Jump to content

శిలాశాసనం

వికీపీడియా నుండి
తెలుగు శాసనాలు
విష్ణుకుండినులు
తూర్పు చాళుక్యులు
పశ్చిమ చాళుక్యులు
రాష్ట్రకూటులు
ఇతర వంశములు
సామ్రాజ్య చోళులు
కాకతీయులు
రెడ్డి రాజులు
రేచర్ల రెడ్లు
రేనాటి చోళులు
వైడుంబులు
చిందులు
తూర్పు గాంగులు
గజపతులు
కుతుబ్‌షాహీలు
మొఘల్‌ సామ్రాజ్యము
సూచిక I
సూచిక II

శిలాశాసనం (ఆంగ్లం : Epigraphy "ఎపీగ్రఫీ" లేదా "inscription" ఇన్‌స్క్రిప్షన్ ) అనగా పురాతన కాలంలో రాయి, రాగిరేకు వంటి వాటిపై వ్రాసిన అక్షరాలు. పురాతన కాలంలో అనగా కాగితం, కాగితంతో తయారు చేసిన గ్రంథాలు ఉపయోగించని కాలంలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, జమీందారులు మొదలగువారు, తమ రాజ్యపు అధికారిక శాసనాలను "రాళ్ళ"పై, రాతి బండలపై, రాగి రేకులపై చెక్కించి, బహుకాలపయోగం కొరకు భద్రపరచేవారు. ఇలాంటి అధికారిక ప్రకటనలకే శాసనం అనేవారు. ఉదాహరణకు "శిలాశాసనం", అంటే శిలపై చెక్కించిన శాసనం. ఈ శాసనాలన్నీ ప్రస్తుతం భారత పురాతత్వ శాఖ వారి ఆధ్వర్యంలో గలవు.ఇలాంటి శాసనాలకు భారతలో ఉదాహరణలు:అశోకుడి (శిలా) శాసనం.

శిలాశాసనాలను అచ్చుతీసుకునే పద్దతి

[మార్చు]

ఎస్టాంపేజి (Estampage) శాసనంలో వున్న అక్షరాలను యధాతదంగా అదే పరిమాణంలో అదే వరసల్లో అచ్చంగా అచ్చుతీసుకునే పద్దతి ఇది. ఇప్పటి వరకూ ఆర్కియాలజీ డిపార్ట్మంట్ కూడా అధికారికంగా వాడుతున్న పద్దతి ఇది. నునుపైన గ్రానైట్ రాతిపైన గంటుకొడుతూ రాసిన అక్షరాలను అచ్చుతీసుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అదే ఎగుడుదిగుడుగా వున్న ఇసుక రాళ్ళలో పలచటి గంట్లుగా అక్షరాలు వుంటే ఇది కొంత కష్టం అవుతుంది.

