Jump to content

మొజాంబిక్

వికీపీడియా నుండి
రిపబ్లిక్ ఆఫ్ మొజాంబిక్

Flag of మొజాంబిక్
జండా
Coat of arms of మొజాంబిక్
Coat of arms
గీతం: Pátria Amada
Beloved Homeland
Location of  మొజాంబిక్  (dark blue) – in Africa  (light blue & dark grey) – in the African Union  (light blue)
Location of  మొజాంబిక్  (dark blue)

– in Africa  (light blue & dark grey)
– in the African Union  (light blue)

రాజధానిMaputo
అధికార భాషలుPortuguese
పిలుచువిధంMozambican
ప్రభుత్వంUnitary presidential republic
• President
Filipe Nyusi
Carlos Agostinho do Rosário[1]
శాసనవ్యవస్థAssembly of the Republic
Independence
• from Portugal
25 June 1975
• Current constitution
30 November 1990
విస్తీర్ణం
• మొత్తం
801,590 కి.మీ2 (309,500 చ. మై.) (35th)
• నీరు (%)
2.2
జనాభా
• 2011 estimate
23,929,708[2] (50th)
• 2007 census
21,397,000 (52nd)
• జనసాంద్రత
28.7/చ.కి. (74.3/చ.మై.) (178th)
GDP (PPP)2012 estimate
• Total
$26.257 billion[3]
• Per capita
$1,169[3]
GDP (nominal)2012 estimate
• Total
$14.600 billion[3]
• Per capita
$650[3]
జినీ (2008)45.7[4]
medium
హెచ్���డిఐ (2013)Increase 0.393[5]
low · 178th
ద్రవ్యంMozambican metical (MZN)
కాల విభాగంUTC+2 (CAT)
• Summer (DST)
UTC+2 (not observed)
వాహనాలు నడుపు వైపుleft
ఫోన్ కోడ్+258
Internet TLD.mz
  1. Makhuwa, Tsonga, Lomwe, Sena and others.
Estimates for this country explicitly take into account the effects of excess mortality due to AIDS; this can result in lower life expectancy, higher infant mortality and death rates, lower population and growth rates, and changes in the distribution of population by age and sex than would otherwise be expected.

మొజాంబిక్ అధికారికంగా " రిపబ్లికా డి మోజాంబిక ". దేశం తూర్పు సరిహద్దులో హిందూ మహాసముద్రం, ఉత్తరసరిహద్దులో టాంజానియా, వాయవ్య సరిహద్దులో మలావి, జాంబియా, పశ్చిమసరిహద్దులో జింబాబ్వే, ఈశాటిని (స్వాజీలాండ్), నైరుతీ సరిహద్దులో దక్షిణ ఆఫ్రికా ఉన్నాయి. సార్వభౌమ దేశం తూర్పున ఉన్న మొజాంబిక్ చానెల్ ద్వారా కొమొరోస్, మయట్టె, మడగాస్కర్ నుండి వేరు చేయబడింది. మొజాంబిక్ రాజధాని మపుటో (గతంలో 1876 నుండి 1976 వరకు "లౌరెన్కో మార్క్యూలు" అని పిలిచే వారు), అతిపెద్ద నగరంగా ఉంది.

సా.శ. మొదటి, ఐదవ శతాబ్దాల్లో మధ్య బాంటూ మాట్లాడే ప్రజలు ఉత్తర, పశ్చిమ ప్రాంతాల నుండి ప్రస్తుత రోజు మొజాంబికు ప్రాంతానికి వలస వచ్చారు. ఉత్తర మొజాంబిక్ హిందూ మహాసముద్రం రుతుపవన వాణిజ్య పవనాల లోపల ఉంది. 7 వ, 11 వ శతాబ్దాల మధ్య ఇక్కడ స్వాహిలీ పోర్ట్ పట్టణాల వరుస అభివృద్ధి చేయడ్డాయి. ఇది ఒక ప్రత్యేకమైన స్వాహిలి సంస్కృతి, భాష అభివృద్ధికి దోహదపడింది. మధ్యయుగ కాలంలో ఈ పట్టణాలు సోమాలియా, ఇథియోపియా, ఈజిప్టు, అరేబియా, పర్షియా, భారతదేశం నుండి వ్యాపారులు తరచూ వచ్చారు.[6]

1498 లో వాస్కో డ గామా సముద్రయానం 1505 లో వలసరాజ్యస్థాపనకు, స్థిరనివాసానికి దారితీసిన పోర్చుగీసు రాకగా గుర్తించబడింది. నాలుగు శతాబ్దాల పోర్చుగీసు పాలన తరువాత మొజాంబిక్ 1975 లో స్వాతంత్ర్యం పొందింది. ఆ తరువాత కొంతకాలం మొజాంబిక్ పీపుల్సు రిపబ్లికుగా మారింది. రెండు సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత దేశం 1977 నుండి 1992 వరకు కొనసాగిన తీవ్రమైన దీర్ఘకాలిక పౌర యుద్ధం సంభవించింది. 1994 లో మొజాంబిక్ మొదటిసారి బహుళ పార్టీ ఎన్నికలను నిర్వహించింది. అప్పటి నుండి ఇది స్థిరమైన అధ్యక్ష రిపబ్లికుగా (తక్కువ తీవ్రత కలిగిన తిరుగుబాటును ఎదుర్కొన్నప్పటికీ) మిగిలిపోయింది.[7]

మొజాంబిక్ విస్తృతమైన సహజ వనరులను కలిగి ఉంది. దేశం ఆర్థికవ్యవస్థ ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడింది. అయితే పరిశ్రమ రంగం అభివృద్ధి చెందుతూ ఉంది. పరిశ్రమారంగంలో ప్రధానంగా ఆహారం, పానీయాలు, రసాయన తయారీ, అల్యూమినియం, పెట్రోలియం ఉత్పత్తి ప్రాధాన్యత వహిస్తున్నాయి. పర్యాటక రంగం కూడా విస్తరిస్తోంది. దక్షిణ ఆఫ్రికా మొజాంబిక్ ప్రధాన వ్యాపార భాగస్వామి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మూలంగా ఉంది. బెల్జియం, బ్రెజిల్, పోర్చుగల్, స్పెయిన్ దేశంలోని అత్యంత ముఖ్యమైన ఆర్థిక భాగస్వాములుగా ఉన్నాయి. 2001 నుండి మొజాంబిక్ వార్షిక సగటు జి.డి.పి. పెరుగుదల ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. అయినప్పటికీ ఈ దేశం ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత పేద, అభివృద్ధి చెందని దేశాలలో ఒకటిగా ఉంది.[8] అలాగే మొజాంబిక్ తలసరి జి.డి.పి, మానవ అభివృద్ధి, ఆర్థిక అసమానత, ఆయుఃప్రమాణంలో తక్కువ స్థాయిలో ఉంది.

మొజాంబిక్ అధికారిక భాష పోర్చుగీసు. ఇది జనాభాలో సగం మందికి రెండవ భాషగా వాడుకలో ఉంది. సాధారణ స్థానిక భాషలలో మఖూవా, సేన, స్వాహిలి ఉన్నాయి. దాదాపు 29 మిలియన్ల మంది ఉన్న దేశ జనాభా బంటు ప్రజలు అధికంగా ఉన్నారు. మొజాంబికులో అతిపెద్ద మతం క్రైస్తవ మతం, తరువాత ఇస్లాం, ఆఫ్రికా స్థానికసాంప్రదాయ మతాలు ఉన్నాయి. మొజాంబిక్ ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికా యూనియను, కామన్వెల్తు ఆఫ్ నేషన్సు, ఇస్లామికు సహకార సంస్థ, పోర్చుగీసు భాషా దేశాల కమ్యూనిటీ, నాన్-సమన్వయ ఉద్యమం, దక్షిణ ఆఫ్రికా డెవెలప్మెంటు కమ్యూనిటీ సభ్యదేశంగా ఉంది. లా ఫ్రాన్కోఫోనే పరిశీలకదేశాలలో ఒకటిగా ఉంది.

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

మొజాంబిక్ ద్వీపం పేరుతో దేశానికి మొజాంబిక్ అనే పేరు పెట్టబడింది. ముసా బిను బికికు లేదా ముసా అలు బిగు లేదా మొస్సా అలు బికీ లేదా ముసా బెను మొబికి లేదా ముస్సా ఇబ్ను మాలికు అనే ఒక అరబ్ వ్యాపార�� మొదట ఈ ద్వీపాన్ని సందర్శించి అక్కడే నివసించారు. [9] 1898 వరకు ఈ ద్వీపం పట్టణం పోర్చుగీసు కాలనీకి రాజధాని ఉంది. ఇది లారెనుస్కో మార్విసుకు (ఇప్పుడు మపుటో) దక్షిణంవైపు ఉంది.

చరిత్ర

[మార్చు]
Mozambican dhow.

బంటు వలసలు

[మార్చు]

సా.శ. 1 వ, 5 వ శతాబ్దాల మధ్య బంటూ మాట్లాడే ప్రజా తరంగాలు పశ్చిమ, ఉత్తరం నుండి జామ్బేజి నది లోయ మీదుగా ఈ ప్రాంతానికి వలస వచ్చాయి. తరువాత క్రమంగా పీఠభూమి, తీర ప్రాంతాల్లోకి చేరాయి.[10] పశువులమందల ఆధారంగా వారు వ్యవసాయ సంఘాలు (సమాజాలను) ఏర్పాటు చేశారు. వారు ఇనుమును కరిగించి, ఇనుముతో పరికరాలను తయారుచేసే సాంకేతికతను తీసుకువచ్చారు.

స్వాహిలీ తీరం

[మార్చు]
Arab-Swahili slave traders and their captives on the Ruvuma River

సా.శ. మొట్టమొదటి సహస్రాబ్ది నుండి విస్తారమైన హిందూ మహాసముద్ర వర్తక నెట్వర్కు మొజాంబికులోని దక్షిణంవైపుకు చిబినే పురాతన నౌకాశ్రయ పట్టణం చిబుయెనె వరకు విస్తరించింది.[11] 9 వ శతాబ్దం ప్రారంభంలో హిందూ మహాసముద్ర వర్తకం అభివృద్ధి తూర్పు తీరప్రాంతంలో ఆధునిక ఓడరేవు పట్టణాల అభివృద్ధికి (ఆధునిక మొజాంబిక్ సహా) దారితీసింది. అతిపెద్ద స్వయంప్రతి ప్రాంతాలుగా ఉన్న ఈ పట్టణాలు విస్తృతంగా ప్రారంభ స్వాహిలీ సంస్కృతిలో పాల్గొన్నాయి. పట్టణ ఉన్నత వర్గాల ప్రజలు తరచుగా ఇస్లాం మతావలంబకులుగా ఉండడం వాణిజ్యాన్ని సులభతరం చేసింది. 15 వ శతాబ్దం నాటికి మొజాంబిక్, సోపాలా, అంకోచీ, మొజాంబిక్ ద్వీపం ప్రాంతీయ శక్తులుగా అభివృద్ధి చెందాయి.

ఈ పట్టణాలు ఆఫ్రికా అంతర్గత ప్రాంతాలు, విస్తార హిందూ మహాసముద్ర ప్రపంచంతో వాణిజ్యం చేసాయి. ముఖ్యంగా బంగారం, దంతపు వాహన మార్గాలు ఉండేవి. జింబాబ్వే రాజ్యం, ముటాపా రాజ్యం వంటి దేశీయ రాజ్యాలు విలువైన బంగారం, దంతాలు అందించాయి. ఇవి తరువాత కిల్వా, మొంబాసా వంటి పెద్ద పెద్ద నగరాలకు ఎగుమతి చేయబడేవి.[12]

పోర్చుగీసు మొజాంబిక్ (1498–1975)

[మార్చు]
The Island of Mozambique is a small coral island at the mouth of Mossuril Bay on the Nacala coast of northern Mozambique, first explored by Europeans in the late 15th century.

