అలెక్స్ కారీ
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అలెక్స్ టైసన్ కారీ | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లాక్స్‌టన్, సౌత్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా | 1991 ఆగస్టు 27|||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | కెజ్[1] | |||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్-batter | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 461) | 2021 డిసెంబరు 8 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 జూలై 28 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 223) | 2018 జనవరి 19 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 సెప్టెంబరు 7 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 4 | |||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 89) | 2018 ఫిబ్రవరి 3 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2021 ఆగస్టు 9 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 4 | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2012/13–present | సౌత్ ఆస్ట్రేలియా | |||||||||||||||||||||||||||||||||||
2016/17–present | Adelaide Strikers | |||||||||||||||||||||||||||||||||||
2019 | ససెక్స్ | |||||||||||||||||||||||||||||||||||
2020 | ఢిల్లీ క్యాపిటల్స్ | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPN Cricinfo, 4 July 2023 |
అలెక్స్ టైసన్ కారీ (జననం 1991 ఆగస్టు 27) ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో వికెట్ కీపరు. అతను టెస్టు మ్యాచ్, వన్ డే ఫార్మాట్‌లలో ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో, అతను సౌత్ ఆస్ట్రేలియా, అడిలైడ్ స్ట్రైకర్స్ తరపున ఆడతాడు. [2] 2010లో గ్రేటర్ వెస్ట్రన్ సిడ్నీ జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ, 2012లో ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ లీగ్‌లో చేరినప్పుడు, అతన్ని జట్టు నుండి తీసేసారు. అతని స్వస్థలమైన సౌత్ ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చి, అక్కడ దేశీయ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.
కారీ, 2013లో స్పెషలిస్టు టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా రంగప్రవేశం చేసాడు. కానీ విజయవంతం కానందున తీసేసారు. ఆ తరువాత బ్యాటింగు వరుసలో దిగువకు వెళ్ళి, వికెట్ కీపర్‌గా మారాడు. 2023 ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో కారీ సభ్యుడు.
కారీ గతంలో ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్‌బాల్ కూడా ఆడాడు.
ఫుట్‌బాల్ కెరీర్
[మార్చు]యుక్తవయసులో కారీ, ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్‌బాల్, క్రికెట్ రెండూ ఆడాడు. పెద్దయ్యాక, ఉన్నత స్థాయిలో ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించాడు. సౌత్ ఆస్ట్రేలియన్ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (SANFL) రిజర్వ్‌ల పోటీలో గ్లెనెల్గ్ కోసం ఆడాడు. 15. [3] 2008లో, కారీ 2008 AFL అండర్ 18 ఛాంపియన్‌షిప్‌ల కోసం దక్షిణ ఆస్ట్రేలియా జట్టులో చేరాడు గానీ ఆట ఒక్కటి కూడా ఆడలేదు. 2008లో AIS/AFL అకాడమీ ఇన్‌టేక్‌లో కూడా ఉన్నాడు. 2009లో గ్లెనెల్గ్‌తో SANFL రిజర్వ్స్ ప్రీమియర్‌షిప్‌ను గెలుచుకోవడంతో పాటు 2009 AFL అండర్ 18 ఛాంపియన్‌షిప్‌లలో [4] దక్షిణ ఆస్ట్రేలియా తరపున ఆడాడు. [5]
