శివరామ కారంత
శ్రీ కోట శివరామ కారంత | |
శివరామ కారంత్ | |
జననం: | అక్టోబరు 10,1902 సాలిగ్రామ, ఉడ్పి జిల్లా |
---|---|
మరణం: | డిసెంబరు 9,1997 మణిపాల, ఉడిపి |
వృత్తి: | రచయిత |
జాతీయత: | భారతీయుడు |
రచనా కాలము: | () |
శైలి: | కథ, కవిత్వం, నవలలు,నాటక రచన |
Subjects: | కర్నాటక,జీవనం |
Literary movement: | నవోదయ |
తొలి కృతి: | (ಮೊದಲ ಪ್ರಕಟಿತ ಕೃತಿ/ಗಳು) |
ప్రభావితులు: | పూర్ణచంద్ర తేజస్వి |
సంతకం: | దస్త్రం:Karant-sign.jpg |
వెబ్సైటు: | http://shivaramkarantha.in/ |
(ఇతరాలు) |
శివరామ కారంత కన్నడ సాహిత్యవేత్త, కవి, కావ్య రచయిత. కడలతీరద భార్గవ (ಕಡಲತೀರದ ಭಾರ್ಗವ), నడెదాడువ (నడిచే) విశ్వకోశ (ನಡೆದಾಡುವ ವಿಶ್ವಕೋಶ) అని కన్నడ దేశంలో పేరెన్నిక గన్న గొప్ప వక్త. భారత జ్ఞానపీఠ పురస్కారం పొందిన సాహిత్యవేత్త.
జననం-జీవనం
[మార్చు]శివరామ కారంత తండ్రి శష కారంత్, తల్లి లక్ష్మి.తల్లిదండ్రులకు కారంత్ ఐదవ సంతానం.శివకారంత్ అన్న రామకృష్ణ కారంత్ ప్రముఖ లాయరు, రాజకీయవేత్త[1] శివరామ కారంత కర్నాటకలోని ఉడిపిజిల్లాలోని కోట అనే గ్రామంలో 1902లో, అక్టోబరు 10న జన్మించాడు. 96 సంవత్సరాల పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన ఒక సంపూర్ణ మహనీయుడు.డా.శివరామ కారంత 1997, డిసెంబరు 19న మరణించారు.[2] కారంత తన జీవితకాలంలో 427 పుస్తకాలను రచించాడు.అందులో కావ్యాలు 47.కారంత తన 96 వ ఏట పక్షులమీద ఒక పుస్తకం వ్రాసారు.మనస్సు, పట్టుదలవుంటే వయస్సు కావ్యరచనకు ఆటంకం కాబోధని చాటి చెప్పాడు. శివరామ కారంత్ గారు కేవలం సాహిత్యానికే తనను పరిమితం చేసుకోలేదు.ఇతర లలితకళలలో కూడా తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు.కర్నాటకలోని ప్రసిద్ధ నాట్యకళ అయిన యక్షగానాన్ని పరిరక్షించుటకై తానే స్వయంగా కొన్ని ప్రయోగాలు చేసి చూపించాడు. కారంత్ గారు స్వయంగా నాట్యం నేర్చుకొని బ్యాలె ప్రదర్శనలో గంభిత ప్రయోగాలు చేశారు.కారంత్ కొన్ని నిర్ధిస్టమైన సామాజిక దృక్పధం ఉంది.అయన వేశ్యా వివాహాలు జరిపించాడు. యక్షగాన నాట్య సంఘాలను ఏర్పరచి దేశ విదేశాలలో ప్రదర్శనలు చేయించాడు.పిల్లల్లో కళలపట్ల అభిరుచి, అనురక్తి పెంచి వారి ప్రతిభను మెరగు పరచుటకు పుత్తురులో బాలవనఅనే పేరుతో ఒక శిక్షణ సంస్థను ఏర్పరచాడు.పుత్తూరులో ఒక ముద్రాణాలయాన్ని ప్రారంభించి, తనరచనలను అందులో అచ్చువెసేవాడు.అంతేకాదు తన రచించిన పుస్తకాలకు/గ్రంధాలకు ముఖచిత్రాన్ని తానే గీసెవాడు.తమ రచనలకు తామే ముఖచిత్రాన్ని రూపొందించేరచయితలు అరుదుగా వుంటారు, శివరామ కారంత అందులో ప్రథముడు.
కన్నడ చిత్రరంగంలో కూడా శివరామ కారంత తన ప్రతిభను చాటుకున్నాడు.కన్నడ చిత్రరంగంలో ఆయన ప్రవేశం ఒక మూకీ సినిమాను చిత్రించడంతో మొదలైనది.హరిజన జీవితం (ప్రస్తుతం దళితులని వ్యవహరిస్తున్నారు) ఆధారంగా డొమింగోఅనే పేరుతో ఒక కన్నడ మూకీ సినిమాని 1930 లో నిర్మించారు/చిత్రికరించారు.ఈ చిత్రంలో అభినయనంతో పాటు దర్శక బాధ్యత కూడా నిర్వర్తించారు.పిమ్మట భూతరాజ్య అనే మూకీసినిమాను (1930) ని కూడా నిర్మించారు.కేవలం కావ్యరచన యందే కాకుండగా కారంత్ గారికి పరిసర పరిరక్షణకు కూడా తన జీవితంలో తగిన ప్రాముఖ్యత ఇచ్చాడు.తన కవిత్వంలో పరిసర చిత్రికరణ/ప్రస్థాపన పాఠకులకు స్పష్టంగా తెలుస్తుంది.కైగా అణువిద్యుత్తు స్థావరణ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళనకు నాయకత్వం వహించాడు.చిన్నపిల్లలనుంది వయోవృద్ధులవరకు అవసరమైన సాహిత్యాన్ని కన్నడ జనావళికి అందించాడు.
ఈయనకు జ్ఞానపీఠ, పద్మభూషణమరియు నాడోజ పురస్కారం ప్రధానం చేసి గౌరవించారు.ఎనిమిది విశ్వవిద్యాలయాలనుండి కారంతు గౌరవ డాక్టరేట్ లు పొందాడు. ఇతడు 1955లో మైసూరులో జరిగిన 37వ కన్నడ సాహిత్య సమ్మేళనానికి అధ్యక్షత వహించాడు.
స్మారక నిలయం
[మార్చు]సాలిగ్రామ అనే గ్రామంలో శివరామ కారంతర పేరుమీద ఒక స్మారక వస్తుసంగ్రహాలయం (museum) ను కట్టినారు.ఈ నిలయంలో కారంతకు చెందిన అనేక వస్తువులను సంగ్రహించి, సందర్శనకై వుంఛారు.ఇందులో యక్షగాన ప్రదర్శనకై ఉపయోగించినవి, పాత కావ్యసంచికలు, ఆయన వేసిన చిత్రాలు తదితరళు, ఆయన ఉపయోగించిన లేఖిని/కలం వంటివి అనేకం ఉన్నాయి.
శివరామ కారంత కలంనుండి జాలు వారిన రచనలు
[మార్చు]శివరామ కారంత్ గారి సాహిత్య రచన బహుముఖమైనది, విస్తృతమైనది.ఆయన రచనావైశిష్టం ప్రత్యేకంగా ఒక విషయానికి మాత్రమే పరిమితం కాలేదు.ఆయన పద్యకావ్యాలు, నవలలు, చిన్నపిల్లల సాహిత్యం, నాటకంలు, చిన్నకతలు, ప్రవాస కథలు, కళాప్రభంధాళు, ఆత్మకథనం, వైజ్ఞానిక వ్యాసాలు, విశ్వకోశం, నిఘంటువు వ్రాసాడు[3]
కవనం
[మార్చు]- రాష్ట్రగీత సుధాకర (ರಾಷ್ಟ್ರಗೀತ ಸುಧಾಕರ)
- సీళ్గవనగళు (ಸೀಳ್ಗವನಗಳು)
నవలలు(ಕಾದಂಬರಿ)
[మార్చు]- అదేఊరు, అదె మర (ಅದೇ ಊರು, ಅದೆ ಮರ)
- అళిదె మేలె (ಅಳಿದ ಮೇಲೆ)
- అంటిద అపరంజి (ಅಂಟಿದ ಅಪರಂಜಿ)
- ఆళ, నిరాళ (ಆಳ, ನಿರಾಳ)
- ఇద్దరూ చింతె (ಇದ್ದರೂ ಚಿಂತೆ)
- ఇన్నోందే దారి (ಇನ್ನೊಂದೇ ದಾರಿ)
- ఇళెయెంబ (ಇಳೆಯೆಂಬ)
- ఉక్కిద నూరె (ಉಕ್ಕಿದ ನೊರೆ)
- ఒడ హుట్టిదవరు (ಒಡ ಹುಟ್ಟಿದವರು)
- ఒంటి దని (ಒಂಟಿ ದನಿ)
- ఔదార్యద ఉరుళల్లి (ಔದಾರ್ಯದ ಉರುಳಲ್ಲಿ)
- కళ్ళిద్దరూ కాణరు (ಕಣ್ಣಿದ್ದೂ ಕಾಣರು)
- కన్నడియల్లి కండాత (ಕನ್ನಡಿಯಲ್ಲಿ ಕಂಡಾತ)
- కన్యాబలి (ಕನ್ಯಾಬಲಿ)
- కరుళిన కరె (ಕರುಳಿನ ಕರೆ)
- కుడియర కూసు (ಕುಡಿಯರ ಕೂಸು) చలనచిత్రంగాతీసారు.