  1. శాసనం ఉపరితలాన్ని శుబ్రం చేయాలి : శాసనపు బండ భూమిలో కూరుకుపోయి వుంటే వెలుపలికి తీయడం, చెట్లు కంపలో ఇరుక్కుని వుంటే వాటిని జాగ్రత్తగా తొలగించడం చేయాలి. ఆ తర్వాత శాసనం పైన వున్న దుమ్ముదూళీ ఇసుక రేణువులను శుభ్రంగా బ్రష్ తో మొదట తుడిచేయ్యాలి. ఇనుప బ్రష్ లాంటి బలమైన బ్రష్ లు వాడకూడదు దానివల్ల అక్షరాలు చెరిగిపోయే అవకాశం వుంది. జాగ్రత్తగా చూడాలి. అ తర్వాత నీళ్ళతో ఉపరితలాన్ని శుభ్రంగా కడిగి స్పాంజిలాంటిదానితో మురికి వదిలేలా తుడిచేయాలి.
  2. తడి కాగితాన్ని ఉపరితలం పై అంటించాలి : మనం అచ్చుతీసుకోడానికి మాప్లితో 24 మిమి లాంటి కాగితాలు మంచిగా ఉపయోగపడతాయి. నిజానికి ఈ ప్రాసెస్ లో చిరిగిపోకుండా గట్టిగా వుండే రకం కాగితం అవసరం అన్నమాట. నీళ్ళలో తడపడం వల్ల అక్షరాల గుంటల్లోకి సులభంగా వంగి లోపటికి వెల్లగలుగుతుంది. దానిపైన బ్రష్ తో తట్టుకుంటూ గుంతల్లో పంపేటప్పుడు చిరిగిపోయి ముక్కలవకుండా వుండేంత గట్టిగా వుండాలి. ఒకవేళ శాసనం వున్నంత పెద్ద పరిమాణంలో పేపర్ దొరకక పోతే వేర్వేరు ముక్కలను నంబర్లు వేసుకుంటూ ఒక క్రమంలో ఆ తర్వాత కలుపుకోవచ్చు.
  3. తడికాగితాన్ని అక్షరాల్లోకి సర్ధటం : శాసనం పై అంటించిన తడి కాగితాన్ని జాగ్రత్తగా మొత్తటి బ్రష్ తో తడుతూ అక్షరాల గుంటల్లోకి వెళ్ళేలా తట్టాలి. కాగితం తడిగా మొత్తగా వున్నప్పడు మాత్రమే ఇలా తట్టడం సాధ్య అవుతుంది. మరీ వేగంగా పనికావాలని గబాగబా కొడితే కాగితం ఇలాంటప్పడు చిరిగిపోయే అవకాశం వుంది. ఎటువంటి గమ్ అంటించకుండానే తడిగా వుండటం వల్ల ఇప్పుడు కాగితం శాసనం యొక్క ఉపరితలంపై అంటుకుని వుంటుంది.
  4. రంగు అద్దటం : అక్షరాలున్న గుంతల్లోని కాగితం పైన కాకుండా మిగిలిన సమతలం పై వున్న కాగితం పైన వరకూ మాత్రమే ఇప్పడు రంగు అద్దలన్నమాట. ఆ రంగు కూడా త్వరగా ఆరేది అయ్యివుండాలి. గుంటల్లో అంటకుండా జాగ్రత్త పడాలి. దానికోసం వర్తుల ఉపరితలం వున్న డాబర్(Dabber) లు ఉపయోగపడతాయి. అంటే ���నం గుడ్డతో మూటలా కడితే ఎలా తయారవుతుందో అలాంటి ఉపరితలం వుండేలా అన్నమాట. ఇంక తయారీ గతంలో పెద్ద ప్రహసనం లా వుండేది. ల్యాంబ్ బ్లాక్ పౌడర్ పావుకిలో పాకెట్ [ lamb black powder one packet (250gm)], తీసుకుంటే దానిలో 50 యం.ఎల్ కామెల్ ఇంక్ బాటిల్స్ నాలుగు [camel ink black 4 small bottle (50ml)], అరబిక్ జిగురు ఒక 100 యం.ఎల్ [Arabic gum 100ml] వీటన్నింటికి కొంచెం నీళ్ళువేసిన ఒక ప్లాస్టిక్ పాత్రలో కలుపుకుంటే రంగు సిద్దం అయినట్లే. అయితే ఇది గాలితడిలితే త్వరగా ఆరిపోతూ వుంటుంది. ఎయిర్ టైట్ కంటైనర్ లో జాగ్రత్తగా దాచిపెట్టుకోవలసి వుంటుంది. మరో పద్దతి కోర్స్ డూప్లికేటింగ్ ఇంక్ 200యం ఎల్ ట్యూబ్ (Kores Duplicating Ink 200ml) 58 రూపాయిల్లో మార్కెట్ లో దొరుకుతుంది. వీటిలో ఏ రంగు కానీ లేదా రబ్బర్ స్టాంప్ ల కోసం వాడే ఇంక్ ప్యాడ్ లోని ఇంక్ లాంటిదైనా కానీ డాబర్ ల మీద ముద్దలు ముద్దలుగా ఏర్పడకుండా సమానంగా సర్దుకోవాలి. ఒకవేళ అలా తరకలుగా ముద్దలుగా ఇంక్ అంటుకుని వుంటే అక్షరాల గుంతల్లో అది చేరే ప్రమాదం వుంది. అట్లా సమానంగా డాబర్ మీద సర్దుకున్న తర్వాత దాన్ని పేపర్ పై తట్టి నట్లు కొట్టకుండా సమతలంపై అంటుకునేలా నెమ్మదిగా అద్దాలి. అంటే అక్షరాలు లేని మిగిలిన సమతలం మొత్తం మీద ఇంక్ అంటేలా పూర్తిగా అంటించాలి. ఉపరితలం సైజును బట్టి డాబర్ సైజుని కూడా ఎంచుకోవాలి.
  5. ఆరేంత వరకూ ఆగండి : ఇలా ఇంక్ రాసిన తర్వాత అక్షరాలు విడిగా కాగితం రంగులో తెల్లగానూ మిగిలిన భాగం మనం అంటించిన నల్లటి రంగులోకి మారుతుంది. దాంతో అక్షరాలు చదివేందుకు అనుకూలంగా కనిపిస్తుంటాయి. వీలయితే ఇలాంటప్పుడు డిజిటల్ ఫోటోలుగా తీసుకోవచ్చు. తడికాగితాన్ని ఉపరితలం నుంచి లాగేస్తే అది చిరిగిపోయే అవకాశం వుంది. ఆరని ఇంకు మిగిలిన చోట అంటుకోవచ్చు. కాబట్టి కాగితం ఆరేంత వరకూ కొంత సమయం ఆగి తర్వాత జాగ్రత్తగా నెమ్మదిగా ఉపరితలం నుంచి తొలగించి వేరే చోట పూర్తిగా ఆరబెట్టాలి. ఆ తర్వాత వీటిని బైండింగ్ క్లాత్ మీద కానీ శాసనం లైఫ్ సైజు లోని కార్డ్ బోర్డు షీటు మీద కానీ అంటించ వచ్చు.

ఇలా అచ్చు తీసుకోవడానికి రోజుల తరబడి శిక్షణలో వేలాది రూపాయిల పరికరాలో అక్కర్లేదు. కేవలం కొద్ది మాత్రం నైపుణ్యం, కొన్ని పరికరాలతో ఇలా అచ్చు తీసుకోవచ్చు.

నాగస్థంభ శిలాశాసనం

రకాలు

[మార్చు]

శాసనాలు స్థూలంగా రెండురకాలుగా విభజించవచ్చు. అవి లోహ శాసనాలు (లౌహికములు), శిలా శాసనాలు (శైలికములు).

లోహ శాసనాలు

[మార్చు]
అశోకుని శాసనం (238 క్రీ.పూ.), బ్రాహ్మీ లిపిలో, ప్రస్తుతం "బ్రిటిష్ మ్యూజియం"లో ఉంది.

లోహశాసనాలకే లౌహికములని మరో పేరు. సంఖ్యాపరంగా చూస్తే శిలాశాసనాల కన్నా ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కానీ వీటి చారిత్రిక ప్రాధాన్యత చాలా ఎక్కువ. పల్లవ, కదంబ, గాంగ, చాళుక్యాది వంశాల చరిత్ర ప్రధానంగా లోహశాలనాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ శాసనాలను ప్రజలు ఏవో యంత్రాలను, మంత్రతంత్రాలకు సంబంధించిన వివరాలేవో వాటిలో వ్రాసి వున్నాయని భావించడంతో చాలా శాసనాలు వెలుగులోకి రావట్లేదు. పలువురు వీటిని నిధినిక్షేపాలున్న ప్రదేశాల దారిని చూపే రహస్యమిందులో వ్రాసివుందని భావించి ప్రభుత్వానికి ఇవ్వక తమ వద్దే దాచుకునే మూర్ఖత వల్ల ఎంతో చరిత్ర కాలగర్భంలోనే ఉండిపోయింది. కొందరు తామ్రశాసనాలను కరిగించి ఇంటికి ఉపయోగించే చెంబులు, తపేలాలు, గుండిగలు వంటివి తయారుచేసుకున్నారు. వీటివల్ల ఎంతో విలువైన చారిత్రిక సమాచారం నశించిపోయింది[1]

గ్రీకు భాష, అరామిక్ భాషలో (ద్విభాషా) శాసనం. అశోకుని కాలంనాటిది, కాంధహార్ వద్ద లభించింది. ప్రస్తుతం కాబూల్ మ్యూజియంలో గలదు.

ఇవీ చూడండి

[మార్చు]

కాకతీయుల తామ్ర శాసనాలు

[మార్చు]

ప్రాచీన మధ్య యుగపు వంశాల విషయంలో లాగానే కాకతీయుల చరిత్ర కూడా ముఖ్యంగా శాసనాలపైననే ఆధారపడి ఉంది. వాటిలో శిలాశాసనాలు కాక ఈ తామ్రశాసనాలు కూడా ముఖ్యమైనవే. ఇప్పటివరకూ పదమూడు తామ్రశాసనాలు వెలుగులోకి వచ్చాయి

