చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్
చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ | |
---|---|
పథకపు నినాదం | చైనాకు ఎనర్జీ దిగుమతులను, వాణిజ్యాభివృద్ధినీ స్థిరపరచడం,[1] పాకిస్తాన్‌లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చెయ్యడం[1] |
పథకం రకం | ఆర్థిక నడవా (ఎకనామిక్ కారిడార్) |
ప్రాంతం | పాకిస్తాన్: ఖైబరు పఖ్తూన్‌ఖ్వా, గిల్గిట్ బల్టిస్తాన్,పంజాబ్, బలూచిస్తాన్, సింద్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ చైనా: షిన్‌జియాంగ్ |
దేశం | చైనా పాకిస్తాన్ |
స్థాపన | 20 ఏప్రిల్ 2015[2] |
బడ్జెట్ | చైనా డేవలప్‌ంకెంట్ బ్యాంక్ ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంవెస్ట్‌మెంట్ బ్యాంక్ సిల్క్ రోడ్ ఫండ్ ఎక్జిం బ్యాంక్ ఆఫ్ చైనా ఇండస్త్స్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా |
స్థితి | కొన్ని ప్రాజెక్టులు ఆపరేషనుకు వచ్చాయి Special Economic Zones Under construction (2020).[4][5] Many projects running behind the schedule (2022)[6] Several projects cancelled.[7] |
చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమాహారం. పాకిస్తాన్ అంతటా ఈ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.[8] మొదలు పెట్టినపుడు వీటి విలువ 46 బిలియన్ డాలర్లు కాగా, 2017 నాటికి సిపిఇసి ప్రాజెక్టుల విలువ 62 బిలియన్ డాలర్లకు పెరిగింది.[9][10] ఆధునిక రవాణా నెట్‌వర్క్‌లు, అనేక ఇంధన ప్రాజెక్టులు, ప్రత్యేక ఆర్థిక మండలాల నిర్మాణం ద్వారా పాకిస్తాన్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలను వేగంగా అప్‌గ్రేడ్ చేయడానికి, దాని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికీ సిపిఇసిని ఉద్దేశించారు. 2016 నవంబరు 13 న, ఆఫ్రికా, పశ్చిమ ఆసియాకు సముద్ర రవాణా చేసేందుకు, చైనా సరుకును గ్వాదర్ నౌకాశ్రయానికి రవాణా చేసినప్పుడు సిపిఇసి పాక్షికంగా పనిచెయ్యడం మొదలైంది. అయితే కొన్ని ప్రధాన విద్యుత్ ప్రాజెక్టులు 2017 చివరి నాటికి మొదలయ్యాయి.[11][12][13]
సిపిఇసి ఆధ్వర్యంలో పాకిస్తాన్ నాలుగు దిశల్లోనూ విస్తరించేలా హైవేలూ, రైల్వేలూ నిర్మిస్తారు. పాకిస్తాన్ లో శిథిలావస్థలో ఉన్న రవాణా నెట్‌వర్కు వలన దేశ వార్షిక జిడిపిలో 3.55% నష్టం కలుగుతోందని ప్రభుత్వం అంచనా వేసింది .[14] సిపిఇసి కింద నిర్మించిన ఆధునిక రవాణా నెట్‌వర్కులు గ్వాడార్, కరాచీ ఓడరేవులను ఉత్తర పాకిస్తాన్‌తో కలుపుతాయి. అలాగే పశ్చిమ చైనాతోను, మధ్య ఆసియాలో ఉత్తరాన ఉన్న స్థలాల తోనూ కూడా కలుపుతుంది.[15] సిపిఇసిలో భాగంగా కరాచీ, లాహోర్ నగరాల మధ్య 1,100 కిలోమీటర్ల పొడవైన మోటారు మార్గాన్ని నిర్మిస్తారు. హసన్ అబ్దాల్ నుండి చైనా సరిహద్దు వరకు ఉన్న కరాకోరం హైవేను పూర్తిగా పునర్నిర్మిస్తారు. కరాచీ-పెషావర్ ప్రధాన రైల్వే మార్గాన్ని కూడా అప్‌గ్రేడ్ చేసి, 2019 డిసెంబరు నాటికి గంటకు 160 కి.మీ.వేగంతో రైలు ప్రయాణం చేసేలా వీలు కల్పిస్తుంది.[16][17] పాకిస్తాన్ రైల్వే నెట్‌వర్కును చివరికి కష్గర్‌లోని చైనా యొక్క దక్షిణ జిన్జియాంగ్ రైల్వేకు కలిపేలా వుస్తరిస్తరు.[18] రవాణా నెట్‌వర్క్‌లను ఆధునీకరించడానికి అవసరమౌతుందని అంచనా వేసిన $ 11 బిలియన్లను సబ్సిడీలతో కూడిన రాయితీ రుణాల ద్వారా నిధులు సమకూరుస్తారు.
పాకిస్తాన్ యొక్క దీర్ఘకాలిక ఇంధన కొరతను తగ్గించడానికి, $ 33 బిలియన్ల కంటే ఎక్కువ ఖర్చుతో శక్తికి సంబంధించిన (విద్యుత్ వగైరా) మౌలిక సదుపాయాలను నిర్మిస్తారు.[19] పాకిస్తాన్ శక్తి లోటు 4,500 మెగావాట్ల కంటే ఎక్కువగా ఉంది.[20] ఈ కారణంగా పాకిస్తాన్, తన వార్షిక స్థూల జాతీయోత్పత్తిలో 2–2.5% కోల్పోతోందని అంచనా వేసారు.[21] సిపిఇసి చేపట్టిన ఫాస్ట్‌ట్రాక్ ప్రాజెక్టులలో భాగంగా 2018 చివరి నాటికి 10,400 మెగావాట్ల శక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుబాటు లోకి తీసుకురావాలి.[22] $ 2.5 బిలియన్ల వ్యయంతో ద్రవీకృత సహజ వాయువు, చమురును రవాణా చేయడానికి గ్వాదర్, నవాబ్షాల మధ్య పైప్‌లైన్ల నెట్‌వర్క్ కూడా వేస్తారు. దీని ద్వారా ఇరాన్ నుండి గ్యాస్ రవాణా చేస్తారు.[23] ఈ ప్రాజెక్టులలో విద్యుత్తు ప్రధానంగా శిలాజ ఇంధనాల నుండి ఉత్పత్తి అవుతున్నప్పటికీ, జలవిద్యుత్, పవన విద్యుత్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అదే విధంగా ప్రపంచంలోని అతిపెద్ద స���ర క్షేత్రాలలో ఒకటి కూడా ఈ ప్రాజెక్టుల్లో ఉంది.
పాకిస్తాన్‌పై సిపిఇసి యొక్క సంభావ్య ప్రభావాన్ని యుద్ధానంతర ఐరోపాలో యునైటెడ్ స్టేట్స్ చేపట్టిన మార్షల్ ప్లాన్‌తో పోల్చారు.[24][25][26][27] సిపిఇసి 2015–2030 మధ్యకాలంలో 23 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తుందని, దేశ వార్షిక ఆర్థిక వృద్ధికి 2 నుంచి 2.5 శాతం పాయింట్లు చేకూరుస్తుందనీ పాకిస్తాన్ అధికారులు అంచనా వేస్తున్నారు.[28]
తొలుత తలపెట్టిన $46 బిలియన్ల విలువైన ప్రాజెక్టులు అమలైతే, ఆ ప్రాజెక్టుల విలువ 1970 నుండి పాకిస్తాన్ లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులన్నిటి మొత్తానికి ఇది సమానమౌతుంది. ఇది, 2015 ఏటి పాకిస్తాన్ స్థూల జాతీయోత్పత్తిలో 17%కి సమానం.[29] ప్రాజెక్టు పరిధి తొలి అంచనాలు 46 బిలియన్ డాలర్ల నికర విలువ నుండి 60 బిలియన్ డాలర్లకు విస్తరించింది.[30] చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లోని ప్రధాన ప్రాజెక్టు, సిపిఇసి.[31]
ఆర్థిక విశ్లేషకులు, గతంలో పాకిస్తాన్లో ప్రధానంగా ఉన్న ఇంధన కొరతకు ఈ ప్రాజెక్టు అంతం పలికిందని పేర్కొన్నారు. ఈ కొరత గతంలో ఆర్థిక వృద్ధిని అడ్డంకిగా నిలిచింది.[32] 2020 జనవరి 14 న, పాకిస్తాన్, గ్వాదర్ నౌకాశ్రయాన్ని ఆఫ్ఘన్ రవాణా వాణిజ్యం కోసం తెరచింది.[33]
చరిత్ర
[మార్చు]నేపథ్యం
[మార్చు]చైనా సరిహద్దు నుండి పాకిస్తాన్ లోని అరేబియా సముద్రపు లోతైన ఓడరేవుల వరకు విస్తరించి ఉన్న ఈ కారిడార్ కోసం ప్రణాళికలు 1950 ల నాటికే ఉండేవి. 1959 నుండి కారకోరం హైవే నిర్మాణానికి ఇవి ప్రేరణ నిచ్చాయి.[34] గ్వాదర్ వద్ద లోతైన నౌకాశ్రయంపై చైనా ఆసక్తి 2002 లో తిరిగి పుంజుకుని, దాని నిర్మాణాన్ని ప్రారంభించి, 2006 లో పూర్తి చేసింది. జనరల్ పర్వేజ్ ముషారఫ్ పతనం, ఆ తరువాత పాకిస్తాన్ కు, తాలిబాన్ ఉగ్రవాదులకూ మధ్య వివాదం తరువాత పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత ఏర్పడడం కారణంగా గ్వాదర్ నౌకాశ్రయం విస్తరణ ఆగిపోయింది.[35]
2013 లో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, చైనా ప్రీమియర్ లీ కెకియాంగ్ పరస్పర అనుసంధానం మరింత పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు ప్రభుత్వాల మధ్య చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌పై దీర్ఘకాలిక ప్రణాళిక కోసం సహకారంపై జు షావో షి, షాహిద్ అమ్జాద్ చౌదరిలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
పాకిస్తాన్‌లో ఆర్థిక కారిడార్ ప్రణాళికలపై చర్చించడానికి 2014 ఫిబ్రవరిలో పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ చైనాను సందర్శించాడు.[36] రెండు నెలల తరువాత, పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ చైనాలో ప్రీమియర్ లీ కెక్వియాంగ్తో సమావేశమై మరిన్ని ప్రణాళికలను చర్చించాడు.[37] ఫలితంగా షరీఫ్ పదవీకాలంలోనే ఈ ప్రాజెక్టు పూర్తి పరిధిని రూపొందించారు.[38] 2014 నవంబరులో, చైనా ప్రభుత్వం తన సిపిఇసిలో $45.6 బిలియన్ల పెట్టుబడీ ప్రణాళికల్లో భాగంగా పాకిస్తాన్‌లో ఇంధన, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం చైనా కంపెనీలకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశ్యాన్ని ప్రకటించింది.
సిపిఇసి యొక్క ప్రకటన
[మార్చు]2015 ఏప్రిల్‌లో పాకిస్తాన్‌లో జి జిన్‌పింగ్ పర్యటన సందర్భంగా, అతను బహిరంగ సంపాదకీయంలో ఇలా రాశాడు: "ఇది నా మొదటి పాకిస్తాన్ పర్యటన, కానీ నేను నా స్వంత సోదరుడి ఇంటికి వెళుతున్నట్లు భావిస్తున్నాను." 2015 ఏప్రిల్ 20 న, పాకిస్తాన్, చైనాలు $46 బిలియన్ల ఒప్పందంపై పని ప్రారంభించడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఇది పాకిస్తాన్ వార్షిక GDPలో దాదాపు 20%.[39] దీని ప్రకారం, దాదాపు $28 బిలియన్ల విలువైన "ఎర్లీ హార్వెస్ట్" ప్రాజెక్టులను 2018 చివరి నాటికి అభివృద్ధి చేయవలసి ఉంది.[40][41]
గ్వాదర్ పోర్ట్, సిటీలో ప్రాజెక్టులు
[మార్చు]చైనా యొక్క ప్రతిష్ఠాత్మకమైన వన్ బెల్ట్, వన్ రోడ్ ప్రాజెక్టుకు, దాని 21వ శతాబ్దపు మారిటైమ్ సిల్క్ రోడ్ ప్రాజెక్టులకూ మధ్య లింక్‌గా భావించబడినందున, సిపిఇసి ప్రాజెక్టులో ఒక ముఖ్యాంశంగా గ్వాదర్ రూపుదిద్దుకుంది.[42] మొత్తంగా, 2017 డిసెంబరు నాటికి గ్వాదర్ ఓడరేవు చుట్టూ $1 బిలియన్ల పైచిలుకు విలువైన ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తారు.
గ్వాదర్ పోర్ట్ కాంప్లెక్స్
[మార్చు]గ్వాదర్ ఓడరేవులో ప్రాథమిక వసతుల పనులు 2002లో ప్రారంభమై 2007లో పూర్తయ్యాయి, [35] అయితే గ్వాదర్ ఓడరేవును అప్‌గ్రేడ్ చేయడానికి, విస్తరించడానికీ వేసిన ప్రణాళికలు నిలిచిపోయాయి. సిపిఇసి ఒప్పందం ప్రకారం, గ్వాదర్ పోర్ట్ ప్రారంభంలో 70,000 డెడ్ వెయిట్ టన్నేజీ వరకు ఉన్న పెద్ద నౌకలను డాకింగ్ చేయడానికి వీలుగా విస్తరించడం, అప్‌గ్రేడ్ చేయడం చేస్తారు.[43] అభివృద్ధి ప్రణాళికల్లో ఓడరేవు చుట్టూ $130 మిలియన్ల బ్రేక్ వాటర్ నిర్మాణం కూడా భాగం.[44] అలాగే రోజుకు 500 మిలియన్ క్యూబిక్ అడుగుల ద్రవీకృత సహజ వాయువు సామర్థ్యాన్ని కలిగి ఉండే ఫ్లోటింగ్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఫెసిలిటీ నిర్మాణం కూడా ఇందులో భాగం. ఇరాన్-పాకిస్తాన్ గ్యాస్ పైప్‌లైన్ లోని భాగమైన గ్వాదర్-నవాబ్‌షా సెగ్మెంట్‌కు దీన్ని అనుసంధానిస్తారు.[45]
విస్తరించిన ఓడరేవు గ్వాదర్‌లోని 2,282 ఎకరాల స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతానికి సమీపంలో ఉంది. దీన్ని చైనాలోని ప్రత్యేక ఆర్థిక మండలాల తరహాలో రూపొందించారు.[46] 43 ఏళ్ల లీజులో భాగంగా 2015 నవంబరులో చైనా ఓవర్సీస్ పోర్ట్ హోల్డింగ్ కంపెనీకి భూమిని అప్పగించారు.[47] ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌లు, లాజిస్టిక్స్ హబ్‌లు, గిడ్డంగులు, డిస్‌ప్లే సెంటర్‌లు ఉంటాయి.[48] ఈ జోన్‌లో ఉన్న వ్యాపారాలకు కస్టమ్స్ అధికారుల నుండి అలాగే అనేక ప్రాంతీయ, కేంద్ర పన్నుల నుండి మినహాయింపు ఉంటుంది.[43] ప్రత్యేక ఆర్థిక జోన్‌లో స్థాపించబడిన వ్యాపారానికి 23 సంవత్సరాల పాటు పాకిస్తాన్ ఆదాయం, అమ్మకాలు, ఫెడరల్ ఎక్సైజ్ పన్నుల నుండి మినహాయింపు ఉంటుంది.[49] చైనా ఓవర్సీస్ పోర్ట్ హోల్డింగ్ కంపెనీతో అనుబంధం ఉన్న కాంట్రాక్టర్లు, సబ్‌కాంట్రాక్టర్లు 20 సంవత్సరాల పాటు అటువంటి పన్నుల నుండి మినహాయింపు పొందుతారు.[50] గ్వాదర్ పోర్ట్, ప్రత్యేక ఆర్థిక మండలి నిర్మాణంలో ఉపయోగించే పరికరాలు, మెటీరియల్స్, ప్లాంట్/మెషినరీ, ఉపకరణాలు, ఉపకరణాల దిగుమతులకు 40 సంవత్సరాల పాటు పన్ను మినహాయింపు నిచ్చారు. .[51]
రోడ్డు ప్రాజెక్టులు
[మార్చు]సిపిఇసి ప్రాజెక్ట్ పాకిస్తాన్ యొక్క రవాణా వసతులను పెద్దయెత్తున నవీకరణలు, మరమ్మత్తులు చెయ్యాలని భావించింది. సిపిఇసి ప్రాజెక్ట్ కింద, చైనా $10.63 బిలియన్ల విలువైన రవాణా మౌలిక సదుపాయాల కోసం ఋణం ప్రకటించింది. ఇందులో $6.1 బిలియన్లు, 1.6 శాతం వడ్డీ రేటుతో "సత్వర ముగింపు" రోడ్డు ప్రాజెక్టులను నిర్మించడానికి కేటాయించారు.[52] ఇంకా ప్రణాళిక దశలోనే ఉన్న రహదారి విభాగాల నిర్మాణానికి పాకిస్తాన్ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు మిగిలిన నిధులు కేటాయించబడతాయి.