సౌత్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ ఇచ్చిన రూకీ కాంట్రాక్ట్ ఆఫర్‌ను కారీ తిరస్కరించాడు. TAC కప్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ లీగ్ (AFL) కొత్త విస్తరణ క్లబ్ అయిన గ్రేటర్ వెస్ట్రన్ సిడ్నీ జెయింట్స్‌లో చేరడానికి, 2010లో సిడ్నీకి వెళ్లాడు.[5] కారీ కెప్టెన్‌గా, జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. గాయం కారణంగా చివరి నాలుగు రౌండ్‌లకు దూరమైనప్పటికీ, జట్టులో ఉత్తమమైన ఆటగాడు అవార్డును గెలుచుకున్నాడు. [3] [5] [6] అతను నార్త్ ఈస్ట్ ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ లీగ్‌లో, 2011లో వారి కోసం మళ్లీ ఆడాడు. కానీ 2012 సీజన్‌లో వారి ప్రారంభ AFL జట్టులో అతనికి చోటు లభించనందున, అడిలైడ్‌కు తిరిగి వచ్చాడు. [5]
క్రికెట్ కెరీర్
[మార్చు]దేశీయ, T20 కెరీర్
[మార్చు]అడిలైడ్‌కు తిరిగి వచ్చినప్పుడు, అతను మొదట్లో గ్లెనెల్గ్ ఫుట్‌బాల్ క్లబ్‌కు తిరిగి రావాలని అనుకున్నాడు, కానీ అతను ఫుట్‌బల్ నుండి క్రికెట్‌కు మారాలని నిర్ణయించుకున్నాడు. 2012–13 సీజన్‌లో గ్లెనెల్గ్ క్రికెట్ క్లబ్‌తో తిరిగి గ్రేడ్ క్రికెట్‌లోకి వెళ్లాడు. అతను స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా ప్రారంభించాడు. గ్లెనెల్గ్‌కి అన్ని ఫార్మాట్లలో సగటు 50కి దగ్గరగా ఉన్నాడు. [5] అతను న్యూ సౌత్ వేల్స్‌తో జరిగిన రియోబి కప్ మ్యాచ్‌లో లిస్టు A క్రికెట్‌లోకి రంగప్రవేశం చేసాడు. అతను మూడు షీల్డ్ మ్యాచ్‌లు ఆడి, ఆరు బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లలో 10.1 సగటు మాత్రమే సాధించాడు. [5] [7]
2013–14 సీజన్‌లో సౌత్ ఆస్ట్రేలియా క్యారీకి రూకీ కాంట్రాక్ట్ ఇచ్చింది, అయితే అతను సీజన్‌లో రాష్ట్ర జట్టు కోసం ఆడలేదు. టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా అతని వైఫల్యాల తర్వాత, అతను వికెట్ కీపర్‌గా మారాడు. బ్యాటింగ్ ఆర్డరులో దిగువకు వెళ్ళాడు. దీని ఫలితంగా అతను ఫ్యూచర్స్ లీగ్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరపున అనేక మ్యాచ్‌లు ఆడగలిగాడు.[5] అతని బ్రేకౌట్ సీజన్ 2015–16లో వచ్చింది, గ్లెనెల్గ్ కోసం 10 మ్యాచ్‌లలో 90.22 సగటుతో 822 పరుగులు చేశాడు, ఇందులో అడిలైడ్‌పై 195, వెస్టు టోరెన్స్‌పై 151 భారీ స్కోర్లు ఉన్నాయి.[5][6] ఫ్యూచర్స్ లీగ్‌లో, అతను ఐదు మ్యాచ్‌లలో 44.13 సగటు సాధించాడు.[6] అందువల్ల అతను 2015-16 షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో చివరి నాలుగు రౌండ్‌లలో సౌత్ ఆస్ట్రేలియా తరపున ఆడటానికి మళ్లీ అవకాశం దొరికింది. అనుభవజ్ఞుడైన వికెట్-కీపర్ టిమ్ లుడెమాన్ స్థానంలో అతన్ని తీసుకున్నారు.[5] [8]
2016–17 సీజన్ కోసం, కారీకి సౌత్ ఆస్ట్రేలియాతో అతని మొదటి సీనియర్ కాంట్రాక్ట్ లభించింది.[9] క్రిస్ హార్ట్లీ, మాథ్యూ వేడ్, ఆడమ్ గిల్‌క్రిస్టు తర్వాత ఒకే షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో వికెట్ కీపర్‌గా 50 ఔట్‌లు, బ్యాట్‌తో 500 పరుగులు నమోదు చేసిన నాల్గవ ఆటగాడిగా నిలిచాడు.[5] [10] షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్ సమయంలో, టోర్నమెంట్‌లో తన 59వ ఔట్‌ను తీసుకున్నాడు, ఇది ఒకే షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించింది. [11] అతని మెరుగుదల ఫలితంగా 2017 ఆఫ్-సీజన్‌లో ఆస్ట్రేలియా నేషనల్ పెర్ఫార్మెన్స్ స్క్వాడ్‌లోకి అతన్ని తీసుకున్నారు. [12] 2017 దక్షిణాఫ్రికా A కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు ఉద్దేశించిన ఆస్ట్రేలియా A జట్టులో ఏకైక వికెట్ కీపర్‌గా కూడా ఎంపికయ్యాడు. అతను మాజీ టెస్టు కీపర్లు పీటర్ నెవిల్, టిమ్ పైన్ కంటే ముందుగా ఎంపిక చేయబడ్డాడు. వేడ్ గాయపడినట్లయితే ఆస్ట్రేలియన్ టెస్టు జట్టులో మాథ్యూ వేడ్ స్థానంలో అతను తదుపరి వరుసలో ఉన్నాడన్న సూచన అది. [13]
కారీ 2017–18 సీజన్‌ను దక్షిణ ఆస్ట్రేలియా కోసం JLT కప్‌లో ఆడటం ప్రారంభించాడు, అతను ఎలిమినేషన్ ఫైనల్‌లో విక్టోరియాపై 92 పరుగులు చేసి, తన తొలి సెంచరీకి చేరువగా వచ్చాడు. జేక్ వెదర్‌రాల్డ్‌తో కలిసి 212 పరుగులు చేశాడు. ఇది సౌత్ ఆస్ట్రేలియాకు నాల్గవ-అతిపెద్ద వన్డే భాగస్వామ్యం.[14] [15] ఆస్ట్రేలియా A కు ఎంపికయ్యాక కారీ, 2017-18 షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో 2017-18 యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తరపున ఆడటానికి ప్రధాన పోటీదారుగా మారాడు. సీజన్ ప్రారంభానికి ముందు 18 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ, కారీ ఆస్ట్రేలియాలో అత్యుత్తమ యువ వికెట్ కీపర్‌గా పరిగణించబడ్డాడు. [16] అతను మొదటి రెండు మ్యాచ్‌లలో పరుగులు సాధించి, సెలెక్టర్లను మెప్పించే అవకాశం లభించింది.[17] కానీ జట్టును ప్రకటించడానికి ముందు, యాభై పైచిలుకు స్కోరు చేయలేకపోయాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భాగస్వాములందరూ ఔటైపోయి ఒంటరిగా ఉండిపోయాడు. అప్పుడు, అతని బదులు టిమ్ పైన్‌ను జట్టు లోకి తీసుకున్నారు. [18] జాతీయ జట్టులోకి ప్రవేశించలేక పోయినప్పటికీ, క్వీన్స్‌లాండ్‌పై సౌత్ ఆస్ట్రేలియా తరపున 139 పరుగులు చేసి కారీ, తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీని సాధించాడు. [19]
2019 మేలో, ఇంగ్లండ్‌లో జరిగే 2019 t20 బ్లాస్టు టోర్నమెంట్‌లో ఆడేందుకు కారీ సస్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు సంతకం చేసాడు.[20] 2020 IPL వేలంలో, 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కొనుగోలు చేసింది.[21]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]కారీ 2017–18 బిగ్ బాష్ లీగ్ సీజనులో 2018 జనవరి 19న అనారోగ్యంతో ఉన్న టిమ్ పైన్ స్థానంలో ఆస్ట్రేలియా కోసం తన వన్డే ఇంటర్నేషనల్ [22] రంగప్రవేశం చేసాడు. అదే నెలలో, అతను 2018 ఫిబ్రవరిలో ప్రారంభమైన 2017–18 ట్రాన్స్-టాస్మాన్ ట్రై-సిరీస్ కోసం ఆస్ట్రేలియా యొక్క ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో ఎంపికయ్యాడు [23] అతను 2018 ఫిబ్రవరి 3న న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా తరపున తన T20I రంగప్రవేశం చేసాడు [24]