సుమారు 1500 నాటికి పోర్చుగీసు వాణిజ్య పోస్టులు, కోటలు అరబ్బుల వాణిజ్య, సైనిక ఆధిపత్యాన్ని స్థానభ్రంశం చేసాయి. తూర్పున కొత్త ఐరోపా సముద్ర మార్గంలో సాధారణ పోర్టులు మారాయి.[10]

1498 లో కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ వాస్కో డా గామా సముద్రయానం ఈ ప్రాంతంలోని వాణిజ్య, రాజకీయ, సమాజంలో పోర్చుగీసు ప్రవేశానికి మైలురాయిగా నిలిచింది. 16 వ శతాబ్దం ప్రారంభంలో పోర్చుగీసు మొజాంబిక్ ద్వీపంపై నియంత్రణను, సోపల ఓడరేవును స్వంతం చేసుకుంది. 1530 నాటికి పోర్చుగీసు వ్యాపారుల చిన్న సమూహాలు, బంగారం అంవేషకులు బంగారం కొరకు అంవేషిస్తూ లోతట్టు ప్రాంతాలకు చొచ్చుకు పోయారు. అక్కడ వారు జంబేజీ నదీ తీరంలో ఉన్న సేనా, టేటే పట్టణప్రాంతాలలో వాణిజ్యపోస్టులను, సైనిక బృందాలను అభివృద్ధి చేసి బంగారు వాణిజ్యం మీద ప్రత్యేక నియంత్రణ పొందటానికి ప్రయత్నించింది.[13]

మొజాంబిక్ భూభాగం కేంద్ర భాగంలో పోర్చుగీసు వారు చట్టబద్ధంగా మార్చడానికి ప్రాజోలు (భూ గ్రాంట్స్) ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. తద్వారా వారి వర్తకం, స్థావరాలను స్థానాలను చట్టబద్ధంగా ఏకీకరించడానికి ప్రయత్నించింది. పోర్చుగీసు అభివృద్ధి చేసిన ప్రాజోలలోని ప్రజలు వివాహ సంబంధాల ద్వారా ఆఫ్రికన్ పోర్చుగీసు, ఆఫ్రికన్ ఇండియన్ కేంద్రాలుగా గుర్తించబడి చీకూడ అని పిలవబడుతూ పెద్ద ఆఫ్రికన్ బానిస సైన్యాల చేత రక్షించబడ్డాయి.[విడమరచి రాయాలి][ఆధారం చూపాలి]చారిత్రాత్మకంగా మొజాంబిక్ లోపల బానిసత్వం ఉంది. ఆఫ్రికన్ గిరిజన నాయకులు మొట్టమొదటిసారిగా కొనుగోలుచేసి అరబు ముస్లిం వీరు వ్యాపారులకు విక్రయించబడ్డారు. వీరు తరువాత మధ్య తూర్పు ఆసియా నగరాలలో తోటలకు పంపబడ్డారు. తరువాత వీరు పోర్చుగీసు, ఇతర ఐరోపా వర్తకులకు కూడా విక్రయించబడ్డారు. అనేక మొజాంబిక్ బానిసలు గిరిజన నాయకులచే సరఫరా చేయబడ్డారు. పోరాడుతున్న గిరిజనుల మీద దాడి చేసి, వారి బంధీలను ప్రెజెయిరోలకు విక్రయించారు.[13]

లారెన్కో బ్రాండులోని సెంట్రల్ ఎవెన్యూ దృశ్యం, (ప్రస్తుత మపుటో), ca. 1905

పోర్చుగీసు ప్రభావం క్రమంగా విస్తరించినప్పటికీ దాని అధికారం పరిమితంగా ఉండేది. స్వయంప్రతిపత్తి ఇవ్వబడిన వ్యక్తిగత స్థావర నివాసులు, స్వయంప్రత్తిపత్తి కలిగిన అధికారులకు మాత్రమే అధికారం పరిమితం చేయబడింది. 1500, 1700 ల మధ్య పోర్చుగీసు వారు అరబు ముస్లింల నుండి చాలా తీర వ్యాపారాన్ని పొందగలిగారు. 1698 లో మొంబాసా ద్వీపంలో (ప్రస్తుతం కెన్యాలో) ఉన్న ఫోర్టు జీససులోని పోర్చుగలు ప్రధాన స్థావరాన్ని అరబు ముస్లింలు నిర్భందించటంతో లోలకం ఇతర దిశలోకదలడం మొదలైంది. దీని ఫలితంగా లిస్బను భారతదేశం దూరతీర ప్రాంతాలు, బ్రెజిల్ వలసరాజ్యాలతో మరింత లాభదాయక వాణిజ్యం మీద దృష్టి కేంద్రీకరించింది. [10]

ఈ యుద్ధాల సమయంలో మజురి, ఓమాని అరబ్బులు హిందూ మహాసముద్ర వర్తకంలో అధికభాగం తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పోర్చుగీసు దక్షిణప్రాతానికి తిరోగమనం అయింది. 19 వ శతాబ్దం మధ్య నాటికి అనేక ప్రాజోలు క్షీణించాయి. అయితే వాటిలో అనేకం సురక్షింతంగా ఉన్నాయి. 19 వ శతాబ్దంలో ఇతర ఐరోపా శక్తులు, ముఖ్యంగా బ్రిటీషు (బ్రిటిష్ సౌత్ ఆఫ్రికా కంపెనీ), ఫ్రెంచి (మడగాస్కర్), పోర్చుగీసు తూర్పు ఆఫ్రికా ప్రాంతాలు ప్రాంతం వర్తక, రాజకీయాలలో ప్రమేయం చేసుకున్నాయి.[ఆధారం చూపాలి]

Portuguese language printing and typesetting class, 1930

20 వ శతాబ్దం ప్రారంభంలో పోర్చుగీసు మొజాంబిక్ పరిపాలనాధికారాన్ని అధికంగా మోజాంబిక్ కంపెనీ, జామ్బెజియా కంపెనీ, నీసాసు కంపెనీ లాంటి పెద్ద ప్రైవేటు సంస్థలకు మార్చింది. వీటికి అధికంగా "బ్రిటిషు" ఫైనాన్షియర్లైన సొలోమోను జోయెలు (వారి పొరుగు కాలనీలైన దక్షిణాఫ్రికా, రోడేషియా రైలుమార్గం నిర్మించడానికి నిధులను అందించింది) నిధులు అందించారు. మొజాంబికులో బానిసత్వం చట్టబద్ధంగా రద్దు చేయబడినప్పటికీ 19 వ శతాబ్దం చివరలో చార్టర్డు కంపెనీలు బలవంతపు కార్మిక విధానాన్ని అమలు చేశాయి. వీరిని సమీప బ్రిటిషు కాలనీలు, దక్షిణాఫ్రికాలోని గనులు, తోటలకు తరచుగా చౌకైన బలవంతపు-ఆఫ్రికా కార్మికులను సరఫరా చేసింది.[10] చాలా లాభదాయకమైన చార్టర్డు కంపెనీ అయిన " జామ్బెజియా కంపెనీ " అనేక చిన్న ప్రజెయిరో హోల్డింగులను స్వాధీనం చేసుకుని తన ఆస్తిని రక్షించడానికి సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. వారి వస్తువులను మార్కెటులో తీసుకువెళడానికి చార్టర్డు కంపెనీలు రోడ్లు, ఓడరేవులను నిర్మించి ప్రస్తుత జింబావేతో రైలుమార్గం అనుసంధానం చేసింది. [14][15]

ఒలివీర సలజారు కార్పొరేటిస్టు ఎస్టాడో నోవో పాలనలో వారి అసంతృప్తికరమైన పనితీరు, అధికార మార్పిడి కారణంగా, కంపెనీల ఉపసంహరించుకుంటూ కంపెనీల రాయితీలు పునరుద్ధరించబడలేదు. 1942 లో మొజాంబిక్ కంపెనీ వ్యవసాయ, వాణిజ్య రంగాలలో పనిచేయడం కొనసాగింది. 1929 లో నీసా కంపెనీ రాయితీని తొలగించడం జరిగింది. 1951 లో ఆఫ్రికాలోని పోర్చుగీసు విదేశీ కాలనీలు పోర్చుగలు విదేశీ ప్రావింసులుగా మార్చబడ్డాయి.[14][15][16]

మొజాంబిక్ స్వాతంత్ర్య యుద్ధం (1964–1974)

[మార్చు]
Portuguese troops during the Portuguese Colonial War, some loading FN FAL and G3.

కమ్యూనిస్టు వలసవాద వ్యతిరేక సిద్ధాంతాలను ఆఫ్రికా అంతటా విస్తరించడంతో మొజాంబిక్ స్వతంత్రానికి మద్దతుగా పలు రహస్య రాజకీయ ఉద్యమాలు స్థాపించబడ్డాయి. మొజాంబిక్ పోర్చుగీసు జనాభా ప్రయోజనాల కోసం పాలక అధికారులు అభివృద్ధి ప్రణాళికలు, ప్రాథమికంగా విధానాలు రూపొందించి మొజాంబిక్ గిరిజన సమైక్యత, స్థానిక సమాజాల అభివృద్ధికి తక్కువ శ్రద్ధ చూపించాయని ఈ ఉద్యమాలు పేర్కొన్నాయి.[17]

అధికారిక గెరిల్లా వాంగ్మూలంలో ఇది ప్రభుత్వ - ప్రాయోజిత వివక్ష, అపారమైన సాంఘిక ఒత్తిడిని ఎదుర్కొన్న స్థానిక ప్రజలను ప్రభావితం చేసిందని పేర్కొనబడింది. చాలామంది తమ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి, వారి ఆర్థిక, సాంఘిక పరిస్థితిని ఐరోపియన్ల స్థాయిలో మెరుగుపర్చడానికి చాలా తక్కువ అవకాశాలు, వనరులు ఉన్నాయని భావించారు. సంఖ్యాపరంగా మొజాంబిక్ పోర్చుగీసు శ్వేతజాతీయులు నల్లజాతీయుల కంటే అధిక సంపన్నులుగా, మరింత నైపుణ్యం గలవారుగా ఉన్నారు. గెరిల్లా ఉద్యమానికి ప్రతిస్పందనగా 1960 నుండి పోర్చుగీసు ప్రభుత్వం ప్రధానంగా 1970 ల ప్రారంభంలో అందరి కోసం కొత్త సామాజిక, ఆర్థిక అభివృద్ధి సమీకృత విధానాలలో క్రమంగా మార్పులు ప్రారంభించాయి.[ఆధారం చూపాలి]

1964 సెప్టెంబరులో పోర్చుగీసు పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా ప్రచారం ప్రారంభించింది. అంగో���ా, పోర్చుగీసు గినియా, ఇతర పోర్చుగీసు కాలనీలలో రెండింటితో, ఇతర పోర్చుగీసు కాలనీలు " పోర్చుగీసు కాలనీయలు యుద్ధం (1961-1974)"లో పాల్గొన్నారు. సైనిక దృక్పథంలో " పోర్చుగీసు రెగ్యులరు ఆర్మీ " జనాభా కేంద్రాలపై నియంత్రణను కొనసాగించింది. గెరిల్లా బలగాలు ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో వారి ప్రభావాన్ని తగ్గించాలని ప్రయత్నించాయి. ఎఫ్.ఆర్.ఇ.ఎల్.ఐ.ఎం.ఒ.వారి స్పందనలో భాగంగా పోర్చుగీసు ప్రభుత్వం సాంఘిక అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించడం మీద మరింత శ్రద్ధ పెట్టింది.[18]

స్వతంత్రం (1975)

[మార్చు]

1974 ఏప్రెలున " కార్నేషన్ విప్లవం "తో అపోడో నోవో పాలన పతనం చేసి ప్రిలిమో ఈ భూభాగం మీద నియంత్రణ సాధించింది. 1975 నవంబరు 25 న జరిగిన తిరుగుబాటు విఫలం అయింది. అలాగే పోర్చుగల్ యొక్క సొంత తిరిగి ప్రజాస్వామ్యం తిరిగి భూభాగం నియంత్రణను చేపట్టింది. ఒక సంవత్సరం లోపు మొజాంబికులో ఉన్న 2,50,000 మంది పోర్చుగీసు ప్రజలు దేశం విడిచి పోయారు. వీరిలో కొంతమందిని స్వతంత్ర భూభాగాల ప్రభుత్వం బహిష్కరించింది. కొంతమంది భయపడి పారిపోయారు. 1975 జూన్ 25 న మొజాంబిక్ పోర్చుగల్ నుండి స్వతంత్రం పొందింది. అర్మండో ఫ్రీలామో పార్టీకి చెందిన గువేభుజా పోర్చుగీసును 24 గంటలలో దేశం విడిచిపెట్టి 20 కిలోల (44 పౌండ్ల) లగేజు మాత్రమే తీసుకుని దేశమును విడిచిపెట్టి పోవాలని చట్టబద్ధంగా ప్రకటించాడు. వారి ఆస్తులలో ఏవీ రక్షించలేక వీరిలో ఎక్కువమంది పన్నిరహితంగా (పైసా లేకుండా) పోర్చుగలుకు తిరిగి వెళ్ళారు.[19]

మొజాంబిక్ అంతర్యుద్ధం (1977–1992)

[మార్చు]
A land mine victim in Mozambique

అధ్యక్షుడు సమోర మాచేలు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం మార్కిస్టు సిద్ధాంతాల ఆధారంగా ఏక పార్టీని దేశాన్ని స్థాపించింది. ఇది క్యూబా, సోవియటు యూనియను నుండి దౌత్య, సైనిక మద్దతు పొందింది. ప్రతిపక్షాన్ని పడగొట్టడానికి ప్రయత్నించింది.[20] స్వతంత్రం తరువాత 1977 నుండి 1992 వరకు " కమ్యూనిస్టు వ్యతిరేక మొజాంబిక్ జాతీయ ప్రతిఘటన " తిరుగుబాటు సైన్యం, ఎఫ్.ఆర్.ఎల్.ఐ.ఎం.ఒ. పాలన, ప్రతిపక్ష దళాల మధ్య సుదీర్ఘ, హింసాత్మక పౌర యుద్ధంతో బాధపడింది. ఈ సంఘర్షణ మొదటి దశాబ్దాలలో మొజాంబిక్ స్వాతంత్ర్య పోరాటంగా వర్గీకరించబడింది. ఇందులో పొరుగు దేశాలైన రోడేసియా, దక్షిణ ఆఫ్రికా విద్రోహంతో, అసమర్థమైన విధానాలు, విఫలమైన కేంద్ర ప్రణాళిక ఫలితంగా వచ్చిన ఆర్థిక పతనం భాగంగా ఉన్నాయి.[21] కుప్పకూలిన మౌలిక వనరులు, ఉత్పాదక రంగంలో పెట్టుబడి లేకపోవటం, ప్రైవేటు యాజమాన్య పరిశ్రమలను ప్రభుత్వం జాతీయం చేయడం, విస్తృతమైన కరువులకు ఈ కాలము గుర్తించబడింది.

అంతర్యుద్ధ కాలంలో ఎఫ్.ఆర్.ఇ.ఎల్.ఐ.ఎం.ఒ- రూపొందించిన కేంద్రీకృత కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల వెలుపల సమర్థవంతమైన నియంత్రణను సాధించలేకపోయింది. వీటిలో చాలా వరకు రాజధాని నుండి తొలగించబడ్డాయి.[10] ఆర్.ఇ.ఎన్.ఎ.ఎం.ఒ. నియంత్రిత ప్రాంతాలలో 50% గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. వారికి ఎటువంటి ఆరోగ్య సేవలు ఆ ప్రాంతాలలో సంవత్సరములుగా అందుబాటులో నివేదించబడింది. ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని తగ్గించినప్పుడు ఈ సమస్య మరింత దిగజారింది.[22] ఘర్షణలో రెండు వైపుల నుండి ఉమ్మడి మానవ హక్కుల ఉల్లంఘనలతో ఈ యుద్ధం గుర్తించబడింది. ఆర్.ఇ.ఎన్.ఎ.ఎం.ఒ. ఉగ్రవాదం, పౌరుల విచక్షణారహిత లక్ష్యాలు గందరగోళానికి దోహదం చేసింది.[23][24] కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తన నియంత్రణను విస్తరించే ప్రయత్నంలో వేలాది మంది వ్యక్తులను ఉరితీసింది. " రీ ఎజ్యుకేషను కేంపు "కు పంపిన వేలాది మంది మరణించారు.[23]

1975 లో భౌగోళిక రాజకీయ పరిస్థితి, ఫ్రెలిమోకు స్నేహపూర్వక దేశాలు నారింజలో చూపించబడ్డాయి

యుద్ధ సమయంలో రెనామో-నియంత్రిత ఉత్తర, పశ్చిమ భూభాగాలను " రిపబ్లికు ఆఫ్ రొబేషియా " విభజించటం ద్వారా శాంతి ఒప్పందం ప్రతిపాదించింది. కానీ ఫ్రెలిమో దానిని తిరస్కరించి మొత్తం దేశం అవిభక్త సార్వభౌమత్వం కావాలని నొక్కి చెప్పింది. పౌర యుధ్ధంలో ఒక మిలియన్ మొజాంబిక్ పౌరులు మరణించినట్లు అంచనా వేశారు. 1.7 మిలియన్లు పొరుగు రాజ్యాలలో శరణార్ధులు కాగా, అనేక మిలియన్లు అంతర్గతంగా స్థానభ్రంశం చెందాయి.[25] ఫ్రెలిమో పాలన దక్షిణాఫ్రికా (ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్), జింబాబ్వే (జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్) తిరుగుబాటు ఉద్యమాలకు ఆశ్రయం ఇచ్చి మద్దతు ఇచ్చింది. రోడేషియా, తరువాత దక్షిణాఫ్రికా ప్రభుత్వాలు (ఆ సమయంలో ఇంకా వర్ణవివక్ష లేనివి) రెనామోకు పౌర యుద్ధంలో మద్దతు ఇచ్చాయి.[10]

1986 అక్టోబరు 19 న సమురాయ్ మాచేల్ అధ్యక్షుడు టుపోలెవ్ టు -133 విమానాలలో జాంబియాలో అంతర్జాతీయ సమావేశంలో పాల్గొని తిరుగుముఖం పట్టిన సమయంలో విమానం మొబిజిని సమీపంలోని లేబంబో పర్వతాలపై కూలిపోయింది. పది ప్రాణాలతో ఉన్నప్పటికీ మొజాంబిక్ ప్రభుత్వానికి చెందిన మంత్రులు, అధికారులతో అధ్యక్షుడు మాచేలుతో 30 మంది మృతి చెందారు. ఐక్యరాజ్యసమితి, సోవియట్ ప్రతినిధి బృందం వారి నైపుణ్యం, అనుభవం దక్షిణాఫ్రికాచే బలహీనపడినట్లు పేర్కొంటూ ఒక మైనారిటీ నివేదికను విడుదల చేసింది. సోవియట్ యూనియను ప్రతి���ిధులు దక్షిణ ఆఫ్రికన్ ప్రభుత్వం సైనిక గూఢచార కార్యకర్తలచే అందించబడిన సాంకేతికతను ఉపయోగించి తప్పుడు నావిగేషనల్ బెకన్ సిగ్నల్ ద్వారా విమానం ఉద్దేశపూర్వకంగా మళ్లించారనే సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు.[26]

మాచెల్ వారసుడిగా ఉన్న జోక్విమ్ చిస్సానో మార్క్సిజం నుండి పెట్టుబడిదారీ విధానానికి మారుతున్న సంస్కరణలు ప్రారంభించి, రెనామోతో శాంతి చర్చలు ప్రారంభించారు. 1990 లో కొత్త రాజ్యాంగం బహుళ పార్టీ రాజకీయ వ్యవస్థ, మార్కెటు ఆధారిత ఆర్థిక వ్యవస్థ, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను అందించింది. 1992 అక్టోబరులో పౌర యుద్ధం " రోమ్ జనరల్ పీస్ ఆకార్డాతో " ముగిసింది. ముందుగా " మొజాంబిక్ క్రిస్టియన్ కౌన్సిల్ (ప్రొటెస్టంట్ చర్చిల కౌన్సిల్)" ద్వారా మధ్యవర్తిత్వం వహించి సంట్ ఎగిజియో సంఘం స్వాధీనం చేసుకుంది. ఐక్యరాజ్యసమితి ONUMOZ శాంతి పరిరక్షక శక్తి పర్యవేక్షణలో మొజాంబికులో తిరిగి శాంతి స్థాపించబడింది.[10][27]

ప్రజాపాలనా యుగం (1993–ప్రస్తుతం)

[మార్చు]
A US helicopter flying over the flooded Limpopo River during the 2000 Mozambique flood.

1994 లో మొజాంబిక్ ఎన్నికలను నిర్వహించింది. అనేక రాజకీయ పార్టీలు స్వేచ్ఛగా, న్యాయమైనవిగా నిర్వహించబడ్డాయని అంగీకరించాయి. జోయాక్విమ్ చిస్సానో నాయకత్వంలో ఫ్రిలిమొ విజయం సాధించింది. అపోన్సో డులకామా నాయకత్వంలోని రేనామో అధికారిక ప్రతిపక్షంగా ఉంది.

1995 లో మొజాంబిక్ కామన్వెల్తు ఆఫ్ నేషంసులో సభ్యదేశం అయింది. ఆ సమయంలో బ్రిటీషు సామ్రాజ్యంలో ఎన్నడూ ఉండని ఏకైక సభ్య దేశంగా మొజాంబిక్ ప్రత్యేకత సంతరించుకుంది.

1995 మధ్య నాటికి పొరుగు దేశాల నుండి 1.7 మిలియన్ల మంది శరణార్థులు మొజాంబికుకు తిరిగి వచ్చారు. ఉప-సహారా ఆఫ్రికాలో స్వదేశానికి తిరిగి చేరిన ప్రజల సంఖ్యగా ఇది ప్రత్యేకత సంతరించుకుంది. అదనంగా 4 మిలియన్ల మంది అంతర్గత స్థానికులు వారి గృహాలకు తిరిగి వచ్చారు.[10]

1999 డిసెంబరులో మొజాంబిక్ పౌర యుద్ధం తర్వాత రెండవ సారి ఎన్నికలు జరిగాయి. ఎన్నికలలో తిరిగి ఫ్రిలిమొ విజయం సాధించింది. రెనామో ఎన్నికలో ఫ్రమ్లిమో మోసం చేసిందని ఆరోపించింది. పౌర యుద్ధం తిరిగి సంభవిస్తుందని భీతిచెందారు. కానీ సుప్రీం కోర్టుకు ఈవిషయంలో విచారణ స్వీకరించడంతో పరిస్థితి చక్కబడింది. కోర్టులో కేసు అపజయం ఎదుర్కొన్నది.

2000 ఆరంభంలో తుఫాను కారణంగా దేశంలో విస్తృతమైన వరదలు సంభవించాయి. వరదల కారణంగా వందలాది మంది చనిపోయారు. మౌలికనిర్మాణాలలో ప్రమాదకరమైన వినాశనం సంభవించింది. విదేశీ సహాయక వనరులను శక్తివంతమైన ఫ్రిలిమొ నాయకులు మళ్లించారనే అనుమానాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ ఆరోపణలను దర్యాప్తు చేసే పాత్రికేయుడు కార్లోస్ కార్డోసో హత్య చేయబడ్డాడు. అతని మరణం గురించిన విచారణ సంతృప్తికరంగా జరగలేదు.

2001 లో చిసానో మూడోసారి పోటీ చేయబోనని సూచించి చిసానో తన కంటే ఎక్కువకాలం ఉండిన నాయకులను విమర్శించాడు. సాధారణంగా ఇది జాంబియా అధ్యక్షుడు ఫ్రెడెరికు చిలుబాకు సూచనగా భావించబడింది. ఆయన ఆ సమయంలో మూడవసారి పోటీ చేసాడు. జింబాబ్వే అధ్యక్షుడు రాబర్టు ముగాబే నాల్గవ మారు పోటీ చేసాడు. అధ్యక్ష, జాతీయ అసెంబ్లీ ఎన్నికలు 1- 2004 డిసెంబరు 2 డిసెంబరు 1-2 న జరిగాయి. ఫ్రీలామో అభ్యర్థి అర్మండో గువేబుసా 64% ఓట్లతో గెలుపొందారు. ప్రత్యర్థి రాంమోమో యొక్క అపోన్సో ళలకామా 32% ఓట్లను పొందారు. పార్లమెంటులో 160 స్థానాలను ఫ్రెలిమో గెలుచుకుంది. రెనామో సంకీర్ణ, అనేక చిన్న పార్టీలు కలిసి 90 స్థానాలను గెలుచుకున్నాయి. 2005 ఫిబ్రవరిన గువేభుజా మొజాంబిక్ అధ్యక్షుడిగా పాలన ప్రారంభించాడు. ఆయన రెండు ఐదు-సంవత్సరాల పదవీకాలాన్ని అందించాడు. అతని వారసుడు ఫిలిప్ న్యుసి, 2015 జనవరి 15 న మొజాంబిక్ 4 వ అధ్యక్షుడు అయ్యాడు.

2013 నుండి దేశంలోని మధ్య, ఉత్తర ప్రాంతాలలో రెనామో తక్కువ తీవ్రత కలిగిన తిరుగుబాటు జరిగింది. 2014 సెప్టెంబరు 5 న సైనిక ఉద్రిక్తత కారణంగా మాజీ అధ్యక్షుడు గువేబుజ, రెనామో డ్లకమా నాయకుడు నాయకత్వం విరమణ ఒప్పందంపై సంతకం చేశారు. ఇది సైనిక ఉద్రిక్తతలకు విరమణ తీసుకువచ్చింది. 2014 అక్టోబరులో జరిగే సాధారణ ఎన్నికల మీద రెండు పార్టీలు దృష్టి పెట్టాయి. ఎన్నికలలో ఒక కొత్త రాజకీయ సంక్షోభం ఉద్భవించి దేశం హింసాత్మక సంఘర్షణ అంచున మరోసారి నిలిచింది. రెనెమొ ఎన్నికల ఫలితాల విశ్వసనీయతను అంగీకరించకుండా నాంపూల, నీయస్సా, టెటే, జామ్బెజియా, సోఫాలా, మనికా - ఆరు ప్రావిన్సుల నియంత్రణను కోరింది. అక్కడ వారు మెజారిటీని సాంధించారని భావించారు.[7] పొరుగున ఉన్న మాలావిలో దాదాపు 12,000 శరణార్థులు ఉన్నారు.[28] యు.ఎన్.హెచ్.సి.ఆర్, వైద్యులు వితౌటు బోర్డర్సు, హ్యూమను రైట్సు వాచు ప్రభుత్వ దళాలు గ్రామాలను వేధించాయని, మరణశిక్షలు, లైంగిక వేధింపులు జరిగాయని నివేదించాయి.[29]

భౌగోళికం, వాతావరణం

[మార్చు]
శాటిలైటు చిత్రం

309,475 చ.మై (801,537 చ.కి.మీ) వైశాల్యంతో మొజాంబిక్ ప్రపంచంలో 36 వ అతిపెద్ద దేశంగా ఉంది. ఇది టర్కీ పరిమాణానికి సమానంగా ఉంటుంది. మొజాంబిక్ ఆఫ్రికా ఆగ్నేయ తీరంలో ఉంది. దేశ దక్షిణసరిహద్దులో దక్షిణాఫ్రికా, పశ్చిమసరిహద్దులో జింబాబ్వే, జాంబియా, మలావి దేశాలు ఉన్నాయి, వాయవ్యసరిహద్దులో టాంజానియా, తూర్పున హిందూ మహాసముద్రం వరకు స్వాజీలాండ్ ఉంది. మొజాంబిక్ 10 ° - 27 ° దక్షిణ అక్షాంశం, 30 ° - 41 ° తూర్పు రేఖాంశంలో ఉంది.