కార్గో రవాణా కోసం మూడు కారిడార్లను గుర్తించారు. అవి: పరిశ్రమలు అత్యధికంగా ఉన్న సింధ్, పంజాబ్ ప్రావిన్సుల గుండా పోయే తూర్పు మార్గం, తక్కువ అభివృద్ధి చెందిన, తక్కువ జనాభా కలిగిన ఖైబరు పఖ్తూన్‌క్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల గుండా పోయే పశ్చిమ మార్గం, ఖైబరు పఖ్తున్ఖ్వా, పంజాబ్, బలూచిస్థాన్‌ల గుండా పోయే మధ్య మార్గం.[53]
కారకోరం హైవే
[మార్చు]సిపిఇసి ప్రాజెక్టులో కారకోరం హైవే (KKH) లో పాకిస్తాన్ భాగమైన జాతీయ రహదారి 35 (N-35) పునర్నిర్మాణం, ఉన్నతీకరణ భాగం. KKH చైనా-పాకిస్తాన్ సరిహద్దుకు, హసన్ అబ్దాల్ సమీపంలోని బుర్హాన్ పట్టణానికీ మధ్య 887 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. బుర్హాన్ వద్ద, ప్రస్తుతం ఉన్న M1 మోటార్‌వే, షా మక్సూద్ ఇంటర్‌ఛేంజ్ వద్ద N-35ని కలుస్తుంది. అక్కడ నుండి, ఇస్లామాబాద్, లాహోర్‌లకు ప్రవేశం ప్రస్తుతం ఉన్న M1, M2 మోటర్‌వేలలో భాగంగా కొనసాగుతుంది. బుర్హాన్ తూర్పు మార్గం, పశ్చిమ మార్గాలకూడలిలో ఉంటుంది.
తూర్పు మార్గం
[మార్చు]సిపిఇసి యొక్క తూర్పు మార్గంలో సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో ఉన్న రోడ్డు ప్రాజెక్టులు భాగం. వీటిలో కొన్నిటిని మొదట 1991లోనే ప్రతిపాదించారు.[54] తూర్పు మార్గంలో భాగంగా, 1,152 కిమీ పొడవైన రహదారి, పాకిస్థాన్‌లోని రెండు అతిపెద్ద నగరాలైన కరాచీ, లాహోర్‌లను 6-వరసల కంట్రోల్డ్ యాక్సెస్ రహదారి ద్వారా కలుపుతారు. దీన్ని గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తారు.[55] మొత్తం ప్రాజెక్టుకు సుమారు $6.6 బిలియన్లు ఖర్చు అవుతుంది. దీనికి అవసరమైన నిధులలో ఎక్కువ భాగం వివిధ చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు అందిస్తాయి.[56]
పశ్చిమ మార్గం
[మార్చు]సిపిఇసి ప్రాజెక్ట్ పశ్చిమ మార్గంలో భాగంగా పాకిస్తాన్ ప్రావిన్సులైన బలూచిస్తాన్, ఖైబరు పఖ్తుంఖ్వా, పశ్చిమ పంజాబ్ లలో రోడ్లను విస్తరించడం, ఉన్నతీకరించడం చేస్తారు. పశ్చిమ మార్గం ప్రాజెక్టు అనేక వందల కిలోమీటర్ల విలువైన రహదారిని 2018 మధ్య నాటికి 2, 4-వరుసల హైవేలుగా అభివృద్ధి చేస్తుంది. భవిష్యత్తులో రోడ్డు భాగాలను 6-వరసల మార్గాలుగా అభివృద్ధి చేయడానికి తగినంత భూ సేకరణ కూడా చేస్తారు.[57] మొత్తంగా, సిపిఇసి ప్రాజెక్ట్ పశ్చిమ మార్గంలో భాగంగా ఒక్క బలూచిస్తాన్ ప్రావిన్స్ లోనే 870 కిలోమీటర్ల రహదారిని పునర్నిర్మిస్తారు. ఆ 870 కిలోమీటర్ల రహదారిలో, 2016 జనవరి నాటికి 620 కిలోమీటర్ల పునర్నిర్మాణం పూర్తైంది.[58]
భవిష్యత్తు మధ్య మార్గం
[మార్చు]సిపిఇసి భవిష్యత్తులో నిర్మించాలని తలపెట్టిన "మధ్య మార్గం" గ్వాదర్‌లో ప్రారంభమయ్యే రహదారుల నెట్‌వర్కుతో మొదలై బసిమా, ఖుజ్దార్, సుక్కూర్, రాజన్‌పూర్, లయ్యా, ముజఫర్‌గఢ్, డేరా ఇస్మాయిల్ ఖాన్‌లో ముగుస్తుంది. అక్కడి నుండి బ్రహ్మ బహ్తర్-యారిక్ మోటర్‌వే ద్వారా కారకోరం హైవేకి కలుపుతారు.[59]
రైల్వే ప్రాజెక్టులు
[మార్చు]సిపిఇసి ప్రాజెక్టులో భాగంగా పాకిస్తాన్ లోని పాత రైల్వే వ్యవస్థను నవీకరించే ప్రణాళికలపై దృష్టి పెడుతుంది. 2020 నాటికి కరాచీ, పెషావర్ మధ్య మొత్తం మెయిన్ లైన్ 1 రైల్వేని పునర్నిర్మించడం ఇందులో భాగం.[60] ఈ ఒక్క రైలుమార్గమే ప్రస్తుతం పాకిస్తాన్ రైల్వే ట్రాఫిక్‌లో 70%ని నిర్వహిస్తోంది.[61] మెయిన్ లైన్ 1 రైల్వేతో పాటు, మెయిన్ లైన్ 2 రైల్వే, మెయిన్ లైన్ 3 రైల్వేలకు నవీకరణలు, విస్తరణలు తలపెట్టారు. సిపిఇసి ప్రణాళికలో 4,693 మీటర్ల ఎత్తైన ఖుంజెరాబ్ పాస్ మీదుగా రైలు మార్గాన్ని పూర్తి చేయాలని కూడా భావించారు. 2030 నాటికి ఈ రైలు మార్గం ద్వారా [61] కరాచీ, గ్వాదర్‌లోని ఓడరేవులకు చైనీస్, తూర్పు ఆసియా వస్తువులను నేరుగా రవాణా చేసేందుకు వీలు కలుగుతుంది.
ఇంధన రంగ ప్రాజెక్టులు
[మార్చు]2015-16 లో పాకిస్థాన్ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 24,830 మెగావాట్లు,.[62] సిపిఇసి ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ప్రధాన దృష్టిగా ఉంటుంది. ఈ రంగం లోకి దాదాపు $33 బిలియన్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.[19] సిపిఇసి యొక్క "సత్వర ముగింపు" ప్రాజెక్ట్‌లలో భాగంగా 2018 మార్చి నాటికి 10,400 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంచనా వేసారు.[22]
సిపిఇసి కింద ఇంధన ప్రాజెక్టులు చైనా, పాకిస్తాన్ ప్రభుత్వాల ద్వారా కాకుండా ప్రైవేట్ స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారుల చేత నిర్మింపజేస్తారు.[63] చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ ఈ ప్రైవేట్ పెట్టుబడులకు 5–6% వడ్డీ రేట్లతో ఆర్థిక సహాయం చేస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఆ సంస్థల నుండి ముందస్తుగా నిర్ణయించుకున్న రేట్లకు విద్యుత్‌ను కొనుగోలు చేసే ఒప్పందానికి కట్టుబడి ఉంటుంది.[64]
"సత్వర ముగింపు" ప్రాజెక్టులు
[మార్చు]సిపిఇసి యొక్క "సత్వర ముగింపు" (ఎర్లీ హార్వెస్ట్) పథకంలో భాగంగా, 2018, 2020 మధ్య కాలంలో 10,000 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయవలసి ఉంది.[22] కొన్ని "ఎర్లీ హార్వెస్ట్" ప్రాజెక్ట్‌లు 2020 వరకు పూర్తి కానప్పటికీ, సిపిఇసిని పూర్తి చేసే ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం ద్వారా 2018 నాటికి పాకిస్తాన్ ఎలక్ట్రిక్ గ్రిడ్‌కు సుమారు 10,000 MW శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని జోడించాలని పాకిస్తాన్ ప్రభుత్వం యోచిస్తోంది.