2018 ఏప్రిల్లో, 2018–19 సీజన్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ద్వారా కారీకి జాతీయ కాంట్రాక్టు లభించింది. [25] [26] 2018 మే 8న అతను, ఆస్ట్రేలియా T20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [27] 2019 ఏప్రిల్లో, 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టులో ఎంపికయ్యాడు. అందులో 10 మ్యాచ్‌లలో 375 పరుగులు చేశాడు. స్టీవ్ స్మిత్, ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌ల తర్వాత ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన 4వ ఆటగాడిగా నిలిచాడు. [28] 18 క్యాచ్‌లతో ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను స���టంపౌట్ చేసి మొత్తం 20 అవుట్‌లు చేశాడు. [29] [30] ప్రపంచ కప్ తర్వాత, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి), కారీని జట్టులో వర్ధమాన స్టార్‌గా పేర్కొంది. [31] ఐసిసి వారి 2019 ప్రపంచ కప్ కోసం 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'లో వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. [32]
2020 జూలై 16న, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు శిక్షణ పొందే 26 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాథమిక జట్టులో కారీ పేరును కూడా చేర్చారు. [33] [34] 2020 ఆగస్టు 14న, క్రికెట్ ఆస్ట్రేలియా టూరింగ్ పార్టీలో క్యారీని చేర్చుకోవడంతో మ్యాచ్‌లు జరుగుతాయని ధృవీకరించింది. [35] [36]
కారీ మొదటి రెండు T20I మ్యాచ్‌లలో వికెట్ కీపర్‌గా ఆడాడు. మాథ్యూ వేడ్ కోసం మూడవ మ్యాచ్ నుండి తీసేసారు.[37] కారీ, బ్యాట్స్‌మన్‌గా కొన్ని T20I మ్యాచ్‌లు ఆడినప్పటికీ, వేడ్ మిగిలిన 2020 లోను, 2021 వరకు ఆస్ట్రేలియా యొక్క T20I వికెట్ కీపర్‌గా కొనసాగాడు.
కారీ ఆస్ట్రేలియా వన్‌డే వికెట్ కీపర్‌గా కొనసాగాడు. 2020 ఇంగ్లాండ్ పర్యటనలో మూడు వన్‌డేలు ఆడాడు. టూర్‌లోని మూడవ వన్‌డేలో, 2020 సెప్టెంబరు 16న, కారీ 114 బంతుల్లో 106 పరుగులతో తన తొలి వన్‌డే సెంచరీని సాధించాడు.[38] అతను ఆరో వికెట్‌కు గ్లెన్ మాక్స్‌వెల్‌తో కలిసి 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, ఆస్ట్రేలియాను 3 వికెట్ల తేడాతో గెలిపించాడు.[39][40]
2021 జూలైలో, ఆ సమయంలో మోకాలి గాయంతో బాధపడుతున్న ఆరోన్ ఫించ్ లేకపోవడంతో వెస్టిండీస్‌తో జరిగిన ఆస్ట్రేలియా 1వ వన్‌డేకి కారీని ఆస్ట్రేలియా కెప్టెన్‌గా నియమించారు.[41] ఇప్పటికే వైస్ కెప్టెన్‌గా చేసాక, ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్‌గా కేరీని నియమించడం ఇదే తొలిసారి.[42] అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 133 పరుగుల తేడాతో మొదటి వన్‌డే గెలిచింది. ఈ మ్యాచ్‌లో కారీ 1000 వన్‌డే పరుగులు, 50 వన్‌డే క్యాచ్‌లను కూడా పూర్తి చేశాడు.[43]
