కింగ్ (సినిమా)
కింగ్ (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శ్రీను వైట్ల |
---|---|
నిర్మాణం | శివప్రసాద్ రెడ్డి |
కథ | కోన వెంకట్, గోపీమోహన్ |
చిత్రానువాదం | శ్రీను వైట్ల |
తారాగణం | అక్కినేని నాగార్జున, శ్రీహరి (నటుడు), కృష్ణ భగవాన్, సాయాజీ షిండే స్నేహా ఉల్లాల్ జయప్రకాశ్ రెడ్డి త్రిష, చంద్రమోహన్, మమతా మోహన్ దాస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం ఫిష్ వెంకట్ శ్రీనివాస రెడ్డి కెల్లీ డార్జ్ |
సంగీతం | దేవి శ్రీప్రసాద్ |
నృత్యాలు | బృంద, రాజశేఖర్, శోభి |
గీతరచన | రామజోగయ్య శాస్త్రి, సాహితి |
సంభాషణలు | బి.వి.యస్ రవి |
ఛాయాగ్రహణం | ప్రసాద్ మూరెళ్ళ |
కూర్పు | ఎం.వి వర్మ |
నిర్మాణ సంస్థ | కామాక్షి కళా మూవీస్ |
భాష | తెలుగు |
కింగ్ (King) 2008 సంవత్సరంలో విడుదలైన భారీ బడ్జెట్ తెలుగు సినిమా. దీని కోసం నిర్మాత శివప్రసాద్ రెడ్డి దర్శకుడు శ్రీను వైట్లతో అక్కినేని నాగార్జున లను ఎన్నుకున్నాడు.
కథ
[మార్చు]ఓ రాజభవనం వేలంపాటలో ప్రత్యర్థి ప్రతినాయకుని రెచ్చగొట్టి, 50 లక్షలు విలువచేసే భవనాన్ని రెండు కోట్లకు ప్రత్యర్థిని కొనేలా చేస్తాడు కింగ్. దీంతో "కింగ్" ఎలాంటివాడో తొలిదృశ్యంలోనే దర్శకుడు చూపిస్తాడు. చంద్రప్రతాపవర్మ (నాగార్జున) ను అందరూ "కింగ్' అని పిలుస్తుంటారు. ఆ వంశోద్ధారకుడు ఈయనే. "కింగ్" తల్లిదండ్రులు రాజావర్మ (శోభన్‌బాబు), తల్లి గీత. ఇతనికోక తమ్ముడు ఉంటాడు. అతని పేరు దీపక్. తండ్రి మరణంతో కింగ్ ఆ ఆస్తికి వారసుడవుతాడు. మరోవైపు కింగ్ మామయ్యలు ముగ్గురు ఆస్తి కాజేయాలని ప్రయత్నిస్తుంటారు. ఆస్తిని దోచుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా విఫలమవడంతో వారు డబ్బులను రేసులు, పేకాటలకు హారతి కర్పూరం చేస్తుంటారు. ఆఖరికి ఇంట్లో దొంగతనం చేసి దాన్ని మేనేజర్‌పై పెట్టి ఇంటి నుంచి అతడిని వెళ్లగొడతారు. ఇది తెలిసిన కింగ్ వారిని నిలదీస్తాడు. ఇక తమకు అడ్డుపడుతున్న కింగ్‌ను ఎలాగోలా వదిలించుకోవాలని మేనమామలైన కృష్ణ భగవాన్, షిండే, జయప్రకాశ్ రెడ్డి అవకాశం కోసం వేచి చూస్తుంటారు. ఓ రోజు వ్యాపార నిమిత్తం ఉత్తరాంచల్‌కు కింగ్ ఒక్కడే వెళ్లాల్సివస్తుంది. ఇదే సరైన సమయమని మేనమామలు ముగ్గురు ఏదో ప్లాన్ చేస్తున్నట్లు కనబడతారు. తీరా అక్కడికి వెళ్ళగానే కింగ్‌ను మమతామోహన్‌దాస్ రిసీవ్ చేసుకుంటుంది. వీరిద్దరూ మాట్లాడుతుండగానే ఓ ముసుగు వ్యక్తి కింగ్‌ను కాల్చేస్తాడు. అయితే గ��రితప్పుతుంది. అతడిని కింగ్ పట్టుకునే ప్రయత్నం చేసే క్రమంలో ఆయన వెనుక ఉన్న మమతా కింగ్‌ను కాల్చేస్తుంది. కింగ్ చనిపోతాడు. ఇంటి దగ్గర కింగ్ తల్లితో తన మేనల్లుడు కన్పించడం లేదని హడావుడి చేస్తారు. దీంతో ఆమె దేశమంతా వెతికించే ప్రయత్నం చేస్తుంది. ఆ గమనం అక్కడితో ఆగిపోతుంది. హైదరాబాద్‌లో బొట్టుశ్రీను అనే రౌడీ (నాగార్జున), జ్ఞానేశ్వర్ (శ్రీహరి) అనే ఇద్దరు రౌడీలుంటారు. వీరిద్దరి మధ్య పోటీ ఉన్నప్పటికీ వాటా పంపంకంతో ఒకటవుతారు. జ్ఞానేశ్వర్ చెల్లెలు శ్రావణి (త్రిష) ఓ ఔత్సాహిక గాయని. ఓ టీవీ ఛానెల్ పెట్టిన సంగీత కార్యక్రమంలో పాల్గొంటుంది. దానికి జడ్జిగా గొప్ప సంగీత దర్శకుడు జయసూర్య (బ్రహ్మానందం) హాజరవుతాడు. అతడు గమకాలు, శృతి, లయలు తెలీకుండా కాపీకొట్టి సంగీతదర్శకుడిగా పేరుతెచ్చుకున్న రకం. గాయని బాగుంటే రాత్రికి రమ్మనే రకం. దీంతో శ్రావణి బాగా పాడినా ఇదేం సంగీతమంటూ నిరుత్సాహపరుస్తుంటాడు. ఇది గమనించిన బొట్టుశ్రీను జయసూర్యను హెచ్చరించి శ్రావణికి మొదటి బహుమతి వచ్చేలా చేస్తాడు. జయసూర్య దీన్ని మనసులో పెట్టుకుని బొట్టుశ్రీనుపై పగపెంచుకుంటాడు. మరోవైపు తాను రౌడీనని తెలిస్తే శ్రావణి ప్రేమించదని అప్పటికే ఆమెకోసం వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శరత్ స్థానంలో బొట్టుశ్రీను వచ్చి తానే శరత్ అంటాడు. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి పాకానపడుతుంది. ఇక ఇద్దరూపెండ్లిచేసుకుందామని నిర్ణయించుకుంటారు. తర్వాత తన అన్న జ్ఞానేశ్వర్ (శ్రీహరి) వద్ద బొట్టుశ్రీనును.. విదేశీ వ్యాపారం చేసే వ్యక్తిగా శ్రావణి పరిచయం చేస్తుంది. దీంతో అయోమయం చెందిన జ్ఞానేశ్వర్.. ఆ తర్వాత తన పరిశోధనలో బొట్టుశ్రీను, శరత్ వేరువేరు అనే నిర్ధారణకు వస్తాడు. అన్నీ దారికి వచ్చి పెండ్లిపీటలదాకా వచ్చే సమయంలో కొంతమంది గూండాలు బొట్టుశ్రీను, ఉరఫ్ శరత్‌లను కింగ్ అనుకుని వెంటాడుతారు. ఆ క్రమంలో జయప్రకాష్ రెడ్డి వద్దకు గూండాలు బొట్టుశ్రీనును తెస్తారు. అచ్చు కింగ్‌లా ఉన్న బొట్టుశ్రీనును రాజవంశీయుల వారసుడైన కింగ్‌లా నటించమని ఒప్పిస్తారు. అలా ఊరువచ్చిన బొట్టుశ్రీనుకు కింగ్ తమ్ముడు దీపక్ విదేశాల నుంచి ఇంటికి వచ్చి మమతామోహన్‌దాస్‌ను పెండ్లి చేసుకుంటానని చెబుతాడు. కానీ ఆమె దీపక్‌ను హత్యచేయాలని చూస్తుంటుంది. వీటిని కింగ్ గమనించి చంద్రముఖి తరహాలో అడ్డుకుంటాడు. కింగ్‌ను ఎందుకు చంపావని? మమతా మోహన్‌దాస్‌ను నిలదీస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన దీపక్ అసలు నిజం చెబుతాడు తానే దోషినని.
పాటలు
[మార్చు]ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.
సం. | పాట | పాట రచయిత | Singer(s) | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "కింగ్" | రామజోగయ్య శాస్త్రి | Leslie Lewis, మమతా మోహన్‌దాస్ | 5:27 |
2. | "A to Z" | రామజోగయ్య శాస్త్రి | నవీన్, ప్రియా హిమేశ్ | 4:45 |
3. | "ఓ మన్మధుడా" | రామజోగయ్య శాస్త్రి | సాగర్, దివ్య | 4:46 |
4. | "ఎంతపని చేస్తివిరో" | సాహితి | వడ్డేపల్లి శ్రీనివాస్, ప్రియా హిమేశ్ | 5:23 |
5. | "ఘనన ఘనన" | రామజోగయ్య శాస్త్రి | ఉజ్జయినీ | 3:38 |
6. | "నేను నీ రాజా" | రామజోగయ్య శాస్త్రి | రాహుల్ నంబియార్, ఆండ్రియా జెరీమియా | 5:17 |
7. | "Ghanana (Funny)" | రామజోగయ్య శాస్త్రి | మమతా మోహన్‌దాస్ | 1:51 |
8. | "నువ్వు రెడీ నేను రెడీ" | రామజోగయ్య శాస్త్రి | శంకర్ మహదేవన్, గోపికా పూర్ణిమ | 5:31 |
9. | "కింగ్ (The DSP Mix)" | రామజోగయ్య శాస్త్రి | దేవీశ్రీ ప్రసాద్ | 3:51 |
మొత్తం నిడివి: | 40:31 |