ఒరేయ్ బుజ్జిగా
ఒరేయ్ బుజ్జిగా | |
---|---|
దర్శకత్వం | విజయ్ కుమార్ కొండా |
రచన | విజయ్ కుమార్ కొండా |
నిర్మాత | కె.కె. రాధామోహన్ |
తారాగణం | రాజ్ తరుణ్ మాళవిక నాయర్ హెబ్బా పటేల్ పోసాని కృష్ణ మురళి విజయ నరేష్ వాణీ విశ్వనాధ్ |
ఛాయాగ్రహణం | ఐ. ఆండ్రూ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | ఆహా (ఓటిటి) |
విడుదల తేదీ | 2 అక్టోబరు 2020 |
సినిమా నిడివి | 153 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఒరేయ్ బుజ్జిగా 2020, అక్టోబరు 2న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ‌్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ నిర్మాణ సారథ్యంలో విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్, పోసాని కృష్ణ మురళి, విజయ నరేష్, వాణీ విశ్వనాధ్ ప్రధాన పాత్రల్లో నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. 2020, మార్చి 25న విడుదలకావాల్సిన ఈ చిత్రం కరోనా-19 కారణంగా వాయిదాపడి 2020, అక్టోబరు 2న ఆహా ఓటిటి లో విడుదలయింది.[1]
కథా నేపథ్యం
[మార్చు]నిడదవోలులోని కాంట్రాక్టర్ కోటేశ్వరరావు (పోసాని కృష్ణమురళి) కొడుకు శ్రీనివాస్ (రాజ్‌తరుణ్). తల్లి చనిపోవడంతో జ్యోతిష్యుడు చెప్పిన దాని ప్రకారం కొడుకు శ్రీనివాస్‌కు పెళ్ళి చేయాలని కోటేశ్వరరావు భావిస్తాడు. కానీ పెళ్ళి చేసుకోవడం ఇష్టంలేని శ్రీనివాస్ ఊరు వదలి వెళ్లిపోవడానికి రైలు ఎక్కుతాడు. అదే సమయంలో అదే ఊరిలో ఉండే చీఫ్ ఇంజనీర్ చాముండేశ్వరి (వాణీ విశ్వనాథ్) కూతురు కృష్ణవేణి (మాళవిక నాయర్) పెళ్ళి చేసుకోవడం ఇష్టంలేక ఊరు విడిచి వెళ్లిపోతూ అదే రైలు ఎక్కుతుంది. దాంతో శ్రీనివాస్, కృష్ణవేణి లేచిపోయారని ఊర్లో అందరూ అనుకుంటుంటారు. రైలు ప్రయాణంలో శ్రీనివాస్, కృష్ణవేణి మంచి స్నేహితులు ��వుతారు. శ్రీనివాస్ ముద్దుపేరు బుజ్జిగాడు అని కృష్ణవేణికి తెలియదు. తను రైలు ఎక్కడం వల్ల బుజ్జిగాడితో కృష్ణవేణి లేచిపోయిందనే పుకారు మొదలైందనే విషయం కృష్ణవేణికి తెలుస్తుంది. దాంతో ఆమె బుజ్జిగాడి మీద కోపం పెంచుకుంటుంది. మరోవైపు కృష్ణవేణి కారణంగా ఇంట్లో సమస్యలు మొదలయ్యాయని తెలుసుకున్న బుజ్జిగాడు, ఆమెను వెతికి పట్టుకొస్తానని అమ్మకు మాట ఇస్తాడు. కృష్ణవేణి కూడా స్వాతి అని పేరు మార్చి చెప్పడంతో, బుజ్జిగాడు కూడా కృష్ణవేణినే తను వెతుకుతున్న స్వాతి అని తెలియక ఆమెతో స్నేహం చేస్తాడు. అసలు శ్రీనివాస్, కృష్ణవేణి వేర్వేరు కారణాలతో రైలు ఎక్కారనే నిజం తెలియక కుటుంబ సభ్యులు గొడవలు పడుతుంటారు. తాను ప్రేమించిన సృజన (హెబ్బా పటేల్) మోసం చేసి పోవడంతో బుజ్జి మళ్లీ తిరిగి ఊరికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకరంటే ఒకరికి తెలియకుండానే శ్రీనివాస్, కృష్ణవేణి ప్రేమలో పడతారు. తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.