2021–22 యాషెస్ సిరీస్‌లో 2021 డిసెంబరు 8న మొదటి టెస్ట్‌లో కారీ, తన టెస్టు రంగప్రవేశం చేశాడు. టిమ్ పైన్ టెస్టు జట్టు నుండి వైదొలిగిన తర్వాత, సిరీస్‌లోని మొదటి రెండు టెస్టులకు అతను వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. [44] కారీ బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను ఆడమ్ గిల్‌క్రిస్టు అతనికి అందించాడు. ఆ మ్యాచ్‌లో ఎనిమిది క్యాచ్‌లు తీసుకుని కారీ, తొలి టెస్టు లోనే అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్ రికార్డును సమం చేశాడు. [45] 2022 లో ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ పర్యటనలో ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికై, 3 టెస్టులు, 3 వన్‌డేలు ఆడాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కారీ 43 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా రెండోసారి బ్యాటింగ్ చేయకపోవడంతో మ్యాచ్ డ్రా అయింది.[46] రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో, కారీ 159 బంతుల్లో 93 పరుగులు చేసి, పాక్ కెప్టెన్ బాబరు ఆజం బౌలింగ్‌లో అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో క్యారీ బ్యాటింగ్ చేయకపోవడంతో మ్యాచ్ డ్రా అయింది. [47] ఇది అతని అత్యధిక స్కోరు. మునుపటి ఆస్ట్రేలియన్ కెప్టెన్, వికెట్ కీపర్ టిమ్ పైన్ చేసిన స్కోరు కంటే ఒక పరుగు ఎక్కువ. [48] మూడవ, చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కారీ, 105 బంతుల్లో 67 పరుగులు చేసి ఆస్ట్రేలియా స్కోరు 391 పరుగులకు చేరుకోవడంలో సహాయపడ్డాడు. కారీ రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు. ఆస్ట్రేలియా 115 పరుగుల తేడాతో మ్యాచ్‌ను, 3 మ్యాచ్‌ల సిరీస్‌నూ 1-0తో గెలుచుకుంది. [49] కారీ 3 ఇన్నింగ్స్‌లలో 179 పరుగులతో, అత్యధిక స్కోరు 93 తో, 59.66 సగటుతో టెస్టు సిరీస్‌ను ముగించాడు. ఇది ఆస్ట్రేలియా తరఫున రెండవ అత్యధికం. [50]
2022 డిసెంబరులో, దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో కారీ తన తొలి టెస్టు సెంచరీ సాధించాడు. [51] MCGలో రాడ్ మార్ష్ తర్వాత, సెంచరీ చేసిన రెండవ వికెట్ కీపరతడు. 2013 లో బ్రాడ్ హాడిన్ చేసిన తరువాత, మళ్ళీ టెస్టు సెంచరీ చేసిన మొదటి ఆస్ట్రేలియన్ వికెట్ కీపరు కూడా.[52]
2023లో, లార్డ్స్‌లో జరిగిన యాషెస్ టెస్టులో వివాదాస్పద రీతిలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టోను స్టంపింగు చేసినపుడు కారీ విమర్శలకు గురయ్యాడు. ఈ కథ UK ప్రెస్‌లో విస్తృతంగా మొదటి పేజీలలో వచ్చింది. [53] కీపరు బంతిని తీసుకున్నాక, బాల్ లైవ్‌లో ఉండగానే, బాల్ డెడ్ అయిందని అనుకుని బెయిర్‌స్టో, క్రీజ్ నుండి బయటికి నడిచాడు. మునుపటి డెలివరీలలో కూడా జానీ అలా చెయ్యడాన్ని కారీ గుర్తించాడు. బంతిని పట్టుకున్న వెంటనే వికెట్ కీపర్ స్థానం నుండి అతని స్టంప్‌లను పడేసాడు. నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌ను అడిగారు. ఆట యొక్క చట్టాలకు అనుగుణంగా ఔట్ ఇచ్చారు. [54]
మూలాలు
[మార్చు]- ↑ Sellar, Lachlan (11 September 2017). "The rise and rise of Alex Carey". South Australian Cricket Association. Archived from the original on 8 డిసెంబరు 2021. Retrieved 8 December 2021.
