ఈశాన్య భారతదేశం
ఈశాన్య భారతదేశం | |
---|---|
ఈశాన్య ప్రాంతం (నార్త్ ఈస్ట్ రీజియన్ NER) | |
Coordinates: 26°N 91°E / 26°N 91°E | |
దేశం | India |
రాష్ట్రాలు | |
అతిపెద్ద నగరం | గౌహతి |
పెద్ద నగరాలు (2011 జనగణన)[1] | |
విస్తీర్ణం | |
• Total | 2,62,184 కి.మీ2 (1,01,230 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 4,57,72,188 |
• Estimate (2022)[2] | 5,16,70,000 |
• జనసాంద్రత | 173/కి.మీ2 (450/చ. మై.) |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక సమయం) |
షెడ్యూలు భాషలు |
ఈశాన్య భారతదేశం, (ఇంగ్లీషులో నార్త్ ఈస్టర్న్ రీజియన్ - NER ) భారతదేశపు తూర్పు కొసన ఉన్న భౌగోళిక రాజకీయ పరిపాలనా ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎనిమిది రాష్ట్రాలున్నాయి - అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర (ఈ ఏడింటిని "సెవెన్ సిస్టర్స్" అంటారు). ఎనిమిదవది "సోదర" రాష్ట్రం సిక్కిం.
ఈ ప్రాంతంలో 5,182 కిలోమీటర్లు (3,220 మై.) పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ఉంది. (ఈ ప్రాంతపు మొత్తం భౌగోళిక సరిహద్దులో దాదాపు 99 శాతం). ఉత్తరాన 1,395 కిలోమీటర్లు (867 మై.) చైనాతో, తూర్పున మయన్మార్‌తో 1,640 కిలోమీటర్లు (1,020 మై.) , నైరుతిలో బంగ్లాదేశ్‌తో 1,596 కిలోమీటర్లు (992 మై.), పశ్చిమాన నేపాల్‌తో 97 కిలోమీటర్లు (60 మై.), వాయవ్యంలో భూటాన్‌తో 455 కిలోమీటర్లు (283 మై.) అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి. [5] దీని వైశాల్యం 262,184 చదరపు కిలోమీటర్లు (101,230 చ. మై.). ఇది భారతదేశపు మొత్తం వైశాల్యంలో దాదాపు 8 శాతం. సిలిగురి కారిడార్ ఈ ప్రాంతాన్ని భారత ప్రధాన భూభాగానికి కలుపుతుంది.
ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (NEC) క్రింద అధికారికంగా గుర్తింపు పొందాయి, [6] 1971లో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి యాక్టింగ్ ఏజెన్సీగా ఏర్పాటైంది. NECని ప్రవేశపెట్టిన చాలా కాలం తర్వాత, సిక్కిం 2002లో ఎనిమిదో రాష్ట్రంగా ఈశాన్య ప్రాంతంలో భాగంగా ఏర్పడింది [7] [8] భారతదేశ లుక్-ఈస్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులు ఈశాన్య భారతదేశాన్ని తూర్పు ఆసియా, ASEAN దేశాలకు కలుపుతాయి. అస్సాంలోని గౌహతి నగరాన్ని "ఈశాన్య ముఖ ద్వారం" అంటారు. ఈశాన్య భారతదేశంలో ఇది అతిపెద్ద మహానగరం.
చరిత్ర
[మార్చు]ఈశాన్య రాష్ట్రాల ఏర్పాటు
[మార్చు]మోమోరియా కల్లోలాల తరువాత, అహోమ్ రాజవంశం క్షీణించింది. బ్రిటిష్ వారు రక్షకులమంటూ వచ్చి చేరారు.[9] 19 వ శతాబ్దం ప్రారంభంలో, అహోం, మణిపూర్ రాజ్యాలు రెండూ బర్మీస్ దండయాత్రకు గురయ్యాయి.[9] తరువాతి మొదటి ఆంగ్లో-బర్మీస్ యుద్ధం ఫలితంగా మొత్తం ప్రాంతమంతా బ్రిటిషు నియంత్రణ లోకి వచ్చింది. వలస పాలన కాలంలో (1826-1947), ఈశాన్య భారతదేశం 1839 నుండి 1873 వరకు బెంగాల్ ప్రావిన్స్‌లో భాగంగా ఉండేది. ఆ తర్వాత అస్సాం బ్రిటిషు భారతదేశంలో ఒక ప్రావిన్స్‌గా ఏర్పడింది.[10] ఇందులో సిల్హెట్ కూడా భాగంగా ఉండేది.
1947లో బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈశాన్య ప్రాంతంలో, బ్రిటిషు కాలపు అస్సాంతో పాటు త్రిపుర రాజ్యం, మణిపూర్ రాజ్యం అనే సంస్థానాలుండేవి. తదనంతరం, మణిపూర్, త్రిపురలను 1956 లో కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. 1972 లో పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇచ్చారు. తరువాత, 1963 లో నాగాలాండ్, 1972 లో మేఘాలయలు రాష్ట్ర హోదా పొందాయి. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలు అస్సాం నుండి విడివడి 1987 ఫిబ్రవరి 20 న పూర్తి స్థాయి రాష్ట్రాలుగా అవతరించాయి.[11] 2002లో సిక్కిం ఎనిమిదవ రాష్ట్రంగా ఈశాన్య కౌన్సిల్‌లో చేరింది.[7]
బ్రిటిషు పాలనలో ఏర్పాటైన అస్సాం ప్రావిన్స్‌కు షిల్లాంగ్ నగరం రాజధానిగా ఉండేది. 1972లో మేఘాలయ రాష్ట్రం ఏర్పడే వరకూ ఇది అవిభక్త అస్సాంకు రాజధానిగా ఉండేది.[12] అస్సాం రాజధాని గౌహతిలో భాగమైన డిస్పూర్‌కి మార్చాక, షిల్లాంగ్‌ను మేఘాలయ రాజధానిగా చేసారు.
రెండవ ప్రపంచ యుద్ధం
[మార్చు]ప్రారంభంలో జపాన్, తమ దేశానికి రక్షణగా చుట్టూ పటిష్టమైన పరివృత్తాన్ని సృష్టించాలనే ఉద్దేశ్యంతో బర్మా (ఇప్పుడు మయన్మార్)తో సహా ఆగ్నేయాసియాలోని బ్రిటిషు భూభాగాలను ఆక్రమించింది. బ్రిటిషు వారు బర్మా రక్షణను విస్మరించడంతో, 1942 ప్రారంభంలో జపనీయులు రంగూన్‌ను స్వాధీనం చేసుకుని, మిత్రరాజ్యాల దళాలను భారతదేశం వైపుకు వెనక్కి నెట్టారు.[13]
జపాన్ పురోగతికి ప్రతిస్పందనగా, బ్రిటిషు వారు 1943 నవంబరులో అడ్మిరల్ లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ ఆధ్వర్యంలో సౌత్ ఈస్ట్ ఆసియా కమాండ్ (SEAC)ని ఏర్పాటు చేశారు. ఇది ఈ ప్రాంతంలో యుద్ధ ప్రయత్నాలకు కొత్త శక్తిని తెచ్చిపెట్టింది. వర్షాకాలం వంటి రవాణా సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ దృఢంగా నిలబడి, పోరాడింది.[14]
ఈశాన్య భారతదేశంలోని కీలక ప్రాంతాలైన ఇంఫాల్, కోహిమాలను స్వాధీనం చేసుకునే లక్ష్యంతో 1944 మార్చిలో జపనీయులు దాడిని ప్రారంభించారు. ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటే జపాన్ చైనాకు మిత్రరాజ్యాల సరఫరా మార్గాలను అంతరాయం కలిగించడానికి, భారతదేశంపై వైమానిక దాడులను ప్రారంభించేందుకూ వీలయ్యేది.[15]
అయితే, ఫీల్డ్ మార్షల్ విలియం స్లిమ్ నాయకత్వంలో మిత్రరాజ్యాల దళాలు దృఢంగా నిలిచాయి. వారు రక్షణాత్మక "పెట్టెలు", అటవీ యుద్ధ కుశలతలలను ఉపయోగించడంతో సహా దూకుడు వ్యూహాలను అనుసరించారు. ముట్టడిలో ఉన్నప్పటికీ, కోహిమా వద్ద ఉన్న రక్షకులు బలగాలు వచ్చే వరకు తీవ్రమైన జపనీస్ దాడులకు వ్యతిరేకంగా పోరాడారు.[16]
ఇంఫాల్, కొహిమా యుద్ధాలు జపనీయుల నిర్ణయాత్మక ఓటమికి దారితీశాయి. వారు భారీ ప్రాణనష్టాన్ని చవిచూసి, బర్మా దండయాత్ర తిరిగి వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. మిత్రరాజ్యాల విజయంతో బర్మా నుండి జపాన్ దళాలను వెళ్ళగొట్టి, తదుపరి దాడులతో చివరికి ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.[17]
చైనా-భారత యుద్ధం (1962)
[మార్చు]భారతదేశపు ఈశాన్య కొనలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చైనా దక్షిణ టిబెట్ అని చెప్పుకునేది.[18] చైనా-భారత సంబంధాలు క్షీణించి, 1962 నాటి చైనా-భారత యుద్ధం జరిగింది. యుద్ధానికి దారితీసిన కారణం ఇప్పటికీ చైనా, భారతీయ వర్గాల మధ్య వివాదాస్పదంగా ఉంది. 1962 నాటి ఆ యుద్ధ సమయంలో, 1954 లో భారతదేశం సృష్టించిన NEFA (ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ) లో చాలా భాగాన్ని చైనా స్వాధీనం చేసుకుంది. 1962 నవంబరు 21 న చైనా, ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించి, తన సైన్యాన్ని మెక్‌మహాన్ రేఖ నుండి 20 కి.మీ. వెనక్కి ఉపసంహరించుకుంది. 1963 లో భారత యుద్ధ ఖైదీలను చైనా వెనక్కి పంపించింది.[19]
ఏడు సోదరీ రాష్ట్రాలు
[మార్చు]సిక్కిం రాష్ట్రాన్ని భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో చేర్చడానికి ముందు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలను సెవెన్ సిస్టర్ స్టేట్స్ అనేవారు. త్రిపురలో జ్యోతి ప్రసాద్ సైకియా అనే పాత్రికేయుడు,[20] రేడియో చర్చా కార్యక్రమంలో 1972 జనవరిలో కొత్త రాష్ట్రాల ప్రారంభోత్సవం సందర్భంగా 'ల్యాండ్ ఆఫ్ ది సెవెన్ సిస్టర్స్' అనే పదాన్ని కాయించాడు. అతనే ఆ తరువాత ఈ ఏడు రాష్ట్రాల పరస్పర ఆధారం, సామాన్యత్వంపై ఒక పుస్తకాన్ని సంకలనం చేశాడు. ప్రధానంగా ఈ ప్రచురణ కారణంగా ఈ పేరు స్థిరపడిపోయింది.[21]
రాష్ట్రం | చారిత్రక పేరు | రాజధాని(లు) | రాష్ట్రత్వం |
---|---|---|---|
అరుణాచల్ ప్రదేశ్ | నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ | ఇటానగర్ | 1987 (1971లో కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటైంది) [22] |
అస్సాం | కామరూప | షిల్లాంగ్ (1969 వరకు), డిస్పూర్ | 1947 |
మణిపూర్ | కంగ్లీపాక్ [23] | ఇంఫాల్ | 1971 (1956 లో కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసారు) [22] |
మేఘాలయ | ఖాసీ కొండలు, జైంతియా కొండలు, గారో కొండలు | షిల్లాంగ్ | 1971 [22] |
త్రిపుర | తిప్పరా [24] | అగర్తల | 1971 (1956 లో కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసారు) [22] |
మిజోరం | లుషాయ్ హిల్స్ | ఐజ్వాల్ | 1987 (1971 లో కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసారు) [22] [25] |
నాగాలాండ్ | నాగా హిల్స్ జిల్లా | కోహిమా | 1963 |
సిక్కిం | సుఖిం | గాంగ్టక్ | 1975 |
భౌగోళికం
[మార్చు]ఈశాన్య ప్రాంతాన్ని భౌతికంగా తూర్పు హిమాలయాలు, పట్కై, బ్రహ్మపుత్ర, బరాక్ లోయ మైదానాలుగా వర్గీకరించవచ్చు. ఈశాన్య భారతదేశంలో (ఇండో-మలయన్, ఇండో-చైనీస్, భారతీయ జీవ భౌగోళిక ప్రాంతాల సంగమం వద్ద) వేడి, తేమలతో కూడిన వేసవి, ఉధృతమైన రుతుపవనాలు, తేలికపాటి శీతాకాలాలతో ప్రధానంగా తేమతో కూడిన ఉప-ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. భారత ఉపఖండంలో ఇంకా మిగిలి ఉన్న వర్షారణ్యాలు భారతదేశపు పశ్చిమ తీరంతో పాటు, ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇవి విభిన్న వృక్ష, జంతుజాలాలకు అనేక పంట జాతులకు నిలయం. ఈ ప్రాంతంలో పెట్రోలియం, సహజ వాయువు నిల్వలు భారతదేశపు మొత్తం నిల్వలలో ఐదవ వంతు ఉంటాయని అంచనా వేసారు.
ఈ ప్రాంతం శక్తివంతమైన బ్రహ్మపుత్ర-బరాక్ నదీ వ్యవస్థలు, వాటి ఉపనదులతో నిండి ఉంది. భౌగోళికంగా, బ్రహ్మపుత్ర, బరాక్, ఇంఫాల్ లోయలు, మేఘాలయ, త్రిపుర కొండల మధ్య ఉన్న కొన్ని చదునైన భూములు కాకుండా, మిగిలిన మూడింట రెండు వంతుల ప్రాంతం లోయలు, మైదానాలతో కూడిన కొండ భూభాగం. దాదాపు సముద్ర మట్టం నుండి ఎత్తు 7,000 మీటర్లు (23,000 అ.) వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో సగటున 10,000 మిల్లీమీటర్లు (390 అం.) కు పైబడిన వర్షపాతం ఉండడం వలన, పర్యావరణ సమస్యలు, అధిక భూకంప కార్యకలాపాలు, వరదలు సంభవిస్తాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో చలి, మంచుతో కూడిన శీతాకాలాలు, తేలికపాటి వేసవితో కూడిన పర్వతప్రాంత వాతావరణం ఉంటుంది.
స్థలాకృతి
[మార్చు]ఎత్తైన శిఖరాలు
[మార్చు]{{{official_name}}} |
---|
ప్రపంచంలోని మూడవ ఎత్తైన పర్వత శిఖరం కాంచన్‌గంగ 8,586 మీ. (28,169 అ.) ఎత్తున ఉంది. ఇది సిక్కిం, ప్రక్కనే ఉన్న నేపాల్‌ల మధ్య ఉంది.
శిఖరం. | రాష్ట్రం | పరిధి/ప్రాంతం | ఎత్తు (m) | ఎత్తు (ft) | సమన్వయాలు |
---|---|---|---|---|---|
కంచెన్జుంగా (నేపాల్తో సంయుక్తంగా) | సిక్కిం | తూర్పు హిమాలయాలు | 8,586 | 28,169 | 27°42′11″N 88°08′53″E / 27.703°N 88.148°E |
కాంగ్టో (చైనాతో సంయుక్తంగా) | అరుణాచల్ ప్రదేశ్ | తూర్పు హిమాలయాలు | 7,090 | 23,261 | 27°51′54″N 92°31′59″E / 27.865°N 92.533°E |
సరమతి పర్వతం (మయన్మార్ తో సంయుక్తంగా) | నాగాలాండ్ | పూర్వాంచల్ శ్రేణిలో నాగా కొండల విభాగం | 3,841 | 12,602 | 25°44′31″N 95°01′59″E / 25.742°N 95.033°E |
మౌంట్ టెంపు (మౌంట్ ఇసో అని కూడా పిలుస్తారు) | మణిపూర్ | పూర్వాంచల్ శ్రేణిలో నాగా కొండల విభాగం | 2,994 | 9,823 | 25°31′52″N 94°05′06″E / 25.531°N 94.085°E |
ఫాంగ్పుయ్ | మిజోరం | పూర్వాంచల్ శ్రేణి లోని లుషాయ్ హిల్స్ విభాగం | 2,165 | 7,103 | 22°37′55″N 93°02′20″E / 22.632°N 93.039°E |
షిల్లాంగ్ శిఖరం | మేఘాలయ | షిల్లాంగ్ పీఠభూమి ఖాసీ హిల్స్ విభాగం | 1,965 | 6,447 | 25°31′55″N 91°51′04″E / 25.532°N 91.851°E |
పేరులేని శిఖరం | అస్సాం | కర్బి ఆంగ్లాంగ్ పీఠభూమి కచార్ కొండల విభాగం | 1,960 | 6,430 | 25°19′16″N 93°27′11″E / 25.321°N 93.453°E |
బెట్లింగ్షిప్ (సిబ్రాయ్-ఖుంగ్ అని కూడా పిలుస్తారు) | త్రిపుర | పూర్వాంచల్ శ్రేణిలో జంపుయి కొండల విభాగం | 930 | 3,051 | 23°48′36″N 92°15′40″E / 23.810°N 92.261°E |
బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం
[మార్చు]ఈశాన్య భారతదేశంలో బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు:
- బెకీ నది
- భోగ్డోయ్ నది
- ధన్‌సిరి నది
- దిబాంగ్ నది
- డిహింగ్ నది
- కామెంగ్ నది
- కొలోంగ్ నది
- కోపిలి నది
- లోహిత్ నది
- మానస్ నది
- సంకోష్ నది
- సుబాంసిరి నది
- తీస్తా నది
శీతోష్ణస్థితి
[మార్చు]ఈశాన్య భారతదేశంలో ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడతాయి.[26][27] ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన మేఘాలయ పీఠభూమి, తూర్పున నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ కొండల వలన ఇక్కడి వాతావరణం ప్రభావితమౌతుంది.[28] బంగాళాఖాతం నుండి ఉద్భవించే రుతుపవనాలు ఈశాన్య దిశగా కదిలి, ఈ పర్వతాలను తాకి తేమతో కూడిన గాలులు పైకి లేస్తాయి. అవి చల్లబడి, మేఘాలుగా ఘనీభవించి, ఈ వాలులపై భారీగా వర్షపాతాన్ని కలిగిస్తాయి.[28] ఇది దేశంలోనే అత్యధిక వర్షపాతం కలిగిన ప్రాంతం. అనేక ప్రదేశాలలో సగటు వార్షిక వర్షపాతం 2,000 mమీ. (79 అం.) వరకు ఉంటుంది. వర్షపాతం అత్యధికంగా వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది.[28] మేఘాలయ పీఠభూమిపై ఉన్న చిరపుంజి, 11,777 mమీ. (463.7 అం.) వార్షిక వర్షపాతంతో ప్రపంచంలోనే అత్యంత వర్షపాతం కలిగిన ప్రదేశం.[28] బ్రహ్మపుత్ర, బరాక్ లోయ నదీ మైదానాలలో ఉష్ణోగ్రతలు మధ్యస్థంగా ఉండగా, కొండ ప్రాంతాలలో ఎత్తుకు వెళ్ళే కొద్దీ తగ్గుతాయి.[28] ఎత్తైన ప్రదేశాలలో, శాశ్వత మంచు కవచం ఉంటుంది.[28] సాధారణంగా, ఈ ప్రాంతంలో శీతాకాలం, వేసవి, వర్షాకాలం - 3 ఋతువులుంటాయి. దీనిలో వర్షాకాలం భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగానే వేసవి నెలలతో సమానంగా ఉంటుంది.[29] శీతాకాలం నవంబరు ప్రారంభం నుండి మార్చి మధ్య వరకు ఉంటుంది. వేసవి ఏప్రిల్ మధ్య నుండి అక్టోబరు మధ్య వరకు ఉంటుంది. [28]
- ఉష్ణోగ్రతలు
ఉష్ణోగ్రతలు ఎత్తును బట్టి మారుతూ ఉంటాయి, బ్రహ్మపుత్ర, బరాక్ నదీ మైదానాలలో వెచ్చగా ఉండే ప్రదేశాలు, ఎత్తైన ప్రదేశాలలో అత్యంత చల్లగా ఉంటాయి.[30] లోయలు, పశ్చిమ ప్రాంతాలు సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల కూడా వాతావరణం ప్రభావితమై, ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.[30] సాధారణంగా, కొండ, పర్వత ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తక్కువ ఎత్తులో ఉన్న మైదానాల కంటే తక్కువగా ఉంటాయి.[31] అధిక మేఘాల ఆవరణం, తేమ కారణంగా వేసవి ఉష్ణోగ్రతలు శీతాకాలపు ఉష్ణోగ్రతల కంటే ఏకరీతిగా ఉంటాయి.[32]
బ్రహ్మపుత్ర, బరాక్ లోయ నదీ మైదానాలలో, శీతాకాలపు ఉష్ణోగ్రతలు 16 -- 17 °C (61 -- 63 °F) మధ్య మారుతూ ఉంటాయి. సగటు వేసవి ఉష్ణోగ్రతలు సుమారు 28 °C (82 °F) [30] అత్యధిక వేసవి ఉష్ణోగ్రతలు పశ్చిమ త్రిపుర మైదానంలో సంభవిస్తాయి. త్రిపుర రాజధాని అగర్తలాలో ఏప్రిల్‌లో 33 -- 35 °C (91 -- 95 °F) మధ్య గరిష్ట వేసవి ఉష్ణోగ్రతలు ఉంటాయి.[33] వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు రుతుపవనాల రాకకు ముందు సంభవిస్తాయి, తూర్పు ప్రాంతాలలో జూన్, జూలైలలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇక్కడ రుతుపవనాలు పశ్చిమ ప్రాంతాల కంటే ఆలస్యంగా వస్తాయి.[33] బ్రహ్మపుత్ర మైదానానికి దక్షిణంగా ఉన్న కాచర్ మైదానంలో, ఉష్ణోగ్రతలు బ్రహ్మపుత్ర మైదానం కంటే ఎక్కువగా ఉంటాయి. అయితే అధిక మేఘాలు, రుతుపవనాల కారణంగా ఉష్ణోగ్రతల పరిధి తక్కువగా ఉంటుంది.[31][33]
అరుణాచల్ ప్రదేశ్‌లోని పర్వత ప్రాంతాలలో, భారతదేశం, చైనాలతో ఉత్తర సరిహద్దులో ఉన్న హిమాలయ శ్రేణులలో చలికాలంలో మంచు భారీగా కురుస్తుంది. ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే స్థాయికి పడిపోతాయి.[31] 2,000 మీటర్లు (6,562 అ.) కంటే ఎత్తున ఉన్న ప్రదేశాల్లో శీతాకాలంలో మంచు కురుస్తుంది, వేసవి చల్లగా ఉంటుంది. [31] 2,000 మీటర్లు (6,562 అ.) కంటే దిగువన ఉన్న చోట్ల, శీతాకాలపు ఉష్ణోగ్రతలు పగటిపూట15 °C (59 °F) వరకు చేరుకుంటాయి, రాత్రులు సున్నాకి పడిపోతాయి. వేసవికాలం చల్లగా ఉంటూ, గరిష్ట సగటు ఉష్ణోగ్రత 25 °C (77 °F), కనిష్ట సగటు ఉష్ణోగ్రత 15 °C (59 °F) ఉంటాయి.[31] మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరంలోని కొండ ప్రాంతాలలో శీతాకాలం బాగా చల్లగా, వేసవికాలం చల్లగా ఉంటాయి.[32]
- వర్షపాతం
ఈశాన్య భారతదేశంలో 1,000 mమీ. (39 అం.) కంటే తక్కువ వార్షిక వర్షపాతం ఉండే ప్రదేశం లేదు. [29] బ్రహ్మపుత్ర లోయలోని ప్రాంతాల్లో 2,000 mమీ. (79 అం.) వర్షపాతం ఉండగా, పర్వత ప్రాంతాలలో 2,000 నుండి 3,000 mమీ. (79 నుండి 118 అం.) ఉంటుంది.[29] ఈ ప్రాంతపు వార్షిక వర్షపాతంలో 90% నైరుతి రుతుపవనాల నుండి వస్తుంది. [34] ఏప్రిల్ నుండి అక్టోబరు చివరి వరకు ఈశాన్య భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది, జూన్, జూలైల్లో అత్యధిక వర్షపాతం ఉంటుంది. [34] ఈ ప్రాంతంలోని చాలా ప్రాంతాల్లో, రుతుపవనాలు ప్రారంభమయ్యే సగటు తేదీ జూన్ 1. [35] దక్షిణ ప్రాంతాల్లో రుతుపవనాలు ముందు (మే లేదా జూన్) వస్తాయి. బ్రహ్మపుత్ర లోయ, ఉత్తర పర్వత ప్రాంతాలకు తరువాత (మే తర్వాత లేదా జూన్) వస్తాయి.[34] మిజోరం లోని కొండ ప్రాంతాలలో, బంగాళాఖాతానికి దగ్గరగా ఉండటం వల్ల రుతుపవనాలు ముంద���గా వస్తాయి. జూన్, ఇక్కడ అత్యంత తేమగా ఉండే నెల.[34]
హై-రిస్క్ సీస్మిక్ జోన్
[మార్చు]ఈశాన్య భారతదేశం, ఇండియా ప్లేట్, యురేషియన్ ప్లేట్, బర్మా ప్లేట్ -ఈ మూడు టెక్టోనిక్ ప్లేట్‌ల ఒకదానికొకటి దగ్గరగా జరగడంతో ఏర్పడిన యాక్టివ్ ఫాల్ట్ ప్లేన్‌ల వల్ల ఇక్కడ మెగా-భూకంపాలు ఏర్పడతాయి. చారిత్రికంగా ఈ ప్రాంతంలో రెండు గొప్ప భూకంపాలు (M > 8.0) - 1897 అస్సాం భూకంపం, 1950 నాటి అస్సాం టిబెట్ భూకంపం - సంభవించాయి. 1897 నుండి దాదాపు 20 పెద్ద భూకంపాలు (8.0 > M > 7.0) సంభవించాయి. [36] [37] 1950 నాటి అస్సాం టిబెట్ భూకంపం ఇప్పటికీ భారతదేశంలో సంభవించిన అతిపెద్ద భూకంపం.
జాతీయ ఉద్యానవనాలు
[మార్చు]నేషనల్ పార్క్ | స్థానం | రాష్ట్రం | ప్రాంతం (km2) | ప్రాముఖ్యత | వృక్షసంపద. |
---|---|---|---|---|---|
నమ్దఫా నేషనల్ పార్క్ | చాంగ్లాంగ్ జిల్లా | అరుణాచల్ ప్రదేశ్ | 1,985 | తూర్పు హిమాలయాలలో అతిపెద్ద రక్షిత ప్రాంతం | ఉష్ణమండల, ఉపఉష్ణమండల తేమతో కూడిన విశాలమైన ఆకుల అడవులు, పర్వత అడవులు |
మానస్ నేషనల్ పార్క్ | బక్సా జిల్లా | అస్సాం | 950 | యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం | ఉష్ణమండల, ఉపఉష్ణమండల తేమతో కూడిన విశాలమైన ఆకుల అడవులు |
కాజీరంగా నేషనల్ పార్క్ | గోలాఘాట్, నాగావ్ జిల్లాలు | అస్సాం | [38]882 | యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం | బ్రహ్మపుత్ర లోయ పాక్షిక సతతహరిత అడవులు, తెరాయ్-దువార్ సవన్నా, గడ్డి భూములుటెరాయ్-డుర్ సవన్నా, గడ్డి భూములు |
కంచెంజోంగా నేషనల్ పార్క్ | ఉత్తర సిక్కిం జిల్లా | సిక్కిం | 850 | యునెస్కో మిశ్రమ ప్రపంచ వారసత్వ ప్రదేశం, భారతదేశంలో అత్యధిక ఎత్తులో ఉన్న వన్యప్రాణుల రక్షిత ప్రాంతం | ఉప-ఉష్ణమండల నుండి ఆల్పైన్ వరకు, క్రుమ్హోల్జ్ (స్టాంటెడ్ ఫారెస్ట్) [39] |
మౌలింగ్ నేషనల్ పార్క్ | ఎగువ సియాంగ్, పశ్చిమ సియాంగ్, తూర్పు సియాంగ్ జిల్లాలు | అరుణాచల్ ప్రదేశ్ | 483 | ఉష్ణమండల నుండి సమశీతోష్ణ అడవులు | |
డిబ్రూ-సైఖోవా నేషనల్ పార్క్ | దిబ్రూగఢ్, తిన్సుకియా జిల్లాలు | అస్సాం | 350 | బ్రహ్మపుత్ర లోయ పాక్షిక సతతహరిత అడవులు | |
బాల్ఫక్రమ్ నేషనల్ పార్క్ | దక్షిణ గారో హిల్స్ జిల్లా | మేఘాలయ | 220 | ఉప-ఉష్ణమండల సతతహరిత ఆకురాల్చే అడవులు | |
ఇంటాంగ్కి నేషనల్ పార్క్ | పెరెన్ జిల్లా | నాగాలాండ్ | 202 | సమశీతోష్ణ సతతహరిత అడవులు | |
నామేరి నేషనల్ పార్క్ | సోనిత్పూర్ జిల్లా | అస్సాం | 200 | బ్రహ్మపుత్ర లోయ పాక్షిక సతతహరిత అడవులు | |
ముర్లెన్ నేషనల్ పార్క్ | చంఫాయ్ జిల్లా | మిజోరం | 100 | మోంటేన్ ఉప-ఉష్ణమండల పాక్షిక సతతహరిత అడవి | |
ఒరాంగ్ నేషనల్ పార్క్ | దరాంగ్, సోనిత్పూర్ | అస్సాం | 79 | తూర్పు కాలానుగుణ చిత్తడి అడవులు, తూర్పు హిమాలయ తేమ మిశ్రమ ఆకురాల్చే అడవులు, తూర్పున తడి ఒండ్రు గడ్డి భూములు [40] | |
ఫాంగ్పుయ్ నేషనల్ పార్క్ | లాంగ్ట్లై జిల్లా | మిజోరం | 50 | సమశీతోష్ణ అడవులు [41] | |
నోక్రెక్ నేషనల్ పార్క్ | పశ్చిమ గారో హిల్స్ జిల్లా | మేఘాలయ | 48 | ఉష్ణమండల, ఉపఉష్ణమండల తేమతో కూడిన విశాలమైన ఆకుల అడవులు | |
సిరోహి నేషనల్ పార్క్ | ఉఖ్రుల్ జిల్లా | మణిపూర్ | 41 | మిజోరం-మణిపూర్-కాచిన్ వర్షారణ్యాలు | |
కెయిబుల్ లామ్జావో నేషనల్ పార్క్ | బిష్ణుపూర్ జిల్లా | మణిపూర్ | 40 | ప్రపంచంలోని ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనంనేషనల్ పార్క్ | ఫుమ్డి (తేలుతున్న చిత్తడి నేలలు) |
బైసన్ (రాజ్బరిహ్ నేషనల్ పార్క్) | దక్షిణ త్రిపుర జిల్లా | త్రిపుర | 32 | ఉష్ణమండల పాక్షిక సతతహరిత, తేమతో కూడిన ఆకురాల్చే అడవులు | |
క్లౌడెడ్ లెపార్డ్ నేషనల్ పార్క్ | సిపాహిజాల జిల్లా | త్రిపుర | 5 | ఉష్ణమండల, ఉపఉష్ణమండల తేమతో కూడిన విశాలమైన ఆకుల అడవులు |
రాష్ట్రాల చిహ్నాలు
[మార్చు]అరుణాచల్ ప్రదేశ్ | అస్సాం | మణిపూర్ | మేఘాలయ | |||||
---|---|---|---|---|---|---|---|---|
జంతువు. | మిథున్ (బోస్ ఫ్రంటాలిస్) | భారతీయ ఖడ్గమృగం (ఖడ్గమృగాలు యునికార్నిస్) | సంగాయ్ (రుసెర్వస్ ఎల్డి ఎల్డి) | క్లౌడెడ్ లెపర్డ్ (నియోఫెలిస్ నెబ్యులోసా) | ||||
పక్షి. | హార్న్బిల్ (బుసెరోస్ బైకోర్నిస్) | తెల్ల రెక్కల బాతు (Asarcornis scutulata) | మిసెస్ హ్యూమ్ నెమలి (సిర్మాటికస్ హుమియా) | హిల్ మైనా (గ్రాకుల రిలీజియోసా) | ||||
పువ్వు. | ఫాక్స్టైల్ ఆర్కిడ్ (రైన్కోస్టైలిస్ రెటుసా) | ఫాక్స్టైల్ ఆర్కిడ్ (రైన్కోస్టైలిస్ రెటుసా) | సిరోయి లిల్లీ (లిలియం మాక్లినియా) | లేడీస్ స్లిప్పర్ ఆర్కిడ్ (పాఫియోపెడిలమ్ చిహ్నం) | ||||
చెట్టు. | హోల్లాంగ్ (డిప్టెరోకార్పస్ మాక్రోకార్పస్) | హోల్లాంగ్ (డిప్టెరోకార్పస్ మాక్రోకార్పస్) | యూనింగ్థౌ (ఫీబ్ హైనేసియానా) | గమర్ (మెలీనా అర్బోరియా) | ||||
మిజోరం | నాగాలాండ్ | సిక్కిం | త్రిపుర | |||||
జంతువు. | హిమాలయన్ సెరో (మకరం) | మిథున్ (బోస్ ఫ్రంటాలిస్) | ఎర్ర పాండా (ఐలురస్ ఫుల్జెన్స్) | ఫేయర్స్ లీఫ్ మంకీ (ట్రాచిఫిథెకస్ ఫేయ్రీ) | ||||
పక్షి. | శ్రీమతి హ్యూమ్ యొక్క నెమలి (సిర్మాటికస్ హుమియా) | బ్లైత్స్ ట్రాగోపాన్ (ట్రాగోపన్ బ్లైథి) | బ్లడ్ ఫెసెంట్ (ఇథాజినిస్ క్రూన్టస్) | గ్రీన్ ఇంపీరియల్ పావురం (డుకులా ఏనియా) | ||||
పువ్వు. | రెడ్ వాండా (రెనాంథెరా ఇమ్స్చూటియానా) | చెట్టు రోడోడెండ్రాన్ (రోడోడెన్డ్రాన్ అర్బోరియం) | నోబెల్ డెండ్రోబియం (డెండ్రోబియమ్ నోబిల్) | భారతీయ గులాబీ చెస్ట్నట్ (మెసువా ఫెరియా) | ||||
