Jump to content

డి.వి.యస్.రాజు

వికీపీడియా నుండి
దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు
డి.వి.యస్.రాజు
జననం
దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు

(1928-12-13)1928 డిసెంబరు 13
మరణం2010 నవంబరు 13(2010-11-13) (వయసు 81)
మరణ కారణంవృద్ధాప్యం
ఇతర పేర్లుడి.వి.యస్.రాజు
వృత్తిసినీ నిర్మాత
పిల్లలు1 కుమారుడు, 2 కుమార్తెలు

డి.వి.యస్.రాజు ప్రసిద్ధులైన దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత. వీరు ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులుగా పనిచేశారు. ఇతనికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1988 సంవత్సరపు రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసి గౌరవించింది. 2001 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు బహుకరించింది.

జీవితం

[మార్చు]

దాట్ల వెంకట సూర్యనారాయణరాజు డిసెంబరు 13, 1928 న ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో జన్మించాడు. డి. వి. ఎస్ ప్రొడక్షంస్ అనే పేరుతో సినీ నిర్మాణ సంస్థ స్థాపించి 25 చిత్రాలు నిర్మించాడు. ఇందులో బహుమతి పొందిన హిందీ సినిమా ముజే ఇంసాఫ్ చాహియే కూడా ఉంది. ఎన్. టి. రామారావు తో పిడుగు రాముడు, చిన్ననాటి స్నేహితులు లాంటి చిత్రాలు తీశాడు. జీవిత నౌక, జీవన జ్యోతి, చాణక్య శపథం, పిచ్చి పుల్లయ్య ఆయన నిర్మించిన చిత్రాల్లో కొన్ని. ఆయన నేషనల్ ఫిల్మ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ కు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా వ్యవహరించాడు. ఫిల్ం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు. ఈయన నవంబరు 13, 2010 న 82 సంవత్సరాల వయసులో మరణించాడు. ఈయనకు భార్య, కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

నిర్మించిన సినిమాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]