ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చరిత్ర
స్వరూపం
విశాఖపట్నం జిల్లా చరిత్ర
విశాఖపట్నం చరిత్ర గతి
[మార్చు]- క్రీ.పూ.260: అశోకుడు కళింగ రాజ్యాన్ని జయించాడు.
- క్రీ.పూ.208: చంద్ర శ్రీ శాతకర్ణి ఏలుబడి.
- సా.శ.14 వ శతాబ్దం: సింహాచలం దేవాలయ నిర్మాణం.
- 1515: శ్రీ కృష్ణదేవ రాయల ఏలుబడి
- సా.శ.17వ శతాబ్ది మధ్య భాగం: బ్రిటిషు వారి ఈస్ట్ ఇండియా కంపెనీ వారిచే కర్మాగార స్థాపన.
- 1689: ఔరంగజేబు సేనలచే ఈ కర్మాగార ఆక్రమణ.
- 1700 సంవత్సరం నాటికి విశాఖపట్టణంలో ఈస్టిండియా కంపెనీ వారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన పాతవైన, అతికొద్ది వర్తకస్థానల్లో ఒకటి వుంది.[1]
- 1735: డచ్చి వారిచే స్థావర నిర్మాణం.
- 1765: బ్రిటిషు వారి ఏలుబడిలోకి ఉత్తర సర్కారులు. తదనంతరం వారు తమ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు.
- 1904: మద్రాసు నుండి విశాఖపట్నం ద్వారా కలకత్తాకు రైలు మార్గం ప్రారంభం.
- 1926: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపన.
- 1933: విశాఖపట్నం నౌకాశ్రయం స్థాపన.
- 1942: రెండవ ప్రపంచ యుద్ధం - జపాను యుద్ధ విమానాల దాడి.
- 1947: తూర్పు నావికా దళ స్థాపన. 1947 కు పూర్వం రాయల్ నేవీకి హఈశ్ సర్కార్స్ రూపంలో స్థావరం ఉండేది.
- 1949: సింథియా నౌకా నిర్మాణ కేంద్ర స్థాపన. జాతియం చేసిన తరువాత అది హిందుస్థాన్ షిప్‌యార్డుగా మారింది.
- : ఆంధ్ర యూనివర్సిటీ స్థాపన.
- 1957: కాల్టెక్స్ చమురు శుద్ధి కర్మాగార స్థాపన.
- : కోరమండలం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ స్థాపన.
- : భారత్ హెవీ ప్లేట్స అండ్ వెస్సెల్స్ లిమిటెడ్ స్థాపన.
- : హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ స్థాపన.
- 1981: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం స్థాపన.
- 1971: 1971 ఇండో-పాక్ యుద్ధం, భారత నౌకా దళాల దాడిలో పి.ఎన్.ఎస్. ఘాజీ మునక.
- 1998: యువభారతి అనే సంస్థ స్థాపించబడింది.
- : విశాఖపట్నానికి మునిసిపాలిటీ హోదా.
- : విశాఖపట్నానికి కార్పొరేషన్ హోదా.
- : విశాఖపట్నానికి 'గ్రేటర్ విశాఖపట్నం (మహా విశాఖపట్నం) ' హోదా.
- : విమానాశ్రయం ప్రారంభం.
- : కైలాసగిరి ప్రారంభం.
- : ఇందిరాగాంధి జంతు ప్రదర్శన శాల ప్రారంభం.
- : వాల్తేరు రైల్వే స్టేషను ప్ర్రారంభం
- : జిల్లా కలెక్టర్ ఆఫీసు భవనం నిర్మాణం.
- : మిసెస్ ఎ.వి.ఎన్. కళాశాల ప్రారంభం.
- : గవర్నర్ బంగళా ప్రారంభం (గవర్నర్ వేసవి విడిది).
- : ఆంధ్రా తాజ్ మహల్ బీస్ ఒడ్డున నిర్మాణం.
- : టర్నర్ ఛౌట్రీ నిర్మాణం.
- : కింగ్ జార్జీ ఆసుపత్రి (కె.జి.హెచ్) ప్రారంభం.
- : విక్టోరియా ఆసుపత్రి (స్త్రీల కొరకు) ప్రారంభం.
- : జియొలాజికల్ సర్వీ ఆఫ్ ఇండియా స్థాపన
- : నేవల్ ఆర్మమెంట్ డిపొ స్థాపన
- : నేవల్ డాక్ యార్డ్ స్థాపన
- : మెటీరియల్ ఆర్గనైజేషన్ స్థాపన (
- : నేవల్ డ్రైడాక్ స్థాపన
- : నేవల్ విజ్ఞాన శాస్త్రం అండ్ టెక్నలాజికల్ లేబరేటరీస్ స్థాపన
- : కేంద్రీయ విద్యాలయం స్థాపన
- : డాల్ఫిన్స్ నోస్ మీద లైట్ హౌస్ స్థాపన
- : డాల్ఫిన్స�� నోస్ మీద వాతావరణాన్ని పసిగట్టే రాడార్ యంత్రం స్థాపన
- : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యూనిట్ స్థాపన.
- : గిరిజన్ కార్పొరేషన్ లిమిటెడ్
- : ఆంధ్రప్రదేశ్ పర్యాటకం డెవలమ్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ .
- : పోలీస్ కమిషనర్ ఆఫీసు స్థాపన
- : పోలీస్ బేరక్స్ స్థాపన
- : ఓర్ హేండ్లింగ్ ప్లాంట్ స్థాపన
- : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్థాపన
- : సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ ఆఫీసు స్థాపన
- : ఎ.కె. కార్పొరేషన్ లిమిటెద్ స్థాపన
- : రెయిన్ కాల్సైనింగ్ లిమిటెడ్ స్థాపన
- : సెయింట్ జోసెఫ్ వుమన్స్ కళాశాల స్థాపన
- : గవర్నమెంట్ వుమన్స్ కళాశాల స్థాపన .
- : ఫిషింగ్ హార్బరు స్థాపన.
- : ఇన్ కం టాక్స్ కమిషనర్ ఆఫీసు స్థాపన
- : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి.ఎస్. ఎన్. ఎల్) స్థాపన
- : ప్రధాన తపాలా కార్యాలయం (హెడ్ పోస్ట్ ఆఫీసు) స్థాపన
- : డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం స్థాపన
- : విశాఖపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ స్థాపన
- : డెయిరీ ఫామ్ స్థాపన
- : గీతం డీమ్డ్ యూనివర్సిటీ స్థాపన
- : నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపన (ఎన్. ఎమ్. డి.సి)
- : మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెద్ స్థాపన (ఎమ్. ఎమ్. టి.సి)
- : నేషనల్ షిప్ డిజైన్ రీసెర్చ్ సెంటర్ (ఎన్. ఎస్. డి. ఆర్. సి)
- : ఆంధ్రప్రదేశ్ రోడ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (ఎ. పి. ఎస్. ఆర్. టి. సి)
- : కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.
- : ఆంధ్ర వైద్య కళాశాల స్థాపన.
- : గురజాద కళా క్షేత్రం స్థాపన.
- : ఇందిరాగాంధి క్రికెట్ స్టేడియం స్థాపన.
- : మునిసిపల్ క్రికెట్ స్టేడియం స్థాపన.
- : కళాభారతి ఆడిటోరియం స్థాపన.
- 260 బి.సి- అశోక చక్రవర్తీ కళింగ యుద్ధంలో కళింగ దేశాన్ని జయించాడు. విశాఖపట్టణం అప్పుడు, కళింగ దేశంలో ఒక భాగంగా ఉండేది.
- 13 ఎ.డి - సింహాచలం దేవస్థానం నిర్మాణం జరిగింది.
- 208 ఎ.డి - చంద్ర శ్రీ శాతకర్ణి విశాఖప్రాంతాన్ని పాలింఛిన రాజు.
- 1515ఎ.డి - ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు విశాల సామ్రాజ్యంలో, విశాఖప్రాంతం ఒక భాగం. ఆయన పాలనా కాలంలో, సింహాచలాన్ని పలు మార్లు దర్శించి, పచ్చల పతకాన్ని, మరికొన్ని నగలను బహూకరించినట్లు శాసనాలు ఉన్నాయి. ఈ పచ్చల పతకాన్ని గజ్జెల ప్రసాద్ అనే స్టూవర్టుపురం గజదొంగ, దొంగతనం చేసాడు. దొంగ దొరికాడు. కానీ, పచ్చల పతకంలోని పచ్చలు కొంచెం విరిగాయి.
- 1515లో రాయలు కొండవీడును ముట్టడించాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉంది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేశాడు. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6న స్వాధీనం చేసుకున్నాడు.
కొండవీడు తరువాత శ్రీకృష్ణదేవరాయల దిగ్విజయ యాత్ర ఇలా సాగింది.
- అద్దంకి, కేతవరం, అమ్మనబ్రోలు, నాగార్జున కొండ, బెల్లంకొండ దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు.
- విజయవాడ సమీపాన ఉన్న కొండపల్లి దుర్గమును రెండునెలలు పోరాడి స్వాధీనం చేసుకున్నాడు.
- అనంతగిరి, ఉర్లుగొండ, ఉండ్రుగొండ, అరసవిల్లి, చిట్యాల, నల్లగొండ మొదలైన దుర్గాలను జయించాడు.
- కోనసీమ, జమ్మిలోయ, కోరాము, రాజమహేంద్రవరములను జయించాడు.
- మాడుగుల, వడ్డాది, సింహాచలములను స్వాధీనం చేసుకొని సింహాచల నరసింహ స్వామిని పూజించి అనేక దాన ధర్మాలు చేసాడు.
- కటకం పైకి దండెత్తి ప్రతాపరుద్ర గజపతిని ఓడించి అతని కుమార్తె తుక్కా దేవిని వివాహమాడాడు.
- ఈ విజయ పరంపరలకు గుర్తుగా, పొట్నూరు దగ్గర, శ్రీకృష్ణదేవరాయలు విజయస్తంభాన్ని నిర్మించాడు.
- ఈ దిగ్విజయ యాత్ర తరువాత రాయలు 1516లో రాజధానికి తిరిగి వచ్చాడు.
- 17వ శతాబ్దం మధ్య కాలంలో, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడికి దగ్గరలో ఉన్న విజయనగరంలో ఒక కర్మాగారం నిర్మించారు.
- 1689 - ఈ కర్మాగారాన్ని మొఘల్ చక్రవర్తి జౌరంగజీబు సైన్యం ఆక్రమించింది.
- 1735 - డచ్ దేశీయుల నివాసాలు ఏర్పడ్డాయి. వీరి సమాధులు భీమునిపట్నంలో ఉన్నాయి.
- 1765 - మొఘల్ సామ్రాజ్య పతనం తరువాత, ఉత్తర సర్కారు ప్రాంతాన్ని (విశాఖపట్టణం అందులో ఒక భాగం) ఈస్ట్ ఇండియా కంపెనీ కి దత్తత ఇచ్చారు. అప్పటి నుంచే ఈ ప్రాంతాన్ని 'సర్కారు' అని 'సర్కారు జిల్లాలు' అని పిలవటం మొదలైంది. ఆ సమయంలో, ఇంగ్లీషువారు నివసించటం (కాలనీ) మొదలైంది. ఆ ప్రాంతాన్ని, వన్ టౌన్ ఏరియాలో ఉన్న 'సోల్జియర్ పేట'గా పిలుస్తారు. ఇప్పటికీ, అక్కడ 'ఆంగ్లో ఇండియన్లు ' ఎక్కువగా నివసిస్తున్నారు.
- 10 జూలై 1831- ఏనుగుల వీరాస్వామయ్య తన పర్యటనలో భాగంగా కాశీ నుంచి తిరుగుప్రయాణంలో విశాఖపట్టణం పరిసర గ్రామాలలో తిరిగాడు. ఆ పరిసర గ్రామాలు విజయనగరం, ఆలమంద, సబ్బవరం, సింహాచలము, కశింకోట, అనకాపల్లి, యలమంచిలి, దివ్యల, నక్కపల్లి, ఉపమాక, తుని, నాగలాపల్లి, యానాం, నీలపల్లి, ఇంజరము, మాదయ పాళెము, ఉప్పాడ.
- 1804 సెప్టెంబర్ - విశాఖపట్టణం జిల్లా మొట్టమొదటగా ఏర్పడింది. (1803 అని కూడా అంటారు). 1947లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి, భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద జిల్లా విశాఖపట్టణం జిల్లా. అందుకే ఈ పెద్ద జిల్లా, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం జిల్లాలుగా విడదీసారు.
- 1847 సెయింట్ అలోసియస్ అంగ్లో ఇండియన్ ఉన్నత పాఠశాల, విశాఖపట్టణం జిల్లాలోనే, అత్యంత ప్రాచీనమైన పాఠశాల. అంతేకాదు, దేశంలోని అత్యంత ప్రాచీనమైన పాఠశాల. విశాఖపట్టణంలోని పాత నగరం (ఒన్ టౌన్ ప్రాంతం) లో ఉంది. ఇండియన్ కౌన్సిల్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐ.సి.ఎస్.ఇ) కి అనుబంధమైన పాఠశాల.
- 1902 - ఆంధ్ర వైద్య కళాశాలను స్థాపించారు. ఈ వైద్య విద్యార్థులకు కింగ్ జార్జి ఆసుపత్రిలో శిక్షణ ఇస్తారు .
- 1904 - మద్రాసు నుంచి కలకత్తా వరకు విశాఖపట్టణము (నాడు వైజాగ్ పటేంగా ఇంగ్లీషు వాడు పలికే వాడు) మీదుగా రైలు దారిని (రైల్వే) ప్రారంభించారు.
- 1907 - బ్రిటిష్ పురాతత్వశాస్త్రవేత్త, అలెగ్జాండర్ రీ, 2000 సంవత్సరాల నాటి బౌద్ధుల కాలంనాటి శిథిలాలను, విశాఖపట్టణానికి 40 కి.మీ దూరంలో ఉన్న శంకరం గురించి వెల్లడించాడు. అక్కడి ప్రజలు, ఆ ప్రాంతాన్ని బొజ్జన్నకొండ అంటారు.
- 7 అక్టోబరు 1933 - విశాఖపట్టణం (వైజాగ్ పటేం పోర్టు) పోర్టును స్థాపించారు.
- 6 ఏప్రిల్ 1941 - జపాన్ వారి యుద్ధ విమానాలు విశాఖపట్టణం మీద బాంబులు వేసాయి. ఎవరూ మరణించ లేదు. ఆ భయంతో, విశాఖ వాసులు కొందరు ఇళ్ళు తక్కువ ధరకు అమ్ముకుని విశాఖ వదిలి పోయారు. భయంలేని వారు, ఆ ఇళ్ళను తక్కువ ధరకు కొనుక్కున్న సంగతి, ఆ నాటి తరంవారు కథలుగా చెప్పుతారు.