నటవర్గం
[మార్చు]- రాజ్ తరుణ్ (శ్రీనివాస్/బుజ్జి)
- మాళవికా నాయర్ (కృష్ణవేణి/స్వాతి)
- హెబ్బా పటేల్ (సృజన)
- పోసాని కృష్ణ మురళి (శ్రీనివాస్ తండ్రి కోటేశ్వరరావు)
- వాణీ విశ్వనాధ్ (కృష్ణవేణి తల్లి చాముండేశ్వరి)
- విజయ నరేష్ (కృష్ణవేణి తండ్రి)
- రాజా రవీంద్ర (కృష్ణవేణి మామ)
- అనీష్ కురువిల్లా (ప్రాజెక్ట్ మేనేజర్)
- సప్తగిరి
- మధునందన్ (శ్రీనివాస్ స్నేహితుడు)
- అన్నపూర్ణ (కృష్ణవేణి అమ్మమ్మ)
- సత్య
- సిరి హనుమంత్ (స్వీటీ, కృష్ణవేణి స్నేహితుడు)
- జయలక్ష్మి (శ్రీనివాస్/బుజ్జీ తల్లి)
- అజయ్ ఘోష్
- సత్యం రాజేష్
- వర్ష
- పమ్మి సాయి
- భద్రం
- రియా
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
- నిర్మాణం: కె.కె. రాధమోహన్
- సంగీతం: అనుప్ రూబెన్స్
- సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ
- కూర్పు: ప్రవీణ్ పూడి
- నిర్మాణ సంస్థ: శ‌్రీసత్యసాయి ఆర్ట్స్
- పంపిణీదారు: ఆహా (ఓటిటి)
పాటలు
[మార్చు]ఈ చిత్రంలో ఐదు పాటలు ఉన్నాయి. ఈ పాటలను అనుప్ రూబెన్స్ స్వరపరిచాడు. వనమాలి, కాసర్ల శ్యామ్, కిట్టు విస్సాప్రగడ, కృష్ణకాంత్ పాటలు రాశారు.
పాటల జాబితా
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "ఈ మాయ పేరేమిటో (రచన: కిట్టు విస్సాప్రగడ)" | సిద్ శ్రీరామ్ | 4:16 | ||||||
2. | "కురిసేనా (రచన: కె.కృష్ణకాంత్)" | అర్మాన్ మాలిక్, పి. మేఘన | 4:09 | ||||||
3. | "కృష్ణవేణి (రచన: కాసర్ల శ్యామ్)" | రాహుల్ సిప్లిగంజ్ | 3:47 | ||||||
4. | "సరిగమ (రచన: వనమాలి)" | అనూప్ రూబెన్స్ | 3:02 | ||||||
5. | "కలలు చూసిన కన్నులే (రచన: కాసర్ల శ్యామ్)" | సిద్ శ్రీరాం | 2:50 | ||||||
18:04 |
స్పందన
[మార్చు]ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ చిత్రానికి 2/5 రేటింగ్ ఇవ్వగా,[2] ది హన్స్ ఇండియా పత్రిక 2.5/5 ఇచ్చింది.[3] స్క్రీన్ ప్లే బలహీనంగా, ఎటువంటి మలుపులు లేకుండా ఉందని, అనూప్ రూబెన్స్ సంగతం బాగుందని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది.[4] ఈ చిత్రంలో అనవసరమైన కామెడీ ఉందని, కొన్ని పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడంతో ప్రేక్షకులను నిరాశపరచిందని ది హిందూ పత్రిక రాసింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ Dundoo, Sangeetha Devi (2020-09-30). "The best of both worlds for Malvika Nair". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-10-26.
- ↑ Orey Bujjiga Movie Review: A stale, predictable love story, 2 October 2020, retrieved 2020-10-26
- ↑ "Orey Bujjiga Movie Review & Rating {2.5/5}". The Hans India. 2020-10-02. Retrieved 2020-10-26.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "'ఒరేయ్.. బుజ్జిగా' రివ్యూ" [Orey Bujjiga review]. Andhra Jyothi. 2 October 2020. Archived from the original on 2020-10-21. Retrieved 2020-10-26.
- ↑ Dundoo, Sangeetha Devi (2020-10-02). "'Orey Bujjiga' review: Been there, seen that". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-10-26.