ఆకురాతి గోపాలకృష్ణ
Appearance
కవిశ్రీ ఆకురాతి గోపాలకృష్ణ ప్రఖ్యాత రచయిత, హేతువాది.[1]1931 లో అమ్మనబ్రోలులో ఆకురాతి వెంకటకృష్ణయ్య, రత్నమ్మలకు జన్మించారు.పొదలకూరు, రేవూరు, కోవూరు, ఏ.యస్.పేట, కలిగిరి లలో ఉద్యోగబాధ్యతలు నిర్వహించారు.1.12.2018న మరణించారు.
రచనలు
[మార్చు]- నడమంత్రపు ఊహల్లో నరులు
- దేవుడెక్కడ?
- ఆకురాతి శతకం
- మన పెంపుడు శతృవులు
- తెలిసినడుచుకొమ్ము తెలుగు బిడ్డ[2] ఇది 105 పద్యాల శతకం.
కొన్ని పద్యాలు
[మార్చు]ఆకురాతి శతకంలో ఒక పద్యం:
రాయి వేల్పుకాదు రక్షించికాపాడ
తాడుపాము కాదు తరిమికరువ
వట్టి భ్రమల నమ్మి నట్టేట మునుగకు
ఆకురాతి మాట అణు బరాట!!
తెలిసినడుచుకొమ్ము తెలుగు బిడ్డ లో ఒక పద్యం:
అమ్మ యనెడి తెలుగు కమ్మని పిలుపును
మమ్మి వచ్చి చేరి మట్టు పెట్టె
మేక వన్నె పులిని సాకిన ఫలమిది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
మూలాలు
[మార్చు]- ↑ "జల్లెడ - బ్లాగులను జల్లించండి One Stop For Telugu Blogs బ్లాగు అధికారభాషగా తెలుగు నుండి టపాలు". www.jalleda.com. Archived from the original on 2018-03-31. Retrieved 2018-01-20.
- ↑ "Google Groups". groups.google.com. Retrieved 2018-01-20.