Jump to content

గ్రెగ్ చాపెల్

వికీపీడియా నుండి
దస్త్రం:Greg Chappell at SCG ground.jpg
గ్రెగ్ చాపెల్

1948, ఆగస్ట్ 7న జన్మించిన గ్రెగ్ చాపెల్ (Gregory Stephen Chappell) ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1975 నుంచి 1977 వరకు ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. ఆ తరువాత వరల్డ్ సీరీస్ క్రికెట్‌లో చేరినాడు. మళ్ళీ ఆస్ట్రేలియా జట్టుకు తిరిగివచ్చి 1979 నుంచి 1983 వరకు జట్టుకు నాయక్త్వం వహించాడు.[1] ఒక మంచి ఆల్‌రౌండర్‌గా బాధ్యతలు నెరవేర్చుతూ రిటైర్ అయ్యేనాటికి టెస్ట్ క్రికెట్‌లోనే అత్యధిక క్యాచ్‌లను అందుకున్న క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.[2]

గ్రెగ్ చాపెల్ క్రీడా జీవితాన్ని రెండూ దశలుగా విభజించవచ్చు. ప్రపంచ సీరీస్ క్రికెట్ వైరుధ్యం తరువాత ప్రొఫెషనలిజంలో రాణించాడు.[3] 1984లోంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన పిదప జాతీయ జట్టు సెలెక్టర్ గాను, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులో సభ్యుడుగాను పనిచేశాడు. 2005లో భారత క్రికెట్ జట్టుకు రెండు సంవత్సరాల పాటు కోచ్‌గా నియమితుడయ్యాడు. 2007 ప్రపంచ కప్ క్రికెట్‌లో భారత జట్టు పేవలమైన ప్రదర్శన వలన గ్రెగ్ చాపెల్ 2007 ఏప్రిల్ 4న ఆ పదవి నుంచి వైదొలిగినాడు.[4][5] ఇండియన్ ప్రీమియర్ లీగ్లో జైపూర్ ఫ్రాంచైజీకి కోచ్‌గా నియమితుడయ్యాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు

[మార్చు]

గ్రెగ్ చాపెల్ 87 టెస్టులలో జట్టుకు ప్రాతినిధ్యం వహించి 53.86 సగటుతో 7110 పరుగులు సాధించాడు. అందులో 24 సెంచరీలు, 31 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 247 నాటౌట్. టెస్టులలో 47 వికెట్లు కూడా పడగొట్టినాడు. టెస్టులలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 61 పరుగులకు 5 వికెట్లు.

వన్డే క్రికెట్ గణాంకాలు

[మార్చు]

చాపెల్ 74 వన్డేలు ఆడి 40.18 సగటుతో 2331 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 14 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 138 నాటౌట్. వన్డేలలో 72 వికెట్లు కూడా పొందినాడు. వన్డేలలో అతడి అత్యుత��తమ బౌలింగ్ విశ్లేషణ 15 పరుగులకు 5 వికెట్లు.

జట్టు నాయకుడిగా గణాంకాలు

[మార్చు]

చాపెల్ 48 టెస్టులకు నేతృత్వం వహించి 21 విజయాలు పొందినాడు. 14 టెస్టులలో ఓటమి పొందగా మరో 14 టెస్టులు డ్రాగా ముగిశాయి. కెప్టెన్‌గా తొలి సీరీస్ లోనే 1975-76లో వెస్ట్‌ఇండీస్ పై 5-1 తేడాతో సీరీస్ ఘనవిజయాన్ని పొందినాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Cashman, Richard (editor - 1996): The Oxford Companion to Australian Cricket, Oxford University Press. ISBN 0-19-553575-8. pp 101-2.
  2. Cashman (1996), pp 102.
  3. Haigh, Gideon (1993): The Cricket War - the Inside Story of Kerry Packer's World Series Cricket, The Text Publishing Company. ISBN 1-86372-027-8. p 308.
  4. "After destroying India, Chappell may do the same to Oz". Archived from the original on 2009-02-07. Retrieved 2008-03-06.
  5. "Greg Chappell Was Autocratic And Failed As Coach And Captain". Archived from the original on 2007-08-13. Retrieved 2008-03-06.