తామ్రపత్రం సంవత్సరం విషయం సూచిక
దానార్ణవుని ���ాంగల్లు దాన శాసనం 956 కాకత్య గుండ్యన కోరిక మేరకు తూర్పు చాళుక్యరాజు దానార్ణవుడు ఓ బ్రాహ్మణుడికి మాంగల్లు గ్రామాన్ని దానం చేసిన విషయాన్ని తెలుపుతుంది EA.I pp 57 ff
గణపతిదేవుని మొగలుట్ల దానశాసనం 1219 రాజు కూతురు కోట గణపాంబ వేసిన శాసనం మొగలుట్ల గ్రామాన్ని ఓ బ్రాహ్మణుడికి దానం చేయడాన్ని ఇందులో పేర్కొన్నారు. EA.IV pp 93 ff
గణపతిదేవుని కోలవెన్ను దానశాసనం 1250 గణపతి దేవుడు ప్రథమ శాఖకు చెందిన కొంతమంది బ్రాహ్మణులకు కోలవెన్ను గ్రామాన్ని దానంగా ఇచ్చిన విషయాన్ని తెలియపరుస్తుంది భారతి తెలుగు మాస పత్రిక జూన్ 1960
గణపతిదేవుని కరీంనగర్ తామ్రశాసనం 1254 ఓ కాలువను గూర్చిన వివాదంలో రాజు తీర్పును నమోదు చేసింది 1AP Kn.Appendix
చక్రనారాయణ అనే శార్ఞధరుని శార్ఞపుర దానశాసనం 1254-55 కాకతి గణపతిదేవుని సామంతుడు శారజ్ఞధరుడు బ్రాహ్మణులకు శారజ్ఞధర పురాన్ని దానమిచ్చిన విషయం ప్రస్తావితం NDI.C.P No.17
గణపతిదేవుని గారవ పాడు తామ్రపత్రాలు 1260 బ్రాహ్మణులకు గారవపాడు గ్రామాన్ని దానంగా ఇవ్వడాన్ని తెలుపుతుంది. EI XVIII pp 34 ff
దాడిగన్నయ చింతలూరు దానశాసనం 1264 జైతుగి తన కూతుర్ని (సోమల దేవిని) గణపతిదేవునికిచ్చి వివాహం చేయటాన్ని తెలుపుతుంది Not Published
రుద్రమదేవి కాలపు ఆలపాడు దాన శాసనం 1264 రాణి అల్లుడు, యాదవ వంశానికి చెందిన ఎల్లణ దేవుడు ఆలపాడు గ్రామాన్ని బ్రాహ్మణులకు దానమిచ్చిన విషయం పేర్కొంటుంది C.P. Ins of Hyd. Mus Vol.I, pp. 109 ff
రుద్రమదేవి సామంతుడి కోటగిరి దానశాసనం 1273 రాణి సామంతుడు - విరియాల సూరుడు వినాయకపురం గ్రామన్ని కొంతమంది బ్రాహ్మణులకు దానమిచ్చిన విషయాన్ని తెలియజేస్తుంది Corpus III p. 114 ff
ప్రతాపరుద్రుడి ఉత్తరేశ్వర దానశాసనం 1290 మంత్రి చాళుక్య ఇందుశేఖరుడు ఉత్తరేశ్వరగ్రామాన్ని విద్దనాచార్య బ్రాహ్మణునికి దానమివ్వడం గురించి E1 XXXVIII pp. 57 ff
దాయగజకేసరిగా ప్రతాపరుద్రుడి ఖండవల్లి దానశాసనం 1 1289 మంత్రి అన్నల దేవుడు కొంత భూమిని విద్దనాచార్యడికి దానమివ్వటాన్ని నమోదు చేసింది EA IV pp 103ff
దాయగజకేసరిగా ప్రతాపరుద్రుడి ఖండవల్లి దానశాసనం 2 1292 చాళుక్య ఇందుశేఖరుడు ఓనపల్లి గ్రామాన్నివిద్దనాచార్యులకు దానమివ్వడాన్ని పేర్కొంటుంది EA IV pp 103ff
ప్రతాప రుద్రుడి సేనాని రాజరుద్రుడి గోరవంకపల్లి దాన శాసనం 1293 సామంతుడు, చెరకు వంశపువాడైన రాజరుద్రుడు గోరవంకపల్లి గ్రామాన్ని కొంతమంది బ్రాహ్మణులకు దానమిచ్చిన విషయం C.P.Ins of Hyd Mns. Vol 1 pp 98 ff
ప్రతాప రుద్రుని (నకిలీ) దానపత్రం 855 విజయ కాకతి రాజవంశజుడు మహాదేవుని కుమారుడిగా ప్రతాపరుద్రుడుని పేర్కొంది. ఒక బ్రాహ్మణుడికి అనంతపురం గ్రామాన్ని దానమిచ్చిన విషయం దీనిలో వుంది EC. XII Tumkur, 14

కాకతీయుల శిలా శాసనాల పట్టిక

[మార్చు]
జిల్లా తాలూకా గ్రామం శాసనంలోని విషయం
ఆదిలాబాద్ చెన్నూరు కుందవరం
చింగ్లేపుట్ (తమిళనాడు) చింగ్లేపుట్ కంజీవరం
కడప కమలాపురం గంగవరం
కడప ప్రొద్దుటూరు ఉప్పరపల్లి
కడప రాజంపేట పొందలూరు
కడప రాజంపేట నందలూరు
కడప రాజంపేట టంగుటూరు
కడప సిద్దవరం కాండువాయి
తూర్పు గోదావరి రామచంద్రాపురం ద్రాక్షారామం
గయ (బీహార్) గయ గయ
గుంటూరు బాపట్ల ఇడుపులపాడు
గుంటూరు బాపట్ల మోటుపల్లి
గుంటూరు బాపట్ల నాయని పల్లి
గుంటూరు బాపట్ల పెదగంజాం
గుంటూరు బాపట్ల పెద్ద చెరుకూరు
గుంటూరు బాపట్ల సంతరావూరు
గుంటూరు బాపట్ల స్వర్ణ
తెలియదు తెలియదు ఆళ్ళపాడు
గుంటూరు బాపట్ల చేబ్రోలు
గుంటూరు బాపట్ల గోరవెంక పల్లి
గుంటూరు బాపట్ల ఇప్పాటం
గుంటూరు బాపట్ల ఖాజా
గుంటూరు బాపట్ల లామ్
గుంటూరు బాపట్ల మల్కాపురం
గుంటూరు బాపట్ల పెనుమాక
గుంటూరు బాపట్ల పెనుములి
గుంటూరు బాపట్ల రాయపూడి
గుంటూరు బాపట్ల తడికొండ
గుంటూరు బాపట్ల వడ్డేశ్వరం
గుంటూరు బాపట్ల యనమదల
గుంటూరు మార్కాపురం త్రిపురాంతకం
గుంటూరు నర్సారావుపేట బొప్పూడి
గ���ంటూరు నర్సారావుపేట ఎడవల్లి
గుంటూరు నర్సారావుపేట జొన్నలగడ్డ
గుంటూరు నర్సారావుపేట కాకాని
గుంటూరు నర్సారావుపేట కనుపర్రు
గుంటూరు నర్సారావుపేట కొనిదెన
గుంటూరు నర్సారావుపేట కొప్పారం
గుంటూరు నర్సారావుపేట కుంకల గుంట
గుంటూరు నర్సారావుపేట మునుమాక
గుంటూరు నర్సారావుపేట మురికిపూడి
గుంటూరు నర్సారావుపేట నర్పారావుపేట
గుంటూరు నర్సారావుపేట పురుషోత్తమ పట్టణం
గుంటూరు నర్సారావుపేట రావిపాడు
గుంటూరు నర్సారావుపేట రొంపిచర్ల
గుంటూరు నర్సారావుపేట సంతమాగులూరు
గుంటూరు నర్సారావుపేట ఉప్పుమాగులూరు
గుంటూరు పల్నాడు దుర్గి
గుంటూరు పల్నాడు జూలకల్లు
గుంటూరు పల్నాడు కారెంపూడి
గుంటూరు పల్నాడు మాచర్ల
గుంటూరు పల్నాడు పిడుగురాళ్ళ
గుంటూరు పల్నాడు పిన్నాలి
గుంటూరు పల్నాడు తంగేడ
గుంటూరు పల్నాడు తేరాల
గుంటూరు పల్నాడు ఒప్పిశేర్ల
గుంటూరు రేపల్లె ఖండవ్రోలు
గుంటూరు సత్తెన పల్లి అమరావతి
గుంటూరు సత్తెన పల్లి చింతపల్లి
గుంటూరు సత్తెన పల్లి గుడిపూడి
గుంటూరు సత్తెన పల్లి పాపాయపాలెం
గుంటూరు సత్తెన పల్లి వేల్పూరు
గుంటూరు తెనాలి సిలుమూరు
గుంటూరు తెనాలి దుగ్గిరాల
గుంటూరు తెనాలి ఈమాని
గుంటూరు తెనాలి కోలకాలూరు
గుంటూరు తెనాలి కొల్లూరు
గుంటూరు తెనాలి మూల్పూరు
గుంటూరు తెనాలి పెదకొండూరు
గుంటూరు వినుకొండ ఇనుమెల్ల
గుంటూరు వినుకొండ ఇప్పూరు
కరీంనగర్ హుజూరాబాద్ కట్టంగూర్
కరీంనగర్ హుజూరాబాద్ గొడిశాల