చెట్టు. | భారతీయ గులాబీ చెస్ట్నట్ (మెసువా ఫెరియా) | ఆల్డర్ (ఆల్నస్ నేపాలెన్సిస్) (ఆల్నస్ నెపాలెన్సిస్) | రోడోడెండ్రాన్ (రోడోడెన్డ్రాన్ నివియం) | అగర్వుడ్ (అక్విలారియా అగల్లోచా) |
జనాభా వివరాలు
[మార్చు]ఈశాన్య భారతదేశంలోని మొత్తం జనాభా 4.6 కోట్లు. వారిలో 68 శాతం మంది అస్సాంలోనే నివసిస్తున్నారు. అస్సాం జనాభా సాంద్రత కిమీ 2 కి 397 మంది. ఇది జాతీయ సగటు 382/కిమీ 2 కంటే ఎక్కువ. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మినహా ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాల్లో అక్షరాస్యత రేట్లు జాతీయ సగటు 74 శాతం కంటే ఎక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం, మేఘాలయ ఈ ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలలో అత్యధికంగా 27.8 శాతం జనాభా వృద్ధిని నమోదు చేసింది, ఇది జాతీయ సగటు 17.64 శాతం కంటే అధికం. నాగాలాండ్‌లో, మొత్తం దేశంలోనే అత్యల్పంగా, 0.5 శాతం తగ్గుదల నమోదైంది.[42]
రాష్ట్రం | జనాభా | పురుషులు | స్త్రీలు | లింగ నిష్పత్తి | అక్షరాస్యత% | గ్రామీణ జనాభా | పట్టణ జనాభా | విస్తీర్ణం (km2) | సాంద్రత (/km2) |
---|---|---|---|---|---|---|---|---|---|
అరుణాచల్ ప్రదేశ్ | 1,383,727 | 713,912 | 669,815 | 938 | 65.38 | 870,087 | 227,881 | 83,743 | 17 |
అస్సాం | 31,205,576 | 15,939,443 | 15,266,133 | 958 | 72.19 | 23,216,288 | 3,439,240 | 78,438 | 397 |
మణిపూర్ | 2,570,390 | 1,290,171 | 1,280,219 | 992 | 79.21 | 1,590,820 | 575,968 | 22,327 | 122 |
మేఘాలయ | 2,966,889 | 1,491,832 | 1,475,057 | 989 | 74.43 | 1,864,711 | 454,111 | 22,429 | 132 |
మిజోరం | 1,097,206 | 555,339 | 541,867 | 976 | 91.33 | 447,567 | 441,006 | 21,081 | 52 |
నాగాలాండ్ | 1,978,502 | 1,024,649 | 953,853 | 931 | 79.55 | 1,647,249 | 342,787 | 16,579 | 119 |
సిక్కిం | 610,577 | 323,070 | 287,507 | 890 | 81.42 | 480,981 | 59,870 | 7,096 | 86 |
త్రిపుర | 3,673,917 | 2,087,059 | 2,086,858 | 960 | 91.58 | 2,639,134 | 1,534,783 | 10,486 | 350 |
జనాభా ప్రకారం అతిపెద్ద నగరాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈశాన్య భారతదేశంలోని అతిపెద్ద నగరాలు
ర్యాంక్ | నగరం | రకం | రాష్ట్రం | జనాభా | ర్యాంక్ | నగరం | రకం | రాష్ట్రం | జనాభా |
---|---|---|---|---|---|---|---|---|---|
1 | గువహతి | నగరం | అస్సాం | 968,549 | 9 | జోర్హాట్ | యుఎ | అస్సాం | 153,889 |
2 | అగర్తలా | నగరం | త్రిపుర | 622,613 | 10 | నాగావ్ | యుఎ | అస్సాం | 147,496 |
3 | ఇంఫాల్ | యుఎ | మణిపూర్ | 414,288 | 11 | బొంగైగావ్ | యుఎ | అస్సాం | 139,650 |
4 | దిమాపూర్ | నగరం | నాగాలాండ్ | 379,769 | 12 | తిన్సుకియా | యుఎ | అస్సాం | 126,389 |
5 | షిల్లాంగ్ | యుఎ | మేఘాలయ | 354,325 | 13 | తేజ్పూర్ | యుఎ | అస్సాం | 102,505 |
6 | ఐజ్వాల్ | నగరం | మిజోరం | 291,822 | 14 | కోహిమా | యుఎ | నాగాలాండ్ | 100,000 |
7 | సిల్చార్ | యుఎ | అస్సాం | 229,136 | 15 | గాంగ్టక్ | నగరం | సిక్కిం | 98,658 |
8 | దిబ్రూగఢ్ | యుఎ | అస్సాం | 154,296 | 16 | ఇటానగర్ | నగరం | అరుణాచల్ ప్రదేశ్ | 95,650 |
UA: అర్బన్ అగ్లోమెరేషన్ [43] |
ఇతర ఇండో-ఆర్యన్ భాషలలో చక్మా మిజోరాంలో మాట్లాడతారు. అస్సాం, మేఘాలయలో హజోంగ్ మాట్లాడతారు. ఇండో-ఆర్యన్ భాష అయిన నేపాలీ, సిక్కింలో ప్రబలంగా ఉంది. చైనా-టిబెటన్ భాషలతో పాటు లింబు, భూటియా, లెప్చా, రాయ్, తమాంగ్, షెర్పా, మొదలైనవి కూడా సిక్కింలో మాట్లాడతారు. 1836 నుండి 1873 వరకు కలోనియల్ అస్సాంలో బెంగాలీ అధికారిక భాషగా ఉండేది.[46]
అధికారిక భాషలు
[మార్చు]రాష్ట్రం | అధికార భాషలు [47] |
---|---|
అరుణాచల్ ప్రదేశ్ | ఇంగ్లీషు |
అస్సాం | అస్సామీ, బోడో, మైతేయి (మణిపురి), [48] బెంగాలీ [49] |
మణిపూర్ | మెయిటీ |
మేఘాలయ | ఆంగ్ల |
మిజోరం | మిజో, ఇంగ్లీష్ |
నాగాలాండ్ | ఇంగ్లీష్ [50] |
సిక్కిం | సిక్కిమీస్, లెప్చా, నేపాలీ, ఇంగ్లీష్ |
త్రిపుర [51] | బెంగాలీ, కోక్‌బోరోక్, ఇంగ్లీష్ |
రాష్ట్రాల పేర్ల వ్యుత్పత్తి
[మార్చు]రాష్ట్రం పేరు | మూలం | సాహిత్యపరమైన అర్థం |
---|---|---|
అరుణాచల్ ప్రదేశ్ | సంస్కృతం | డాన్-లైట్ పర్వతాల భూమి |
అస్సాం | స్థానిక పేరు | అస్సాం, అహోం రెండూ అసమ్, అకామ్, అహోమ్‌లకు ఉపయోగించిన షాన్/శ్యామ్ యొక్క అవినీతికి చెందినవి. [52] |
మణిపూర్ | సంస్కృతం | ఆభరణాలతో సమృద్ధిగా ఉన్న భూమి, 18వ శతాబ్దంలో స్వీకరించబడింది |
మేఘాలయ | సంస్కృతం | మేఘాల నివాసం, షిబా పి. ఛటర్జీచే రూపొందించబడింది |
మిజోరం | మిజో భాష | మిజో ప్రజల భూమి ; రమ్ అంటే భూమి |
నాగాలాండ్ | ఆంగ్ల | నాగా ప్రజల భూమి |
సిక్కిం | లింబు భాష | కొత్త ఇల్లు - "సుఖిం" అనే పదం నుండి ఉద్భవించింది, "సు" అంటే కొత్తది, "ఖిం" అంటే ఇల్లు |
త్రిపుర | కోక్బోరోక్ | స్థానిక పేర్ల సంస్కృత వెర్షన్: తిప్రా, టుయ్‌పురా, ట్విప్రా మొదలైనవి. దీని అక్షరాలా నీటికి సమీపంలో ఉన్న భూమి అని అర్ధం - త్రిపుర బంగాళాఖాతంకి కొద్దిగా సమీపంలో ఉన్నందున "TWIPRA", "Twi" అంటే నీరు, "బుప్రా" అనే పదం నుండి ఉద్భవించింది. . |
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపుర, మణిపూర్, సిక్కిం లలో హిందూ మతం మెజారిటీ మతం కాగా అరుణాచల్ ప్రదేశ్‌లో బహుళత్వం ఉంది. మేఘాలయ, నాగాలాండ్, మిజోరంలలో క్రైస్తవ మతం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో బహుళత్వం ఉంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని గణనీయమైన బహుళత్వంలో స్థానిక మతమైన డోనీ-పోలోను అనుసరిస్తారు. అస్సాంలో ఇస్లాం గణనీయంగా ఉంది. మొత్తం ఈశాన్య ముస్లిం జనాభాలో 93% మంది ఆ రాష్ట్రంలోనే కేంద్రీకృతమై ఉన్నారు. భారతదేశంలోని క్రైస్తవ జనాభాలో ఎక్కువ భాగం, 30% మంది, ఈశాన్య ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో బౌద్ధమతం గణనీయంగా ఉంది.[53]
రాష్ట్రం | హిందూమతం | ఇస్లాం | క్రైస్తవ మతం | బౌద్ధమతం | జైనమతం | సిక్కు మతం | ఇతర మతాలు | మతం పేర్కొనబడలేదు |
---|---|---|---|---|---|---|---|---|
అరుణాచల్ ప్రదేశ్ | 401,876 | 27,045 | 418,732 | 162,815 | 771 | 3,287 | 362,553 | 6,648 |
అస్సాం | 19,180,759 | 10,679,345 | 1,165,867 | 54,993 | 25,949 | 20,672 | 27,118 | 50,873 |
మణిపూర్ | 1,181,876 | 239,836 | 1,179,043 | 7,084 | 1,692 | 1,527 | 233,767 | 10,969 |
మేఘాలయ | 342,078 | 130,399 | 2,213,027 | 9,864 | 627 | 3,045 | 258,271 | 9,578 |
మిజోరం | 30,136 | 14,832 | 956,331 | 93,411 | 376 | 286 | 808 | 1,026 |
నాగాలాండ్ | 173,054 | 48,963 | 1,739,651 | 6,759 | 2,655 | 1,890 | 3,214 | 2,316 |
సిక్కిం | 352,662 | 9,867 | 60,522 | 167,216 | 314 | 1,868 | 16,300 | 1,828 |
త్రిపుర | 3,063,903 | 316,042 | 159,882 | 125,385 | 860 | 1,070 | 1,514 | 5,261 |
మొత్తం | 24,726,344 | 11,466,329 | 7,893,055 | 627,527 | 33,244 | 33,645 | 903,545 | 88,499 |
జాతి సమూహాలు
[మార్చు]ఈశాన్య భారతదేశంలో 220 కంటే ఎక్కువ జాతులు, అదే సంఖ్యలో మాండలికాలు ఉన్నాయి. బోడో అతిపెద్ద దేశీయ జాతి. [55] అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ వంటి ప్రాంతంలోని కొండల రాష్ట్రాలు గిరిజన సమూహాలలో కూడా భిన్నత్వంతో కూడిన గిరిజన ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. ఈ ప్రాంతపు ప్రజల్లో టిబెట్, ఇండో-గంగా భారతదేశం, హిమాలయాలు, ప్రస్తుత బంగ్లాదేశ్, మయన్మార్ నుండి పురాతన, నిరంతర వలసల ఫలితంగా వచ్చినవారు ఉన్నారు. [56]
మెజారిటీ సామాజిక సమూహాలు
[మార్చు]కింది జాతుల సమూహాలు ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాలు/ప్రాంతాలలో గణనీయమైన మెజారిటీగా ఉన్నాయి:
- అస్సామీ ప్రజలు - (48.38%), అస్సాంలో అతిపెద్ద జాతి
- తాని ప్రజలు - (40.32%), అరుణాచల్ ప్రదేశ్‌లో అతిపెద్ద జాతి
- బోడో ప్రజలు - (30.47%), అస్సాంలోని బోడోలాండ్ ప్రాంతంలో అతిపెద్ద జాతి
- బెంగాలీ ప్రజలు - (63.48%, 80.84%), త్రిపుర రాష్ట్రం, అస్సాంలోని బరాక్ వ్యాలీ ప్రాంతంలో అతిపెద్ద జాతి
- మెయిటీ ప్రజలు - (53.3%), మణిపూర్‌లో అతిపెద్ద జాతి
- త్రిపురి ప్రజలు - త్రిపుర గిరిజన ప్రాంతాల అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఆఫ్ త్రిపురలో అతిపెద్ద జాతి
- మిజో ప్రజలు - (73.14%), మిజోరంలో అతిపెద్ద జాతి
- ఖాసీ ప్రజలు - (46.24%), మేఘాలయలో అతిపెద్ద జాతి
- నాగా ప్రజలు - (88.24%), నాగాలాండ్‌లో అతిపెద్ద జాతి
- నేపాలీ ప్రజలు - (62.6%), సిక్కింలో అతిపెద్ద జాతి
- సిక్కిం ప్రజలు - సిక్కిం యొక్క స్థానిక జాతి
మైనారిటీ సమూహాలు
[మార్చు]ఈ జాతి సమూహాలు ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాలలో మైనారిటీలుగా ఉన్నాయి:
పరిపాలన, రాజకీయ వివాదాలు
[మార్చు]అంతర్జాతీయ సరిహద్దుల నిర్వహణ
[మార్చు]- సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లలో చైనాతో ఉన్న సరిహద్దు మెక్‌మాన్ రేఖ వెంట సరిహద్దు క్రాసింగ్‌ల వద్ద ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు, ప్రత్యేక ఫ్రాంటియర్ ఫోర్స్ లు గస్తీ నిర్వహిస్తాయి
- అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం వెంట సరిహద్దు భద్రతా దళం గస్తీ నిర్వహిస్తుంది
- భారతదేశం-మయన్మార్ సరిహద్దు, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం వెంట అస్సాం రైఫిల్స్, ఇండియన్ ఆర్మీ గస్తీ తిరుగుతాయి
- సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లలో భారత-భూటాన్ సరిహద్దు వెంటా సశాస్త్ర సీమా బల్ పహారా కాస్తుంది.