అధికారికంగా సిపిఇసి పరిధిలో లేనప్పటికీ, 1,223 MW బల్లోకి విద్యుత్కేంద్రం, 1,180 MW భక్కి <b>విద్యుత్కేంద్రం</b> రెండూ 2018 మధ్యలో పూర్తయ్యాయి, [65][66][67][68] దీనితో పాటు 969 MW నీలం– జీలం జలవిద్యుత్ ప్లాంట్ 2018 వేసవిలో పూర్తయింది. 1,410 MW తర్బేలా IV ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టు, 2018 ఫిబ్రవరిలో పూర్తైంది.[69] ఫలితంగా సిపిఇసి, నాన్-సిపిఇసి ప్రాజెక్టులు రెండూ కలిసి 2018 చివరి నాటికి పాకిస్తాన్ విద్యుత్ గ్రిడ్‌కు అదనంగా 10,000 MW జోడించబడుతుంది.[70] CASA-1000 ప్రాజెక్ట్‌లో భాగంగా తజికిస్థాన్, కిర్గిజ్‌స్థాన్ నుండి పాకిస్తాన్‌కు మరో 1,000 MW విద్యుత్ దిగుమతి చేసుకుంటారు. ఇది 2018లో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు [71]
ప్రాజెక్టుల పట్టిక
[మార్చు]"సత్వర ముగింపు" విద్యుత్తు ప్రాజెక్టు [72] | సామర్థ్యం | ప్రదేశం |
---|---|---|
పాకిస్తాన్ పోర్ట్ ఖాసిం పవర్ ప్రాజెక్ట్ . | 1,320 MW (2 x 660 MW ప్లాంట్లు) | సింధ్ |
థార్-ల్ ప్రాజెక్ట్ | 1,320 MW (4 x 330 MW ప్లాంట్లు) | సింధ్ |
థార్-ల్ ప్రాజెక్ట్, బొగ్గు గని | 1,320 MW (2 x 660 MW ప్లాంట్లు) | సింధ్ |
సాహివాల్ కోల్ పవర్ ప్రాజెక్ట్ | 1,320 MW (2 x 660 MW ప్లాంట్లు) | పంజాబ్ |
రహిమ్యార్ ఖాన్ బొగ్గు విద్యుత్ ప్రాజెక్ట్ | 1,320 MW (2 x 660 MW ప్లాంట్లు) | పంజాబ్ |
క్వాయిడ్-ఎ-అజం సోలార్ పార్క్ | 1,000 మె.వా | పంజాబ్ |
సుకి కినారి జలవిద్యుత్ ప్రాజెక్ట్ | 870 MW (2020లో పూర్తవుతుందని అంచనా) [73] | ఖైబరు పఖ్తున్ఖ్వా |
కరోట్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ | 720 MW (2020లో పూర్తవుతుందని అంచనా) [74] | పంజాబ్ |
చైనా పవర్ హబ్ జనరేషన్ కంపెనీ | 2X660 MW | బలూచిస్తాన్ |
థార్ ఎంగ్రో కోల్ పవర్ ప్రాజెక్ట్ | 660 MW (2 x 330 MW ప్లాంట్లు) | సింధ్ |
గ్వాదర్ బొగ్గు విద్యుత్ ప్రాజెక్ట్ | 300 మె.వా | బలూచిస్తాన్ |
UEP విండ్‌ఫార్మ్ | 100 మె.వా | సింధ్ |
దావూద్ పవన విద్యుత్ ప్రాజెక్ట్ | 50 మె.వా | సింధ్ |
సచల్ విండ్‌ఫార్మ్ | 50 మె.వా | సింధ్ |
సున్నెక్ విండ్‌ఫార్మ్ | 50 మె.వా | సింధ్ |
మాటియారీ నుండి లాహోర్‌కు ట్రాన్స్‌మిషన్ లైన్ | 660 కిలోవోల్టులు | సింధ్, పంజాబ్ |
ప్రభావం
[మార్చు]చైనా తన 13వ పంచవర్ష అభివృద్ధి ప్రణాళికలో సిపిఇసి ప్రాజెక్టును చేర్చడాన్ని బట్టి, అది ఈ ప్రాజెక్టుకు ఇస్తున్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.[75][76] సిపిఇసి ప్రాజెక్ట్‌లు చైనాకు ఇంధన సరఫరాల కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తాయి. అలాగే, పశ్చిమ చైనా వాణిజ్య ఆవకాశాలకు కొత్త మార్గాన్ని అందిస్తాయి. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, నమ్మదగిన ఇంధన సరఫరాను అందించడం వల్ల పాకిస్తాన్ కూడా లాభపడుతుంది.[77][78]
సిపిఇసి, ప్రపంచీకరణ యొక్క తదుపరి అంచెలో నియమాలను వ్రాయడానికి, దాని ఎగుమతులు, పెట్టుబడి ఇంజిన్‌లను రాబోయే సంవత్సరాల్లో అమలు చేయడం కోసం చైనా అవలంబిస్తున్న దూరదృష్టి ప్రణాళికలో భాగమని 2017 జనవరి 8 న ఫోర్బ్స్ పేర్కొంది. 2017 జనవరిలో వ్రాస్తూ, భారత అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషనుకు చెందిన అరుణ్ మోహన్ సుకుమార్, "సిపిఇసి ఒక ముఖ్యమైన ప్రాజెక్టు, దీని ఆర్థిక, వ్యూహాత్మక పరిణామాలను పద్దతిగా అంచనా వేయాల్సిన అవసరం ఉంది", "సిపిఇసి ఒక ద్వైపాక్షిక ప్రయత్నం కావచ్చు, కానీ న్యూఢిల్లీ దాని నుండి ఉత్పన్నమయ్యే ప్రాంతీయ ప్రభావాలను విస్మరించజాలదు" అని పేర్కొన్నాడు. "లాభాపేక్ష మాత్రమే పాకిస్తాన్‌తో చైనా జరిపే వ్యాపారాన్ని నడిపిస్తుందనే తప్పుడు సౌలభ్యంపై ఆధారపడితే భారతదేశం పొరబడినట్లు అవుతుంది" అని అతను అభిప్రాయపడ్డాడు.[79]
చైనా ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ ప్రకారం, ఈ ప్రాజెక్టులతో పాకిస్తాన్ లో జరిగే అభివృద్ధి వలన "మతతత్వం నుండి ప్రజల దృష్టిని మరల్చవచ్చు".[80]
పాకిస్తాన్
[మార్చు]సిపిఇసి, పాకిస్తాన్ చరిత్రలో ఒక మైలురాయి లాంటి ప్రాజెక్టు.[81] స్వాతంత్ర్యం తర్వాత పాకిస్తాన్ ఆకర్షించిన అతిపెద్ద పెట్టుబడి ఇది. ఏ విదేశంలో నైనా చైనా పెట్టిన అతిపెద్ద పెట్టుబడి. ఆర్థికంగా వృద్ధిని సాధించడంలో సిపిఇసి, పాకిస్తాన్‌కు కీలకమైనదిగా పరిగణించబడుతుంది.[82] పాకిస్తాన్ మీడియా, ప్రభుత్వం సిపిఇసి పెట్టుబడులను ఈ ప్రాంతానికి "రాత మార్చేది" అని వర్ణించాయి.[83][84] ఈ భారీ పెట్టుబడి ప్రణాళిక పాకిస్తాన్‌ను ప్రాంతీయ ఆర్థిక కేంద్రంగా మారుస్తుందనీ, రెండు దేశాల మధ్య లోతైన సంబ���ధాలను మరింత పెంచుతుందనీ చైనా, పాకిస్తాన్ రెండూ భావించాయి.[85] సిపిఇసి ప్రకటించిన సుమారు 1 సంవత్సరం తర్వాత, చైనా ఓవర్సీస్ పోర్ట్ హోల్డింగ్ కంపెనీ ఛైర్మన్ జాంగ్ బావోజోంగ్ ది వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడుతూ, గ్వాదర్ యొక్క పారిశ్రామిక జోన్ కోసం రోడ్లు, విద్యుత్, హోటళ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం తమ కంపెనీ అదనంగా $4.5 బిలియన్లు ఖర్చు చేయాలని యోచిస్తోందని చెప్పాడు.[86] పాకిస్తాన్‌లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఇది అతిపెద్ద మొత్తాలలో ఒకటి.
2017 ప్రారంభంలో పాకిస్తాన్ రోజుకు 12 గంటల వరకు సాధారణ విద్యుత్ కోతలుండేవి.[87] 4,500 MW పైబడిన విద్యుత్తు కొరతను ఎదుర్కొంది.[88] దీని వలన దాని వార్షిక GDP 2–2.5% వరకూ తగ్గింది.[87] ఫైనాన్షియల్ టైమ్స్ పాకిస్తాన్ లో ఉన్న విద్యుత్ కొరత విదేశీ పెట్టుబడులకు పెద్ద అవరోధంగా ఉందని, పాకిస్తాన్ మౌలిక సదుపాయాలు, విద్యుత్ ప్రాజెక్టులలో చైనా పెట్టుబడులు "మేలైన చక్రీయతకు" దారితీస్తాయని పేర్కొంది. వివిధ రంగాలలో విదేశీ పెట్టుబడులకు దేశాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.[89] పాకిస్తాన్‌లో ఆర్థిక వృద్ధి, పెట్టుబడులు రెండింటికీ విద్యుత్తు కొరత ప్రధాన అడ్డంకిగా ప్రపంచ బ్యాంక్ పరిగణించింది.
