జూలై 12
స్వరూపం
జూలై 12, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 193వ రోజు (లీపు సంవత్సరములో 194వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 172 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2025 |
సంఘటనలు
[మార్చు]- 1961: పూణె వరదలు, ఖడక్ వాస్లా, పాన్సెట్ ఆనకట్టలు (డామ్ లు) కారణంగా సగం పూణె నగరం ములిగి పోయింది. లక్ష కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 2000 మందికి పైగా మరణించారు.
- 1979: కిరిబతి దీవి బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.
జననాలు
[మార్చు]- క్రీ.పూ. 101/102 - జూలియస్ సీజర్.
- 1904: పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1973)
- 1906: పువ్వాడ శేషగిరిరావు, తెలుగు కవి, పండితులు, వీరు కవి పాదుషా బిరుదాంకితులు. (మ.1981)
- 1930: ఇరివెంటి కృష్ణమూర్తి, తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలితరం కథకులలో ఒకడు. (మ.1991)
- 1933: గడ్డం గంగారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ లోక్సభ సభ్యుడు. (మ.2017)
- 1955: నందిని సిధారెడ్డి, సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
- 1957: శ్రీలక్ష్మి రేబాల, నటి, భరతనాట్య కళాకారిణి.
- 1958: ఉప్పలపాటి నారాయణరావు,దర్శకుడు, నిర్మాత, నటుడు.
- 1958: శిలాలోలిత, కవయిత్రి, విమర్శకురాలు.
- 1977: బ్రాక్ లెస్నర్, అమెరికన్ మిశ్రమ రణతంత్ర యోధుడు, మాజీ వృత్తిగత, ఔత్సాహిక మల్లయోధుడు.
- 1982: ఆచంట శరత్ కమల్, టేబుల్ టెన్నిస్ ఆటగాడు.1997 nagu babu
- 1983: సుజిత, టీ.వి.నటి, తెలుగు, తమిళ, మలయాళ నటి
మరణాలు
[మార్చు]- 1803: కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ, ఆత్మవిద్య బోధిస్తూ తపశ్చర్య కొనసాగించింది. (జ.1703)
- 1923: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (జ.1877)
- 1985: జిల్లెళ్ళమూడి అమ్మ, ఆధ్యాత్మిక వేత్త. (జ.1923)
- 1988: కట్టా సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకుడు (జ.1940)
- 1994: ఎం.ఎస్.ఆచార్య, పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (జ.1924)
- 1999: రాజేంద్ర కుమార్, హిందీ నటుడు. (జ.1929)
- 2012: దారా సింగ్, భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (జ.1928)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- కిరిబతి స్వాతంత్ర్యదినం. యునైటెడ్ కింగ్ డం నుంచి 1979 లో స్వాతంత్ర్యం పొందింది.
- సావొ టోమే, ప్రిన్చిపె దీవుల స్వాతంత్ర్య దినం. పోర్చుగల్ నుంచి 1975 లో స్వాతంత్ర్యం పొందింది.
- నాదం - మంగోలియా దేశంలో జూలై 11 నుంచి జూలై13 వరకు జాతీయ సెలవు దినాలు (మంగోలియాలో పెద్ద పండుగ వాతావరణం ఉంటుంది). నాదం పండుగ 3 రోజులు జరుగుతుంది. ఇది రెండవ రోజు. ఈ మూడు రోజులు మంగోలియాలో 3 ఆటలు ఆడతారు. కుస్తీలు, గుర్రపు స్వారి, విలువిద్య. ఇటీవల మంగోలియన్ స్త్రీలు కూడా గుర్రపు స్వారి, విలువిద్య లలో పాల్గొంటున్నారు. ముఖ్యమైన పండుగ మంగోలియా రాజధాని ఉలాన్బాతార్ నగరంలోని జాతీయ కీడా మైదానం (నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం) లో జరుగుతుంది.
- నాబార్డ్ స్థాపక దినోత్సవం.
- తెలంగాణలో మూడవ విడత హరితహారం ప్రారంభం
- జాతీయ సరళత దినోత్సవం
- పేపర్ సంచుల దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2007-03-12 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 12
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 11 - జూలై 13 - జూన్ 12 - ఆగష్టు 12 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |