Jump to content

అమెరికా అధ్యక్ష ఎన్నికలు

వికీపీడియా నుండి

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆ దేశపు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు జరిగే పరోక్ష ఎన్నికలు. ఈ ఎన్నికల్లో అమెరికాలోని 50 రాష్ట్రాల్లో, వాషింగ్టన్, డి.సి.ల్లో ఎక్కడైనా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారు ప్రత్యక్షంగా కాకుండా ఎలక్టోరల్ కాలేజీకి సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఎలక్టర్స్ ఎలక్టోరల్ ఓట్ల ద్వారా అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ వోట్లలో పూర్తి మెజారిటీ సాధించిన వారు (ప్రస్తుతం 538 కి గాను 270) ఆఫీసుకు ఎన్నికవుతారు. ఏ అభ్యర్థి మెజారిటీ సాధించకపోతే హౌస్ ఆఫ్ రెప్రెజెంటేటివ్స్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అలాగే ఉపాధ్యక్ష పదవికి కూడా ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోతే సెనేట్ సభ్యులు ఉపాధ్యక్షుడిని ఎంపిక చేస్తారు.

చరిత్ర

[మార్చు]

ఎలక్టోరల్ కాలేజ్

[మార్చు]

అమెరికా రాజ్యాంగంలోని రెండవ అధికరణం మొదటగా ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేయడంతో పాటుగా, అధ్యక్ష ఎన్నికల పద్ధతిని ఏర్పాటు చేసింది. రాజ్యాంగ నిర్మాతలు అధ్యక్షుడిని కాంగ్రెస్ ఎన్నుకోవాలని కోరుకున్నారు. ఇంకొంతమంది ప్రజా ఓటు ద్వారా ఎన్నుకోవాలని అన్నారు. ఆ రెండింటి మధ్యే మార్గమే ప్రస్తుత పద్ధతి.[1]

రాజకీయ పార్టీలు

[మార్చు]

అమెరికా రాజ్యాంగంలో తొలుత రాజకీయ పార్టీలకు స్థానం లేదు. ఎందుకంటే ఆ దేశపు రాజ్యాంగ నిర్మాతలకు పార్టీలు ప్రజలను వివిధ వర్గాలగా విడగొట్టడం ఇష్టం లేదు. ఆ దేశపు మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. తర్వాత 1796 లో వాషింగ్టన్ వారసుడు జాన్ ఆడమ్స్ ఎన్నుకునే సమయంలో అమెరికాలో రెండు పార్టీల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచీ విజేతలు ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీకి చెందిన వారే ఎన్నికవుతూ ఉన్నారు.[2][3] 1860 లో ఒకసారి, 1912 లో ఒకసారి మాత్రమే తృతీయ పక్షాలు మెజారిటీ సాధించాయి.

మూలాలు

[మార్చు]
  1. Bugh, Gary (2010). Electoral College Reform: Challenges and Possibilities. Ashgate Publishing, Ltd. p. 40. ISBN 978-0-7546-7751-2. Archived from the original on October 3, 2021. Retrieved November 21, 2015.
  2. Richard Hofstadter, The Idea of a Party System: The Rise of Legitimate Opposition in the United States, 1780–1840 (1970)
  3. Gordon S. Wood, Empire of Liberty: A History of the Early Republic, 1789–1815 (Oxford History of the United States)