ఇంధన రంగంలో చైనా పెట్టుబడుల ప్రభావం త్వరలోనే కనిపించింది. 2017 డిసెంబరులో పాకిస్తాన్ మిగులు విద్యుత్ ఉత్పత్తిని సాధించింది. పాకిస్తానీ ఫెడరల్ పవర్ డివిజన్ మంత్రి, అవైస్ లెఘారీ మొత్తం 8,600 ఫీడర్‌లకు గాను, 5,297 ఫీడర్‌లలో విద్యుత్ కోతలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు. దేశపు ప్రస్తుత విద్యుత్ ఉత్పత్తి డిమాండ్ కంటే 2700 మెగావాట్‌లు అధికంగా - 16,477 మెగావాట్లకు ఉత్పత్తి పెరిగిందని పేర్కొన్నాడు.[90]
సిపిఇసి - మలక్కా డైలమా
[మార్చు]మలక్కా జలసంధి ద్వారా వెళ్ళే మార్గం, చైనా నుండి ఐరోపా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు అతి తక్కువ దూరం ఉండే మార్గం.[91] మధ్యప్రాచ్యం నుండి చైనా చేసుకునే ఇంధన దిగుమతుల్లో దాదాపు 80% మలక్కా జలసంధి గుండానే వెళుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన చైనాకు [92] ఇంధన భద్రత కీలకమైన అంశం. అయితే మధ్యప్రాచ్యం నుండి చమురును దిగుమతి చేసుకోవడానికి ఉపయోగించే ప్రస్తుత సముద్ర మార్గాలపై అమెరికా నావికాదళం నిఘా పెడుతోంది.[93]
అమెరికా నుండి చైనా అవరోధాలను ఎదుర్కొన్నట్లైతే, మలక్కా జలసంధి ద్వారా ఇంధన దిగుమతులకు ఆటంకం ఏర్పడవచ్చు, ఇది చైనా ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో పడేస్తుంది. దీన్ని "మలక్కా డైలమా" అని అంటూంటారు.[94] మలక్కా జలసంధిలో ఎదురయ్యే ఈ దుర్బలత్వాలకు అదనంగా, ప్రస్తుతం చైనా, తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్, అమెరికాల మధ్య ఉద్రిక్తతకు మూలమైన వివాదాస్పద స్ప్రాట్లీ దీవులు, పారాసెల్ దీవుల సమీపంలో దక్షిణ చైనా సముద్రం గుండా వెళ్ళే సముద్ర మార్గాలపై చైనా ఎక్కువగా ఆధారపడి ఉంది.[95] చైనీస్ ఇంధన దిగుమతులు ఈ వివాదాస్పద ప్రాంతాల గుండా పోకుండా, పశ్చిమాన కొత్త మార్గాన్ని ఏర్పరచుకునే సాధనం, సిపిఇసి ప్రాజెక్టు. తద్వారా అమెరికా, చైనాల మధ్య ఘర్షణ అవకాశాలు కూడా తగ్గుతాయి.[96] అయితే, గ్వాదర్ నుండి చైనా వరకు పైప్‌లైన్‌లు వెయ్యడం చాలా ఖర్చుతో కూడుకున్నది, క్లిష్టమైన భూభాగం, ఉగ్రవాదంతో సహా అనేక రవాణా సమస్యలు ఎదురౌతాయి. అంచేత చైనా యొక్క మొత్తం ఇంధన భద్రతపై ఈ ప్రాజెక్టు ఎటువంటి ప్రభావం చూపదు.[97]
ప్రధాన ప్రాజెక్టుల జాబితా
[మార్చు]Project | Notes |
---|---|
గ్వాదర్ పోర్ట్ | దశ 1 పూర్తయింది. ఫేజ్ 2 నిర్మాణంలో ఉంది. |
గ్వాదర్-రాటోడెరో మోటర్‌వే (M-8) | నిర్మాణంలో ఉంది. 892 కిమీలో 193 కిమీ పని చేస్తోంది |
దావూద్ పవన విద్యుత్ ప్రాజెక్ట్ (50 MW) | కమర్షియల్ ఆపరేషన్ తేదీ (COD) 2017 ఏప్రిల్ 5. పూర్తిగా పని చేస్తోంది. |
E-35 ఎక్స్‌ప్రెస్‌వే (హజారా మోటర్‌వే) | ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిధులతో నిర్మాణంలో ఉంది, అయితే కారకోరం హైవే పునర్నిర్మాణ ప్రాజెక్టుకు ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. 47 కిలోమీటర్ల పొడవైన బుర్హాన్ నుండి షా మక్సూద్ విభాగం 2017 డిసెంబరులో పూర్తి చేసి ట్రాఫిక్‌కు తెరవబడింది. |
ఇరాన్-పాకిస్తాన్ గ్యాస్ పైప్‌లైన్ | నిర్మాణంలో ఉంది. ఇరాన్ భాగం పూర్తయింది. గ్వాదర్ నుండి నవాబ్‌షా భాగానికి సిపిఇసి ఒప్పందాల ద్వారా నిధులు సమకూరుతాయి, గ్వాదర్ - ఇరాన్ సరిహద్దు భాగానికి పాకిస్తాన్ ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. |
కారకోరం హైవే పునర్నిర్మాణం | నిర్మాణంలో ఉంది. సిపిఇసి ప్రకటనకు ముందు రైకోట్, చైనా సరిహద్దుల మధ్య భాగం నిర్మాణంలో ఉంది. ఇది 2012లో పూర్తయింది. అట్టాబాద్ సరస్సు చుట్టూ 24 కిలోమీటర్ల పొడవైన కారకోరం హైవే రీలైన్‌మెంట్ కూడా 2015లో పూర్తయింది. |
KKH దశ II (థాకోట్ -హవేలియన్ విభాగం) | థాకోట్-హవేలియన్ (118 కిమీ) ప్రారంభ పంట ప్రాజెక్ట్ కేటగిరీలో ఉంది. ఇది 2020 మార్చి నాటికి పూర్తవుతుంది. హవేలియన్-అబోటాబాద్-మన్సెహ్రా (39 కిమీ) విభాగాన్ని 2019 నవంబరు 18న ప్రధానమంత్రి ప్రారంభించారు. |
ముల్తాన్-సుక్కుర్ మోటర్‌వ��� (M-5) (392 కి.మీ) | ప్రాజెక్ట్ 2019 నవంబరు 5న పూర్తయి, ప్రారంభించబడింది. |
అబ్దుల్ హకీమ్-లాహోర్ మోటర్‌వే (M-3) (230 కి.మీ) | ప్రాజెక్ట్ 2019 మార్చి 30న పూర్తయిం, ప్రారంభించబడింది |
హక్లా డి.ఐ ఖాన్ మోటర్‌వే (285 కి.మీ) | 2020 జూన్లో పూర్తి చేయడానికి ప్రణాళిక చేయబడింది. |
కరోట్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ (720 MW) | 50% సివిల్ పనులు పూర్తయ్యాయి. అంచనా COD 2021 డిసెంబరు. |
రహిమ్యార్ ఖాన్ ఇంధన పవర్ ప్లాంట్ 1320 MW దిగుమతి చేసుకున్నాడు | GP ద్వారా LOI జారీ చేయబడింది |
కోహలా హైడల్ పవర్ ప్రాజెక్ట్, AJK (1100 MW) | 2026లో పూర్తవుతుందని అంచనా |
ఆరెంజ్ లైన్ (లాహోర్ మెట్రో) | నిర్మాణంలో ఉంది. రైలు సేవ యొక్క గడువు 2020 జనవరి |
పాకిస్తాన్ పోర్ట్ ఖాసిం పవర్ ప్రాజెక్ట్ (1320 MW) | ప్రాజెక్ట్ 2018 ఏప్రిల్ 25 న పూర్తయింది |
క్వాయిడ్-ఎ-అజం సోలార్ పార్క్ (1000 MW) | నిర్మాణంలో మొదటి దశ పూర్తి, 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. |
సాహివాల్ కోల్ పవర్ ప్రాజెక్ట్ (1320 MW) | 2017 జూలైలో పూర్తయింది. అమలులో ఉంది. |
బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో వెస్ట్రన్ అలైన్‌మెంట్ ప్రాజెక్టులు. | నిర్మాణంలో ఉంది. సిపిఇసి యొక్క వెస్ట్రన్ అలైన్‌మెంట్‌లో భాగంగా బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని 870 కిలోమీటర్ల రహదారిని నిర్మించడం/పునర్నిర్మించడంలో, 2016 జనవరి నాటికి 620 కిలోమీటర్లు ఇప్పటికే పునర్నిర్మించబడ్డాయి. సురబ్ నుండి గ్వాదర్ భాగానికి ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ నిధులు సమకూరుస్తుంది, అయితే పూర్తి చేయడానికి ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. సిపిఇసి యొక్క వెస్ట్రన్ అలైన్‌మెంట్. |
పాకిస్తాన్-చైనా ఫైబరు ఆప్టిక్ ప్రాజెక్ట్ | ప్రాజెక్ట్ 2018 జూలై 13న పూర్తయి, ప్రారంభించబడింది |
ఎకనామిక్ కారిడార్ సపోర్ట్ ఫోర్స్ | రిక్రూట్‌మెంట్ ప్రోగ్రెస్‌లో ఉంది |
కరాచీ, పెషావర్ మధ్య ప్రధాన-లైన్ 1 రైల్వే మరమ్మతు | ప్రణాళికా అధ్యయనాలు జరుగుతున్నాయి |
హవేలియన్ అబోటాబాద్ డ్రై పోర్ట్ | ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం 2017 మేలో సంతకం చేయబడింది |
చైనా-పాకిస్థాన్ జాయింట్ కాటన్ బయోటెక్ లాబొరేటరీ | ఆమోదించబడింది |
మన్సెహ్రా ముజఫరాబాద్ మీర్పూర్ ఎక్స్‌ప్రెస్ వే | ఆమోదించబడింది |
చైనా-పాకిస్తాన్ జాయింట్ మెరైన్ రీసెర్చ్ సెంటర్ | ఆమోదించబడింది |
గ్వాదర్ ఈస్ట్ బే ఎక్స్‌ప్రెస్ వే | నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పూర్తయిన తేదీ 2020 అక్టోబరు. |
పాక్ చైనా ఫ్రెండ్‌షిప్ హాస్పిటల్ | 2019 చివరి నాటికి సంచలనం సృష్టించవచ్చు |
కొత్త గ్వాదర్ అంతర్జాతీయ విమానాశ్రయం | నిర్మాణ పనులు 2019 అక్టోబరు 31న ప్రారంభమయ్యాయి. |
గ్వాదర్-నవాబ్‌షా LNG టెర్మినల్, పైప్‌లైన్ ప్రాజెక్ట్ | ఆమోదించబడింది |
UEP 100 MW విండ్ ఫామ్ (జిమ్పిర్, తట్టా) | కమర్షియల్ ఆపరేషన్ తేదీ (COD) 2017 జూన్ 16, కార్యాచరణ |
సచల్ 50 మెగావాట్ల విండ్ ఫామ్ (జిమ్పిర్, తట్టా) | కమర్షియల్ ఆపరేషన్ తేదీ (COD) 2017 ఏప్రిల్ 11కి చేరుకుంది, కార్యాచరణ |
మూడు గోర్జెస్ రెండవ, మూడవ పవన విద్యుత్ ప్రాజెక్టులు (100 MW) | కమర్షియల్ ఆపరేషన్ తేదీ (COD) 2018 జూలై 9కి చేరుకుంది, కార్యాచరణ |
కాచో 50 MW విండ్ పవర్ ప్రాజెక్ట్ | LOI (లేటర్ ఆఫ్ ఇంటెంట్) దశ |
వెస్ట్రన్ ఎనర్జీ (ప్రై.) లిమిటెడ్. 50 MW విండ్ పవర్ ప్రాజెక్ట్ | ఆమోదించబడింది |
థార్ మైన్ మౌత్ ఒరాకిల్ పవర్ ప్లాంట్ (1320 MW) & సర్ఫేస్ మైన్ | NTP/LOI జారీ కింద |
CPHGC 1,320 MW బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్, హబ్, బలూచిస్తాన్ | COD 2019 ఆగస్టు 14, పూర్తిగా పనిచేస్తుంది. |
ఇప్పటికే ఉన్న లైన్ ML-1 విస్తరణ, పునర్నిర్మాణం | ప్రాజెక్ట్ 2 దశల్లో పూర్తవుతుంది. 2018 మేలో CDWP ద్వారా ఫేజ్-1 యొక్క PC-1 ఆమోదించబడింది. ఆశించిన COD 2022. |
ఫాండర్ జలవిద్యుత్ కేంద్రం (80 MW) | రెండు వైపుల నుండి నిపుణుల సమీక్షలో ఉంది |
గిల్గిట్ KIU జలవిద్యుత్ (100 MW) | రెండు వైపుల నుండి నిపుణుల సమీక్షలో ఉంది |
మాటియారీ నుండి ఫైసలాబాద్ ట్రాన్స్‌మిషన్ లైన్ | 2020/21లో పూర్తవుతుందని అంచనా |
మాటియారీ నుండి లాహోర్ ట్రాన్స్‌మిషన్ లైన్ (878 కి.మీ) | 2021 మార్చిలో ఆశించిన COD. |
సుకి కినారి జలవిద్యుత్ ప్రాజెక్ట్ (870 MW) | నిర్మాణంలో ఉంది, కమర్షియల్ ఆపరేషన్ తేదీ (COD) 2022 డిసెంబరు. |
SSRL థార్ కోల్ బ్లాక్-I 6.8 Mtpa &SEC మైన్ మౌత్ పవర్ ప్లాంట్ (2×660 MW) | 2019 చివరిలో బొగ్గు గని పూర్తి అవుతుందని అంచనా |
థార్ బొగ్గు క్షేత్రంలోని బ్లాక్ IIలో ఉపరితల గని, సంవత్సరానికి 3.8 మిలియన్ టన్నులు | థార్ బ్లాక్ II 2018 జూన్ 10న బొగ్గును వెలికితీసింది |
ఎంగ్రో థార్ బ్లాక్ II 2×330 MW బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ | COD 2019 జూలై 10. అమలులో ఉంది. |
TEL 1×330 MW మైన్ మౌత్ లిగ్నైట్ ఫైర్డ్ పవర్ ప్రాజెక్ట్ థార్ బ్లాక్-II, సింధ్, పాకిస్తాన్ | 2021 మార్చిలో పూర్తవుతుందని అంచనా |
థాల్నోవా 1×330 MW మైన్ మౌత్ లిగ్నైట్ ఫైర్డ్ పవర్ ప్రాజెక్ట్ థార్ బ్లాక్-II, సింధ్, పాకిస్తాన్ | 2021 మార్చిలో పూర్తవుతుందని అంచనా |
పాకిస్తాన్‌లోని గ్వాదర్‌లో దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత పవర్ ప్రాజెక్ట్ (300 MW) | 2019 నవంబరు 4న శంకుస్థాపన జరిగింది. |
ఖుంజేరాబ్ రైల్వే | సాధ్యాసాధ్యాల అధ్యయనాలు జరుగుతున్నాయి |
చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వ్యాపారవేత్త నెట్‌వర్కింగ్ | వృద్ధిలో ఉంది - వ్యాపార సంఘం కోసం సభ్యత్వం తెరవబడింది |
రద్దైన ప్రాజెక్టులు
[మార్చు]ప్రాజెక్టులు | కెపాసిటీ | స్థానం | గమనికలు |
---|---|---|---|
గదాని పవర్ ప్రాజెక్ట్ | 6,600 MW (10 x 660 MW ప్లాంట్లు) | బలూచిస్తాన్ | |
రహిమ్యార్ ఖాన్ బొగ్గు విద్యుత్ ప్రాజెక్ట్ | 1,320 MW (2 x 660 MW ప్లాంట్లు) | పంజాబ్ | [98] |
ముజఫర్‌గఢ్ బొగ్గు విద్యుత్ ప్రాజెక్టు | 1,320 MW (2 x 660 MW ప్లాంట్లు) | పంజాబ్ | [98] |
మాటియారీ నుండి ఫైసలాబాద్ ట్రాన్స్‌మిషన్ లైన్ | 660 కిలోవోల్ట్ | సింధ్, పంజాబ్ |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Jon Boone (20 Apr 2015). "China president in Pakistan to sign £30bn 'land corridor' agreement". The Guardian. Islamabad. Retrieved 3 November 2022.
- ↑ Shayan Rauf. "China-Pakistan Economic Corridor (CPEC)". britannica.com. Encyclopaedia Britannica. Retrieved 4 November 2022.
- ↑ "Investment under CPEC rises to $62 billion: Zubair". Business Recorder.
- ↑ "Works on CPEC projects to be accelerated in 2020: Asad Umar". Dunya News.
- ↑ "Work on CPEC projects to be accelerated". The Express Tribune. 11 January 2020.