- 1947 - నేటి తూర్పు నౌకాదళానికి పునాదిగా, 1947లో ఇంగ్లీషు వారు (రాయల్ నేవీ), ఆ నాడు బర్మాలో జరుగుతున్న యుద్ధానికి (రెండవ ప్రపంచ యుద్ధం) సహాయంగా, సరుకులు ఆయుధాలు, రవాణా చేయటానికి ఇక్కడ ఒక 'బేస్' ని స్థాపించారు. దాని పేరే హెచ్.ఎమ్.ఐ.ఎస్. సర్కార్స్ (హెర్ మెజెస్టీ ఇండియన్ షిప్ సర్కార్స్). నేడది ఐ.ఎన్.ఎస్. సర్కార్స్ (ఇండియన్ నేవల్ షిప్) గా పేరు మార్చుకుంది. ఆ నాడు ఇంగ్లీషు వారు వేసిన విత్తనం, నేడు తూర్పు తీరాన్ని అంతా రక్షించే 'తూర్పు నౌకా దళం' అనే వట వృక్షంగా ఎదిగింది.
- 1957 - డాల్ఫిన్స్ నోస్ పైన ఉన్న లైట్ హౌస్ (దీపస్తంభం) ని తిరిగి నిర్మిచారు.
- 1957 - కాల్ట్రెక్స్ (అమెరికాలోని 'కాలిఫోర్నియా'లోని మొదటి కాల్, 'టెక్సాస్' రాష్ట్రంలో 'టెక్స్' కల్లిప్ 'కాల్టెక్స్'గా పేరు పెట్టారు. ఈ కాల్టెక్స్ని నిర్మీంచటానికి, అక్కడ ఉండే మల్కాపురం అనే గ్రామాన్ని ఖాళీ చేయించి, నేటి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఎదురుగా, రోడ్డు దాటిన తరువాత ప్రాంతంలో పునరావాసం కల్పించింది.
- 4 డిశంబరు 1971 - భారత నౌకాదళం కరాచీ నౌకాశ్రయం మీద బాంబుల దాడి జరిపి తుత్తునియలుగా చేసింది. ఈ సంఘటనకు ఆపరే��న్ ట్రైడెంట్ అని పేరు పెట్టారు. అప్పటినుంచి, డిశంబరు 4న నేవీ డే (నౌకాదళ దినోత్సవం) గా జరుపుకుంటున్నారు.
- 1976 - కాల్టెక్స్ని భారత ప్రభుత్వం జాతీయ కరణ చేసింది.
- 1976 - ఇంటర్నేషనల్ విజ్ఞాన శాస్త్రం కాంగ్రెస్ (ఐ.ఎస్.సి) కి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆతిధ్యం 1976లో ఒకసారి, 2008లో ఒకసారి ఇచ్చింది.
- 1978 - కాల్టెక్స్ని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో కలిపి వేసారు.
- 1979 - విశాఖపట్టణం మునిసిపల్ కార్పొరేషనుగా ఎదిగింది.
- 1981 - విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం తన ఉత్పత్తిని ప్రారంభించింది.
- 1985 - హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మొదటిసారి విస్తరణ.
- 14 సెప్టెంబరు 1997 హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో పేలుడు జరిగి భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఒక విచారకరమైన సంఘటన.
- 1999 - హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రెండవసారి విస్తరణ.
- 2008 - ఇంటర్నేషనల్ విజ్ఞాన శాస్త్రం కాంగ్రెస్ (ఐ.ఎస్.సి) కి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆతిధ్యం 1976లో ఒకసారి, 2008లో ఒకసారి ఇచ్చింది.
- 2010 - హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మూడవసారి విస్తరణ.
- 26 డిశంబర్ 2004 డిసెంబరు నాటి సునామీ దుర్ఘటన సందర్భంగా తీరప్రాంతంలో ఉన్నప్పటికీ, ఎండబెట్టిన చేపలు కొట్టుకొని పోవడం తప్పించి, విశాఖపట్నం ఏమంత దెబ్బ తినలేదు.
- ప్రతి సంవత్సరం సంక్రాంతి (జనవరిలో) సందర్భంగా విశాఖ ఉత్సవ్ జరుగుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.