కరీంనగర్ జగిత్యాల ధర్మపురి
కరీంనగర్ కరీంనగర్ హస్నాబాద్
కరీంనగర్ కరీంనగర్ కరీంనగర్
కరీంనగర్ కరీంనగర్ మంతెన
కరీంనగర్ కరీంనగర్ నగునూరు
కరీంనగర్ కరీంనగర్ రేగొండ
కరీంనగర్ కరీంనగర్ శనిగ్రామ
కరీంనగర్ మంథని కమ్మపల్లి
కరీంనగర్ మంథని కాళేశ్వరం
కరీంనగర్ మెట్ పల్లి చిత్తాపూర్
కరీంనగర్ పెద్దపల్లి మయాదారం
కరీంనగర్ పెద్దపల్లి సుండెల్ల
కరీంనగర్ పెద్దపల్లి యెల్గేడు
ఖమ్మం జిల్లా ఖమ్మం చిన కందుకూరు
ఖమ్మం జిల్లా ఖమ్మం కటుకూరు
ఖమ్మం జిల్లా ఖమ్మం కూసుమంచి కూసుమంచి గణపేశ్వరాలయం దాన శాసనం
ఖమ్మం జిల్లా ఖమ్మం మాటేరు
ఖమ్మం జిల్లా ఖమ్మం పమ్మి
ఖమ్మం జిల్లా మధిర చిన కందుకూరు
ఖమ్మం జిల్లా ఇల్లందు కోటగడ్డ
కృష్ణాజిల్లా బందరు మల్లవోలు
కృష్ణాజిల్లా దివి గణపేశ్వరం
కృష్ణాజిల్లా దివి శ్రీకాకుళం
కృష్ణాజిల్లా గుడివాడ మండపాడు
కృష్ణాజిల్లా మచిలీ పట్నం పెద్దకళ్ళేపల్లి
కృష్ణాజిల్లా నందిగామ గుడిమెట్ట
కృష్ణాజిల్లా నందిగామ కంకాల
కృష్ణాజిల్లా నందిగామ కొక్కిరేణి
కృష్ణాజిల్లా నందిగామ మాగల్లు
కృష్ణాజిల్లా నందిగామ నడిగూడెం
కృష్ణాజిల్లా నందిగామ తాడువాయి
కృష్ణాజిల్లా విజయవాడ కోలవెన్ను
కృష్ణాజిల్లా విజయవాడ విజయవాడ
కర్నూలు నందికొట్కూరు శ్రీశైలం
కర్నూలు నంద్యాల పానెం
తెలియదు తెలియదు గరవపాడు
మహబూబ్ నగర్ అలంపూర్ అలంపూర్
మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ వర్ధమానపురం
మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ బోద్ పూర్
మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మక్తల్
మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ పామాపురం
మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ ఉమామహేశ్వరం
మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వర్ధమానపురం
మెదక్ గజ్వేల్ ఇటిక్యాల
మెదక్ గజ్వేల్ మునిగడప
మెదక్ హుజూర్ నగర్ పాలకవీడు
మెదక్ మెదక్ మన్నూరు
మెదక్ మెదక్ టేక్ మాల్
మెదక్ రామయ్యపేట వెంకటాపూర్
మెదక్ సంగారెడ్డి ఎల్మెల
మెదక్ సిద్దిపేట దుద్దెడ
మెదక్ సిద్దిపేట కొండపాక
మెదక్ సిద్దిపేట పుల్లూరు
నల్గొండ జిల్లా భువన గిరి బొల్లెపాలెం
నల్గొండ జిల్లా భువన గిరి కొలనుపాక
నల్గొండ జిల్లా భువన గిరి మాసాపేట
నల్గొండ జిల్లా దేవరకొండ బొల్లారం
నల్గొండ జిల్లా దేవరకొండ ఏలేశ్వరం
నల్గొండ జిల్లా దేవరకొండ కందుకూరు
నల్గొండ జిల్లా దేవరకొండ పెద్దమునగాల
నల్గొండ జిల్లా దేవరకొండ రంగారెడ్డి గూడెం
నల్గొండ జిల్లా దేవరకొండ సారంపేట