- కేవల మనుష్యరు (ಕೇವಲ ಮನುಷ್ಯರು)
- గెద్ద దొడ్డస్తికె (ಗೆದ್ದ ದೊಡ್ಡಸ್ತಿಕೆ)
- గొండారణ్య (ಗೊಂಡಾರಣ್ಯ)
- చిగురిద కనసు (ಚಿಗುರಿದ ಕನಸು) చలనచిత్రంగాతీసారు
- చోమన దుడి (ಚೋಮನ ದುಡಿ) చలన చిత్రంగా రూపొందించారు
- జగదోద్ధర నా (ಜಗದೋದ್ಧಾರ ನಾ)
- జారువ దారియల్లి (ಜಾರುವ ದಾರಿಯಲ್ಲಿ)
- దేవదూతరు (ದೇವದೂತರು)
- ధర్మరాయన సంసార (ಧರ್ಮರಾಯನ ಸಂಸಾರ)
- నష్టదిగ్గజగళు (ನಷ್ಟ ದಿಗ್ಗಜಗಳು)
- నంబిదవర నాక, నరక (ನಂಬಿದವರ ನಾಕ, ನರಕ)
- నావు కట్టిద స్వర్గ (ನಾವು ಕಟ್ಟಿದ ಸ್ವರ್ಗ)
- నిర్భాగ్య జన్మ (ನಿರ್ಭಾಗ್ಯ ಜನ್ಮ)
- బత్తద తొరె (ಬತ್ತದ ತೊರೆ)
- బెట్టద జీవ (ಬೆಟ್ಟದ ಜೀವ) చలన చిత్రంగా తీసారు.
- భూత (ಭೂತ)
- మరళి మణ్ణిగె (ಮರಳಿ ಮಣ್ಣಿಗೆ) [4]
- ముగిద యుద్ధ (ಮುಗಿದ ಯುದ್ಧ)
- మాకజ్జియ కనసుగళు (ಮೂಕಜ್ಜಿಯ ಕನಸುಗಳು)
- మాజన్మ (ಮೂಜನ್ಮ)
- మై మనగళ సుళియల్లి (ಮೈ ಮನಗಳ ಸುಳಿಯಲ್ಲಿ)
- మూగ పడెద మన (ಮೊಗ ಪಡೆದ ಮನ)
- విచిత్రకూట (ವಿಚಿತ್ರ ಕೂಟ)
- శనీశ్వరన నెరళినల్లి (ಶನೀಶ್ವರನ ನೆರಳಿನಲ್ಲಿ)
- సన్యాసియ బదుకు (ಸನ್ಯಾಸಿಯ ಬದುಕು)
- సమీక్షె (ಸಮೀಕ್ಷೆ)
- సరసమ్మన సమాధి (ಸರಸಮ್ಮನ ಸಮಾಧಿ)
- స్వప్నద హొళె (ಸ್ವಪ್ನದ ಹೊಳೆ)
- హెత్తాళా తాయి (ಹೆತ್ತಳಾ ತಾಯಿ)
నాటకములు
[మార్చు]- అవళి నాటకగళు
- ఏకాంక నాటకగళు
- ఐదు నాటకగళు
- కట్టె పురాణ
- కథారి భైరవ
- కర్ణార్జున
- కీఛక సైరంధ్రి
- గర్భగుడి
- గీత నాటకాలు
- జంబద జానకి
- జ్యూలియస్ సీజరు
- దుమింగొ
- దృష్టి సంగమ
- నవీన నాటకాలు
- నారద గర్వభంగ
- బిత్తిద బెళె
- బెవరిగె జయవాగలి
- బౌద్ధయాత్రా
- మంగలారతి
- ముక్తద్వార
- యారొ అందరు
- విజయ
- విజయ దశమి
- సరళ విరళ నాటకాలు
- సావిర మిలియ
- హణె బరహ
- హిరియక్కన చాళి
- హేగాదరేను
- హేమంత
చిన్న కతలు
[మార్చు]- కవికర్మ
- తెరెయ మరెయల్లి
- హసివు
- హావు
వ్యంగపూరిత రచనలు
[మార్చు]- గ్నాన
- చిక్కదొడ్డవరు
దేహజ్యోతిగళు మత్తు ప్రాణి ప్రబంధగళు
- మైగళ్ళన దినచరియింద
- మైలికల్లినొడనె మాతుకతెగళు
- హళ్లియ హత్తు సంస్తరు
ప్రవాసకథలు
[మార్చు]- అపూర్వ పశ్చిమ
- అరసికరల్ల
- అబూవినింద బరమక్కె
- పాతాళక్కె పయన
- పూర్వదింద అత్యపూర్వక్కె
- యక్షరంగక్కాగి ప్రవాస
అత్మకథ
[మార్చు]- స్మృతి పటలదింద (1.2.3 భాగాలు)
