Jump to content

ఉత్తర కన్నడ జిల��లా

వికీపీడియా నుండి
Uttara Kannada district
ಉತ್ತರ ಕನ್ನಡ ಜಿಲ್ಲೆ
North Kanara
World's Second Tallest Statue of Shiva at Murdeshwar/ముర్దేశ్వర్లో వున్న ప్రపంచంలోనే అతి ఎత్తైన శివుని విగ్రహము.
World's Second Tallest Statue of Shiva at Murdeshwar/ముర్దేశ్వర్లో వున్న ప్రపంచంలోనే అతి ఎత్తైన శివుని విగ్రహము.
Countryభారత దేశం
రాష్ట్రంకర్ణాటక
ప్రాంతంKonkan
HeadquarterKarwar
BoroughsKarwar, Ankola, Kumta, Honnavar, Bhatkal, Sirsi, Siddapur, Yellapur, Mundgod, Haliyal, Joida
Government
 • Deputy CommissionerShri Ujwal Kumar Ghosh
విస్తీర్ణం
 • Total10,291 కి.మీ2 (3,973 చ. మై)
 • Rank5th
జనాభా
 (2011)[1]
 • Total14,37,169
 • జనసాంద్రత140/కి.మీ2 (400/చ. మై.)
భాషలు
 • అధికారకన్నడం
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
581xxx
టెలిఫోన్ కోడ్+91 0(838x)
Vehicle registration
Coastline142 కిలోమీటర్లు (88 మై.)
లింగ నిష్పత్తి0.975[1] /
అక్షరాస్యత84.03%
Lok Sabha constituencyKanara Lok Sabha constituency
ClimateMansoon (Köppen)
Precipitation2,835 మిల్లీమీటర్లు (111.6 అం.)
Avg. summer temperature33 °C (91 °F)
Avg. winter temperature20 °C (68 °F)

కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో ఉత్తరకన్నడ (ఉత్తర కనర) జిల్లా ఒకటి.

సరిహద్దు వివరణ జిల్లా
ఉత్తర సరిహద్దు గోవా రాష్ట్రం, బెల్గాం జిల్లా
తూర్పు సరిహద్దు ధ్వార్వాడ, హవేరి జిల్లాలు
దక్షిణ సరిహద్దు షిమోగా, ఉడిపి
పశ్చిమ సరిహద్దు అరేబియన్ సముద్రం
దస్త్రం:Sadashivgad Fort & Kali Bridge as seen from Nandangadda Village.jpg
Kali River & Sadashivgad Fort as seen from Nandangadda Village

ఉత్తరకన్నడ కదంబ సామ్రాజ్యానికి (350-525) స్వస్థలంగా ఉంది. వారు బనవాసిని కేంద్రంగా చేసుకుని పాలన సాగించారు. కదంబాలను చాళుక్యులు జయించిన తరువాత జిల్లా ప్రాంతాన్ని చాళుక్యులు, రాష్ట్రకూటులు, హొయశిలలు, విజయనగర చక్రవర్తులు పాలించారు. ప్రఖ్యాత యాత్రీకుడు ఇబ్న్ బటూటా నవయాత్ సుల్తాన్ జమాల్ ఆల్- దిన్ కాలంలో ఈ ప్రాంతంలో హున్నూరు వద్ద కొంతకాలం నివసించాడు. ఈ ప్రదేశం ప్రస్తుతం హొన్నవర్ పట్టణంలో ఉండేది. మసీదు శిథిలాలు, చిన్న మీనారు కూడా ఇప్పుడీ గ్రామంలో ఉన్నాయి. 1750లో ఈ జిల్లాభూభాగం మరాఠీ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత మైసూర్ రాజ్యంలో ఉండేది. తరువాత 1799లో జరిగిన 4వ మైసూరు యుద్ధంలో ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వబడింది. ఇది ముందుగా మద్రాసు ప్రెసిడెన్సీలోని కనరా జిల్లాలో భాగంగా ఉండేది. తరువాత 1859లో జిల్లా ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాలుగా విభజించబడింది. 1862లో చివరిగా ఉత్తర కన్నడ జిల్లా బాంబే ప్రొవింస్‌కు మార్చబడింది.

1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత బాంబే ప్రెసిడెన్సీ పునర్విభజన చేయబడిన తరువాత బాంబే రాష్ట్రం రూపుదిద్దుకుంది. 1956లో బంబే రాష్ట్ర దక్షిణ ప్రాతం మైసూరు రాష్ట్రంలో విలీనం చేయబడింది. 1972లో మైసూరు రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం అయింది. ఉత్తర కన్నడ నెదర్లాండ్ (డచ్), పోర్చుగల్, ఫ్రాన్స్, బ్రిటిష్, అరేబియన్లతో వ్యాపారసంబంధాలు ఉన్న పురాతన నగరం. ఇబ్న్ బటూటా తన యాత్రలో భాగంగా రెండు మూడు మార్లు ఈ ప్రాంతాన్ని దాటి వెళ్ళాడు.

చారిత్రక ప్రసిద్ధి చెందిన అందమైన సదాశివగాడ్ కోట ప్రస్తుతం ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. ఇది కాళీనదీతీరంలో వంతెన వద్ద ఉంది. కాళీనది అరేబియన్ సముద్రంలో సంగమిస్తున్న ప్రదేశంలో ఈ కోట నిర్మించబడి ఉంది. నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాకూర్1882లో ఉత్తరకన్నడ ప్రాంతాన్ని సందర్శించాడని భావిస్తున్నారు. రవీంద్రనాథ్ ఠాకూర్ ఒక అధ్యాయం పూర్తిగా ఈ నగరాన్ని గురించి వర్ణించాడు. .[2] 22 సంవత్సరాల రవీంద్రనాథ్ ఠాకూర్ తన అన్న సత్యేంద్రనాథ్ ఠాకూర్ వద్ద కొంతకాలం నివసించాడు. సత్యేంద్రనాథ్ ఠాకూర్ ఉత్తర కన్నడ జడ్జిగా పనిచేసాడు. ఈ ప్రాంతంలో గుర్తించతగినన్ని చార్డో కుటుంబాలు ఉన్నాయి. వీరు గోవాలో పోర్చుగీస్ సాగించిన హింసకు భాయపడి ఈ ప్రాంతానికి వలస వచ్చారు.

చింటకోరా (ఇది చిత్రకూల్, చిట్టకుల, సిద్పూర్ అని పిలువబడింది). ఈ కోటను సదాశివగాడ్ నిర్మించాడు. తరువాత ఈ గ్రామానికి సదాశివగాడ్ అని పేరు వచ్చింది. పీర్ కోటలో ప్రసిద్ధి చెందిందిన షాకరముద్దీన్ దర్గా ఉంది . 1510లో దీనిని పోర్చుగీసులు ఆక్రమించి కాల్చి వేసారు. కాళీ నదీ సంగమ ప్రాంతం ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉండేది. సదాశివగాడ్ కోటను నిర్మించిన తరువాత ఈ నౌకాశ్రయం ప్రాముఖ్యత సంతరించికుంది. పోర్చుగీసువారు ఈ నౌకాశ్రయ ప్రాముఖ్యతను గ్రహించి దీని మీద దాడి చేసారు.

1638లో ఉత్తరకన్నడలో బ్రిటిష్ వ్యాపార బృందం ఒక పరిశ్రమను స్థాపించారు. కాళీనదికి 6 కి.మీ దూరంలో ఉన్న ఈ గ్రామం పేరు కడ్వాడ్. ప్రముఖ వాణిజ్య నౌకాశ్రయంగా ఉన్న ఈ ప్రాంతానికి అరేబియా, ఆఫ్రికా నుండి వ్యాపారులు తరచుగా వచ్చిపోతూ ఉండేవారు. బైకోల్ కోట (ప్రస్తుత ఉత్తరకన్నడ సివిల్ పోర్ట్) సహజ నౌకాశ్రయంగా ప్రసిద్ధి చెందింది. బైకోల్ అంటే రక్షణ అని అర్ధం. ఇక్కడ నుండి పలుచని వస్త్��ాలు అధికంగా ఎగుమతి చేయబడినప్పటికీ ఉత్తర కన్నడ నుండి నల్ల మిరియాలు, యాలుకలు, కాసియర్, పత్తితో చేసిన నీలివర్ణ ముతక వస్త్రాలు కూడా ఎగుమతి చేయబడేవి. గోవాకు 50 కి.మీ దూరంలో భారతీయ పశ్చిమతీరంలో ఉన్న ఉత్తర కన్నడ సురక్షిత నౌకాశ్రయంగా పేరు పొందింది. 1649లో కోర్టీన్ అసోసియేషన్ ఈస్టిండియా కంపనీతో విలీనం అయింది. తరువాత ఉత్తర కన్నడ కంపనీ ఫ్యాక్టరీగా మారింది.