దేశాన్ని జామ్బెజీ నదిచే రెండు ప్రాంతాలుగా విభజిస్తుంది. జంబేజీ నది ఉత్తరాన ఇరుకైన తీరప్రాంతం లోతట్టు కొండలు, దిగువ పీఠభూమిలకు దారితీస్తుంది. పశ్చిమంలో ఎగుడు, దిగుడు పర్వత ప్రాంతాలు ఉన్నాయి. అవి నయాసా పర్వత ప్రాంతములు, నములి (షైరు పర్వత ప్రాంతములు), అంగోనియా పర్వతములు, టెటె హైలాండ్సు, మకోండ పీఠభూమి, మియోంబొ అడవులతో కప్పబడి ఉంటుంది. దక్షిణప్రాంతంలో ఉన్న మసోనాల్యాండు పీఠభూమి, లెబోంబ పర్వతాలు ఉన్నాయి.

దేశంలో ఐదు ప్రధాన నదులు, అనేక చిన్న ప్రవాహాలు ఉన్నాయి. వీటిలో జంబేజీ నది అతిపెద్ద, అతి ముఖ్యమైన నదిగా ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో నాలుగు ప్రసిద్ధ సరస్సులు ఉన్నాయి: నియాస్సా సరస్సు (మాలావి), చిట సరసు, కాహోరా బాస్సా సరసు, షిర్వా సరస్సు ఉన్నాయి. ఇవి అన్ని ఉత్తరప్రాంతంలో ఉన్నాయి. ప్రధాన నగరాలలో మపుటో, బెయిరా, నంపుల, టెటె, క్యులీమనే, చిమోయియో, పెమ్బా, ఇన్హాంబనె, క్సై-క్సై, లిచింగా ప్రాధాన్యత వహిస్తున్నాయి.

వాతావరణం

[మార్చు]
Mozambique map of Köppen climate classification

మొజాంబికూలో ఉష్ణమండల వాతావరణం నెలకొని ఉంటుంది. అక్టోబరు నుండి మార్చి వరకు, ఏప్రిల నుండి సెప్టెంబరు వరకు పొడి సీజను ఉంటుంది. వాతావరణ పరిస్థిత���లు ఎత్తుపై ఆధారపడి ఉంటాయి. తీరం వెంట వర్షపాతం భారీగా ఉంటుంది. ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో వర్షపాతం తగ్గుతుంది. వార్షిక పాతం ప్రాంతాల వారిగా వ్యత్యాసాలు ఉంటాయి. 500 నుండి 900 మి.మీ (19.7 నుండి 35.4 అం) వరకు ఉంటుంది. సగటున 590 మి.మీ (23.2 అం). తుఫానులు సాధారణంగా సంభవిస్తూ ఉంటాయి. మపుటోలో సగటు ఉష్ణోగ్రత జూలైలో 13 నుండి 24 ° సెం (55.4 నుండి 75.2 ° ఫా), ఫిబ్రవరి 22 నుండి 31 డిగ్రీల సెం ఉంటుంది.

వన్యజీవితం

[మార్చు]

మొజాంబికులో ఉన్న 740 పక్షిజాతులలో ప్రపంచవ్యాప్తంగా అంతరించి పోతున్న 20 జాతులు, ప్రవేశపెట్టిన జాతులు ఉన్నాయి. మొజాంబికులో 200 కంటే అధికంగా క్షీరదాలు ఉన్నాయి. వీటిలో అంతరించిపోతున్న సెలౌసు 'జీబ్రా, విన్సెంటు బుషు ఉడుత, 13 ఇతర అంతరించిపోతున్న జాతులు ఉన్నాయి.

మొజాంబిక్ రక్షిత ప్రాంతాలలో 13 అటవీ నిల్వలు, 7 జాతీయ ఉద్యానవనాలు, 6 ప్రకృతి నిల్వలు, 3 సరిహద్దు పరిరక్షణ ప్రాంతాలు, 3 వన్యప్రాణి (వేట ప్రాంతాలు) ఉన్నాయి.

ఆర్ధికం

[మార్చు]
A proportional representation of Mozambique's exports

అధికారిక కరెన్సీగా " న్యూ మెటాలిక " (2018 మార్చి నాటికి $ 1 అమెరికా డాలరుకుదాపు 62 న్యూ మెటికల్సు సమానం). పాత మెటికలు విలువ 1 అమెరికా డాలరుకు 1000 మెటికల్సుగా ఉండేది. 2012 చివరి వరకు పాత కరెన్సీ " బ్యాంకు ఆఫ్ మొజాంబిక్ " మార్చుకునడానికి వీలు కల్పించబడింది. అమెరికా డాలరు, దక్షిణాఫ్రికా రాండు, ఇటీవలి కాలంలో యూరోలు కూడా వ్యాపార లావాదేవీలలో ఆమోదించబడ్డాయి. కనీస చట్టబద్ధమైన జీతం నెలకు 60 అమెరికా డాలర్లు. మొజాంబిక్ దక్షిణ ఆఫ్రికా డెవలప్మెంటు కమ్యూనిటీలో సభ్యదేశంగా ఉంది.[10] ఎస్.ఎ.డి.సి. ఉచిత వాణిజ్య ప్రోటోకాల్ సుంకాలను, ఇతర వాణిజ్య అడ్డంకులను తొలగించడం ద్వారా దక్షిణాఫ్రికా ప్రాంతం మరింత పోటీని ఎదిరించి నిలవడం లక్ష్యంగా పెట్టుకుంది. 2007 లో ప్రపంచ బ్యాంక్ మొజాంబిక్ " బ్లిస్టరింగు పేస్ ఆఫ్ ఎకనమిక్ గ్రోతు " అభివర్ణించింది. 2007 ప్రారంభంలో ఒక ఉమ్మడి దాత-ప్రభుత్వ అధ్యయనం మొజాంబిక్ సహాయంతో విజయం సాధించిన దేశంగా భావించబడుతుందని తెలిపింది. 2007 ప్రారంభంలో ఐఎంఎఫ్, 'మొజాంబిక్ అనేది ఉప-సహారా ఆఫ్రికాలో విజయం సాధించిన దేశం' అని తెలిపింది. స్పష్టమైన విజయాన్ని సాధించినప్పటికీ ప్రపంచ బ్యాంకు, యునిసెఫ్ రెండూ కూడా జి.డి.పి. పెరుగుదల ఉన్నప్పటికీ దీర్ఘకాలిక పిల్లల పోషకాహార లోపం ('పారడాక్సు') సమస్యను ఎదుర్కొంటున్నదని భావించబడుతుంది. 1994 - 2006 మధ్య సగటు వార్షిక జి.డి.పి. పెరుగుదల సుమారు 8%. అయినప్పటికీ ఈ దేశం ప్రపంచంలో పేద, అత్యంత అభివృద్ధి చెందని దేశాలలో ఒకటిగా ఉంది. 2006 లో జరిగిన ఒక సర్వేలో మొజాంబికుకు చెందిన 75% మంది గత ఐదేళ్లలో వారి ఆర్థిక స్థితి అదే విధంగా ఉండిపోవడం, దారుణంగా మారిందని తెలియజేసారు.[30]

తిరిగి అభివృద్ధి

[మార్చు]

పౌరయుద్ధ శరణార్ధుల పునరావాసం, విజయవంతమైన ఆర్థిక సంస్కరణలు అధిక వృద్ధిరేటుకు దారితీశాయి: 1996 - 2006 మధ్యకాలంలో సగటున 8% వార్షిక వృద్ధి రేటును సాధించింది.[31] 2006 నుండి 2011 మద్యకాలంలో 6-7% అభివృద్ధి జరిగింది.[2] 2000 ప్రారంభంలో జరిగిన వినాశకరమైన వరదలు జి.డి.పి పెరుగుదలను 2.1%కు తగ్గించింది.[10] అయినప్పటికీ 2001 లో 14.8% పెరుగుదలతో పూర్తి పునరుద్ధరణ పొందింది.[ఆధారం చూపాలి] బృహత్తర విదేశీ పెట్టుబడుల ప్రాజెక్టులు, ఆర్థిక సంస్కరణ కొనసాగింపు, వ్యవసాయం, రవాణా, పర్యాటక రంగాల పునరుజ్జీవనం ఆర్థికరగం అభివృద్ధిని కొనసాగిస్తుందని భావించబడింది.[10] 2013 లో సుమారు 80% ప్రజలకు వ్యవసాయంలో ఉపాధి కల్పించబడింది. వీరిలో చాలామంది చిన్నస్థాయి వ్యవసాయాన్ని జీవనాధారంగా ఎంచుకుంటున్నారు.[32] వ్యవసాయరంగం ఇప్పటికీ మౌలిక వసతులు కొరత, వాణిజ్య నెట్వర్కుల కొరత, పెట్టుబడుల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.[10] అయినప్పటికీ 2012 లో మొజాంబిక్ 90% వ్యవసాయభూలలో ఇప్పటికీ సాగు చేయబడలేదు.

మొజాంబికులో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, పోర్చుగలులోని పేలవమైన ఆర్థిక పరిస్థితి కారణంగా 2009 లో పోర్చుగీసు మొజాంబికుకు తిరిగివచ్చిందని ఒక బి.బి.సి. కథనం పేర్కొంది.[33]

ఆర్ధిక సంస్కరణలు

[మార్చు]
Maputo, the capital of Mozambique is the largest city in the country and is separate from the Maputo Province. On the image the Port of Maputo is featured, the second largest in East Africa

ప్రభుత్వ రంగానికి చెందిన 1,200 కంటే అధికమైన చిన్న సంస్థలు ప్రైవేటీకరించబడ్డాయి. ఇతర వ్యక్తిగత సంస్థలకు, టెలీకమ్యూనికేషన్సు, శక్తి, పోర్టులు, రైల్వేలు ప్రైవేటీకరణ, రంగాల సరళీకరణ సన్నాహాలు తయారు చేయబడ్డాయి. వ్యక్తిగత సంస్థలను ప్రైవేటీకరించేటప్పుడు ప్రభుత్వం తరచూ వ్యూహాత్మకంగా విదేశీ పెట్టుబడిదారుడిని ఎంపిక చేసింది. అదనంగా కస్టమ్సు పన్నులు తగ్గించబడి, కస్టమ్సు నిర్వహణ క్రమబద్ధీకరించబడి, సంస్కరించబడింది. దేశీయ ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం 1999 లో విలువ ఆధారిత పన్నును ప్రవేశపెట్టింది. 2003-04 లలో వాణిజ్య కోడు సంస్కరణలో చేర్చబడ్డాయి. సమగ్ర న్యాయ సంస్కరణ, ఆర్థిక రంగం బలపడడం కొనసాగింది; పౌర సేవా సంస్కరణ, మెరుగుపరచబడిన ప్రభుత్వ బడ్జెటు, ఆడిటు, తనిఖీ సామర్ధ్యం.[10] రాజకీయ అస్థిరత, వరదల కారణంగా వేలాది మంది ప్రజలు వారి స్వంత దేశంలో నిరాశ్రయులయ్యారు.[10]

అవినీతి

[మార్చు]
Traditional sailboat in Ilha de Moçambique

మొజాంబిక్ ఆర్థిక వ్యవస్థలో అనేక అవినీతి కుంభకోణాల కారణంగా కదలిక మొదలైంది. 2011 జూలైలో నిధుల దుర్వినియోగం, ప్రజాధనాన్ని అపహరించడం మొదలైనవి నేరాలుగా పరిగణిస్తూ ప్రభుత్వం కొత్త అవినీతి వ్యతిరేక చట్టాలు ప్రతిపాదించారు. ఇది మంత్రిమండలి ఆమోదాన్ని పొందింది.[34]

మొజాంబిక్ ప్రపంచవ్యాప్త అవినీతికి సంబంధించిన తాజా సూచిక అయిన " ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనలు " తాజా సూచికలో 178 దేశాలలో మొజాంబిక్ 116 వ స్థానంలో ఉంది. 2005 లో వ్రాసిన ఒక " యు.ఎస్. ఎయిడు " నివేదిక ఆధారంగా "మొజాంబికులో అవినీతి స్థాయి, పరిధి భయభ్రాంతులకు కారణమవుతుంది." [35]

2012 మార్చిలో దక్షిణ మొజాంబిక్ ప్రావిన్సు ఇన్హంబనే ప్రభుత్వం ప్రొవిన్షియలు యాంటీ-డ్రగ్సు ఆఫీసు డైరెక్టరు " కాలిస్టో అల్బెర్టో టోమో " ప్రజా నిధుల దుర్వినియోగాన్ని వెల్లడించింది. 2008 - 2010 మధ్యకాలంలో ఆయన 2,60,000 మెటికాయిసులను (మొజాంబిక్ ద్రవ్యం) దొంగిలించడానికి యాంటీ డ్రగ్సు ఆఫీసు (రెకడా గ్వాంబె) అకౌంటెంటుతో చేతులు కలిపాడని ఆరోపించబడింది.[36]

మొజాంబిక్ ప్రభుత్వం అవినీతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. 2012 లో అనేక నూతన అవినీతి వ్యతిరేక బిల్లుల కొన్ని సానుకూల పరిణామాలు గమనించవచ్చు.[37]

సహజ వనరులు

[మార్చు]