- హుచ్చుమనస్సిన హత్తు ముఖగళు
విజ్ఞానికి సంబంధించిన రచనలు
[మార్చు]- అద్భుత జగత్తు (1.విచిత్రఖగోల,2.నమ్మభూఖండగళు)
- ఉష్ణవలయద అగ్నేస్య
- ప్రాణిప్రపంచద విస్మయగళు
- మంగన కాయిలె
- విజ్ఞఆన మత్తు అంధశృద్ధె
- విశాల సాగరగళు
- హిరియ కిరియ హక్కిగళు
కళా ప్రబంధ రచనలు
[మార్చు]- కలెయ దర్శన
- కర్నాతకదల్లి చిత్రకలె
- చాలుక్య వాస్తు మత్తు శిల్ప
- చిత్ర, శిల్ప, వాస్తుకలెగళు
- జానపదగోతెగళు
- భారతీయచిత్రకలె
- భారతీయశిల్ప
- యక్షగాన బయలాట
- సౌందర్య ప్రజ్ఞయన్ను బెళెసలు
విశ్వకోశం
[మార్చు]- కలాప్రపంచ
- ప్రాణిప్రపంచ
- బాలప్రపంచ (1.2.3 సంపుటాలు)
- విజ్ఞాన ప్రపంచ (1.2.3.4 సంపుటాలు)
ఆంగ్లంలో సాహిత్య రచనలు
[మార్చు]- Folk Art of Karnataka
- Karnataka Paintings
- My Concern for Life, Literature and Art
- Picturesque South Kanara
- Yakshagana
- జ్ఞానపీఠ ప్రశస్తి
- పద్మభూషణ ప్రశస్తి
- రావ్ బహదూర్ ప్రశస్తి
- పంప పురస్కారం
- వివిధ విద్యాలయాలనుండి డాక్టరేటు బిదురులు.
బయటి లింకులు
[మార్చు]- Balavana Archived 2013-09-05 at the Wayback Machine
- శివరామ కారంత్. మరణానంతరం (in telugu).
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)(గతంలో DLI లో వుండేది)
ఉల్లేఖనలు
[మార్చు]- ↑ "The Popular Novelist – K. Shivarama Karanth". karnataka.com. Retrieved 2014-02-22.
- ↑ "Kota Shivarama Karanth". goodreads.com. Retrieved 2014-02-22.
- ↑ "Writings". karanthabalavana.com. Archived from the original on 2013-09-07. Retrieved 2014-02-22.
- ↑ "Indian Literature > Vol. 5, No. 2, 1962 > Sivarama Karanth's '..." jstor.org/discover. Retrieved 2014-02-22.
- ↑ "Awards". karanthabalavana.com. Archived from the original on 2013-09-07. Retrieved 2014-02-22.
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- CS1 maint: unrecognized language
- జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- కన్నడ రచయితలు
- 1902 జననాలు
- 1997 మరణాలు
- కర్��ాటక రచయితలు