- ↑ "Alex Tyson Carey". ESPNcricinfo. ESPN Inc. Retrieved 29 November 2017.
- ↑ 3.0 3.1 Ramsey, Andrew (23 September 2017). "Carey's crushed AFL hopes pave new path". Cricket.com.au. Cricket Australia. Retrieved 29 November 2017.
- ↑ McCartney, Jason (27 May 2009). "NAB AFL U18 titles: the Division One guns". AFL.com.au. Bigpond. Retrieved 29 November 2017.
- ↑ 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 Sellar, Lachlan (11 September 2017). "The rise and rise of Alex Carey". SACA.com.au. South Australian Cricket Association. Archived from the original on 1 December 2017. Retrieved 29 November 2017.
- ↑ 6.0 6.1 6.2 "Alex Carey". Cricket.com.au. Cricket Australia. Retrieved 29 November 2017.
- ↑ Earle, Richard (24 March 2017). "Former GWS Giant Alex Carey hoping to claim Shield glory". The Advertiser. News Corp Australia. Retrieved 29 November 2017.
- ↑ Jolly, Laura (22 February 2016). "Siddons puts Redbacks players on notice". Cricket.com.au. Cricket Australia. Retrieved 29 November 2017.
- ↑ "Cosgrove and Cooper cut by South Australia". ESPNcricinfo. ESPN Inc. 15 April 2016. Retrieved 29 November 2017.
- ↑ Coverdale, Brydon (28 March 2017). "Holland takes seven as Victoria remain on top". ESPNcricinfo. ESPN Inc. Retrieved 29 November 2017.
- ↑ Coverdale, Brydon (29 March 2017). "Alex Carey breaks wicketkeeping record". ESPNcricinfo. ESPN Inc. Retrieved 29 March 2017.
- ↑ Brettig, Daniel (19 April 2017). "Carey, Labuschagne, McDermott among NPS intake". ESPNcricinfo. ESPN Inc. Retrieved 29 November 2017.
- ↑ Ferris, Sam (22 May 2017). "Carey on the cusp of national call-up". Cricket.com.au. Cricket Australia. Retrieved 29 November 2017.
- ↑ Earle, Richard (20 October 2017). "Redbacks skipper Travis Head says keeper Alex Carey is right in the mix for an Ashes Test debut". The Advertiser. News Corp Australia. Retrieved 8 December 2017.
- ↑ Earle, Richard (19 October 2017). "JLT Cup: South Australia overwhelm Victoria to storm into Cup final". The Advertiser. News Corp Australia. Retrieved 8 December 2017.
- ↑ Horne, Ben (8 September 2017). "The Ashes 2017-18: South Australia keeper Alex Carey enters selection fray as Matthew Wade's star dims". The Daily Telegraph. News Corp Australia. Retrieved 8 December 2017.
- ↑ Lalor, Peter (20 October 2017). "Alex Carey: the Test keeper in waiting you've never heard of". The Australian. News Corp Australia. Retrieved 8 December 2017.
- ↑ Earle, Richard (22 November 2017). "South Australia coach Jamie Siddons says Tim Paine's Ashes resurrection could give hope to Callum Ferguson". The Advertiser. News Corp Australia. Retrieved 8 December 2017.
- ↑ "SA bowlers leave Queensland reeling after Carey's maiden ton". ESPN Cricinfo. 4 December 2017. Retrieved 4 December 2017.
- ↑ "Sussex sign Australia's Alex Carey for Vitality Blast". ESPN Cricinfo. Retrieved 30 May 2019.
- ↑ "IPL auction analysis: Do the eight teams have their best XIs in place?". ESPN Cricinfo. 20 December 2019. Retrieved 20 December 2019.
- ↑ Cameron, Louis (19 January 2018). "Carey to debut in place of ill Paine". Cricket Australia. Retrieved 19 January 2018.