మోజాంబికులో భారీ సహజ వాయువు నిక్షేపాలు కనుగొనబడ్డాయి. ఇది మొజాంబిక్ ఆర్థిక వ్యవస్థను నాటకీయంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.[38]

పర్యాటకం

[మార్చు]
European tourists on the beach, in Inhambane, Mozambique

మొజాంబిక్ పర్యాటకులను ఆకర్షిస్తుంది. దేశం సహజ పర్యావరణం, వన్యప్రాణి, చారిత్రాత్మక వారసత్వం అందిస్తున్న సముద్ర తీరాలు, సాంస్కృతిక, పర్యావరణ-పర్యాటక రంగ ఆకర్షణలలో ప్రాధాన్యత వహిస్తున్నాయి.[ఆధారం చూపాలి] మొజాంబిక్ పర్యాటకరంగా అభివృద్ధికి అవసరమైన స్థూల దేశీయ ఉత్పత్తి (జి.డి.పి) లో గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. [ఆధారం చూపాలి] పర్యాటకరంగం ప్రస్తుతం జి.డి.పి.లో 5.6% మాత్రమే భాగస్వామ్యం వహిస్తూ ఉంది.[ఆధారం చూపాలి]

పరిశిభ్రమైన నీటిని కలిగి ఉన్న బీచులు పర్యాటకానికి అనుకూలంగా ఉన్నాయి. పట్టణ కేంద్రాల నుండి చాలా దూరంలో ఉన్న కాఫీ డెల్గాడో ప్రావిన్సు, ముఖ్యంగా క్విర్బింసు ద్వీపాలు, ఇన్హంబనె ప్రావిన్సు బజార్యుటో ద్వీపసమూహాలు ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి.[ఆధారం చూపాలి]

దేశంలో అనేక జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. వాటిలో గోరోంగోసా నేషనల్ పార్కు అంతరించిపోతున్న జంతువులకు పునరావాసం కల్పిస్తూ వాటిని సంఖ్యాపరంగా అభివృద్ధి చేస్తుంది. [ఆధారం చూపాలి]

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]
Steam locomotive at Inhambane, 2009.
National Mozambican airline, LAM Mozambique

మోజాంబికులో రైలుమార్గం, రహదారి మార్గం, జలమార్గం, వాయుమార్గం ద్వారా రవాణా సౌకర్యాలు కల్పించబడుతున్నాయి.

30,000 కిలోమీటర్ల పొడవైన రహదార్లు ఉన్నాయి. కానీ చాలావరకు రహదారి నెట్వర్కుకు పాదచారి బాటలు నిర్మించబడలేదు. పొరుగున ఉన్న కామన్వెల్తు దేశాలలో ఉన్నట్లు ట్రాఫికు ఎడమవైపు తిరుగుతుంది.

మపుటోలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, 21 ఇతర మెరుగైన విమానాశ్రయాలు, యుద్ధ విమానాలు కొరకు రంవేరహితమైన 100 ఎయిరు స్ట్రిపులు ఉన్నాయి.

హిందూ మహాసముద్ర తీరంలో అనేక పెద్ద ఓడరేవులు ఉన్నాయి. వీటిలో నాకాలా, బెయిరా, మపుటో మొదలైన ప్రధాన నౌకాశ్రయాలు ఉన్నాయి. మరిన్ని నౌకాశ్రయాలు అభివృద్ధి చేయబడ్డాయి. 3,750 కిలోమీటర్ల పొడవైన నౌకాయాన జలమార్గాలు ఉన్నాయి. ప్రధాన నగరాలకు రైలు మార్గాలతో నౌకాశ్రయాలు అనుసంధానించబడి ఉన్నాయి. మొజాంబిక్ జలమార్గాలతో మలావి, జింబాబ్వే, దక్షిణాఫ్రికాతో అనుసంధానించబడి ఉన్నాయి.

మొజాంబిక్ హిందూ మహాసముద్రతీరంలో ఉన్న మూడు వేర్వేరు నౌకాశ్రయాలు రైలుమార్గాల టెర్మినల్సుగా పనిచేస్తున్నాయి. ఇవి శతాబ్దానికి ముందే ఆరంభించి అభివృద్ధి చేయబడుతూ ఉన్నాయి. మొజాంబిక్ అంతర్యుద్ధంలో రైలు మార్గాలను లక్ష్యంగా చేసుకుని తిరుగుబాటుదారులు విద్రోహచర్యలకు పాల్పడ్డారు. అంతర్యుద్ధంలో రైలుమార్గాలను అధికంగా రెనామో తిరుగుబాటు దారులు విధ్వంసం చేసారు. తరువాత ఇవి పునరుద్దరించబడ్డాయి. పోర్సాసు ఇ కామిన్హోసు డి ఫెర్రో డి మోచంబిక (మొజాంబిక్ నౌకాశ్రయాలు, రైల్వే) సంస్థ మొజాంబిక్ రైల్వే వ్యవస్థ, దాని అనుసంధిత నౌకాశ్రయాలను పర్యవేక్షిస్తుంది. కానీ నిర్వహణ ఎక్కువగా ప్రైవేటు యాజమాన్యానికి ఇవ్వబడింది. ప్రతి మార్గానికి దాని స్వంత అభివృద్ధి కారిడార్ ఉంది.

2005 నాటికి 3,123 కి.మీ పొడవైన రైలుమార్గాలు ఉండేది, ఇందులో 2,983 కిలోమీటర్లు (1,067 మిమీ, 3 అడుగుల 6 అంగుళాలు) పొడవైన గేజు మార్గం భాగంగా ఉంది. పొరుగు రైలు వ్యవస్థలకు అనుగుణంగా 762 మిమీ (2 అడుగుల 6 అం) గేజు, గాజా రైలుమార్గం ఉంది.[39]" సెంట్రలు బెయిరా రైల్రోడ్ కార్పోరేషన్ " మార్గం బెయిరా నౌకాశ్రయాన్ని మలావి, జాంబియా, జింబాబ్వే భూభాగ ప్రాంతాలను అనుసంధానిస్��ుంది. ఉత్తరప్రాంతంలో నాకాలా నౌకాశ్రయం కూడా రైలుమార్గంతో మలావిని అనుసంధానిస్తుంది. దక్షిణప్రాంతంలో ఉన్న మపుటోతో రైలుమార్గాలు జింబాబ్వే, దక్షిణాఫ్రికా లతో అనుసంధానిస్తున్నాయి. ఈ నెట్వర్కులు పొరుగు దేశాలను మాత్రమే అనుసంధానిస్తున్నాయి. టెటె, బెయిరాల మధ్య బొగ్గు గనుల కోసం కొత్త రైలు మార్గం 2010 నాటికి సేవలోకి తీసుకుని రావడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది.[40] 2010 ఆగస్టులో సెరులె (బోత్సువానా) నుండి మొజాంబికులో టెక్కోబానిను పాయింటు వద్ద ఉన్న " డీపువాటరు పోర్టు "కు బొగ్గును తీసుకురావడానికి జింబాబ్వే మీదుగా 1,100 కిలోమీటర్ల రైల్వేను అభివృద్ధి చేయడానికి ఒక అవగాహన ఒప్పందం మీద మొజాంబిక్, బోత్సువానా దేశాలు సంతకం చేసాయి.[41] నుండి " న్యూ రోలిగు స్టాకు " ఇండియా లోని గోల్డెను రాక్ వర్కుషాపు,[42] " సెంటరు బఫరు కప్లరు " ఉపయోగించి[43] ఎయిరు బ్రేక్సు సంస్థల ద్వారా సరఫరా చేయబడుతుంది.

నీటి సరఫరా, పారిశుధ్యం

[మార్చు]
Woman fetching water during the dry season from a polluted source in Machaze District of the Central Manica Province.

మొజాంబికులో నీటి సరఫరా, పారిశుద్ధ్యం, మెరుగైన నీటి వనరులు తక్కువ స్థాయిగా వర్గీకరించబడింది (2011 లో 51%గా అంచనా వేయబడింది). పారిశుద్ధ్యం (2011 లో 25%గా అంచనా వేయబడింది)స్థాయి తక్కువగా ఉన్నట్లు వర్గీకరించబడింది. పేలవమైన సేవ నాణ్యత తక్కువ స్థాయి అందుబాటులో ఉండటం లక్షణాలను కలిగి ఉంటుంది. 2007 లో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో నీటి సరఫరా, పారిశుద్ధ్యం కోసం ఒక వ్యూహాన్ని రూపొందించింది. గ్రామీణప్రాంతాలలో జనాభాలో 62% మంది నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో నీటిని అనధికారిక చిన్న-స్థాయి సరఫరాదారుల ద్వారా, అధికారిక సరఫరాదారుల ద్వారా సరఫరా చేయబడుతుంది.

1998 లో ప్రారంభమైన మొజాంబిక్ సిఆర్ఏ అని పిలవబడే ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థ, ఎఫ్.ఐ.పి.ఎ.జి. అని పిలవబడే ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య సంస్థ (పిపిపి) " అక్వాసు డీ మొజాంబిక్ " అనే సంస్థతో రాజధాని, ఇతర నాలుగు నగర ప్రాంతాలకు అధికారిక నీటి సరఫరా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2008 లో గడువు ముగిసిన నాలుగు నగరాల నిర్వహణ ఒప్పందాలు, లీజు ఒప్పందాలను విదేశీ భాగస్వామి 2010 లో భారీ నష్టాలను ప్రకటించి ఉపసహరించింది.

పట్టణ నీటి సరఫరా గణనీయ అభివృద్ధి చేయబడినప్పటికీ పట్టణ పారిశుధ్యం కోసం ప్రభుత్వం వ్యూహం రూపొందించ లేదు. బాహ్య దాతలు ఈ రంగములో మొత్తం ప్రభుత్వ పెట్టుబడులలో 87.4% వెలుపలి దాతల నుండి లభిస్తుంది. ప్రపంచ బ్యాంకు, ఆఫ్రికా డెవలప్మెంటు బ్యాంకు, కెనడా, నెదర్లాండ్సు, స్వీడన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ స్టేట్సు జల రంగంలో ప్రధాన దాతలుగా ఉన్నారు. [ఆధారం చూపాలి]

గణాంకాలు

[మార్చు]
Population in Mozambique[44]
Year Million
1950 6.1
2017 28.9
2016 28.8

ఉత్తర-కేంద్రప్రాంతాలు జామ్బెజియా, నంపులా అత్యధికంగా జనసాంధ్రత కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడ దేశ జనాభాలో 45% జనాభా నివసిస్తున్నారు. దేశంలోని ఉత్తర భాగంలో 4 మిలియన్ల మకావా సమూహం సంఖ్యాపరంగా ఆధిక్యత వహిస్తుంది. జాంబేజి లోయలో ప్రముఖంగా సేనా, షోనా (అధికంగా న్డౌ) ప్రజలు ప్రాధాన్యత వహిస్తున్నారు.[10] దక్షిణ మొజాంబికులో త్సోంగా, షంగాను ప్రజలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇతర సమూహాలలో మకోండే, యావో, స్వాహిలీ, టోంగా, చోపి, న్గుని (జులూతో సహా) ఉన్నాయి. మొత్తం ప్రజలలో బంటు ప్రజలు 97.8% మంది ఉన్నారు. మిగిలిన వారిలో వైట్ ఆఫ్రికన్లు (ఎక్కువగా పోర్చుగీసు సంతతికి చెందినవారు), యూరో-ఆఫ్రికన్లు (" మెస్టికొ " ప్రజలు బంటు, పోర్చుగీసు పూర్వీకుల సంతతి), భారతీయులు ఉన్నారు. [45] మొజాంబికులో భారత సంతతికి చెందిన ప్రజలు సుమారు 45,000 మంది నివసిస్తున్నారు.[46]

పోర్చుగీసు వలసరాజ్య పాలనలో పోర్చుగీసు సంతతికి చెందిన పౌరులు పెద్ద సంఖ్యలో దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాలలో శాశ్వతంగా నివసించారు,[47] మొజాంబికులో స్వాతంత్ర్యం పొందిన సమయములో 3,60,000 మంది పోర్చుగీస్ వారసత్వం కలిగిన మొజాంబిక్ పౌరులు నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది 1975 లో పోర్చుగల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశాన్ని విడిచిపెట్టారు. మొజాంబిక్ లోని చైనా సమాజము సంఖ్యా పరిమాణము విషయంలో వైవిధ్యమైన అభిప్రాయాలు ఉన్నాయి. 2007 నాటికి చైనా ప్రజలసంఖ్య 7,000 నుండి 12,000 వరకు ఉంటుందని అంచనాలు ఉన్నాయి.[48][49] 2011 సర్వే ఆధారంగా సంతానోత్పత్తి రేటు ఒక మహిళకు సరాసరి 5.9. గ్రామీణ ప్రాంతాల్లో 6.6, పట్టణ ప్రాంతాల్లో 4.5.ఉంది.[50]

భాషలు

[మార్చు]
Ethnic map of Mozambique.

పోర్చుగీసు దేశంలో అధికారిక, విస్తృతంగా మాట్లాడే భాషగా ఉంది. పోర్చుగీసు భాషను 50.3% మంది ప్రజలకు వాడుక భాషగా ఉంది. [52] నగరాలలో నివసిస్తున్న చాలామంది మొజాంబిక్ పౌరులకు పోర్చుగీసు మొదటి భాషగా ఉంది.

బంటు-సమూహ భాషలు మొజాంబిక్ స్థానిక భాషలుగా ఉన్నాయి. వారి సమూహాల్లో చాలా తేడాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తక్కువగా గుర్తింపు, పత్రబద్ధం చేయబడుతూ ఉంటుంది.[53] దేశం ఉత్తరప్రాంతంలో బంటు లింగుయా ఫ్రాంకాగా ఉంది. టాంజానియా సరిహద్దులో తీరంలోని కొంత ప్రాంతంలోని ప్రజలకు స్వాహిలి వాడుక భాషగా ఉంది. దక్షిణం వైపున ఉన్న మోకోంబిక దీవిలో వాడుకలో ఉన్న కిమ్వాని భాష స్వాహిలీ మాండలికంగా పరిగణించబడుతుంది. సుదీర్ఘకాలం స్వాహిలీ ప్రాంతం లోతట్టు భూభాగంలో మకోండే భాష వాడుక భాషగా ఉపయోగించబడుతుంది. యావో, చియోవో వాడుక భాషాగా ఉన్న ప్రాంతాలను వేరుచేస్తున్న చిన్న ప్రాంతంలో మఖూవా భాష వాడుక భాషగా ఉంది. మకుండే, యావో భాషా సమూహాలు ప్రత్యేక సమూహాలుగా గుర్తించబడుతూ ఉన్నారు.[54] యావో భాష మ్వేరా భాషతో దగ్గరి సబంధం కలిగి ఉంది.[55] మాలివి సరసు తీరంలో నైన్జ భాష వాడుకలో ఉంది.[56][57]

ఈ భాషలు అన్నింటికీ కొంత భిన్నంగా ఇమాఖువా భాషలు, ప్రారంభ k- కోల్పోవడంతో, అనేక నామవాచకాలు అచ్చుతో ప్రారంభమవుతాయి: ఉదాహరణకు, epula = "rain".[53]

ఇమాఖువాతో సంబధం ఉన్న ఎలోవావు, ఇవావబోలతో, తీరం వద్ద చిన్న ప్రాంతంలో ఇకోటి భాష వాడుకలో ఉంది. జాంబేజీ, సేన ప్రజలకు నైన్జా భాష వాడుకలో ఉంది. ఎగువ నదీ తీరంలో సిన్యుంగ్వే, సిస్గెంగ్వే భాషలు వాడుకలో ఉన్నాయి.

జింబాబ్వే సరిహద్దు, సముద్రం మధ్య విస్తృతమైన షోనా మాట్లాడే ప్రాంతం విస్తరించింది: వీరిని పూర్వం న్డౌ అనేవారు.[58] కానీ ఇప్పుడు జింబాబ్వే ప్రామాణిక షోనా లిపిని ఉపయోగిస్తుంది. స్పష్టంగా షోనా మాదిరిగానే ఉన్నప్పటికీ ఉచ్ఛారణ షోనా భాష కంటే వ్యత్యాసంగా ఉంటుంది. ఈ భాషా వాడుకరులను ప్రత్యేక వర్గంగా పరిగణించేవారు. జింబాబ్వే సరిహద్దు దగ్గర ఒక చిన్న ప్రాంతంలో సిబల్కే భాష వాడుకలో ఉంది.

దక్షిణ ప్రాంతంలో సోంగా సమూహానికి చెందిన భాషలు వాడుకలో ఉన్నాయి. తీరప్రాంతం, లోతట్టు ప్రాంతాలలో క్సిత్స్వా (త్స్వా) భాష వాడుకలో ఉంది. లింపోపో నది సమీపప్రాంతంలో క్సిత్సొంగా (త్సొంగా) భాషవాడుకలో ఉంది. వీటితో క్సిలింగను, క్సింవాలుంగు, క్సిబిలా, క్సిహ్లెంగ్వే, క్సిద్జొంగా వంటి స్థానిక మాండలికాలు కూడా వాడుకలో ఉన్నాయి. ఈ భాషా ప్రాంతం పొరుగునున్న దక్షిణాఫ్రికాకు విస్తరించింది. ఇంకా వీటికి సంబంధించినప్పటికీ ప్రత్యేకమైన సికోపీ (చోపి) లింపోపో నదీ ముఖద్వారానికి ఉత్తర ప్రాంతంలో వాడుకలో ఉంది. మాపుటో చుట్టూ ఉన్న ప్రదేశంలో క్సిరోంగా (రోంగా) భాష వాడుకలో ఉంది. ఈ సమూహంలో ఉన్న భాషలు, చిన్న పదజాలాలతో నిర్మితమౌతాయి. [53] ఇది స్వల్పంగా జులు భాషను పోలి ఉంటుంది. స్వాజిలాండ్, క్వాజులు-నాటాల్ సరిహద్దుల సమీప మొజాంబికు ప్రాంతంలో చిన్న స్వాజీ, జులు మాట్లాడే ప్రాంతాలు ఉన్నాయి.

అరబ్బులు, చైనీయులు, భారతీయులు ప్రధానంగా పోర్చుగీసు, కొందరు హిందీ మాట్లాడతారు. పోర్చుగీసు భారతదేశం నుండి వచ్చిన భారతీయులకు పోర్చుగీసు వాడుక భాషగా ఉంది. వారి రెండవ భాషగా పోర్చుగీసు వాడుకలో ఉంది.

Beira Cathedral
A mosque in downtown Maputo

2007 గంణాంలా ఆధారంగా మొజాంబిక్ ప్రజలలో 56.1% మంది క్రైస్తవులు ఉన్నారు. జనాభాలో ముస్లిములు 17.9% మంది ఉన్నారు. ప్రజలలో 7.3% మంది ఇతర నమ్మకాలు (ప్రధానంగా అనిమిజం) 18.7% మత విశ్వాసాలు లేవు.[45][59] 2015 లో డెమోక్రటికు అండ్ హెల్తు సర్వేసు ప్రోగ్రాం నిర్వహించిన ఇటీవలి సర్వే ఆధారంగా కాథలిక్కు జనాభా 30.5%కు అధికరించిందని, ముస్లింలు 19.3%, వివిధ ప్రొటెస్టంటు గ్రూపులు మొత్తం 44%గా ఉన్నారని సూచించింది.[60]

రోమను కాథలికు చర్చి పన్నెండు డియోసెసు (బీరా, చిమోయో, గురు, ఇన్హాంబనె, లిచింగా, మపుటో, నాకాలా, నంబుల, పెంబా, క్యులీమనే, టెటె,[61] క్సై-క్సై; ఆర్కిడియోసీస్లు బెయిరా, మపుటో, నమ్పుల ఉన్నాయి). డియోసెస్ కొరకు గణాంకాలు చోమోయోయో డియోసెసు చిమోయిలో 5.8% కాథలిక్కులు, క్యులెమ్యాను డియోసెసు (అనయూరియో కాటోలియో డి మోకాంబేక్ 2007) లో 32.50% ఉన్నా��ు.

1890 లో మొజాంబికులో మెథడిజం ప్రారంభమైంది. ఆర్.ఇ.వి. డాక్టరు. ఎర్విను రిచర్డ్సు ఇన్హాబను ప్రావిన్సులో చికుక్యూ వద్ద ఒక మెథడిస్టు మిషను ప్రారంభించాడు. 1990 లో మొజాంబికులో ఒక ఇగ్రేజా మెటోడిస్టా యునిడా ఎం మోకాంబిక మొజాంబికులో మెథోడిస్టు ఉనికిని 100 వ వార్షికోత్సవాన్ని నిర్వహించాడు. అప్పుడు మొజాంబిక్ అధ్యక్షుడు చిసానో ఈ ఉత్సవానికి హాజరైన 10,000 మందిని ప్రశంసించారు.

1998 నుండి యునైటెడు మెథడిస్టు చర్చి మొజాంబికులో మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం 24 జిల్లాల్లోని 180 సమ్మేళనాలలో 1,50,000 మంది సభ్యులు ఉన్నారు. వార్షికంగా కొత్త పాస్టరు నియమింపబడతాడు. ప్రతి సంవత్సరం వార్షిక సదస్సు కొరకు (ఉత్తర, దక్షిణ) నూతన చర్చిలు ప్రతిపాదించబడుతుంటాయి.[62]

లేటర్-డే సెయింట్సు జీససు క్రైస్టు చర్చి ఉనికి మొజాంబికకులో అధికరిస్తుంది. 1999 లో మొదట మిషనరీలను మోజాంబికుకు పంపడం ప్రారంభమైంది. 2015 ఏప్రెలు నాటికి 7,943 మందికి పైగా సభ్యులున్నారు.[63]

1950 ల ప్రారంభంలో మొజాంబికులో బహాయి విశ్వాసం ఉన్నప్పటికీ బహిరంగంగా గుర్తించలేదు. ఎందుకంటే కాథలిక్కు చర్చి బలమైన ప్రభావం కారణంగా బహాయీ అధికారికంగా ప్రపంచ మతంగా గుర్తించబడలేదు. 1975 లో స్వాతంత్ర్యం తరువాత దేశంలో కొత్త పయినీర్లు ప్రవేశించారు. మొత్తంగా మొజాంబికులో సుమారుగా 3,000 మంది బహూయిలు ఉన్నారు. అడ్మినిస్ట్రేటివు కమిటీ మపుటోలో ఉంది.

దేశంలోని ఉత్తరప్రాంతంలో ప్రత్యేకంగా ముస్లింలు ఉన్నారు. వారు అనేక "తరిగా" (బ్రదర్ హుడ్సు)లుగా నిర్వహించబడుతున్నాయి. రెండు జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి - కాన్సెల్హో ఇస్లెమికో డి మొచ్చాంకికు, కాంగ్రెసు ఇస్లాంకో డి మొచ్చాంకికు, ముఖ్యమైన పాకిస్తానీ, భారతీయ సంఘాలు అలాగే కొన్ని షియా సంఘాలు కూడా ఉన్నాయి.

ప్రధాన ప్రొటెస్టంటు చర్చిలలో ఇగ్త్రేజా యునియొ బాప్టిస్టా డి మోచంబిక, అస్సెంబలియస్ డీ డ్యూస్, సెవెంత్-డే అడ్వెంటిస్ట్స్, దక్షిణ ఆఫ్రికా ఆంగ్లికను చర్చి, ది ఇగ్రేజో ఇవాంజెలో కంప్లో డే డ్యూసు, ది ఇగ్రేజ మేటోడిస్టా యునిడా, ది ఇగ్రేజా ప్రిస్బిటియాననా డి మొచ్చాంకి క్రిస్టో, అసెంబ్లీ ఎవాంగెలికా డి డ్యూసు ఇగ్జిజాసు ఉన్నాయి.

మపుటోలో చాలా చిన్న యూదు సమాజం ఉంది.[64]

ఆరోగ్యం

[మార్చు]
జనాభా పిరమిడ్ 2016
లుబాబోలో హాస్పిటలు
హెచ్.ఐ.వి. పాజిటివు మొజాంబిక్కుల సంఖ్య పెరుగుదల,ఆంటిరెట్రోవైరల్ చికిత్సపై 2003-14

సంతానోత్పత్తి రేటు మహిళకు 5.5 జననాలు. ఆరోగ్యరక్షణ కొరకు ప్రభుత్వ వ్యయం 2004 లో జిడిపిలో 2.7% ఉంది. అదే సమయంలో ఆరోగ్యంపై వ్యక్తిగత వ్యయం 1.3% వద్ద ఉంది. 2004 లో తలసరి ఆరోగ్యం ఖర్చు 42 అమెరికా డాలర్లు. 21 వ శతాబ్దం ప్రారంభంలో దేశంలో 1,00,000 మందికి 3 వైద్యులు ఉన్నారు. 2005 లో శిశు మరణాలు 1,000 జననలలో 100 కు చేరాయి.[65]

1,000 జననాలు 147, -5 మరణాల కింద శాతంగా నియోనాటల్ మరణాల 29 శాతం మొజాంబిక్ 100,000 జననాలు శాతం 2010 ప్రసూతి మరణాల రేటు 550. 2008 లో 598,8, 1990 లో 385 తో ఉంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల మణాలు 1000 మందిలో 147. 4 వారాలలోపు శిశుమరణాలు 1,000 మందిలో 29. మొజాంబికులో 1,000 ప్రసవాలకు మంత్రసానుల సంఖ్య 3, గర్భిణీ స్త్రీలలో 37 మందిలో ఒకరికి మరణం ప్రమాదం ఉంది.[66]

2011 లో మొజాంబికులో అధికారికంగా హెచ్ఐవి ప్రాబల్యం 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 11.5% మంది ఉన్నారని తెలియజేబడింది. మొజాంబిక్-మపుటో గాజా ప్రావిన్సుల దక్షిణ భాగాలలో అలాగే మపుటో నగరంలో-అధికారిక గణాంకాలు జాతీయ సగటు కంటే రెండు రెట్లు ఎక్కువ. 2011 లో ఆరోగ్య అధికారులు సుమారు 1.7 మిలియను మొజాంబికా ప్రజలు హెచ్.ఐ.వి. పాజిటివ్ వీరిలో 600,000 యాంటీ రెట్రోవైరలు చికిత్స అవసరం ఉండేవారని అంచనా వేసింది. 2011 డిసెంబరు నాటికి 2,40,000 మందికి చికిత్స లభించింది. 2014 మార్చిలో 4,16,000 మందికి లభించిందని ఆరోగ్య అధికారులు తెలిపారు. 2011 యు.ఎన్.ఎ.ఐ.డి.ఎస్. నివేదిక ఆధారంగా మొజాంబిక్ లోని హెచ్.ఐ.వి. ప్రాణాంతక వ్యాధి తగ్గుతున్నట్లు కనిపిస్తుందని భావించారు.[67]

విద్య

[మార్చు]
Pupils in front of their school in Nampula, Mozambique
School children in the classroom

అనేది మొజాంబికు పాఠశాలల్లో బోధన ప్రాథమిక భాషగా పోర్చుగీసు ఉంది. ప్రాథమిక స్థాయి ద్వారా పాఠశాలకు హాజరు కావాలని మొజాంబిక్ చట్టం నిర్బంధిస్తుంది. అయినప్పటికీ మొజాంబికులో చాలా మంది పిల్లలు ప్రాథమిక పాఠశాలకు హాజరు కావడం లేదు. ఎందుకంటే వారి కుటుంబాలకు జీవనాధారమైన పొలాలలో వారు పని చేయవలసి ఉంటుంది. 2007 లో ఒక మిలియన్ పిల్లలు పాఠశాలకు వెళ్ళలేదు. వీరిలో చాలామంది పేద గ్రామీణ కుటుంబాలకు చెందినవారే. మొజాంబికు లోని ఉపాధ్యాయులలో దాదాపు సగం మంది ఇప్పటికీ అర్హత పొందలేదు. 2002 లో బాలికల నమోదు 3 మిలియన్ల ఉండగా 2006 లో 4.1 మిలియన్లకు అధికరించింది. అయితే పూర్తి స్థాయి రేటు 31,000 నుండి 90,000 వరకు అధికరించింది.[68]

గ్రేడు 7 తరువాత విద్యార్థులు ఎనిమిదవ నుండి 10 వ తరగతి వరకు నడుపుతున్న ఉన్నత పాఠశాలలో ప్రవేశించడానికి ప్రామాణిక జాతీయ పరీక్షలను తీసుకోవాలి.[ఆధారం చూపాలి] మొజాంబిక్ విశ్వవిద్యాలయాలలో స్పేస్ చాలా పరిమితంగా ఉంది; అందువల్ల పూర్వ-విశ్వవిద్యాలయ పాఠశాల పూర్తి చేసిన చాలా మంది విద్యార్థులు వెంటనే విశ్వవిద్యాలయ అధ్యయనాలకు వెళ్ళరు. చాలా మంది ఉపాధ్యాయులుగా పనిచేయడం లేదా నిరుద్యోగులుగా ఉన్నారు. వ్యవసాయ, సాంకేతిక లేదా బోధనా అధ్యయనాలలో ప్రత్యేక వృత్తినిచ్చే వృత్తి శిక్షణ ఇవ్వడానికి ఇంస్టిట్యూట్లు కూడా ఉన్నాయి. విద్యార్థులు పూర్వ విశ్వవిద్యాలయ పాఠశాలకు బదులుగా గ్రేడ్ 10 తర్వాత వీటికి హాజరు కావచ్చు. 1975 లో పోర్చుగల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పోర్చుగీసు ప్రభుత్వం, మొజాంబిక్ ప్రభుత్వం మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా పోర్చుగీసు ఉన్నత పాఠశాలలు, పాలిటెక్నికలు ఇంస్టిట్యూట్లు, విశ్వవిద్యాలయాలలో ప్రతి సంవత్సరం మొజాంబిక్ విద్యార్థులు ప్రవేశిస్తున్నారు.

2010 అంచనాల ప్రకారం మొజాంబిక్ అక్షరాస్యత రేటు 56.1% (70.8% మగ, 42.8% స్త్రీ).[69] 2015 నాటికి ఇది 58.8%కి అధికరించింది. (73.3% పురుషులు, 45.4% స్త్రీలు).[70]

సంస్కృతి

[మార్చు]
Woman with traditional mask in Mozambique
Island of Mozambique, 2016

సాంస్కృతిక గుర్తింపు

[మార్చు]

మొజాంబికును పోర్చుగలు పాలించింది. అందువలన మొజాంబిక్ ప్రధాన భాష (పోర్చుగీసు), ప్రధాన మతం (రోమను కాథలిక్కులు) పోర్చుగీసుతో పంచుకున్నారు. కానీ మొజాంబిక్ ప్రజలలో చాలామంది బంటు ప్రజలు కావడంతో సంస్కృతిలో ఎక్కువ భాగం స్థానికంగా ప్రభావితమై ఉంటుంది. పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న బంటూ ప్రజల మీద కొంత పోర్చుగీస్ ప్రభావం ఉంది. మొజాంబిక్ సంస్కృతి పోర్చుగీసు సంస్కృతిని ప్రభావితం చేస్తుంది.

కళలు

[మార్చు]

మాకోండే వారి చెక్క శిల్పాలకు, విస్తృత��ైన ముసుగులు తయారుచేయడంలో ప్రసిద్ధి చెందారు. వీటిని సంప్రదాయ నృత్యాలలో సాధారణంగా ఉపయోగిస్తారు. రెండు వేర్వేరు రకాల చెక్క శిల్పాలు ఉన్నాయి: షట్టని, (దుష్ట ఆత్మలు), వీటిని ఎక్కువగా భారీ ఆకారాలు, పొడవాటి, చిహ్నాలు, ప్రకాశవంతమైన ముఖాలతో వంకరగా ఉంటాయి. యూజమా; ఇవి టోటెమ్-రకం చెక్కడాలు, ఇది వ్యక్తుల జీవనశైలి ముఖాలు, వివిధ వ్యక్తులకు ఉదాహరణలుగా ఉంటాయి. ఈ శిల్పాలు సాధారణంగా "వమ్శ వృక్షాలు"గా పిలువబడతాయి. ఎందుకంటే వారు అనేక తరాల కథలను తెలియజేస్తారు.

వలసరాజ్యం చివరి సంవత్సరాలలో మొజాంబిక్ కళ అనేది వలసరాజ్యం అణచివేతను ప్రతిబింబిస్తూ ప్రతిఘటన చిహ్నంగా మారింది. 1975 లో స్వాతంత్ర్యం తరువాత ఆధునిక కళ కొత్త దశలోకి వచ్చింది. మొజాంబిక్ కళాకారులలో సమకాలీన చిత్రకారుడు మాలంగాటానా న్గ్వేనియా, శిల్పి ఆల్బెర్టో చిస్సానో ఇద్దరు ప్రసిద్ధ, అత్యంత ప్రభావవంగా ఉన్నారు. 1980 - 1990 లలో స్వాతంత్ర్యానంతర కళ చాలా రాజకీయ పోరాటం, పౌర యుద్ధం, బాధ, ఆకలిని ప్రతిబింబిస్తాయి.

మొజాంబిక్ అంతటా నృత్యాలు సాధారణంగా క్లిష్టమైన, అత్యంత అభివృద్ధి చెందిన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. పలు తెగలకు చెందిన అనేక రకాల నృత్యాలు సాధారణంగా సంప్రదాయం ఆధారితంగా ఉంటాయి. ఉదాహరణకు చోపి, జంతువుల తోలు ధరించిన పోరాటాలను ప్రయోగిస్తారు. మకుయా ప్రజలు రంగురంగుల దుస్తులను, ముసుగులను ధరించిన పురుషులు గ్రామీణప్రాంతాలలో గంటలతరబడి నృత్యప్రదర్శన చేస్తారు. దేశ ఉత్తర భాగంలో మహిళల బృందాలు ఇస్లామిక్ ఉత్సవాలు జరుపుకోవడానికి సాంప్రదాయ నృత్యం టఫో నిర్వహిస్తారు.

[71]

ఆహార సంస్కృతి

[మార్చు]

దాదాపు 500 సంవత్సరాల పాటు దేశంలో ఉనికిలో ఉన్న పోర్చుగీసు మొజాంబిక్ వంట పద్ధతిని బాగా ప్రభావితం చేసింది. కాసావా (కర్రపెండెలం), జీడిపప్పు (మొజాంబిక్ అతిపెద్ద ఉత్పత్తిదారు), పజోజిహో (పోర్చుగీసు వారు తీసుకువచ్చారు-ఫ్రెంచి శైలి బన్సు [ఆధారం చూపాలి])వీరిని పోర్చుగీసు వారు తీసుకునివచ్చారు. ఆహారంలో పోడియమ్, మిల్లెట్, బంగాళాదుంపలు, బియ్యం, జొన్న, చెరకు ప్రాధాన్యత వహిస్తున్నాయి. మసాలా దినుసులు, బేలీవ్సు వంటి సీజనింగ్సు, మిరపకాయలు, తాజా కొత్తిమీర, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పాప్రికా, తియ్యని ఎరుపు మిరపకాయలు, వైను వంటివి పోర్చుగీసుచే ప్రవేశపెట్టబడ్డాయి. ఎస్పెటడ (కబాబు), ప్రసిద్ధ ఇన్టీరో కామ్ పిరిపిరి (పిరి-పిరి సాసులో కోడి), ప్రిగో (స్టీకు రోలు), పుడిమ్ (పుడ్డింగు), రిస్సోయిసు (కొట్టబడిన రొయ్యలు) వంటి పోర్చుగీసు వంటలను ప్రస్తుతం మొజాంబికులో సాధారణంగా తింటారు.[ఆధారం చూపాలి]

మాధ్యమం

[మార్చు]
Headquarters of Rádio Moçambique in KaMpfumo district of Maputo (photo 2009)

మొజాంబిక్ మాధ్యమాన్ని ప్రభుత్వం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.[72] వార్తాపత్రికల అధిక ధరలు, తక్కువ అక్షరాస్యత శాతం కారణంగా వార్తాపత్రికల విక్రయాల శాతం తక్కువగా ఉంది.[72] అత్యధికంగా పంపిణీ చేయబడిన వార్తాపత్రికలలో నోటిసియాసు, డియారియో డి మోచంబిక వంటి దినపత్రికలు, వారపత్రిక డోమింగో వంటి ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తూ ఉన్నాయి.[73] వారి ప్రసరణ అధికంగా మపుటోకు పరిమితమైంది. [74] అధిక నిధులు, ప్రకటనల ఆదాయం ప్రభుత్వ అనుకూల వార్తాపత్రికలకు ఇవ్వబడింది.[72] అయినప్పటికీ ఇటీవల సంవత్సరాలలో విమర్శనాత్మక వీక్షణలతో ప్రైవేట్ వార్తాపత్రికలు గణనీయంగా అధికరించాయి.[73] సులభంగా ప్రజలకు చేరువౌతున్న రేడియో ప్రసరణలు మొజాంబికు మాధ్యమంలో ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.[72]

ప్రైవేటు యాజమాన్యంలో పనిచేస్తున్న రేదియో ప్రసరణల కంటే ప్రభుత్వానికి స్వంతమైన రేడియోప్రసరణలకు ప్రజాదరణ అధికంగా ఉంది. ఇందుకు నిదర్శనగా " రేడియో మొచాంబికా " దేశంలో అత్యంత ఆదరణ కలిగి ఉంది.[72] ఇది మొజాంబిక్ స్వతంత్రం పొందిన తరువాత కొద్దికాలానికే స్థాపించబడింది.[75]

మొజాంబియాన్స్ వీక్షించిన టి.వి. స్టేషన్లలో ఎస్.టి.వి, టి.ఐ.ఎం, టి.వి.ఎం. టెలీవిసొ మోకోంబిక్ ప్రాధాన్యత వహిస్తున్నాయి. కేబులు, ఉపగ్రహాల ప్రసారాలు ప్రేక్షకులకు పదుల సంఖ్యలో ఇతర ఆఫ్రికన్, ఆసియన్, బ్రెజిలియను, ఐరోపా చానెళ్ళను అందిస్తున్నాయి. [ఆధారం చూపాలి]

సంగీతం

[మార్చు]

మొజాంబిక్ సంగీతం మతపరమైన వ్యక్తీకరణ నుండి సాంప్రదాయ వేడుకల వరకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. సంగీత వాయిద్యాలు సాధారణంగా చేతితో తయారు చేయబడతాయి. మొజాంబిక్ సంగీత వ్యక్తీకరణలో ఉపయోగించే కొన్ని వాయిద్యాలు కలప, జంతు చర్మంతో చేసిన డ్రమ్సు ప్రాధాన్యత కలిగి ఉంటాయి. " లుపుంబె " వాయిద్యం " కలపతో తయారు చేబడే వాయు వాయిద్యం జంతువు కొమ్ములు లేదా కలప నుండి తయారు చేయబడుతుంది. ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాలకు చెందిన స్థానిక వాయిద్యం జిలాఫోనె వంటి మర్బిబా. మరీబా సౌత్ సెంట్రల్ కోస్టు చోపి ప్రజల (వీరు సంగీత నైపుణ్యాలకు, నృత్యానికి ప్రసిద్ధి చెందారు) ఆదరణ పొందింది.

కొందరు మొజాంబిక్ సంగీతం రెగె, వెస్టు ఇండియను కాలిప్సో మాదిరిగానే ఉంటుందని చెప్తారు. మొజాంబికులోని ఇతర సంగీత బాణులు మర్రాబెంటా, క్వైటో, అఫ్రోబీటు ఇతర లుసోఫోను సంగీత రూపాలు ఫాడో, బోసా నోవా, కిజిమ్బా, సేమ్బా వంటివి ప్రధానమైనవిగా ఉన్నాయి.

జాతీయ శలవుదినాలు

[మార్చు]
Date National holiday designation Notes
1 January Universal fraternity day New year
3 February Mozambican heroes day In tribute to Eduardo Mondlane
7 April Mozambican women day In tribute to Josina Machel
1 May International workers day Work day
25 June National Independence day Independence proclamation in 1975 (from Portugal)
7 September Victory Day In tribute to the Lusaka Accord signed in 1974
25 September National Liberation Armed Forces Day In tribute to the start of the armed fight for national liberation
4 October Peace and Reconciliation In tribute to the General Peace Agreement signed in Rome in 1992
25 December Family Day Christians also celebrate Christmas

క్రీడలు

[మార్చు]

మొజాంబికులో అసోసియేషను ఫుట్ బాలు ప్రజాదరణ పొందిన క్రీడగా ఉంది. " మొజాంబిక్ నేషనలు ఫుట్ బాలు టీం " మొజాంబిక్ జాతీయ టీంగా ఉంది. రోలరు హాకీ కూడా మొజాంబికులో ప్రజాదరణ కలిగి ఉంది. 2011 ఎఫ్.ఐ.ఆర్.ఎస్. రోలరు హాకీ వరల్డు కప్పు క్రీడలలో 4 వ స్థానం స్థాధించి జాతీయ హాకీ టీం మరిత ప్రజాదరణ పొంఫింది.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-01-28.
  2. 2.0 2.1 (2013) World DataBank World Development Indicators Mozambique The World Bank, Retrieved 5 April 2013 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "databank.worldbank.org" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. 3.0 3.1 3.2 3.3 "Mozambique". International Monetary Fund. Retrieved 2013-04-17.
  4. "Gini Index". World Bank. Retrieved 2 March 2011.
  5. "2014 Human Development Report Summary" (PDF). United Nations Development Programme. 2014. pp. 21–25. Retrieved 27 July 2014.
  6. Newitt, M.D.D. "A Short History of Mozambique." Oxford University Press, 2017
  7. 7.0 7.1 Schenoni, Natália Bueno. "Provincial Autonomy: The Territorial Dimension of Peace in Mozambique". academia.edu.
  8. Investing in rural people in Mozambique Archived 27 ఏప్రిల్ 2015 at the Wayback Machine. ifad.org
  9. History. ilhademo.net
  10. 10.00 10.01 10.02 10.03 10.04 10.05 10.06 10.07 10.08 10.09 10.10 10.11 10.12 10.13 10.14 "Mozambique (07/02)". U.S. Bilateral Relations Fact Sheets/Background Notes. U.S. Department of State. Retrieved 1 July 2018.  This article incorporates text from this source, which is in the public domain.
  11. Sinclair, Paul; Ekblom, Anneli; Wood, Marilee (2012). "Trade and Society on the Southeast African Coast in the Later First Millennium AD: the Case of Chibuene". Antiquity. 86.
  12. Newitt, Malyn. "Mozambique Island: The Rise and Decline of an East African Coastal City" 2004.
  13. 13.0 13.1 Arming Slaves, Arming slaves: from classical times to the modern age, Christopher Leslie Brown, Philip D. Morgan, Gilder Lehrman: Center for the Study of Slavery, Resistance, and Abolition. Yale University Press, 2006 ISBN 0-300-10900-8, ISBN 978-0-300-10900-9
  14. 14.0 14.1 The Cambridge history of Africa, The Cambridge history of Africa, John Donnelly Fage, A. D. Roberts, Roland Anthony Oliver, Edition: Cambridge University Press, 1986, ISBN 0-521-22505-1, ISBN 978-0-521-22505-2
  15. 15.0 15.1 The Third Portuguese Empire, 1825–1975, The Third Portuguese Empire, 1825–1975: A Study in Economic Imperialism, W. G. Clarence-Smith, Edition: Manchester University Press ND, 1985, ISBN 0-7190-1719-X, 9780719017193
  16. Agência Geral do Ultramar. dgarq.gov.pt
  17. Dinerman, Alice (26 September 2007). Independence redux in postsocialist Mozambique. ipri.pt
  18. "CD do Diário de Notícias – Parte 08". Youtube.com. Retrieved 2 May 2010.
  19. Couto, Mia (April 2004). Carnation revolution. Le Monde diplomatique
  20. Mozambique: a tortuous road to democracy by J .Cabrita, Macmillan 2001 ISBN 978-0-333-92001-5
  21. Dismantling the Portuguese Empire Archived 2013-07-23 at the Wayback Machine, Time (Monday, 7 July 1975).
  22. Pfeiffer, J (2003). "International NGOs and primary health care in Mozambique: The need for a new model of collaboration". Social Science & Medicine. 56 (4): 725–38. doi:10.1016/s0277-9536(02)00068-0. PMID 12560007.
  23. 23.0 23.1 Table 14.1C Centi-Kilo Murdering States: Estimates, Sources and Calculations. hawaii.edu
  24. Gersony 1988, p.30f.
  25. Perlez, Jane (13 October 1992). A Mozambique Formally at Peace Is Bled by Hunger and Brutality, The New York Times
  26. "Special Investigation into the death of President Samora Machel". Truth and Reconciliation Commission (South Africa) Report, vol.2, chapter 6a. Archived from the original on 13 April 2006. Retrieved 18 June 2006.
  27. UNITED NATIONS OPERATION IN MOZAMBIQUE. popp.gmu.edu
  28. "Mozambican refugees stuck between somewhere and nowhere". aljazeera. 22 July 2016. Retrieved 23 July 2016.
  29. "Mozambique's Invisible Civil War". foreign policy. 22 July 2016. Retrieved 6 May 2016.
  30. Hanlon, Joseph (19 September 2007). Is Poverty Decreasing in Mozambique? Archived 2013-11-04 at the Wayback Machine. Open University, England.
  31. "Mozambique | Partner Countries and Activities | English | Þróunarsamvinnustofnun Íslands" (in ఐస్లాండిక్). Iceida.is. 1 జూన్ 1999. Archived from the original on 4 నవంబరు 2013. Retrieved 2 మే 2010.
  32. Mozambique Archived 2013-03-27 at the Wayback Machine Canadian International Development Agency (29 January 2013), Retrieved 6 April 20`13
  33. Akwagyiram, Alexis (5 April 2013) Portugal's unemployed heading to Mozambique 'paradise'. BBC News Africa, Retrieved 6 April 2013
  34. AFP (27 July 2011). "Mozambique proposes new anti-corruption laws". Google News. Archived from the original on 23 February 2014.
  35. "CORRUPTION ASSESSMENT: MOZAMBIQU" (PDF). USAID. 16 డిసెంబరు 2005. Archived from the original (PDF) on 3 మార్చి 2016. Retrieved 27 మార్చి 2019.
  36. "Mozambique: Corruption Alleged in Anti-Drugs Office". All Africa. 27 March 2012.
  37. "Mozambique Corruption Profile". Business Anti-Corruption Profile. Archived from the original on 15 జూలై 2015. Retrieved 14 July 2015.
  38. Flynn, Alexis (9 May 2012). "UPDATE: Mozambique Talks To Shell On Developing LNG". WSJ.com. Archived from the original on 12 May 2012. Retrieved 10 May 2012.
  39. "The World Factbook — Central Intelligence Agency". www.cia.gov. Archived from the original on 2020-08-31. Retrieved 2019-03-27.
  40. "Mozambique: Australian Company Plans New Coal Mine in Tete By 2010". Allafrica.com. Retrieved 24 December 2014.
  41. "Railway Gazette: Pointers September 2010". Archived from the original on 2010-09-08. Retrieved 2010-09-10.
  42. Railway Gazette International, August 2008, p.483
  43. "Golden Rock workshop exports locos to Mozambique". The Hindu Business Line. Archived from the original on 6 డిసెంబరు 2010. Retrieved 24 డిసెంబరు 2014.
  44. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
  45. 45.0 45.1 "Mozambique". Archived 2020-08-31 at the Wayback Machine CIA World Factbook. Retrieved 22 May 2007.
  46. Singhvi, L. M. (2000). "Other Countries of Africa". Report of the High Level Committee on the Indian Diaspora (PDF). New Delhi: Ministry of External Affairs. p. 94. Archived from the original (PDF) on 8 ఏప్రిల్ 2014.
  47. Mozambique (01/09), U.S. Department of State
  48. Jian, Hong (2007). "莫桑比克华侨的历史与现状 (The History and Status Quo of Overseas Chinese in Mozambique)". West Asia and Africa (5). Chinese Academy of Social Sciences. ISSN 1002-7122. Archived from the original on 2012-05-22.
  49. Horta, Loro (13 August 2007). "China, Mozambique: old friends, new business". International Relations and Security Network Update. Retrieved 3 November 2007.
  50. Moçambique Inquérito Demográfico e de Saúde 2011. Instituto Nacional de Estatística, Ministério da Saúde Maputo, Moçambique (March 2013)
  51. "Quadro 23. População de 5 anos e mais por idade, segundo área de residência, sexo e língua que fala com mais frequência em casa" Archived 2018-12-16 at the Wayback Machine, Instituto Nacional de Estatística, Maputo Moçambique, 2007
  52. "Quadro 24. População de 5 anos e mais por condição de conhecimento da língua portuguesa e sexo, segundo área de residência e idade" Archived 2018-12-17 at the Wayback Machine, Instituto Nacional de Estatística, Maputo Moçambique, 2007
  53. 53.0 53.1 53.2 Relatório do I Seminário sobre a Padronização da Ortografia de Línguas Moçambicanas. NELIMO, Universidade Eduardo Mondlane, 1989.
  54. Malangano ga Sambano (Yao New Testament), British and Foreign Bible Society, London, 1952
  55. Harries, Rev. Lyndon (1950), A Grammar of Mwera. Witwatersrand University Press, Johannesburg.
  56. Barnes, Herbert (1902), Nyanja – English Vocabulary (mostly of Likoma Island). Society for Promoting Christian Knowledge, London.
  57. ChiChewa Intensive Course, (Chewa is similar to Nyanja) Lilongwe, Malawi, 1969.
  58. Doke, Clement, A Comparative Study in Shona Phonetics. University of Witwatersrand Press. 1931.
  59. 3º Recenseamento Geral da População e Habitação. 2007 Census of Mozambique. ine.gov.mz
  60. "Moçambique: Inquérito de Indicadores de Imunização, Malária e HIV/SIDA em Moçambique (IMASIDA), 2015" (PDF) (in Portuguese). Ministério da Saúde & Instituto Nacional de Estatística. p. 40. Retrieved 20 April 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  61. CELEBRANDO O ANO DA FÉ NA DIOCESE DE TETE. diocesedetete.org.mz (7 September 2012)
  62. "UMC in Mozambique". moumethodist.org. July 2011. Archived from the original on 2015-05-10.
  63. LDS Statistics and Church Facts for Mozambique. Mormonnewsroom.org. Retrieved on 21 June 2015.
  64. JosephFebruary 1, Anne; Images, 2018Getty. "In Mozambique, A Jewish Community Thrives". The Forward (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-03-19.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  65. "Human Development Report 2009 – Mozambique". Hdrstats.undp.org. Archived from the original on 30 January 2010. Retrieved 2 May 2010.
  66. "The State of the World's Midwifery". United Nations Population Fund. Archived from the original on 2012-01-21. Retrieved 2019-03-27.
  67. UNAIDS World AIDS Day Report 2011 Archived 2014-08-24 at the Wayback Machine. UNAIDS.org
  68. Key facts Archived 9 జనవరి 2009 at the Wayback Machine, Department for International Development (DFID), UK Government (24 May 2007)
  69. "The World Factbook". cia.gov. Archived from the original on 2020-08-31. Retrieved 2019-03-27.
  70. UIS. "Education". data.uis.unesco.org. Archived from the original on 2017-09-05. Retrieved 2019-03-27.
  71. Fitzpatrick, Mary (2007). Mozambique. Lonely Planet. p. 33. ISBN 1-74059-188-7.
  72. 72.0 72.1 72.2 72.3 72.4 Salgado, Susana (2014). The Internet and Democracy Building in Lusophone African Countries. Ashgate. p. 79.
  73. 73.0 73.1 Matsimbe, Zefanias (2009). "Ch. 9: Mozambique". In Denis Kadima and Susan Booysen (ed.). Compendium of Elections in Southern Africa 1989–2009: 20 Years of Multiparty Democracy. EISA, Johannesburg. pp. 319–321. Archived from the original on 2014-02-28.
  74. Mário, Tomás Vieira; UNESCO (2011). Assessment of Media Development in Mozambique: Based on UNESCO's Media Development Indicators. UNESCO. p. 123.
  75. Berg, Jerome S. Broadcasting on the Short Waves, 1945 to Today. McFarland. p. 221. ISBN 978-0786469024.

బయటి లంకెలు

[మార్చు]
ప్రభుత్వము
సాధారణ వా��్తలు
సమాచారము
స్వచ్ఛంద సంస్థలు
పర్యాటకము
ఆరోగ్యము

The State of the World's Midwifery – Mozambique Country Profile

UN Mission in Mozambique