Jump to content

విమానం

వికీపీడియా నుండి
ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్
జెట్2.కామ్ వారి బోయింగ్ 737-300, ఆధునిక ప్యాసెంజర్ విమానం
Part of a series on
Categories of Aircraft
గాలికన్నా తేలికైనవి(aerostats)
Unpowered Powered
బెలూన్ Airship
Hybrid Lighter-than-air/Heavier-than-air
Unpowered Powered
Hybrid airship
గాలికన్నా బరువైనవి(aerodynes)
Unpowered Powered
Unpowered flexible-wing Powered flexible-wing
Hang glider
Paraglider
Powered hang glider
Powered paraglider
Unpowered fixed-wing Powered fixed-wing
• Glider • Powered airplane/aeroplane
Powered hybrid fixed/rotary wing
Tiltwing
Tiltrotor
Coleopter
Unpowered rotary-wing Powered rotary-wing
Rotor kite Autogyro
Gyrodyne ("Heliplane")
Helicopter
Powered aircraft using other means of lift
Ornithopter
Flettner airplane
see also
Ground-effect vehicle
Hovercraft
Flying Bedstead
Avrocar
ఎయిర్ ఫ్రాన్స్‌కు చెందిన బోయింగ్ 777, అత్యాధునిక పాసెంజర్ జెట్.

విమానం (ఆంగ్లం Aeroplane) అనేది సాధారణ వాడుకలో గాలిలో ప్రయాణించడానికి వీలుగా తయారుచేయబడిన వాహనము. వీటినే ఎయిర్‌ప్లేన్‌లు అని ఉత్తర అమెరికాలో(యు.ఎస్. కెనడా), ఏరోప్లేన్‌లు అని కామన్‌వెల్త్ దేశాల్లో (ఒక కెనడా తప్ప), ఐర్లాండ్లో వ్యవహరిస్తారు. ఈ పదాలు గ్రీకు భాష నుండి ఆవిర్భవించాయి. గ్రీక్ భాషలో αέρας (ఏరాస్) అనగా "గాలి" అని అర్థం.[1] 1903లో రైట్ సోదరులు "ఏరోప్లేన్" అన్న పదాన్ని ఒక రెక్కను వివరించడానికి మాత్రమే వాడారు,[2] కాని అది పూర్తి విమానానికి పేరుగా వాడుకలోకి వచ్చింది.

విమానాన్ని సాంకేతిక పరిభాషలో ఫిక్స్డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ (fixed-wing aircraft) అని అంటారు - అంటే స్థిరంగా, కదలకుండా రెక్కలు ఉండే విమానం. ఇతర విమానాలతో (రోటరీ వింగ్ ఏర్‌క్రాఫ్ట్ లేదా ఆర్నిథాప్టర్స్) వీటిని వేరు చేయడానికి అనువుగా ఈ పదాన్ని వాడతారు. ఫిక్స్డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ గాలికంటే బరువైనదై ఉండడంతో పాటు రెక్కలు ఎగరడానికి కావాలసిన శక్తిని విమానానికి ఇవ్వలేవు.

పని చేసే సూత్రం

[మార్చు]

గాలిలో ప్రయాణించే ఏ వస్తువు మీదైనా ప్రధానంగా నాలుగు బలాలు పని చేస్తాయని శాస్త్రజ్ఞుడు జార్జి కేలీ సూత్రీకరించాడు. అవి

  1. పైన ప్రయాణిస్తుండే వస్తువును నిరంతరం కిందకు లాగుతుండే గురుత్వాకర్షణ శక్తి. అదే దాని బరువు. భౌతిక శాస్త్రంలో దీనినే భారము అని కూడ అంటారు.{{{భారము=ద్రవ్యరాశి * గురుత్వాకర్షణ శక్తి----(W=mg) (w=భారము;m=ద్రవ్యరాశి;g=గురుత్వాకర్షణ శక్తి)}}}
  2. ఈ బరువుకు వ్యతిరేకంగా అది కిందకు పడిపోకుండా నిరంతరం దాన్ని పైకి లేపుతూ అది తేలుతూ ఉండేలా చూసే బలం రెండోది. అదే తేలు లేదా లిఫ్ట్. ఇది విమాన యానానికి అత్యంత కీలకమైన బలం. విమానం బరువుకు వ్యతిరేకంగా, బరువు కంటే ఎక్కువగా తేలు పని చేస్తున్నపుడే విమానం తేలుతుంది. పైపైకి లేస్తుంటుంది. ఈ "తేలు" బలాన్ని రెక్కలు సృష్టించాలి. విమానం చలన వేగాన్ని పెంచడం ద్వారా లేదా రెక్కల కోణాన్ని మార్చడం ద్వారా ఈ తేలు (లిఫ్ట్) బలాన్ని పెంచవచ్చు. కిందకు లాగే బరువు పైకి లేపే లిఫ్ట్ సరి సమానంగా ఉంటే విమానం గాలిలో అక్కడే తేలుతుంటుంది. లిఫ్ట్ ఎక్కువైతే విమానం పైకి లేస్తుంది. తక్కువైతే కిందకు దిగుతుంది.
  3. విమానాన్ని బలంగా ముందుకు లాక్కుపోతుండే బలం... థ్రస్ట్. విమానం లోని ఇంజన్ , ప్రొఫెల్లర్లు గాలిని వేగంగా వెనక్కి నెడుతూ ఈ గుంజుడు బలాన్ని సృష్టిస్తాయి.
  4. ఇదే సమయంలో పుట్టే ఎదురు గాలి సృష్టించే అవరోధం నాలుగోది. అదే డ్రాగ్. ఈ డ్రాగ్ కంటే కూడా దాన్ని ముందుకు లాగే బలం (థ్రస్ట్) ఎక్కువగా ఉంటేనే విమానం ముందుకు సాగిపోతుంది.
విమానము పనిచేసే సూత్రం
చిన్న విమానము. హైదరాబాద్ లో తీసిన చిత్రము

విమానాల్లో రకాలు

[మార్చు]
The X-43A, shortly after booster ignition
  • గ్లైడర్‌లు :
  • ప్రొపెల్లర్ విమానాలు :
ప్రొపెల్లర్ సాయంతో నడిచే సెస్నా 177.
USAF en:Lockheed SR-71 Blackbird ట్రైనర్
  • జెట్ విమానాలు :
  • రాకెట్‌తో నడిచే విమానం :
Bell X-1A గాలిలో ఎగురుతున్నప్పటి దృశ్యం.

విమానం ఆగే పద్ధతి

[మార్చు]

అతి జోరుగా (దరిదాపు గంటకి 500 మైళ్లు లేదా ??? కిమీలు) ప్రయాణించే విమానం నేల మీదకి దిగి ఆగాలంటే దానీ వేసే మరకట్టుకి సాధనాలు ఏమిటో చూద్దాం. విమానం రెక్కకి కొద్దిగా వెనక ఉన్న కుర్చీలో కూర్చుని రెక్క వైపు జాగ్రత్తగా చూస్తే విమానం ఆఘడానికి చోదకుడు చేసే పని కొంతవరకు అర్థం అవుతుంది. ఇక్కడ చూడవలసిన అంశాలు మూడు: ఒకటి, రెక్క వెనక భాగం. విమానం ఇంఖా ఆకాశంలో ఎగురుతూ ఉండగానే ఇది వైశాల్యంలో విస్తరిస్తుంది. ఇది ఇలా వెడల్పు అవుతూన్న కొద్దీ బరువు పాలు ఎక్కువ అవుతుంది, తేలు పాలు తగ్గుతుంది కనుక విమానం నెమ్మదిగా దిగుతుంది. రెండు, విమానం చక్రాలు నేలని తగలగానే మళ్లా పైకి, గాలిలోకి, లేచిపోకుండా ఉంచేందుకుగాను, రెక్కల మీద ఉన్న రెండు రేకులలాంటివి పైకి లేస్తాయి. గాలికి ఎదురయి ఇవి కలిగించే అవరోధానికి విమానం జోరు తగ్గుతుంది. మూడు, ఇంజను వెనక భాగం చూస్తే అక్కడ ఒక చట్రం లాంటి ఉపకరణం ఇంజను నుండి ఊడిపోతోందా అనేటట్లు వెనక్కి వస్తుంది - ఒక్క క్షణం పాటు. అప్పుడు ఇంజను ప��ద్దగా హోరుమని శబ్దం చేస్తుంది. ఈ ప్రక్రియ ముందుకి వెళుతూన్న విమానాన్ని వెనక్కి తోస్తుంది. ఇదొక రకం మరకట్టు. అప్పటికి విమానం జోరు పందెపు కారు జోరంత ఉండొచ్చు. అప్పుడు పుంజుగుంటలో ఉన్న చోదకుడు తిరుగుతూన్న చక్రాలకి మరకట్టు వేస్తాడు. ఇంత హడావుడి చేస్తే కాని విమానాన్ని ఆపలేం!!

మూలాలు

[మార్చు]
  1. "Aeroplane", ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు, Second edition, 1989.
  2. U.S. Patent 821,393 Archived 2013-09-16 at the Wayback Machine — Wright brothers' patent for "Flying Machine"

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=విమానం&oldid=4037379" నుండి వెలికితీశారు