నల్గొండ జిల్లా దేవరకొండ ఊట్లపల్లి
నల్గొండ జిల్లా దేవరకొండ ఏలేశ్వరం
నల్గొండ జిల్లా హుజూర్ నగర్ బూరుగు గడ్డ
నల్గొండ జిల్లా హుజూర్ నగర్ సిలుకూరు
నల్గొండ జిల్లా హుజూర్ నగర్ గణపవరం
నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మట్టంపల్లి
నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మేళ్ళచెర్వు
నల్గొండ జిల్లా హుజూర్ నగర్ సోమవరం
నల్గొండ జిల్లా హుజూర్ నగర్ తొగరాయి
నల్గొండ జిల్లా మిరియాల గూడ ఆగమోతుకూరు
నల్గొండ జిల్లా మిరియాల గూడ ఆలుగడప
నల్గొండ జిల్లా మిరియాల గూడ ఇంకిర్యాల
నల్గొండ జిల్లా మిరియాల గూడ మాటూరు
నల్గొండ జిల్లా మిరియాల గూడ రాజసావరం
నల్గొండ జిల్లా మిరియాల గూడ వాడపల్లి
నల్గొండ జిల్లా నల్గొండ ఆలుగడప
నల్గొండ జిల్లా నల్గొండ అన్నారెడ్డిగూడెం
నల్గొండ జిల్లా నల్గొండ కందుపట్ల
నల్గొండ జిల్లా నల్గొండ సీకటి మిద్ది
నల్గొండ జిల్లా నల్గొండ గణపవరం
నల్గొండ జిల్లా నల్గొండ కొలనుపాక
నల్గొండ జిల్లా నల్గొండ కొత్తపల్లి
నల్గొండ జిల్లా నల్గొండ పానుగల్
నల్గొండ జిల్లా నల్గొండ పానుగల్లు
నల్గొండ జిల్లా నల్గొండ పేరూరు
నల్గొండ జిల్లా నల్గొండ సర్వేల్
నల్గొండ జిల్లా నల్గొండ ఏలేశ్వరం
నల్గొండ జిల్లా రామన్నపేట చిట్యాల
నల్గొండ జిల్లా రామన్నపేట దుప్పల్లి
నల్గొండ జిల్లా రామన్నపేట కూరెళ్ళ
నల్గొండ జిల్లా రామన్నపేట తుమ్మలగూడెం
నల్గొండ జిల్లా సూర్యాపేట జలాల్ పూర్
నల్గొండ జిల్లా సూర్యాపేట కూసుమంచి
నల్గొండ జిల్లా సూర్యాపేట మామిళ్ళగూడ
నల్గొండ జిల్లా సూర్యాపేట నాగులపాడు
నల్గొండ జిల్లా సూర్యాపేట నగులపాడు
నల్గొండ జిల్లా సూర్యాపేట పాతర్లపాడు
నల్గొండ జిల్లా సూర్యాపేట పిల్లల మర్రి
నెల్లూరు జిల్లా దర్శి అలువాల పాడు
నెల్లూరు జిల్లా దర్శి భీమవరం
నెల్లూరు జిల్లా దర్శి దర్శి
నెల్లూరు జిల్లా దర్శి గంగవరం
నెల్లూరు జిల్లా దర్శి కొక్కర్లకోట
నెల్లూరు జిల్లా దర్శి పొట్లపాడు
నెల్లూరు జిల్లా దర్శి సార్నగాపురం
నెల్లూరు జిల్లా దర్శి తాళ్ళూరు
నెల్లూరు జిల్లా దర్శి తమ్మలూరు
నెల్లూరు జిల్లా కందుకూరు భీమవరం
నెల్లూరు జిల్లా కందుకూరు గుడ్లూరు
నెల్లూరు జిల్లా కందుకూరు కందుకూరు
నెల్లూరు జిల్లా కందుకూరు పాకాల
నెల్లూరు జిల్లా కందుకూరు వేంపాడు
నెల్లూరు జిల్లా కావలి కాట్రయపాడు
నెల్లూరు జిల్లా నెల్లూరు నెల్లూరు
నెల్లూరు జిల్లా పొడ్లి సిమట
నెల్లూరు జిల్లా దొంగలూరు
నిజామాబాద్ జిల్లా బోధన్ బిక్కోలు
నిజామాబాద్ జిల్లా కామారెడ్డి బందరామేశ్వర పల్లి
