అగస్త్యేశ్వరస్వామి ఆలయం
అగస్త్యేశ్వర స్వామి ఆలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E |
పేరు | |
ప్రధాన పేరు : | అగస్త్యేశ్వర స్వామి ఆలయం |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా: | తూర్పు గోదావరి |
ప్రదేశం: | రాజమహేంద్రవరం, ధవళేశ్వరం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | అగస్త్యేశ్వర స్వామి ఆలయం |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఒకటి |
అగస్త్యేశ్వర స్వామి ఆలయం తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, ధవళేశ్వరం వెలిసారు.
ఆలయ చరిత్ర
[మార్చు]ఈ స్వా���ి వారు త్రేతాయుగంలో వెలిసారు.పూర్వం ఇక్కడ దండకారణ్యంలో, వాతాపిపురంలో వాతాపి, ఇల్వలుడు అనే రాక్షసులను సంహరించి బ్రహ్మహత్యాపాతకానికి గురయిన అగస్త్యుడు ఈశ్వరలింగములను అయిదు చోట్ల ప్రతిష్ఠించిన తరువాత ఈ దవళగిరికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. కృతయుగం గడిచిపోయాక, త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుడుని సంహరించాడు. రావణుడు లక్షణాలతో రాక్షసుడు. బ్రహ్మవంశ సంజాతుడు కావడం వలన రాముడుకి బ్రహ్మహత్యా దోషం రావడంతో నివారణకు ఎన్ని క్షేత్రాలలో శివలింగములను ప్రతిష్ఠించినా, ఆ పాపవిముక్తి పోలేదు.
ఆ సందర్భంలోనే రామేశ్వరంలో శివలింగమును ప్రతిష్ఠించాలని ఆంజనేయ స్వామిని కాశీపంపారు. కాశీలో నుండి శక్తివంతమయిన శివలింగమును తీసుకుని వచ్చాడు. ఆంజనేయుడు ఎక్కడా ఆగకుండా శివలింగమును తీసుకోస్తున్నాడు అడవిలో తపస్సు చేసుకుంటున్న అగస్త్యుడు శివలింగమును తెస్తున్న ఆంజనేయుడ్ని చూసి, ఇక్కడ తన ఆతిధ్యం తీసుకుని కొంత సేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళమని కోరాడు. అందుకు ఆంజనేయుడు అంగీకరించలేదు.
అగస్త్యుడు కచ్చితంగా కొద్దిసేపు అయినా ఆతిధ్యం తీసుకోవాలన్నాడు. ఆంజనేయుడు దిగి అగస్త్య మహర్షి ఆతిథ్యం తీసుకుని, మాటల్లో మరిచిపోయి శివలింగమును క్రిందపెట్టాడు. అది ఈశాన్యం వైపు ఏటవాలుగా పెట్టడంతో అలాగే ప్రతిష్ఠ జరిగిపోయింది. తరువాత ఇద్దరూ ఎంత పెకలించినా లింగముపైకి రాలేదు. వెంటనే ఆంజనేయుడు కాశీ బయలుదేరి మరో లింగమును తీసుకొచ్చాడు. అయితే రామేశ్వరంలో విగ్రహ ప్రతిష్ఠ సమయందాటి పోవడంతో ఆంజనేయుడు ఎంతసేపటికి రాకపోవడంతో సీతాదేవి ఇసుకతో శివలింగం చేయడం ప్రతిష్ఠ చేయడం జరిగింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఎన్. ఎస్, నాగిరెడ్డి (2003). తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి.