కొత్తూరు ధనదిబ్బలు
Kotturu Dhanadibbalu
Pandavula guhalu | |
---|---|
Protected Buddhist Monument | |
Country | India |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | Visakhapatnam |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | AP |
Nearest city | Visakhapatnam |
కొత్తూరు ధనదిబ్బలు & పాండవుల గుహలు కొత్తూరు గ్రామం సమీపంలో (అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఉన్న గ్రామం) ఉన్న బౌద్ధ గుహలు. [1]
చరిత్ర
[మార్చు]ఇది పురాతన బౌద్ధక్షేత్రం. ఇక్కడ మహాస్థూపం, బౌద్ధ సన్యాసులు నివసించిన గుహల అవశేషాలు ఉన్నాయి. ఇది శారదానదీ తీరంలో ఉన్న ఈ గుహల ప్రాంతాన్ని క్రీ.పూ. 1 శతాబ్దం నుండి సా.శ. 2వ శతాబ్దం వరకు బైద్ధ సన్యాసుల నివాసప్రాంతంగా ఉండేదని విశ్వసిస్తున్నారు.ఈ ప్రాంతాన్ని ప్రాంతీయంగా " ధనదిబ్బలు అని పిలుస్తుంటారు. [2] ఈ ప్రదేశంలో ఇప్పటికీ ఆర్కియాలజీశాఖ త్రవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ విహారాలు, శిలాశాసనాలు బయల్పడుతూ ఉన్నాయి. మహాస్థూపం సమీపంలో చిన్న రాతి పీపాలు ఉన్నాయి. కొండనుండి కొతదూరం పోయిన తరువాత అక్కడక్కడా ఇటుకలు ఊడిపోయిన బౌద్ధవిహారాలు ఉన్నాయి.మరికొంత దూరంలో రాతిని తొలిచిచేసిన 5 గుహలు ఉన్నాయి. ఈ గుహలను పాండవుల గుహలు అని ప్రాంతీయులు చెపుతుంటారు.సరైనరక్షణ, కాపలా లేనికారణాంగా ఇటుకలను ప్రజలు వారి నిర్మాణాలకు వాడుకుంటున్నారు. అవశేషాల చుట్టూ కంచ నిర్మించబడింది. ఆర్కియాలజీశాఖ ఇక్కడ ఒకపూదోటను నిర్వహిస్తున్నారు.
భౌగోళికం
[మార్చు]కొత్తూరు ధనదిబ్బలు జిల్లా కేంద్రం అయిన అనకాపల్లి నుండి 31 కీమీ దూరం లో ఎలమంచిలి - అత్చుతాపురం రహదారిలో ఉంటుంది.
సమీప బస్ స్టేషన్ - ఎలమంచిలి (8 కి. మీ)
సమీప రైల్వే స్టేషన్ - ఎలమంచిలి (9 కి.మీ)
సమీప విమానాశ్రయం - విశాఖపట్నం (46 కి.మీ)
చిత్రమాలిక
[మార్చు]-
ధనదిబ్బలు వద్ద రాళ్ళను తొలిచి చేసిన గుహలు.
-
ధనదిబ్బల వద్ద వోటివ్ స్థూపం శిథిలాలు, ఫిరంగి అవశేషాలు.
-
ధనదిబ్బల వద్ద బౌద్ధ క్షేత్ర అవశేషాలు
-
ధనదిబ్బల వద్ద రాక్ కట్ గుహలకు (పాండవుల గుహలు) దారి.
-
ధనదిబ్బలు వద్ద మహాస్థూప అవశేషాలు.
మూలాల జాబితా
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-06. Retrieved 2016-10-23.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-21. Retrieved 2016-10-23.