1784లో టిప్పు సుల్తాన్, ఈస్టిండియా కంపనీ మద్య జరిగిన ఒప్పందంలో ఉత్తరకన్నడ, సదాశివగాడ్ (కార్వర్, సదాశివ్గుడే) ప్రస్తావన ఉంది. .[3]

బ్రిటిష్ సామ్రాజ్యం

[మూలపాఠ్యాన్ని సవరించు]

1882లో బ్రిటిష్ సామ్రాజ్యం. ఉత్తరకన్నడను వారి జిల్లాకేంద్రంగా చేసారు. 1862 నుండి బాంబే ప్రెసిడెన్సీలో విలీనం చేయబడిన తరువాత బాంబే - కొలంబోల మద్య ఉత్తరకన్నడ ప్రథమశ్రేణి నౌకాశ్రయంగా గుర్తించబడింది.

Karwar Evening

జిల్లాలోని ప్రధాన భౌగోళికాంశం పశ్చిమ కనుమలు లేక సహ్యాద్రి పర్వతావళి. జిల్లాలో ఇవి ఉత్తరదక్షిణాలుగా విస్తరించి ఉన్నాయి. సహ్యాద్రి, అరేబియా సముద్రం నడుమ సన్నని సముద్రతీర భూభాగం ఉంది. దీనిని పయంఘాట్ అంటారు. ఇది వెడల్పులో 8-24 కి.మీ వైవిధ్యంలో ఉంటుంది. సముద్రతీర మైదానాల వెంట ఉన్న సహ్యాద్రి పర్వతావళి 60-100 మీ వైవిధ్యమైన ఎత్తులో ఉంటాయి. తూర్పులో ఉన్న సహ్యాద్రి పర్వతాలను బాలాఘాట్ ఎగువ భూములు విస్తారమైన దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉంది.

పశ్చిమం నుండి వీస్తున్న తేమతోకూడిన గాలుల కారణంగా 3000 మి.మీ వార్షిక వర్షపాతం లభిస్తుంది. పశిమముఖంగా ఉండే సహ్యాద్రి పర్వతశ్రేణిలో అత్యధికంగా 5000 మి.మీ వర్షపాతం ఉంటుంది. తూర్పుముఖంగా విస్తరించి ఉన్న సహ్యాద్రి పర్వతాలలో వర్షపాతం 1000 మి.మీ ఉంటుంది. జూన్- సెప్టెంబరు మధ్య వర్షపాతం అధికంగా ఉంటుంది.

సహ్యాద్రి పర్వతాలలో జన్మించి పశ్చిమంగా ప్రవహిస్తున్న నదులు అరేబియా సముద్రానికి చేరుకుంటున్నాయి. కాళి, గుంగావళి, అఘనాషిని, షరావతి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదుల నుండి పలు జలపాతాలు పుట్టాయి. వీటిలో ప్రధానమైనవి జోగ్ జలపాతం నుండి ప్రవహిస్తున్న నీరు పొరుగున ఉన్న షిమోగా జిల్లా వద్ద షరావతి నదిలోకి చేరుతున్నాయి. ఇతర ప్రధాన జలపాతాలలో ఉంచల్లి జలపాతాలుగుర్తించతగినవి. అఘానాశిని జలాలు 116 మీటర్ల లోతులో జలాలను కుమ్మరించడం వలన ఈ జలపాతాలు ఏర్పడుతున్నాయి. మగాడ్ జలపాతాలు బెద్తి నదీ జలాలు 180 మీటర్ల లోతులో జలాలను కుమ్మరించడం వలన ఈ జలపాతాలు ఏర్పడుతున్నాయి షివగంగ జలపాతాలు సొండా (షల్మాలి) నదీ జలాలు 74 మీటర్ల లోతులో జలాలను కుమ్మరించడం వలన ఈ జలపాతాలు ఏర్పడుతున్నాయి. లాల్గులి జలపాతాలు, మైల్మనే జలపాతాలను కాళీనదీ జలాలు సృషిస్తున్నాయి. ఈ నదులు దిగువభూములలో సముద్రతీరం వెంట పలు కి.మీ ప్రాంతంలో చిత్తడి భూములను ఏర్పరుస్తూ ఉన్నాయి.

Candy Corn Plant in the Anshi National Park

జిల్లా అందుకుంటున్న అధిక వర్షపాతం కారణంగా జిల్లాలో సుమారు 70% దట్టమైన అరణ్యాలు ఆక్రమించి ఉన్నాయి. అరేబియా సముద్రం, 250 మీటర్ల ఎత్తులో వరకు పశ్చిమ కనుమల కొండ దిగువ మధ్య ఉన్న సన్నని పర్యావరణ ప్రభావిత భూభాగంలోమలబార్ తీర చిత్తడి అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఈ అడవులు దాదాపు పూర్తిగా వ్యవసాయం, టేకు చెట్ల పెంపక భూములుగా మార్చబడ్డాయి. ఉత్తర పశ్చిమ కనుమలలోని సహ్యాద్రి]] నుండి సముద్రమట్టానిమి 250 - 1000 మీటర్ల ఎత్తులో ఆర్ద్ర ఆకురాల్చు అడవులు విస్తరించి ఉన్నాయి. అనేక చెట్లు పొడి మాసాలలో ఆకులు రాల్చుతుంటాయి. సముద్రమట్టానికి 1000 పైన మీటర్ల ఎత్తులో ఉత్తర పశ్చిమ కనుమలలోని సతతహరిత వర్షారణ్యాలు ఉంటాయి. 250 చ.కి.మీ విస్తరించి ఉన్న దండేలి సమీపంలోని అంషి నేషనల్ పార్క్ అర్ధ హరితం అరణ్యం విస్తరించి ఉంది. ఈ అరణ్యంలో పులి, నల్ల చిరుత, చిరుత పిల్లి, గౌర్, ఆసియా ఏనుగు, సాంబార్ జింక మొదలైన జంతుజాలం ఉంది. పలు పక్షి జాతులు, పలు సరీసృపాలు ఉన్నాయి. 834 చ.కి.మీ విస్తరించి ఉన్న దండేలి వన్యప్రాణి సంక్చురి అర్ధ హరితం, కాళి నది, దాని ఉపనదులు కనేరి, నాగజ్‌హరి పరీవాహక వెదురు అడవికి రక్షణ కలిగిస్తుంది. భీంగాడ్ అభయారణ్యంలో రాగ్‌టని ఫ్రీటెయిల్ బ్యాట్ (అక్టోపస్ రాగ్‌టన్) కనిపిస్తుంటాయి.

జిల్లా సావన (ఉష్ణమండల పసరిక మైదానాం), పలుచని పొదారణ్యాలు ఉన్నాయి. వీటిని వంట చెరకు, పశువుల మేపడానికి అతిగా ఉపయోగిస్తున్నారు. దిగువభూములలో అరణ్యం అధికభాగం వ్యవసాయంకోసం నిర్మూలించబడింది. నదీమైదానాలలో మాన్‌గ్రోవ్ అరణ్యాలు అధికంగా ఉన్నాయి. నదీతీరంలోని ఇసుక భూములు కాలోఫిలం, ఇనోఫిలం, కొబ్బరి చెట్లు, స్క్రూ పైన్ (పాండాంస్) అధికంగా ఉన్నాయి. బింగ, అర్గ, బెలెకెరి, తదాడి, అంకోలా, కుంట, ధారేశ్వర్, కాసర్‌కోడ్, ముర్దేశ్వర్, భత్క, బెల్కే మొదలైన శిలామయ సముద్రతీరాలలో సముద్రప్రాణులతో సుసంపన్నంగా ఉన్నాయి. ఉత్తరకన్నడ శిలామయ సముద్రతీరాలలో ఫిలం పొరిఫెర, సియోలెంతెరటా, అన్నెలిడా, అర్త్రోపొడా, మొలుస్కా, ఎచినోడెర్మిటా వంటి వృక్షజాలం కనిపిస్తుంది. అట్టివేరి పక్షులశరణాలయంలో 22 విదేశీపక్షులతో కలిసి 79 జాతుల పక్షులు సంరక్షించబడుతున్నాయి.

దండేల్ వన్యప్రాణి అభయారణ్యం నల్లని చిరుతలకు, గౌర్, పులి, చిరుతలకు ప్రసిద్ధి. కవల గుహలలో 5 అడుగుల ఎత్తైన శివలింగం ఉంది. 500 అడుగుల ఎత్తైన సిథరీ రాళ్ళతో తయారైన గుహలు, జలపాతాలు వించోలి రాపిడ్స్, ఆకాశ వీక్షణా కేంద్రాలు ఉన్నాయి. అభయారణ్యంలో కాళినది, వ్రేలాడే వంతెన మొదలైన పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. దట్టమైన అరణ్యాలలో పర్వతారోహణ ద్వారా యానా చేరుకుంటే అక్కడ ప్రకృతి సౌందర్యం వీక్షకులను మత్రముగ్ధులను చేస్తుంది. ఇది జాగ్‌రాక్డ్ ఫార్మేషన్లకు, జలపాతాలకు ప్రసిద్ధి. ఇక్కడ భైరవేశ్వరాలయం ఉంది. దండేల్‌కు కొంత దూరంలో అంషి నేషనల్ పార్క్ ఉంది. ఉత్తరకన్నడ జిల్లాలో బురుడే జలపాతం (సిద్ధపురా నుండి 20 కి.మీ), ఉంచల్లి జలపాతాలు, శివగంగె, బీనెహొలే జలపాతం (సిర్సి నుండి 25 కి.మీ) మగాడ్ జలపాతాలు, సతోడి (యలపురా సమీపంలో) జలపాతం మొదలైన ప్రముఖ జలపాతాలు ఉన్నాయి. జిల్లాలో సుపా ఆనకట్ట, కొడసల్లి ఆనకట్ట, కంద్రా ఆనకట్ట మొదలైన ఆనకట్టలు ఉన్నాయి. కైగ వద్ద కాళి నదీతీరంలో ప్రఖ్యాత ఆణువిద్యుత్తు కేంద్రం ఉన్నాయి.

జిల్లాలో ప్రధానంగా కన్నడ భాష వాడుకలో ఉంది. తరువాత స్థానాలలో కొంకణి కూడా అధికంగా వాడుకలో ఉంది. సాంఘిక సమాచార పరిమార్పిడిలో మరాఠీ, ఉర్దూ, హిందీ, ఆగ్లం కూడా వాడుకలో ఉన్నాయి. ప్రజలలో హిందువులు అధికంగా ఉన్నారు.