- ↑ "Richardson, Holland in Australia squad for South Africa Tests". International Cricket Council. Retrieved 22 January 2018.
- ↑ "1st Match (N), Twenty20 Tri Series at Sydney, Feb 3 2018". ESPN Cricinfo. Retrieved 22 January 2018.
- ↑ "Carey, Richardson gain contracts as Australia look towards World Cup". ESPN Cricinfo. Retrieved 11 April 2018.
- ↑ "Five new faces on CA contract list". Cricket Australia. Retrieved 11 April 2018.
- ↑ "Paine to captain Aussies in ODIs | cricket.com.au". Archived from the original on 29 June 2018. Retrieved 8 May 2018.
- ↑ "ICC Cricket World Cup, 2019 - Australia Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-07-18.
- ↑ "Smith and Warner make World Cup return; Handscomb and Hazlewood out". ESPN Cricinfo. 15 April 2019. Retrieved 15 April 2019.
- ↑ "Smith, Warner named in Australia World Cup squad". International Cricket Council. Retrieved 15 April 2019.
- ↑ "CWC19 report card: Australia". International Cricket Council. Retrieved 12 July 2019.
- ↑ "CWC19: Team of the Tournament". www.icc-cricket.com.
- ↑ "Usman Khawaja and Marcus Stoinis in expanded Australia training squad for possible England tour". ESPN Cricinfo. Retrieved 16 July 2020.
- ↑ "Aussies name huge 26-player group with eye on UK tour". Cricket Australia. Retrieved 16 July 2020.
- ↑ "Riley Meredith, Josh Philippe and Daniel Sams included as Australia tour to England confirmed". ESPN Cricinfo. Retrieved 14 August 2020.
- ↑ "Uncapped trio make Australia's UK touring party". Cricket Australia. Retrieved 14 August 2020.
- ↑ Mitch Marsh digs deep to salvage pride for Australia, and the No.1 ranking, ESPNcricinfo, 09-Sep-2020
- ↑ "Carey dispels doubts with pressure-filled maiden ton". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 2021-07-21.
- ↑ "Full Scorecard of England vs Australia 3rd ODI 2020 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-07-21.
- ↑ "Glenn Maxwell, Alex Carey turn tide to seal thrilling series for Australia". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-07-21.
- ↑ "Alex Carey to captain Australia in opening ODI after Finch ruled out | Cricbuzz.com". Cricbuzz (in ఇంగ్లీష్). 20 July 2021. Retrieved 2021-07-20.
- ↑ "Alex Carey to captain Australia after Aaron Finch ruled out". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-07-20.
- ↑ "Mitchell Starc's five blows West Indies away to give Alex Carey winning start". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-07-21.
- ↑ "Alex Carey comes into Australia's 15-man Ashes squad, replacing Tim Paine, confirmed to keep at the Gabba - ABC News". amp.abc.net.au. Retrieved 2021-12-02.
- ↑ "Carey makes record-breaking start to Test career".
- ↑ "Full Scorecard of Pakistan vs Australia 1st Test 2021/22 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-07-18.
- ↑ "Full Scorecard of Australia vs Pakistan 2nd Test 2021/22 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-07-18.
- ↑ "Tim Paine profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo. Retrieved 2022-07-18.
- ↑ "Full Scorecard of Australia vs Pakistan 3rd Test 2021/22 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-07-18.
- ↑ "Benaud-Qadir Trophy, 2021/22 - Australia Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-07-18.
- ↑ Cameron, Louis. "Carey follows in Marsh's MCG footsteps with maiden ton". cricket.com.au. Retrieved 28 December 2022.
- ↑ Cameron, Louis. "Carey follows in Marsh's MCG footsteps with maiden ton". cricket.com.au. Cricket Australia. Retrieved 28 December 2022.
- ↑ "Newspaper headlines: Banks free speech warning and 'strikes until 2025'". BBC News. 3 July 2023.
- ↑ "Explained: When does a ball become dead?". 3 July 2023.