Jump to content

విశాలాక్షి దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 25°18′32″N 83°0′39″E / 25.30889°N 83.01083°E / 25.30889; 83.01083
వికీపీడియా నుండి
విశాలాక్షి దేవాలయం
ఆలయ ప్రవేశ ద్వారం
ఆలయ ప్రవేశ ద్వారం
విశాలాక్షి దేవాలయం is located in Uttar Pradesh
విశాలాక్షి దేవాలయం
Location within Uttar Pradesh
భౌగోళికం
భౌగోళికాంశాలు25°18′32″N 83°0′39″E / 25.30889°N 83.01083°E / 25.30889; 83.01083
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లావారణాసి
స్థలంమీర్ ఘాట్, వారణాసి
సంస్కృతి
దైవంవిశాలాక్షి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుఆలయం
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ1893AD
సృష్టికర్తNagarathar
వెబ్‌సైట్vishalakshi.org

విశాలాక్షి ఆలయం లేదా విశాలాక్షి గౌరీ ఆలయం విశాలాక్షి దేవతకి అంకితం చేసిన హిందూ దేవాలయం. ఈమె ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి వద్ద గంగా నది ఒడ్డున ఉన్న మీర్ ఘాట్ వద్ద "విశాలమైన కనులు గల దేవత".[1] ఈమె పార్వతి దేవి లేదా గౌరీ దేవత అంశంగా భావిస్తారు.[2] [3] ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తి పీఠంగా పరిగణించబడుతుంది, ఇది హిందూ దైవిక తల్లికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన దేవాలయం.

వారణాసిలోని ఈ పవిత్ర ప్రదేశంలో సతీదేవి చెవిపోగులు పడ్డాయని చెబుతారు. ఈ ఆలయం ప్రసిద్ధ మణికర్ణిక శ్మశాన వాటికలో ఉంది. విశాలాక్షి దేవాలయం కాజలి తిజ్‌లోని ఆలయ పండుగకు ప్రసిద్ధి చెందింది. ఇది హిందూ భాద్రపద మాసం (ఆగస్టు)లో కృష్ణ పక్షం రోజులలో మూడవ రోజున నిర్వహిస్తారు. ఆది పరాశక్తి 4 అవతారాల ప్రధానమైనవి. కంచిలో కామాక్షి దేవతగా[4] ఉత్తరాన కాశీలో విశాలాక్షి దేవతగా [5] పశ్చిమాన అలీబాగ్ లేదా శ్రీబాగ్‌లో రేణుకాదేవిగా[6] పశ్చిమాన అలీబాగ్ లేదా శ్రీబాగ్‌లో పద్మాక్షి దేవతగా, దక్షిణాన మీనాక్షి దేవతగా [7] తూర్పున పశ్చిమ బెంగాల్‌లోని కేతుగ్రామ్ లో బహుళాక్షి దేవతగా [8] పూజలందుకుంటున్నారు.

ప్రజాపతి దక్షుని కుమార్తె, సతీదేవి కోరికకు విరుద్ధంగా శివుడిని వివాహం చేసుకుంటుంది. దక్షుడు గొప్ప యజ్ఞాన్ని నిర్వస్తాడు, కానీ సతీదేవిని, శివుడిని ఆహ్వానించడు. ఆహ్వానం లేకుండానే సతిదేవి యజ్ఞస్థలానికి చేరుకుంటుంది. అక్కడ దక్షుడు సతిని విస్మరించి శివుడిని దూషించాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యాగంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. సతిదేవి చనిపోయింది, కానీ ఆమె శవం కాలిపోలేదు. సతి మరణానికి కారణమైనందుకు దక్షుడిని శివుడు వీరభద్రుడు అవతారంలో అతన్ని చంపి, తిరిగి క్షమించి, అతన్ని పునరుత్థానం చేశాడు. భరించలేని దుఃఖంతో ఉన్న శివుడు సతీదేవి శవంతో విశ్వంలో సంచరించాడు. చివరగా విష్ణువు సతీ శరీరాన్ని 51 భాగాలుగా విడదీశాడు. వాటిలో ప్రతి ఒక్కటి శక్తి పీఠంగా, దేవత యొక్క ఒక్కొక్క రూపానికి ఒక ఆలయంగా మారాయి. ప్రతి శక్తి పీఠం వద్ద శివుడు భైరవ రూపంలో పూజించబడతాడు. పురుషుడు ప్రతిరూపం లేదా పీఠం అధిష్టానం దేవత సంరక్షకుడుగా ఉంటాడు.[9] సతీదేవి కన్ను లేదా చెవిపోగు వారణాసిలో పడిపోయిందని, విశాలాక్షిని శక్తి పీఠంగా స్థాపించిందని నమ్ముతారు.[10] అయితే ఈరోజు అక్కడ ఉన్న ఆలయంలో ఎవరైనా అడిగితే, పూజారి, మిగతా వారందరూ పడిపోయిన శరీర భాగం మూర్తి వెనుక దాగి ఉన్న ఆమె ముఖం అని నిర్ధారిస్తారు.

వారణాసి పవిత్ర భౌగోళికంలో, షష్టాంగ యోగాకు ప్రతీకగా చెప్పబడ్డాయి. ఇది ఆరు ప్రదేశాలను సందర్శించడం ద్వారా ప్రదర్శించబడుతుంది. ఇవి విశ్వనాథ్ ఆలయం ఇది వారణాసిలోని అతి ముఖ్యమైన ఆలయం. ఇది శివునికి అంకితం చేయబడిన ఆలయం, విశాలాక్షి ఆలయం, గంగానది, కాల భైరవ ఆలయం ఇది వారణాసి సంరక్షక విశాలాక్ష్మి దేవత సంరక్షకుడుగా భైరవనికి అంకితం చేయబడిన ఆలయం. డుంఠి గణపతి ఆలయం ఇది గణేశుడికి అంకితం చేయబడింది. దండపాణి దేవాలయం ఇది శివుడి అంశానికి అంకితం చేసిన దేవాలయం.[11]

అన్నపూర్ణ, శివుని భార్య పార్వతి ఆహారం, రూపానికి సంబంధించిన దేవత, "విశాలమైన కన్నులు" కలిగినందున విశాలాక్షి అనే పేరు పెట్టబడింది. ఆమె అత్యంత ప్రసిద్ధ ఆలయం వారణాసిలో ఉంది. ఇక్కడ ఆమె పోషక దేవతగా పరిగణించబడుతుంది. స్కాంద పురాణం వ్యాస ఋషి వారణాసిని శపించిన కథను వివరిస్తుంది. ఎందుకంటే నగరంలో ఎవరూ అతనికి ఆహారం ఇవ్వలేదు. చివరగా విశాలాక్షి గృహిణి రూపంలో కనిపించి, వ్యాసునికి ఆహారం ఇస్తుంది. విశాలాక్షి ఈ పాత్ర అన్నపూర్ణ పాత్రను పోలి ఉంటుంది. ఆమె తన భర్త శివునికి భోజనం పెట్టింది. అతని ఆకలిని తన ఆహారంతో తీర్చగలదు. అన్నపూర్ణ ఆహారంతో సంతోషించిన శివుడు, వారణాసిని స్థాపించి, ఆమెను అధిష్టాన దేవతగా నియమిస్తాడు. వారణాసి దేవాలయంలోని విశాలాక్షి దేవత ప్రారంభ కాలంలో అన్నపూర్ణతో గుర్తిస్తారు, అయితే కాలక్రమేణా ఒక ప్రత్యేకమైన దేవతగా మారింది, ఫలితంగా దేవత ఆలయాలు ఏర్పడ్డాయి.[12]

విశాలాక్షి అంటే "విశాలమైన కన్నుల గల" దేవత అని అర్థం. ఈమె తరచుగా మరో ఇద్దరు దేవతలతో సంబంధం కలిగి ఉంటుంది. కామాక్షి, కాంచీపురం "ప్రేమ కన్నుల" దేవత, మదురై మీనాక్షి దేవత "చేప కన్ను" అయిన మీనాక్షి, ప్రముఖంగా (సారూప్య పేరు కారణం) [13] ఈ మూడింటిని దక్షిణ భారతీయులు అత్యంత ముఖ్యమైన దేవతా దేవాలయాలుగా భావిస్తారు. విశాలాక్షి ఉత్తర భారతదేశంలో నివసిస్తుండగా, ఇతర దేవత ఆలయాలు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉన్నాయి. దక్షిణ భారతీయులు యుగయుగాలుగా విశాలాక్షిని పూజిస్తున్నారు.ఈ ఆలయంతో బలమైన సంబంధాలను కలిగి ఉన్నారు.దక్షిణ భారత తమిళ ప్రజలు కూడా 1971లో ఆలయాన్ని పునరుద్ధరించడంలో సహాయపడ్డారు [10] [14] [13]

ఆలయంలో పూజలు చేయడానికి ముందు భక్తులు తరచుగా సమీపంలోని పవిత్ర గంగానదిలో స్నానం చేస్తారు. పూజ (ఆరాధన), నైవేద్యాలు, దేవత స్తోత్రాల పఠనం, ఆలయంలో దానధర్మాలు ప్రధానమైన దేవత శక్తి కారణంగా అత్యంత ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. వరుడి కోసం పెళ్లికాని అమ్మాయిలు, సంతానం కోసం సంతానం లేని దంపతులు, అభాగ్యులు తమ అదృష్టం కోసం దేవతను ప్రత్యేకంగా పూజిస్తారు. గర్భగుడి లో రెండు దేవతా చిత్రాలు పక్కపక్కనే ఉంటాయి. ఎడమ వెనుక భాగంలో విశాలాక్షి అని పిలువబడే ఒక చిన్న నల్లరాతి చిత్రం, తరువాతి కాలంలో స్థాపించిన పొడవైన నల్లరాతి చిత్రం ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న విశ్వనాథ, అన్నపూర్ణ క్షేత్రాలను భక్తులు తరచుగా సందర్శిస్తారు.[15]

విశాలాక్షి ఆలయం వార్షిక ఆలయ ఉత్సవం భారతీయ వర్షాకాలం చివరి నెల అయిన భాద్రపదమాసం కృష్ణ పక్షంలో మూడవ రోజు జరుపుకుంటారు. మహిళలు ఈ సమయంలో కాజలి (నలుపు) అని పిలిచే "రసిక" వర్షాకాల పాటలు పాడతారు. ముఖ్యంగా మహిళలు వారి సోదరుల సంక్షేమం కోసం పవిత్ర దినం పాటిస్తారు.[16]

మూలాలు

[మార్చు]
  1. Bangala Bhasar Abhidhaan ( Dictioanary of the Bengali Language), Shishu Sahitya Samsad Pvt Ltd., 32A, APC Road, Kolkata – 700009, Volume 2, p.1600. (ed. 1988)
  2. Eck 1982, p. 229.
  3. Varanasi Temples
  4. Harshananda, Swami (2012). Hindu Pilgrimage Centres (second ed.). Bangalore: Ramakrishna Math. p. 61. ISBN 978-81-7907-053-6.
  5. Bangala Bhasar Abhidhaan ( Dictioanary of the Bengali Language), Shishu Sahitya Samsad Pvt Ltd., 32A, APC Road, Kolkata – 700009, Volume 2, p.1600. (ed. 1988)
  6. "Sri Renuka Amman Parameswari". Archived from the original on 18 May 2015. Retrieved 2015-04-29.
  7. William P. Harman (1992). The Sacred Marriage of a Hindu Goddess. Motilal Banarsidass. p. 24. ISBN 978-81-208-0810-2.
  8. পাইন, সুগত (2021). নানারূপে সতীঅঙ্গ. p. 27.
  9. Jones, Constance; Ryan, James D. (2007). Encyclopedia of Hinduism. Infobase Publishing. pp. 401–402. ISBN 9780816075645. Retrieved 14 November 2012.
  10. 10.0 10.1 Eck 1982, p. 173.
  11. Eck 1982, p. 323.
  12. P. Arundhati (1 January 2001). Annapurna: A Bunch of Flowers of Indian Culture. Concept Publishing Company. pp. 17–21. ISBN 978-81-7022-897-4. Retrieved 19 November 2012.
  13. 13.0 13.1 V. K. Subramanian (1 January 2003). Art Shrines Of Ancient India. Abhinav Publications. p. 30. ISBN 978-81-7017-431-8. Retrieved 20 November 2012.
  14. Varanasi Temples
  15. Varanasi Temples
  16. Eck 1982, p. 266.

వెలుపలి లింకులు

[మార్చు]