- ↑ Umair Jamal (3 Nov 2022). "Pakistani PM's Visit to China Puts CPEC Back on Track". The Diplomat. Retrieved 4 November 2022.
- ↑ John Hurley; Scott Morris; Gailyn Portelance (March 2018). "Examining the Debt Implications of the Belt and Road Initiative from a Policy Perspective" (PDF). CGD Policy Paper. Center for Global Development: 19. Retrieved 4 November 2022.
- ↑ China Pakistan Economic Corridor. What is One Belt One Road? A Surplus Recycling Mechanism Approach. Social Science Research Network. Date Accessed 26 August 2017.
- ↑ Hussain, Tom (19 April 2015). "China's Xi in Pakistan to cement huge infrastructure projects, submarine sales". McClatchy News. Islamabad: mcclatchydc.
- ↑ Kiani, Khaleeq (30 September 2016). "With a new Chinese loan, CPEC is now worth $62bn". Dawn. Archived from the original on 30 September 2016. Retrieved 19 November 2016.
- ↑ "PM inaugurates Port Qasim coal power plant's unit in Karachi - Pakistan - Dunya News". Dunya News (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 29 November 2017. Retrieved 2018-02-27.
- ↑ "Second unit of Sahiwal power plant being inaugurated today". The Nation (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 26 March 2019. Retrieved 2018-03-02.
- ↑ "Zonergy plugs in 300-MW solar park in Pakistan - report". Renewablesnow.com (in ఇంగ్లీష్). Retrieved 2018-03-02.
- ↑ "Transport policy: need of the day". Dawn. 13 February 2017. Retrieved 7 April 2017.
"Dr Nadeem-ul-Haque was deputy chairman of the Planning Commission — saying it would reverse a colossal loss of 3.5pc of GDP that Pakistan was incurring due to poor transport infrastructure.
- ↑ Shah, Saeed (20 April 2015). "China's Xi Jinping Launches Investment Deal in Pakistan". The Wall Street Journal. Retrieved 23 April 2015.
- ↑ "Railway track project planned from Karachi to Peshawar". Pakistan Tribune. 13 November 2015. Archived from the original on 9 అక్టోబరు 2018. Retrieved 6 March 2016.
- ↑ "CPEC may get extra billion dollars". Pakistan: The Nation. 22 June 2015. Retrieved 11 December 2015.
- ↑ Zhen, Summer (11 November 2015). "Chinese firm takes control of Gwadar Port free-trade zone in Pakistan". South China Morning Post. Retrieved 11 December 2015.
- ↑ 19.0 19.1 Malik, Ahmad Rashid (7 December 2015). "A miracle on the Indus River". The Diplomat. Retrieved 11 December 2015.
- ↑ "Electricity shortfall increases to 4,500 MW". Dunya News. 29 June 2015. Retrieved 11 December 2015.
- ↑ Kugelman, Michael (9 July 2015). "Pakistan's Other National Struggle: Its Energy Crisis". The Wall Street Journal. Retrieved 11 December 2015.
- ↑ 22.0 22.1 22.2 "Parliamentary body on CPEC expresses concern over coal import". Daily Times. 19 November 2015. Archived from the original on 22 December 2015. Retrieved 11 December 2015.
- ↑ Shah, Saeed (9 April 2015). "China to Build Pipeline From Iran to Pakistan". The Wall Street Journal. Retrieved 6 December 2015.
- ↑ Sukumar, Arun Mohan (10 January 2017). "What the Marshall Plan Can Teach India About the China-Pakistan Economic Corridor". The Wire (India). Retrieved 22 January 2017.
The CPEC may be a bilateral endeavour, but New Delhi cannot ignore its spillover effects on regional governance. The inequities in the China-Pakistan relationship and the nature of proposed Chinese investment in the CPEC merit a comparison with the Marshall Plan, the most successful foreign assistance project of the 20th century.
- ↑ Muhammad, Salim (6 November 2016). "Marshall Plan for Pakistan". The News on Sunday. Archived from the original on 2 ఫిబ్రవరి 2017. Retrieved 22 January 2017.
- ↑ Curran, Enda (7 August 2016). "China's Marshall Plan". Bloomberg. Retrieved 22 January 2017.
China's ambition to revive an ancient trading route stretching from Asia to Europe could leave an economic legacy bigger than the Marshall Plan or the European Union's enlargement, according to a new analysis.
- ↑ Haddad, Tareq (6 January 2017). "Pakistan builds state-of-the-art warships to defend new trade routes with China". International Business Times (UK). Retrieved 22 January 2017.
"Symbolically it would be potent evidence of what economic benefits a country that allies with Beijing can expect. A rough comparison would be the Marshall Fund, the programme by which the United States rebuilt war-torn Europe, reworked the very economic structure of that continent and showcased its arrival as a superpower.
- ↑ Shah, Saeed. "Big Chinese-Pakistani Project Tries to Overcome Jihadists, Droughts and Doubts". The Wall Street Journal. ISSN 0099-9660. Retrieved 2016-04-10.
- ↑ Khan, Bilal (3 December 2015). "Pakistan's economy is turning a corner". Standard Charter Bank. Retrieved 14 March 2016.
- ↑ https://www.atlanticcouncil.org/blogs/new-atlanticist/chinese-infrastructure-project-drives-pakistan-further-into-debt
- ↑ "Massive Chinese investment is a boon for Pakistan". The Economist. 8 September 2017. Retrieved 8 September 2017.
- ↑ https://www.thenews.com.pk/print/370347-energy-subsidies-efficiency-must-for-growth
- ↑ http://www.geo.tv/latest/267451-gwadar-port-starts-handling-afghan-transit-trade-report
- ↑ Mahnaz Z. Ispahani (June 1989). Roads and Rivals: The Political Uses of Access in the Borderlands of Asia (First ed.). Cornell University Press. p. 191. ISBN 978-0801422201.
- ↑ 35.0 35.1 Abrar, Mian (4 December 2015). "Between the devil and deep Gwadar waters". Pakistan Today. Retrieved 6 December 2015.
- ↑ Tiezzi, Shannon (20 February 2014). "China, Pakistan Flesh Out New 'Economic Corridor'". The Diplomat. Retrieved 23 April 2015.
- ↑ "Nawaz Sharif, Li Keqiang to firm up plans for China-Pakistan Economic Corridor". Archived from the original on 2016-03-05. Retrieved 2022-12-12.
- ↑ "Politicians hit out at 'unfair' Pakistan-China Economic Corridor". The Express Tribune. 22 April 2015.
- ↑ "Pakistan lands $46 billion investment from China". CNN. 20 April 2015.
- ↑ "Ministry of Planning, Development & Reforms" (Press release). pc.gov.pk.
- ↑ "Here's why Indian strategists should worry about China's $46 billion funding to Pakistan". Firstpost. 22 April 2015. Retrieved 22 April 2015.
- ↑ Saran, Shyam (10 September 2015). "What China's One Belt and One Road Strategy Means for India, Asia and the World". The Wire (India). Archived from the original on 18 November 2015. Retrieved 6 December 2015.
- ↑ 43.0 43.1 "Industrial potential: Deep sea port in Gwadar would turn things around". The Express Tribune. 17 March 2016. Retrieved 9 April 2016.
- ↑ Butt, Naveed (3 September 2015). "Economic Corridor: China to Extend Assistance at 1.6 Percent Interest Rate". Business Recorder. Archived from the original on 17 November 2015. Retrieved 16 December 2015.
- ↑ "Gwadar-Nawabshah LNG project part of CPEC". The Nation. 28 March 2016. Retrieved 9 April 2016.
- ↑ Li, Yan. "Groundwork laid for China-Pakistan FTZ". ECNS. Retrieved 6 December 2015.
- ↑ "Economic Zone: Government Hands Gwadar Land over to China". Business Recorder. 12 November 2015. Archived from the original on 2016-03-04. Retrieved 2022-12-12.
- ↑ "Gwadar Port to become distribution centre for ME market: Zhang". Business Recorder. 17 March 2016. Archived from the original on 10 ఆగస్టు 2017. Retrieved 9 April 2016.
include bonded warehouses, manufacturing, international purchasing, transit and distribution transshipment, commodity display and supporting services and where the federal, provincial and local taxes
- ↑ "Pakistan approves massive tax exemptions for Gwadar port operators". Express Tribune. 24 May 2016. Retrieved 25 May 2016.
In a major move, the ECC approved a complete income tax holiday for 23 years to businesses that will be established in the Gwadar Free Zone... / A 23-year exemption from sales tax and federal excise duty has also been granted to businesses that will be established inside the Gwadar Free Zone. However, if these businesses make supplies and sales outside the free zone, they will be subject to taxation.
- ↑ "Pakistan approves massive tax exemptions for Gwadar port operators". Express Tribune. 24 May 2016. Retrieved 25 May 2016.
Under the move, the concession will extend to contractors and subcontractors and COPHCL companies for 20 years.
- ↑ "Pakistan approves massive tax exemptions for Gwadar port operators". Express Tribune. 24 May 2016. Retrieved 25 May 2016.
Pakistan approved customs duty exemption for the COPHCL, its operating companies, contractors and subcontractors for a period of 40 years on import of equipment, materials, plants, machinery, appliances and accessories for construction of Gwadar Port and the associated Free Zone.
- ↑ "PURCHASE OF POWER: PAYMENTS TO CHINESE COMPANIES TO BE FACILITATED THROUGH REVOLVING FUND". Business Recorder. Archived from the original on 1 అక్టోబరు 2016. Retrieved 6 December 2015.
- ↑ Shahbaz Rana (26 July 2015). "Eastern CPEC route unfeasible: report". The Express Tribune. Retrieved 8 June 2016.
- ↑ "First phase of Karachi-Lahore motorway launched". Dawn. 12 March 2015. Retrieved 16 January 2016.
- ↑ "China's CSCEC to build $20000.9bn motorway in Pakistan as part of planned 'corridor'". Global Construction Review. 8 January 2016. Retrieved 16 January 2016.
- ↑ "Karachi-Lahore motorway: Project to be completed in 3 years". Pakistan Tribune. 29 January 2015. Retrieved 16 December 2015.
700 Billion Pak rupees = US$6.6 billion as of December 16, 2015
- ↑ "KP remained part of CPEC Western Route meetings at federal level". The News (Pakistan). 13 January 2016. Retrieved 16 January 2016.
- ↑ "COAS Assures Balochistan People Will Prosper With Upcoming Projects". Geo News. 1 January 2016. Retrieved 26 January 2016.
- ↑ "Overcoming Challenges to CPEC". Spearhead Research. 27 May 2015. Archived from the original on 15 April 2016. Retrieved 9 April 2016.
- ↑ "Feasibility study for rehab of Karachi-Peshawar rail line in progress". The Nation. 23 January 2016. Retrieved 10 February 2016.
- ↑ 61.0 61.1 "Havelian to Khunjerab railway track to be upgraded under China-Pakistan Economic Corridor". Sost Today. 15 January 2016. Retrieved 10 February 2016.
- ↑ "Annual Plan 2015–16" (PDF). Ministry of Planning, Development, and Reform (Pakistan). p. 130. Archived from the original (PDF) on 13 March 2016. Retrieved 13 March 2016.
- ↑ "OVER 80 PERCENT INVESTMENT UNDER CPEC TO COME THROUGH PRIVATE SECTOR: AHSAN". Business Recorder. 17 December 2015. Retrieved 29 January 2016.
The minister said out of the total investment of US$46 billion, US$38 billion would be spent on energy related projects which was on independent power producer (IPP) mode and would not increase burden of national debt.
- ↑ Shoaib-ur-Rehman Siddiqui (17 April 2015). "1ST PHASE OF CPEC TO BRING $35BN INVESTMENT IN ENERGY: AHSAN IQBAL". Business Recorder.
- ↑ https://nation.com.pk/22-May-2018/1-180mw-bhikki-plant-starts-full-power-generation
- ↑ https://dieselgasturbine.com/1223-mw-plant-up-in-pakistan/
- ↑ Zain, Ali (9 October 2015). "PM Nawaz inaugurates 1180 MW Bhikhi Power Plant in Sheikhupura". Daily Pakistan. Retrieved 11 December 2015.
- ↑ "PAKISTAN PM Nawaz inaugurates Balloki power project, which would add 1223 MW". The News Teller. 10 November 2015. Archived from the original on 11 ఏప్రిల్ 2019. Retrieved 10 March 2016.
- ↑ "Tarbela 4th extension project starts power production - The Express Tribune". The Express Tribune (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-02-27. Retrieved 2018-02-27.
- ↑ "Pakistan orders completion of two hydel projects by June". The Siasast Daily. 5 March 2016. Retrieved 23 March 2016.
- ↑ "Tajik Energy Ministry: CASA-1000 project implementation to be launched this year". AzerNews.az (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-02-07. Retrieved 2018-02-27.
- ↑ "NATIONAL ASSEMBLY SECRETARIAT: "UNSTARRED QUESTIONS AND THEIR REPLIES"" (PDF). 10 December 2015. pp. 5–6. Retrieved 13 March 2016.
- ↑ "Suki Kinari: Landowners threaten to resist acquisition for hydropower project". The Express Tribune (Pakistan). 19 February 2015. Retrieved 13 March 2016.
- ↑ Tiezzi, Shannon (13 January 2016). "China Powers up Pakistan: The Energy Component of the CPEC". The Diplomat. Retrieved 13 March 2016.
- ↑ "CPEC made part of China's 13th 5-year development plan: Weidong". Pakistan Today. 23 November 2015. Retrieved 6 March 2016.
- ↑ "China's landmark investments in Pakistan". The Express Tribune. 21 April 2015. Retrieved 21 April 2015.
- ↑ "CPEC has changed economic outlook of Pakistan, S Asia". www.thenews.com.pk.
- ↑ Chaudhary, Asif (5 December 2016). "What Pakistan gains from CPEC".
- ↑ Sukumar, Arun Mohan. "What the Marshall Plan Can Teach India About the China-Pakistan Economic Corridor". thewire.in (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2017-02-06.
- ↑ "Massive Chinese investment is a boon for Pakistan". The Economist. 8 September 2017. Retrieved 8 September 2017.
- ↑ "CPEC Documentary in Urdu 🇵🇰|🇨🇳 China-Pakistan Economic Corridor". YouTube. PTV Parliament. Retrieved 2 January 2019.
- ↑ Usman W. Chohan (May 2015). "Geostrategic Location and the Economic Center of Gravity of the World". McGill University Economic Publications.
- ↑ "Pakistan media hails Chinese investments as 'game-changer'". The Times of India. 21 April 2015. Retrieved 21 April 2015.
- ↑ "One-on-one meeting between Mamnoon Hussain and his Chinese counterpart was followed by delegation level talks". Radio Pakistan. 21 April 2015. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 21 April 2015.
- ↑ "MUCH OF INVESTMENT, $35 BILLION OF WHICH WILL GO TO ENERGY PROJECTS, WILL BE IN FORM OF DISCOUNTED LOANS". Newsweek Pakistan. 21 April 2015. Retrieved 21 April 2015.
- ↑ Shah, Saeed. "Big Chinese-Pakistani Project Tries to Overcome Jihadists, Droughts and Doubts". The Wall Street Journal. ISSN 0099-9660. Retrieved 2016-04-10.
- ↑ 87.0 87.1 Kugelman, Michael (9 July 2015). "Pakistan's Other National Struggle: Its Energy Crisis". The Wall Street Journal. Retrieved 11 December 2015.
- ↑ "Electricity shortfall increases to 4,500 MW". Dunya News. 29 June 2015. Retrieved 11 December 2015.
- ↑ Fingar, Courtney (11 March 2016). "Pakistan's FDI: fuelled by China". Financial Times. Retrieved 13 March 2016.
- ↑ "Pakistani Govt announces no load-shedding at 5297 feeders across Pakistan". Geo News. Retrieved 18 December 2017.
Pakistani Govt announces no load-shedding at 5297 feeders across Pakistan.
- ↑ "Is China-Pakistan 'silk road' a game-changer?". BBC. No. 22 April 2015. Retrieved 17 February 2016.
- ↑ "Pakistan lands $46 billion investment from China". CNN. 20 April 2015.
- ↑ Chowdhary, Mawish (25 August 2015). "China's Billion-Dollar Gateway to the Subcontinent: Pakistan May Be Opening A Door It Cannot Close". Forbes. Retrieved 17 February 2016.
- ↑ Ramachandran, Sudha (31 July 2015). "China-Pakistan Economic Corridor: Road to Riches?". China Brief (The Jamestown Foundation). 15 (15). Retrieved 17 February 2016.
- ↑ "Exclusive: China sends surface-to-air missiles to contested island in provocative move". Fox News Channel. 16 February 2016. Retrieved 17 February 2016.
- ↑ Alam, Omar (21 December 2015). "China-Pakistan Economic Corridor: Towards a New 'Heartland'?". International Relations and Security Network. Retrieved 17 February 2016.
- ↑ Garlick, Jeremy (2018). "Deconstructing the China-Pakistan Economic Corridor: pipe dreams versus geopolitical realities". Journal of Contemporary China. 27 (112): 519–533. doi:10.1080/10670564.2018.1433483. S2CID 158778555.
- ↑ 98.0 98.1 http://www.dawn.com/news/1457449