Jump to content

ఎస్. బంగారప్ప

వికీపీడియా నుండి
సారెకొప్ప బంగార‌ప్ప‌

12వ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి
పదవీ కాలం
17 అక్టోబర్ 1990 – 19 నవంబర్ 1992
గవర్నరు భాను ప్రతాప్ సింగ్
ఖుర్షెడ్ అలం ఖాన్
ముందు వీరేంద్ర పాటిల్
తరువాత వీరప్ప మొయిలీ

parliament సభ్యుడు
శిమోగా లోక్‌సభ నియోజకవర్గం
పదవీ కాలం
5 జూన్ 2005 – 12 ఫిబ్రవరి 2009
తరువాత బి. వై. రాఘవేంద్ర
పదవీ కాలం
6 అక్టోబర్ 1999[1][2] – 10 మార్చి 2005
ముందు ఆయనూర్ మంజునాథ్
పదవీ కాలం
1996 – 1998
ముందు కే. జి. శివప్ప
తరువాత ఆయనూర్ మంజునాథ్

Member of the కర్ణాటక Assembly
for సొరబ్ శాసనసభ నియోజకవర్గం
పదవీ కాలం
1967 – 1996
తరువాత కుమార్ బంగారప్ప

వ్యక్తిగత వివరాలు

జననం (1933-10-26)1933 అక్టోబరు 26
శిమోగా జిల్లా,కర్ణాటక రాష్ట్రం, భారతదేశం
మరణం 2011 డిసెంబరు 26(2011-12-26) (వయసు 78)
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
రాజకీయ పార్టీ జనతా దళ్(సెక్యూలర్) (2010–11)
ఇతర రాజకీయ పార్టీలు
జీవిత భాగస్వామి
శకుంతల
(m. 1958⁠–⁠2011)
సంతానం కుమార్ బంగారప్ప, మధు బంగారప్ప సహా 5మంది

సారెకొప్ప బంగార‌ప్ప‌ (26 అక్టోబర్ 1933 - 26 డిసెంబర్ 2011) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు వరుసగా సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై వివిధ హోదాల్లో పనిచేసి 1990 అక్టోబరు 17 నుండి 1992 నవంబరు 19 వరకు కర్ణాటక రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బంగారప్ప సోషలిస్టుగా రాజకీయాల్లో వచ్చి 1967లో తొలిసారి శాసనసభకు ఎన్నికై తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర మంత్రిగా, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షునిగా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అతను 44 ఏళ్ల రాజకీయ జీవితంలో 1996 నుంచి 2009 వరకు వరుసగా 7 సార్లు కర్ణాటక శాసనసభ సభ్యునిగా పనిచేశాడు. బంగారప్ప రాజకీయ సమీకరణాల్లో భాగంగా కర్ణాటక వికాస్ పార్టీ, కర్ణాటక కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు, తరువాత బిజెపి, సమాజ్‌వాదీ పార్టీలో చేరి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. బంగారప్ప పదవీ కాలంలో 36 వేల పుణ్య క్షేత్రాలను పునరుద్ధరించడం, పునర్నిర్మించడం చేశాడు. పేదలకు ఇళ్లు కట్టించడం, గ్రామీణ కళాకారులు, కుటీర పరిశ్రమలకు చేయూత ఇచ్చి బ��ుజన నాయకుడిగా గుర్తింపునందుకున్నాడు.[4]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1967- 1996: కర్ణాటక శాసన సభ్యుడు (సొరబా నియోజకవర్గం నుండి వరుసగా 7 సార్లు)
  • 1977- 1978: హోం శాఖ మంత్రి
  • 1978-79: పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి
  • 1979-80: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెసు కమిటి
  • 1980-81:, రెవెన్యూ, వ్యవసాయ శాఖ మంత్రి
  • 1985-87: కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు
  • 1989-90: వ్యవసాయ శాఖ మంత్రి
  • 1990-92: కర్ణాటక రాష్ట్ర 12వ ముఖ్యమంత్రి
  • 1996: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక
  • 1998: కర్ణాటక వికాస్ పక్ష అధ్యక్ష్యుడు
  • 1999: కాంగ్రెస్ పార్టీ నుండి 2వ సారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక
  • 2004: బీజేపీ పార్టీ నుండి 3వ సారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక
  • 2005: సమాజ్‌వాదీ పార్టీ నుండి 4వ సారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక (ఉప ఎన్నిక)

ఇతరాలు

[మార్చు]
  • 2008: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి
  • 2009: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి, శిమోగా నియోజకవర్గం
  • 2010: జనతా దళ్ (సెక్యులర్ పార్టీ)

మరణం

[మార్చు]

బంగారప్ప మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతూ మల్యా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2011 డిసెంబరు 26న మరణించారు.[5]

మూలాలు

[మార్చు]
  1. "The 1999 Indian Parliamentary Elections and the New BJP-led Coalition Government". 2008-10-11. Archived from the original on 11 October 2008. Retrieved 2021-08-16.
  2. "tribuneindia... Nation". www.tribuneindia.com. Retrieved 2021-08-16.
  3. "Bangarappa joins BJP". Outlook India. Retrieved 2021-08-16.
  4. Karnataka (14 June 2013). "S. Bangarappa - A Political Nomad". Archived from the original on 7 March 2022. Retrieved 7 March 2022.
  5. The Hindu (26 December 2011). "Bangarappa passes away" (in Indian English). Retrieved 7 March 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)