Jump to content

ఆశ్చర్య రామాయణము

వికీపీడియా నుండి
ఆశ్చర్య రామాయణం - సుందర కాండము, ముఖచిత్రం

రామాయణం భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రముఖమైన గ్రంథం. తెలుగు సాహిత్యంలో కవిత్రయం భారతం, పోతన భాగవతం అత్యంత ప్రామాణికం, ఏకైక సుప్రఖ్యాతంగా నిలబడ్డాయి. ఐతే రామాయణం విషయంలో ఏ ఒక్క తెలుగు రామాయణానికో ఆ ఖ్యాతి దక్కలేదు. వేటికవే సాటిగా రంగనాథ రామాయణం, రామాయణ కల్పవృక్షం, మొల్ల రామాయణం పేరు తెచ్చుకున్నా ఆ వాల్మీకాన్ని హిందీ తులసీ రామాయణం మరపించినట్టుగా చేయలేదు. అందుకే ఎన్నెన్నో రామాయణాలు ఏర్పడ్డాయి. అసంఖ్యాకమైన రామాయణాలు రావడంతో విశ్వనాథ వారు మరలనిదేల రామాయణంబని ప్రశ్న తనకుతానే వేసుకుని సమాధానం చెప్పుకుని మరీ కల్పవృక్షాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రచించిన తెలుగు రామాయణం ఆశ్చర్య రామాయణం. దీనిని రామయణ కేసరి బిరుదాంకితులైన లక్కావఝ్ఝల వెంకట కృష్ణశాస్త్రి గారు రచించారు.

దీనిలో అవాల్మీకములైన విడ్డూరాలు ఉన్నాయి. వాటిలో అనేకం ప్రాచుర్యం పొందాయి కూడా. ఇంటి గుట్టు లంకకు చేటన్న సామెతకు మూలమైన కథ, రావణుడు సీతను స్పృశించక భూమి పెకలించాడని, హనుమ రావణ సభలో తోకతో చుట్టచుట్టి దానిపై కూర్చొన్నాడని అనేకమైన విడ్డూరమైన విషయాలు ఇందులోనివే.

భాగాలు

[మార్చు]
  1. ఆశ్చర్య రామాయణము, బాలకాండము ద్వితీయ ముద్రణమును వేంకట్రామ అండ్ కో వారు 1945 ప్రచురించారు.[1] ఇది ఏలూరు శ్రీ పాండురంగ ముద్రాక్షరశాల యందు ముద్రించబడింది. దీనిని కవి భద్రాచలంలోని శ్రీ రామచంద్రస్వామికి అంకితం చేశారు.
  2. ఆశ్చర్య రామాయణము, అరణ్యకాండము ప్రథమ ముద్రణము 1940 ప్రచురించబడినది.[2]
  3. ఆశ్చర్య రామాయణము, సుందరకాండమును వేంకటరామా అండ్ కో వారు 1953 లో ప్రచురించారు.[3] ఇది విజయవాడలోని గ్రామ ముద్రాక్షరశాల యందు ముద్రించబడింది. దీనిని కవి భద్రాచలంలోని శ్రీ రామచంద్రస్వామికి అంకితం చేశారు.
  4. ఆశ్చర్య రామాయణము, యుద్ధకాండమును వేంకటరామా అండ్ కో వారు 1950 లో ప్రచురించారు.[4] దీనికి కృష్ణాజిల్లా గోపాలపురమునకు చెందిన కొల్లు పాపయ్య చౌదరి గారు ధనసహాయం చేశారు.

ఇతర ముద్రణలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆశ్చర్య రామాయణము, బాలకాండము. వేంకట్రామ అండ్ కో. 1945.
  2. https://archive.org/details/in.ernet.dli.2015.372227/page/n3/mode/2up
  3. ఆశ్చర్య రామాయణము, సుందరకాండము. వేంకటరామ అండ్ కో. 1953.
  4. ఆశ్చర్య రామాయణము, యుద్ధకాండము. వేంకటరామా అండ్ కో. 1950.
  5. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన గ్రంథాలు (సప్తగిరి మాసపత్రిక ed.). తిరుమల తిరుపతి దేవస్థానములు. ఫిబ్రవరి 2015. pp. 33–5.