  • సంప్రదాయపరంగా ప్రజల జాబితా:-
Costume of Yakshaghana

యక్షగాన సంప్రదాయ నృత్యం కర్ణాటక రాష్ట్రంలో ప్రాబల్యం కలిగి ఉంది. ఇది ఉత్తరకన్నడ జిల్లాలో అత్యధికంగా ప్రజాదరణ కలిగి ఉంది. షిమోగా, ఉడిపి, దక్షిణ కనర, క్శ్రళ లోని కాసరగాడ్ జిల్లాలలో కూడా ప్రాబల్యత సంతరించుకుని ఉంది. ఈ కళలో సంగీతం, నృత్యం, నటన, వచనం, కథ, అసమానమైన వస్త్రాలంకరణ భాగమై ఉంటాయి. సంగీతం నృత్యంతో సమ్మిశితమైన స్వల్పమైన చక్కని కథకూడా ఉంటుంది. ఇది భారతీయ సంప్రదాయ నృత్యాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. నటన, వచన ఉచ్చారణ కళాకారుని ప్రతిభను చాటుతుంది. సంప్రదాయ, జానపద సమ్మిశ్రితం యక్షగానాన్ని భారతీయ నృత్యకళారూపాలలో అసమాన నృత్యరూపంగా చేస్తుంది. పశ్చిమ దేశాల దృష్టిలో ఇది ఒక ఒపేరాగా కనిపిస్తుంది. సాధారణంగా యక్షగానం రాత్రి వేళలో (లేట్ నైట్) మొదలై రాత్రంతా కొనసాగుతుంది. నేపథ్యగాయకుడు భాగవతార్ కథను నడిపిస్తూ వేదికమీద మొత్తం కాత్యక్రమాన్ని నియంత్రిస్తుంటాడు. భగవతార్‌తో వాయిద్యకళాకారులు మద్దెల, చండే వాయిద్యాలను వాయిస్తుంటారు. కళాకారులు వర్ణరంజితమైన వస్త్రధారణ చేస్తుంటారు. కళాకారులు కథాంశంలో పలు పాత్రలను ధరిస్తూ నర్తిస్తుంటారు. కర్ణాటకాలో పలు యక్షగాన బృందాలు ఉన్నాయి. చలనచిత్రాలు, టి.వి షోల పోటీల మధ్య ఈ బృందాలు టికెట్ వసూలు చేసుకుంటూ ప్రదర్శనలు ఇస్తూ ఆదాయం పొదుతూ ఉన్నాయి. గ్రామీణ ఉత్సవాలలో మంచి ప్రావీణ్యత ప్రదర్శించే బృందాలను పిలిపించి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటారు. వీరిలో " చిత్తాణి రామక్రిష్ణ హెగ్డే, కొండాడ్కుళి రామక్రిష్ణ హెగ్డే బృందాలు ప్రాంతీయ కళాకారులకు అవకాశం కల్పిస్తూ ఉన్నాయి. యక్షగానం కన్నడ, కొంకణి భాషలలో ఆట (నాటకం)!అని కూడా అంటారు. .[4] యక్షగానం అంటే యక్షుల గానం అని అర్ధం. పురాణాలలో యక్షులు గానంలో ప్రసిద్ధిలని పేర్కొనబడి ఉంది. గానం చేయడం వారి ప్రధాన వృత్తులలో ఒకటిగా ఉండేది.[5]

జిల్లాలో ప్రధానంగా వరి, పోక పండించబడుతుంది. కొబ్బరి, చెరకు, కోకో, జీడిపప్పు, మామిడి, అరటి, అనాస, గార్సినియా, సపోటా మొదలైన పండ్లరకాలు పండించబడుతున్నాయి. ఎర్రగడ్డలు, ముల్లంగి, దోస, కాలిఫ్లవర్, చిలగడ దుంప (గనిసి గడ్డ), బ్రింజాల్, అమరనాథ్ మొదలైన కూరాగాయలు పండించబడుతున్నాయి. నల్లమిరియాలు, యాలుకలు, అల్లం, జాజి మొదలైన సుగంధద్రవ్యాలు పండించబడుతున్నాయి. పశ్చిమ పర్వత ప్రాంతాలలో మిల్లెట్, పత్తి మొదలైన మెట్టపంటలు పండించబడుతున్నాయి.

జిల్లాలో చిన్నతరహా పరిశ్రమలు ప్రధానంగా టైల్స్, నార ఉత్పత్తులు, ఆభరణాలు, ఆహార తయారీ, వుడ్, ఫర్నీచర్, గ్లాస్, సెరామిక్, సీ ఫుడ్ ప్రధానమైనవి. ఎస్.ఎస్.ఐ, చిన్నతరహా పరిశ్రమలు అధికంగా ఉపాధి కల్పిస్తున్నాయి. మద్యతరహా, బృహత్తర పరిశ్రమలకు అవసరమైన పనిముట్లు, విడిభాగాలు జిల్లానుండి, వెలుపలి నుండి లభిస్తున్నాయి. జిల్లాలోని 8 మద్యతరహా, బృహత్తర పరిశ్రమల నుండి పేపర్, డూప్లెక్స్ బోర్డ్, కాస్టిక్ బోర్డ్, ఫెర్రో అల్లాయ్స్, ట్రాంస్మిషన్ గియర్స్, ఫుడ్ కాంసెంట్రేట్స్, మూలికా ఔషధాలు, ఔషధాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి.

5
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం.
జాతియ సరాసరి (72%) కంటే.

According to the 2011 census Uttara Kannada has a population of 1,436,847,[1] roughly equal to the nation of Swaziland[6] or the US state of Hawaii.[7] This gives it a ranking of 346th in India (out of a total of 640).[1] The district has a population density of 140 inhabitants per square kilometre (360/sq mi). Its population growth rate over the decade 2001-2011 was 6.15%. Uttara Kannada has a sex ratio of 975 స్త్రీs for every 1000 పురుషుడుs, and a literacy rate of 84.03%.[1]

హిందువులు దీపావళి పండుగను కోలాహలంగా జరుపుకుంటారు. దీపావళిని దీపాల పండుగ అని కూడా అంటారు. గృహాలు, దుకాణాలు, కార్యాలయాలు ప్రత్యేకంగా అలంకరించబడుతుంటాయి.

జిల్లాలో ముస్లిములు సంప్రదాయకంగా ఈద్- ఉల్- ఫితర్ (రంజాన్), ఈద్ - ఉల్- ఆధా (బక్రీద్) పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటుంటారు.

Batata Vada

ఉత్తరకన్నడ జిల్లా రుచికరమైన సీ ఫుడ్ (సముద్ర ఆధారిత ఆహారం) ప్రసిద్ధి చెందింది. చేపలకూర, అన్నం జిల్లావాసులకు ప్రధాన ఆహారంగా ఉంది. జీడిపప్పు, కొబ్బరి ఆహారంలో ప్రధానపాత్ర వహిస్తుంటాయి.

ఆహారంలో ప్రధానంగా వండిన అన్నం, కూరలు లేక సీ ఫుడ్ ఉంటాయి. సముద్రం నుండి పుష్కలంగా ఆహారం లభిస్తున్న కారణంగా ఆహారంలో సీ ఫుడ్స్ అధికంగా భాద్వామ్యం వహిస్తున్నాయి. సీ ఫుడ్స్‌కు సుగంధ ద్రవ్యాలను చేర్చి ఘుమఘుమలాడే వంటలు తయారు చేయబడుతుంటాయి. టీ కూడా ప్రజల అభిమానపానీయంగా భావించబడుతుంది. యాలుకలు, పుదీనా వేసి చేసే మసాలా టీ ప్రత్యేకరుచితో ఉంటుంది.

2

" నార్త్ వెస్ట్ కర్ణాటక ట్రాంస్‌పోర్ట్ కార్పొరేషన్ " (ఎన్.వి.కె.ఆర్.టి.సి) జిల్లాలో ప్రజలకు ప్రయాణసౌకర్యాలు అందిస్తుంది. ఎన్.వి.కె.ఆర్.టి.సి జిల్లాలోని పట్టణాలు, గ్రామాలన్నింటికి అవసరమైన ప్రయాణ సౌకర్యాలు అందిస్తుంది. జిల్లాలో చక్కని ట్రాంస్‌పోర్ట్ నెట్‌వర్క్ పనిచేస్తుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు, పట్టణాలకు (బెంగుళూరు, మైసూరు, మేంగుళూరు) క్రమానుసార సర్వీసులు నిర్వహించబడుతున్నాయి. మేంగుళూరు నుండి గోవాకు ప్రయాణసౌకర్యాలు ఉన్నాయి. కుంత, భత్క, సిర్సి మొదలైనవి ప్రధాన ప్రయాణ సౌకర్య కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడ నుండి 24 గంటలు బసు సౌకర్యం లభిస్తూ ఉంది.

పలు ప్రైవేట్ ట్రాంస్‌పోర్ట్ బసులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు బసులు నడుపబడుతున్నాయి. ప్రైవేట్ ట్రాంస్‌పోర్ట్ బసులకు భత్క ప్రధానకేంద్రంగా ఉంది. జాతీయరహదారి 17 జిల్లా గుండా పయనిస్తుంది. ఇది జిల్లాను పాంవెల్, ముంబయి, పూనా, కొల్హాపూర్, బెల్గాం, పనజి, మార్గో, ఉడిపి, మేంగుళూరు, భత్కల్, కాసరగాడ్, కన్నూర్, కోళికోడ్ మొదలైన నగరాలతో అనుసంధానం చేస్తుంది.

కింది ఉత్తర కన్నడ జిల్లాలో ద్వారా పోయే నేషనల్ హైవేలు.

  • జాతీయరహదారి -17 సమీపంలో ఎడపల్లి కొచీ (వద్ద కలుపుతుంది, పాన్వెల్ ముంబై (వద్ద కలుస్తుంది) జిల్లాలో ఇది ఉత్తరాన మజలి గ్రామం వద్ద ప్రారంభమై & భట్కల్ వద్ద ముగుస్తుంది.
  • జాతీయరహదారి -206 కలిపే హోన్నావర్, బెంగళూరు
  • కలిపే జాతీయరహదారి -63 అంకోలా, హుబ్లి
  • జాతీయరహదారి -17a కలిపే దండేలి, వాస్కో డ గామా (గోవా)

కింది రైల్వేస్ జిల్లా గుండా:

  • కొంకణ్ రైల్వే మంగళూరు కలిపే, ముంబై కార్వార్ ద్వారా,
  • లొండా (కర్ణాటక) క్యాజెల్ రాక్ ద్వారా పోయే వాస్కో రైల్వే లైన్
  • కోట దండేలి రైల్వే లైన్ రాక్.
  • హుబ్లి - అంకోలా రైల్వే లైన్ కార్వార్ పోర్ట్, ఉత్తర కర్నాటక లింక్ ప్రతిపాదించబడింది.
  • సేవల ఆర్-ఆర్ ( ఆఫ్ రోల్ రోల్) కు అంకోలా రైల్వే స్టేషను నుండి సురత్కల్ రైల్వే స్టేషను కొంకణ్ రైల్వే ద్వారా అందించబడుతుంది. అనేక ట్రక్కర్స్ మంగళూరుకు అంకోలా మధ్య ఈ సౌకర్యం ఉపయోగించవచ్చు.

ఉత్తరకన్నడ సముద్రతీర జిల్లాలలో ఒకటిగా ఉంది. జిల్లాలో 120 కి.మీ పొడవున సముద్రతీరం ఉంది. జిల్లాలోని పకు నౌకాశ్రయాలు వ్యాపార కేంద్రాలు, నావల్ బేస్, చేపల పరిశ్రమలు ఇతర మేతిన్ ఏక్టివిటీలు అభివృద్ధి చెందాయి.

  • కార్వార్ పోర్ట్ :- ఈ నౌకాశ్రయం మహాదముద్ర నౌకలు, సముద్రతీర షిప్పింగ్, ఫిస్షింగ్ జెట్టి మొదలైన కాత్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడి నుండి కార్వర్ పోర్ట్ వరకు షిప్ బంకరింగ్

సౌకర్యం కూడా లభిస్తుంది.

  • ఐ.ఎన్.ఎస్ కదంబ :- ఇది ఒక నావల్ బేస్‌గా ఉంది. ఇది కార్వర్ లోని అర్గా గ్రామం వద్ద ఉంది. ఇది నావల్ వెసెల్స్ కొరకు ఉపయోగపడుతుంది. ఇక్కడ నావల్ షిప్ మరామత్తు కేంద్రం (డ్రై డాక్స్) కూడా ఉంది.
  • 'బెల్కెరి పోర్ట్' ఒక లంగరు నౌకాశ్రయం.
  • 'తద్రి పోర్ట్' ఒక ఫిషింగ్ పోర్ట్ ఉంది.
  • 'కుంటా పోర్ట్' ఒక ఫిషింగ్ పోర్ట్ ఉంది.
  • 'హోన్నావర్ పోర్ట్' ఒక ఫిషింగ్ పోర్ట్ ఉంది.
  • 'భట్కల్ పోర్ట్' ఒక ఫిషింగ్ పోర్ట్ ఉంది.

సమీపంలోని విమానాశ్రయాలు

[మూలపాఠ్యాన్ని సవరించు]
  • హుబ్లి
  • బెల్గాం విమానాశ్రయం
  • గోవా అంతర్జాతీయ విమానాశ్రయం (పనజీ)
  • మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం

సుప్రసిద్ధ వ్యక్తులు

[మూలపాఠ్యాన్ని సవరించు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Uttara Kannada (North Canara) : Census 2011". Government of India. Retrieved February 17, 2012.
  2. Uttara Kannada in Tagore's memoirs
  3. "Project South Asia". Archived from the original on 2008-07-20. Retrieved 2015-02-05.
  4. "Enduring art". Online webpage of The Hindu. Chennai, India. 2004-06-10. Archived from the original on 2004-08-30. Retrieved 2007-09-06.
  5. "yaksha". Encyclopædia Britannica. Retrieved 2007-09-06.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Swaziland 1,436,847
  7. "2011 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Hawaii 1,436,847[permanent dead link]

వెలుపలి లింకులు

[మూలపాఠ్యాన్ని సవరించు]