- సిక్కింలో భారత-నేపాల్ సరిహద్దు వెంబడి సశాస్త్ర సీమా బల్ పహారా కాస్తుంది
అంతర్రాష్ట్ర అభివృద్ధి సంస్థలు
[మార్చు]- ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (DoNER)
- నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్
రాష్ట్రాలు, ఉప-విభాగాలు
[మార్చు]రాష్ట్రం | కోడ్ | రాజధాని | జిల్లాలు | సబ్ డివిజన్ రకం | ఉపవిభాగాల సంఖ్య |
---|---|---|---|---|---|
అరుణాచల్ ప్రదేశ్ | IN-AR | ఇటానగర్ | 20 | వృత్తం | 149 |
అస్సాం | IN-AS | డిస్పూర్ | 35 | సబ్ డివిజన్ | 78 |
మణిపూర్ | IN-MN | ఇంఫాల్ | 16 | సబ్ డివిజన్ | 38 |
మేఘాలయ | IN-ML | షిల్లాంగ్ | 12 | కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్ | 39 |
మిజోరం | IN-MZ | ఐజ్వాల్ | 11 | కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్ | 22 |
నాగాలాండ్ | IN-NL | కోహిమా | 16 | వృత్తం | 33 |
సిక్కిం | IN-SK | గాంగ్టక్ | 6 | సబ్ డివిజన్ | 9 |
త్రిపుర | IN-TR | అగర్తల | 8 | సబ్ డివిజన్ | 23 |
రాష్ట్రం | స్వయంప్రతిపత్తి విభాగం | స్థాపన |
---|---|---|
అస్సాం | బోడోలాండ్ ప్రాదేశిక ప్రాంత జిల్లాలు | ఫిబ్రవరి 2003 |
దిమా హసావో జిల్లా | ఫిబ్రవరి 1970 | |
కర్బి ఆంగ్లాంగ్ జిల్లా | ఫిబ్రవరి 1970 | |
స్వయంప్రతిపత్తి మండలిని విలీనం చేయడం | 1995 | |
రాభా హసోంగ్ అటానమస్ కౌన్సిల్ | 1995 | |
మణిపూర్ [57][58] | చురాచంద్పూర్ స్వయంప్రతిపత్తి జిల్లా మండలి | 1971 |
చందేల్ స్వయంప్రతిపత్తి జిల్లా మండలి | 1971 | |
సేనాపతి స్వయంప్రతిపత్తి జిల్లా మండలి | 1971 | |
సదర్ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ | 1971 | |
తమెంగ్లాంగ్ స్వయంప్రతిపత్తి జిల్లా మండలి | 1971 | |
ఉఖ్రుల్ స్వయంప్రతిపత్తి జిల్లా మండలి | 1971 | |
మేఘాలయ | గారో హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ | |
జయంతియా హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ | జూలై 2012 | |
ఖాసీ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ | ||
మిజోరం | చక్మా స్వయంప్రతిపత్తి జిల్లా మండలి | ఏప్రిల్ 1972 |
లాయ్ స్వయంప్రతిపత్తి జిల్లా మండలి | ఏప్రిల్ 1972 | |
మారా స్వయంప్రతిపత్తి జిల్లా మండలి | మే 1971 | |
త్రిపుర | త్రిపుర గిరిజన ప్రాంతాలు స్వయంప్రతిపత్తి జిల్లా మండలి | జనవరి 1982 |
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]నార్త్ ఈస్టర్న్ రీజియన్ అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MDoNER) ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం క్రింద పనిచేస్తున్న నిర్ణయాత్మక సంస్థ. MDoNER ఆధ్వర్యంలోని నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఈశాన్య భారతదేశానికి ప్రాంతీయ పాలకమండలిగా పనిచేస్తుంది. నార్త్ ఈస్టర్న్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (NEDFI) అనేది ఈశాన్య ప్రాంతంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, పెద్ద సంస్థలకు సహాయం అందించే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. MDoNER కింద ఉన్న ఇతర సంస్థలలో నార్త్ ఈస్టర్న్ రీజినల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (NERAMAC), సిక్కిం మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (SMC), నార్త్ ఈస్టర్న్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NEHHDC) లు ఉన్నాయి.
2023-24 జాతీయ ఉత్పత్తిని (NSDP) బట్టి ఈశాన్య రాష్ట్రాల జాబితా
[మార్చు]ర్యాంక్ | రాష్ట్రం | NSDP
రూపాయిలు ₹ |
తలసరి NSDP
₹ లో |
---|---|---|---|
1 | అస్సాం | ₹ 5,67,000 కోట్లు | ₹ 1,58,734 |
2 | త్రిపుర | ₹ 89,000 కోట్లు | ₹ 2,14,458 |
3 | సిక్కిం | ₹ 47,331 కోట్లు | ₹ 6,85,957 |
4 | మేఘాలయ | ₹ 46,600 కోట్లు | ₹ 1,39,104 |
5 | మణిపూర్ | ₹ 45,145 కోట్లు | ₹ 1,39,768 |
6 | అరుణాచల్ ప్రదేశ్ | ₹ 37,870 కోట్లు | ₹ 2,07,506 |
7 | నాగాలాండ్ | ₹ 37,300 కోట్లు | ₹ 90,666 |
8 | మిజోరం | ₹ 35,904 కోట్లు | ₹ 2,89,548 |
పరిశ్రమలు
[మార్చు]వ్యవసాయం
[మార్చు]ఈశాన్యంలో ఆర్థిక వ్యవస్థ వ్యవసాయాధారితమైంది. స్థిర వ్యవసాయానికి భూమి అందుబాటు తక్కువగా ఉంది. స్థిరపడిన వ్యవసాయంతో పాటు, ఝుమ్ (పోడు) సాగును ఇప్పటికీ కొన్ని దేశీయ సమూహాలు ఆచరిస్తున్నాయి. దుర్గమమైన ప్రాంతం కావడం, అంతర్గత కల్లోలాల కారణంగా ఈ ప్రాంతంలో పారిశ్రామికీకరణ వేగవంతంగా జరగడం లేదు.
-
ఝుమ్ వ్యవసాయం
-
అస్సాంలో తేయాకు తోట
-
మణిపూర్‌లో వరిపంట
-
మిజోరంలో ఆయిల్ పాం తోట
-
నాగాలాండ్‌లో టెర్రేస్ సాగు
-
అస్సాంలో కూరగాయలు
పర్యాటక
[మార్చు]సజీవ వృక్షాల (లివింగ్ రూట్) వంతెనలు
ఈశాన్య భారతదేశం అనేక సజీవ వృక్షాల వంతెనలకు నిలయం. మేఘాలయలో, ఇవి దక్షిణ ఖాసీ, జైంతియా హిల్స్‌లో కనిపిస్తాయి.[59][60][61] అవి ఈ ప్రాంతంలో విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. అయితే వరదల వలన, ఇటీవలి సంవత్సరాలలో జరుగుతున్న కృత్రిమ నిర్మాణాల వలన అవి అంతరించిపోతున్నాయి.[62] ఇండో-మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని నాగాలాండ్ రాష్ట్రంలో కూడా సజీవ వృక్ష వంతెనలు ఉన్నాయి.[63]
రవాణా
[మార్చు]గాలి
[మార్చు]ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాల నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమాన సౌకర్యం ఉంది. సైనిక, ప్రైవేట్ ప్రయోజనాల కోసం రాష్ట్రాల్లో అనేక చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లున్నాయి. పవన్ హన్స్ హెలికాప్టర్ సేవల ద్వారా వీటిని చేరుకోవచ్చు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి - లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం(గౌహతి), బీర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఇంఫాల్), మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం (అగర్తలా). ఇక్కడి నుండి థాయిలాండ్, మయన్మార్, నేపాల్ భూటాన్ లకు విమాన సేవలున్నాయి. సిక్కింలో విమానాశ్రయం నిర్మాణంలో ఉంది.
రాష్ట్రం | విమానాశ్రయం | నగరం | IATA కోడ్ |
---|---|---|---|
అరుణాచల్ ప్రదేశ్ | ఇటానగర్ విమానాశ్రయం | ఇటానగర్ | హెచ్జీఐ |
అస్సాం | దిబ్రూగఢ్ విమానాశ్రయం | దిబ్రూగఢ్ | డిఐబి |
జోర్హాట్ విమానాశ్రయం | జోర్హాట్ | జెఆర్హెచ్ | |
లోక్ప్రియ గోపీనాథ్ బోర్డోలోయి అంతర్జాతీయ విమానాశ్రయం | గువహతి | GAU | |
లీలాబరి విమానాశ్రయం | లఖింపూర్ | IXI | |
రూప్సి విమానాశ్రయం | ధుబ్రి | ఆర్యుపి | |
సిల్చార్ విమానాశ్రయం | సిల్చార్ | IXS | |
తేజ్పూర్ విమానాశ్రయం | తేజ్పూర్ | TEZ | |
మణిపూర్ | బీర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రయం | ఇంఫాల్ | ఐఎంఎఫ్ |
మేఘాలయ | బాల్జెక్ విమానాశ్రయం | తుర | వెటు (ఐకా) |
షిల్లాంగ్ విమానాశ్రయం | షిల్లాంగ్ | ఎస్హెచ్ఎల్ | |
మిజోరం | లెంగ్పుయ్ విమానాశ్రయం | ఐజ్వాల్ | ఎజెఎల్ |
నాగాలాండ్ | దిమాపూర్ విమానాశ్రయం | దిమాపూర్ | డిఎంయు |
సిక్కిం | పాక్యాంగ్ విమానాశ్రయం | గాంగ్టక్ | పివైజి |
త్రిపుర | మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం | అగర్తలా | IXA |
రైల్వే
[మార్చు]ఈశాన్య భారతదేశంలోని రైలు మార్గాలు ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ కిందికి వస్తాయి. ప్రాంతీయ నెట్‌వర్క్ బాగా అభివృద్ధి చెందలేదు. మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం రాష్ట్రాలకు 2023 మార్చి నాటికి ఇంకా రైలు మార్గం చేరలేదు. నిర్మాణంలో ఉన్న రైలు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మణిపూర్, మిజోరం, నాగాలాండ్ రాజధాని నగరాలకు రైలు సౌకర్యం లభిస్తుంది.[64]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Indian cities by population" (PDF). Archived (PDF) from the original on 23 July 2013. Retrieved 30 May 2018.
- ↑ State/UT wise Aadhaar Saturation
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 "Languages Included in the Eighth Schedule of the Indian Constitution | Department of Official Language | Ministry of Home Affairs | GoI". rajbhasha.gov.in. Retrieved 31 July 2022.
- ↑ "Manipuri language | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). 25 February 2024.
- ↑ "Problems of border areas in Northeast India" (PDF). Archived (PDF) from the original on 23 January 2022. Retrieved 30 April 2018.
- ↑ "North Eastern Council". Archived from the original on 15 April 2012. Retrieved 25 March 2012.
- ↑ 7.0 7.1 "Integration of Sikkim in North Eastern Council". The Times of India. 10 December 2002. Archived from the original on 30 April 2013. Retrieved 25 March 2012. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Integration of Sikkim in North Eastern Council" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Evaluation of NEC funded projects in Sikkim" (PDF). NEC. Archived from the original (PDF) on 8 September 2017. Retrieved 4 June 2017.
- ↑ 9.0 9.1 (Guha 1977)
- ↑ "Formation of Assam during British rule in India". Archived from the original on 11 June 2012. Retrieved 25 March 2012.
- ↑ "Formation of North Eastern states from Assam". Archived from the original on 27 June 2018. Retrieved 25 March 2012.
- ↑ "Shillong becomes the capital of Meghalaya". Archived from the original on 16 April 2012. Retrieved 25 March 2012.
- ↑ Ranjan Pal (4 October 2020). "Revisiting India's forgotten battle of WWII: Kohima–Imphal, the Stalingrad of the East". CNN (in ఇంగ్లీష్). Retrieved 27 December 2022.
- ↑ "Battles of Imphal and Kohima | National Army Museum". National Army Museum. Retrieved 2024-04-13.
- ↑ "Kohima: Britain's 'forgotten' battle that changed the course of WWII" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2021-02-14. Retrieved 2024-04-13.
- ↑ "Remembering The Second World War in North East India". The India Forum (in ఇంగ్లీష్). 2020-11-12. Retrieved 2024-04-13.
- ↑ (2018). "When Legions Thunder Past: The Second World War and India's Northeastern Frontier".
- ↑ "China says Arunachal Pradesh part of it "since ancient times"". The Economic Times. PTI. Dec 31, 2021. Retrieved 27 December 2022.
- ↑ Larry M. Wortzel, Robin D. S. Higham (1999), Dictionary of Contemporary Chinese Military History
- ↑ Saikia, J. P (1976). The Land of seven sisters (in ఇంగ్లీష్). Place of publication not identified: Directorate of Information and Public Relations, Assam. OCLC 4136888.
- ↑ "Who are the Seven Sisters of India?". HT School (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 27 December 2022.
- ↑ 22.0 22.1 22.2 22.3 22.4 "The North Eastern Areas (Re-organisation Act) 1971" (PDF). meglaw.gov.in. Archived (PDF) from the original on 6 December 2017. Retrieved 5 December 2017.
- ↑ "Ancient name of Manipur". 9 April 2012. Archived from the original on 18 November 2017. Retrieved 5 June 2017.
- ↑ "Historical evolution of Mizoram" (PDF). Archived (PDF) from the original on 7 July 2017. Retrieved 5 June 2017.
- ↑ "History of Mizoram". Archived from the original on 29 August 2017. Retrieved 5 June 2017.
- ↑ Dikshit 2014, p. 150.
- ↑ Dikshit 2014, p. 151.
- ↑ 28.0 28.1 28.2 28.3 28.4 28.5 28.6 Dikshit 2014, p. 152.
- ↑ 29.0 29.1 29.2 Dikshit 2014, p. 149.
- ↑ 30.0 30.1 30.2 Dikshit 2014, p. 153.
- ↑ 31.0 31.1 31.2 31.3 31.4 Dikshit 2014, p. 156.
- ↑ 32.0 32.1 Dikshit 2014, p. 158.
- ↑ 33.0 33.1 33.2 Dikshit 2014, p. 155.
- ↑ 34.0 34.1 34.2 34.3 Dikshit 2014, p. 160.
- ↑ Dikshit 2014, p. 59.
- ↑ "At least eight dead as north-east India hit by 6.7 magnitude earthquake". 4 January 2016. Archived from the original on 9 September 2017. Retrieved 4 June 2017.
- ↑ J. R. Kayal; S. S. Arefiev; S. Barua; Devajit Hazarika; N. Gogoi; A. Kumar; S. N. Chowdhury; Sarbeswar Kalita (July 2006). "Shillong Plateau Earthquakes". Archived from the original on 2 March 2022. Retrieved 11 February 2019.
- ↑ "Kaziranga National Park – a world heritage site, Govt. of Assam" (PDF). Archived (PDF) from the original on 8 September 2017. Retrieved 10 September 2017.
- ↑ "Khangchendzonga National Park". Archived from the original on 11 July 2018. Retrieved 26 December 2019.
- ↑ "Orang Tiger Reserve". Archived from the original on 10 September 2017. Retrieved 10 September 2017.
- ↑ "Forest types of Mizoram". Archived from the original on 10 September 2017. Retrieved 10 September 2017.
- ↑ "Nagaland records negative decadal growth". The Hindu. April 2011. Archived from the original on 28 February 2020. Retrieved 1 May 2018.
- ↑ "Archived copy" (PDF). Archived from the original on 26 December 2018. Retrieved 30 May 2017.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Language – India, States and Union Territories" (PDF). Census of India 2011. Office of the Registrar General. pp. 13–14. Archived (PDF) from the original on 14 November 2018. Retrieved 30 April 2019.
- ↑ "C-16 Population By Mother Tongue". census.gov.in. Archived from the original on 12 January 2020. Retrieved 6 March 2020.
- ↑ Banerjee, Paula (2008). Women in Peace Politics. Sage. pp. 71. ISBN 978-0-7619-3570-4.
- ↑ "Report on North East India" (PDF). Archived (PDF) from the original on 24 February 2020. Retrieved 29 May 2017.
- ↑ Purkayastha, Biswa Kalyan (24 February 2024). "Assam recognises Manipuri as associate official language in four districts". Hindustan Times. Retrieved 26 February 2024.
- ↑ "Govt withdraws Assamese as official language from Barak valley". Business Standard India. Press Trust of India. 9 September 2014. Archived from the original on 29 January 2018. Retrieved 29 January 2018.
- ↑ "Nagaland State Profile". Archived from the original on 13 September 2017. Retrieved 24 July 2017.
- ↑ "Know Tripura | Tripura State Portal". tripura.gov.in. Archived from the original on 3 January 2021. Retrieved 29 June 2020.
- ↑ "Ahoms also gave Assam and its language their name (Ahom and the modern ɒχɒm. 'Assam' comes from an attested earlier form asam, acam, probably from a Burmese corruption of the word Shan/Shyam, cf. Siam: Kakati 1962; 1–4)." (Masica 1993)
- ↑ "India - C-01: Population by religious community, India - 2011". censusindia.gov.in. Retrieved 10 September 2023.
- ↑ "Population By Religious Community". Archived from the original on 13 September 2015. Retrieved 5 June 2017.
- ↑ "Tribal groups in Assam and Northeast India". Archived from the original on 28 August 2019. Retrieved 28 August 2019.
- ↑ van Driem, G. (2012)
- ↑ "Autonomous District Councils of Manipur". Archived from the original on 18 April 2018. Retrieved 17 April 2018.
- ↑ "Manipur District Council Act 1971". 22 February 2015. Archived from the original on 17 April 2018. Retrieved 17 April 2018.
- ↑ "Living Root Bridges". Cherrapunjee (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 9 June 2014. Retrieved 11 September 2017.
- ↑ "The Living Root Bridge Project". The Living Root Bridge Project (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 5 September 2017. Retrieved 11 September 2017.
- ↑ "The Living-Root Bridge: The Symbol of Benevolence". Riluk (in అమెరికన్ ఇంగ్లీష్). 10 October 2016. Archived from the original on 8 September 2017. Retrieved 11 September 2017.
- ↑ "Why is Meghalaya's Botanical Architecture Disappearing?". The Living Root Bridge Project (in అమెరికన్ ఇంగ్లీష్). 6 April 2017. Archived from the original on 11 September 2017. Retrieved 11 September 2017.
- ↑ "Living Root Bridges of Nagaland India – Nyahnyu Village Mon District | Guy Shachar". guyshachar.com (in ఇంగ్లీష్). Archived from the original on 12 June 2018. Retrieved 11 September 2017.
- ↑ By March 2023, Manipur, Mizoram and Nagaland to have rail connectivity Archived 15 సెప్టెంబరు 2021 at the Wayback Machine, Business Standard, 29 August 2020.