ప్రకాశం జిల్లా గిద్దలూరు సలకలవీడు
ప్రకాశం జిల్లా మార్కాపురం త్రిపురాంతకం
ప్రకాశం జిల్లా ఒంగోలు ఆల్లూరు
ప్రకాశం జిల్లా ఒంగోలు బొల్లవరప్పాడు
ప్రకాశం జిల్లా ఒంగోలు గొనసపూడి
ప్రకాశం జిల్లా ఒంగోలు ఈడమూడి
ప్రకాశం జిల్లా ఒంగోలు కండ్లగుంట
ప్రకాశం జిల్లా ఒంగోలు కరవడి
ప్రకాశం జిల్లా ఒంగోలు మడ్డిపాడు
ప్రకాశం జిల్లా ఒంగోలు నాగులప్పలపాడు
ప్రకాశం జిల్లా ఒంగోలు నిడమానూరు
ప్రకాశం జిల్లా ఒంగోలు రావినూతల
ప్రకాశం జిల్లా ఒంగోలు ఉప్పుగుండూరు
ప్రకాశం జిల్లా ఒంగోలు వలపర్ల
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎండ్లూరు
తిరుచిరాపల్లి (తమిళనాడు) తిరుచిరాపల్లి శ్రీరంగం
వరంగల్ జిల్లా జనగామ ఆకునూరు
వరంగల్ జిల్లా జనగామ కుందవరం
వరంగల్ జిల్లా జనగామ నిడిగొండ
వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఇనుగుర్తి
వరంగల్ జిల్లా మహబూబాబాద్ మహబూబాబాద్
వరంగల్ జిల్లా మహబూబాబాద్ మాటేడు
వరంగల్ జిల్లా మహబూబాబాద్ రాజులకోటపల్లి
వరంగల్ జిల్లా మహబూబ్ నగర్ మహబూబాబాద్
వరంగల్ జిల్లా మహబూబ్ నగర్ మాటేడు
వరంగల్ జిల్లా ములుగు చిట్యాలపాడు
వరంగల్ జిల్లా ములుగు మాకాపురం
వరంగల్ జిల్లా ములుగు పాలమీట
వరంగల్ జిల్లా నర్సంపేట డిక్కకుంట
వరంగల్ జిల్లా నర్సంపేట గుండాల
వరంగల్ జిల్లా నర్సారావుపేట బనాజీపేట
వరంగల్ జిల్లా నర్సారావుపేట డిక్కకుంట
వరంగల్ జిల్లా నర్సారావుపేట పాకాల్
వరంగల్ జిల్లా నర్సారావుపేట రామకృష్ణాపురం
వరంగల్ జిల్లా నర్సారావుపేట రాంపూర్
వరంగల్ జిల్లా వరంగల్ అనుమకొండ
వరంగల్ జిల్లా వరంగల్ బెక్కలూరు
వరంగల్ జిల్లా వరంగల్ ధర్మాసాగర్
వరంగల్ జిల్లా వరంగల్ గార్ల
వరంగల్ జిల్లా వరంగల్ గిజ్మాజీపేట
వరంగల్ జిల్లా వరంగల్ అనుమకొండ
వరంగల్ జిల్లా వరంగల్ ఖాజీపేట
వరంగల్ జిల్లా వరంగల్ కొలనుపల్లి
వరంగల్ జిల్లా వరంగల్ కొండపర్తి
వరంగల్ జిల్లా వరంగల్ కుమారుపల్లి
వరంగల్ జిల్లా వరంగల్ మట్టెవాడ
వరంగల్ జిల్లా వరంగల్ ముప్పువరం
వరంగల్ జిల్లా వరంగల్ వర్ధమానపురం
వరంగల్ జిల్లా వరంగల్ వరంగల్
వరంగల్ జిల్లా వరంగల్ ఎలకుర్తి
వరంగల్ జిల్లా మహబూబాబాదు గుడితండా గణపతిదేవుని
పశ్చిమగోదావరి జిల్లా తణుకు జుట్టిగ
పశ్చిమగోదావరి జిల్లా తణుకు కందవల్లి
పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఉత్తరేశ్వర

మూలాలు

[మార్చు]
  1. వెంకటరమణయ్య, నేలటూరు (1948). చారిత్రిక వ్యాసములు (1 ed.). మద్రాస్: వేదము వేంకటరాయశాస్త్రి అండ్ సన్స్. Retrieved 9 December 2014.

వెలుపలి లంకెలు

[మార్చు]