మైలాదుత్తురై
Mayiladuthurai
Mayavaram Mayuram | |
---|---|
Town | |
Coordinates: 11°06′06″N 79°39′09″E / 11.101800°N 79.652600°E | |
Country | India |
State | Tamil Nadu |
District | Mayiladuthurai district |
Chola Nadu | Cauvery Delta |
Government | |
• Type | Selection Grade Municipality |
• Body | Mayiladuthurai Municipality |
• chairman | N Selvaraj |
విస్తీర్ణం | |
• Total | 35 కి.మీ2 (14 చ. మై) |
Elevation | 38 మీ (125 అ.) |
జనాభా (2011) | |
• Total | 85,632 |
• జనసాంద్రత | 2,400/కి.మీ2 (6,300/చ. మై.) |
Languages | |
• Official | Tamil |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 609001 |
Telephone code | 91 4364 |
Vehicle registration | TN-82 |
మైలాదుత్తురై, (గతంలో మాయవరం లేదా మయూరం అని పిలుస్తారు) భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, మైలాదుత్తురై జిల్లాకు చెందిన ఒక పట్టణం.ఇది మైలాదుత్తురై జిల్లాకు ప్రధాన కేంద్రం. ఈ పట్టణం రాష్ట్ర రాజధాని చెన్నై నుండి 281 కిమీ (175 మై) దూరంలో ఉంది. మైలాదుత్తురై ప్రాంతాన్ని మధ్యయుగ చోళులు పరిపాలించారు. తరువాత విజయనగర సామ్రాజ్యం, తంజావూరు నాయకులు, తంజావూరు మరాఠాలు, చివరిగా బ్రిటీష��� సామ్రాజ్యంతో సహా వివిధ రాజవంశాలచే పాలించబడింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు మైలదుతరై పూర్వపు తంజావూరు జిల్లాలో భాగంగా ఉంది. 1991 వరకు తంజావూరు జిల్లా, ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన నాగపట్టణం జిల్లాలో భాగంగా ఉంది. ఈ పట్టణం ప్రాంతం వ్యవసాయం, చేనేతకు ప్రసిద్ధి చెందింది. మైలాదుత్తురై తూర్పు తీరంలో ఉన్నందున, దాని ఆదాయాన్ని సంపాదించడంలో చేపల వేట కీలక పాత్ర పోషిస్తుంది.
మైలాదుత్త్తురై 1866లో స్థాపించబడిన పురపాలక సంఘం ద్వారా పరిపాలన నిర్వహించబడుతుంది. 2008 నాటికి మున్సిపాలిటీ పరిధి 11.27 కిమీ2 (4.35 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో ఉంది. మైలాదుత్తురై ప్రాంతం, మైలాదుత్తురై శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగం. మైలాదుతురై పట్టణం రోడ్డు రైలు రవాణా ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. మైలాదుత్తురై ప్రధాన మార్గంగా చెన్నై నగరాన్ని, తిరుచ్చిని కలిపే ఒక ముఖ్యమైన కూడలిగా ఉంది. రోడ్డు మార్గాలు, రైల్వేలు పట్టణానికి ప్రధాన రవాణా మార్గం. సమీప విమానాశ్రయం, పాండిచ్చేరి విమానాశ్రయం, ఇది పట్టణం నుండి 116 కిమీ (72 మైళ్ళు) దూరంలో ఉంది. 2020 డిసెంబరు 28న తమిళనాడు రాష్ట్రంలో మైలాదుత్తురై జిల్లా, 38వ జిల్లాగా, మైలాదుత్తురై పట్టణం జిల్లా ప్రధాన కేంద్రగా, నాగపట్నం జిల్లా నుండి విడగొట్టుటద్వారా ఏర్పడింది.[1]
వ్యుత్పత్తి శాస్త్రం
[మార్చు]పార్వతి దేవత ఒక అద్భుత నృత్యం ద్వారా శివుని దృష్టిని ఆకర్షించడానికి నెమలిగా కనిపించిన పురాతన కథ కారణంగా ఈ జిల్లాకు "మైలాదుతురై" లేదా మైలాదుత్తురై అని పేరు వచ్చింది. 18వ శతాబ్దం వరకు మైలాదుత్తురైని "మయూరపురం", "మాయవరం" అని పిలిచేవారు. 1982 నాటి ప్రభుత్వ ఆర్డినెన్స్ ప్రకారం ఈ స్థలం పేరు "మైలాదుత్తురై"గా మారింది. అమ్మన్ కు అంకితం చేయబడిన మయూరనాథస్వామి ఆలయం పట్టణంలోని అతి ముఖ్యమైన హిందూ దేవాలయాలలో ఒకటి. శివుని చిహ్నమైన లింగాన్ని పూజిస్తున్న అమ్మన్ దేవతని పీహెన్ రూపంలో చిత్రీకరిస్తున్న విగ్రహం ఉంది.
చరిత్ర
[మార్చు]మైలాదుత్తురై ముఖ్యమైన పురాతన ప్రాంతం. మధ్యయుగ చోళుల కాలం నాటి పురాతన ఆలయాలు ఉన్నాయి.. అయితే ఈ ప్రాంతం సా.పూ 3వ సహస్రాబ్ది నుంచి ఉనికిలో ఉన్నట్లు తెలుస్తుంది. సా.శ. 7వ శతాబ్దానికి చెందిన శైవ సాధువు సంబందర్ రచనలలో మైలాదుత్తురైకి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. తంజావూరు నాయక్ రాజు రఘునాథ నాయక్ మైలాదుత్తురైలో మండపాలను నిర్మించాడు. సా..శ. 17వ, 18వ శతాబ్దాలలో, మైలాదుత్తురైని తంజావూరు మరాఠాలు పరిపాలించారు, వీరు తెలుగు, కన్నడ, మరాఠా దేశాల నుండి బ్రాహ్మణులను ఈ ప్రాంతంలో స్థిరపడటానికి ఆహ్వానించారు. వారికి పెద్ద ఎత్తున భూమిని ఇచ్చారు. I1799లో, మైలాదుత్తురై తంజావూరు మరాఠా పాలకుడు సెర్ఫోజీ II ద్వారా తంజావూరు మరాఠా రాజ్యంలోని మిగిలిన భాగాలతో పాటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించబడింది. Mబ్రిటిష్ పాలనలో మైలాదుత్తురై తంజావూరు జిల్లాలో ఒక ముఖ్యమైన పట్టణంగా అభివృద్ధి చెందింది.
కర్ణాటక సంగీత విద్వాంసులు మధురై మణి అయ్యర్, గోపాలకృష్ణ భారతి, మొదటి తమిళ నవల ప్రతాప ముదలియార్ చరిత్ర రాసిన శామ్యూల్ వేదనాయగం పిళ్లై మైలాదుత్తురై పట్టణంతో అనుబంధం కలిగి ఉండగా, తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి, ఎం.ఎస్.ఉదయమూర్తి మైలాదుత్తురై మున్సిపల్ హైస్కూల్‌లో చదువుకున్నారు.[2]
స్థానిక జానపద కథల ప్రకారం, మైలాదుత్తురై "సిద్ధులు" అని పిలువబడే హిందూ పవిత్ర పురుషులతో సంబంధం కలిగి ఉంది.[2] 1991లో తంజావూరు జిల్లాను మూడుగా విభజించినప్పుడు, మైలాదుత్తురై కొత్తగా ఏర్పడిన నాగపట్నం జిల్లాకు బదిలీ చేయబడింది. మైలాదుత్తురై పట్టణం జిల్లా కేంద్రంగా 2020 డిసెంబరు 28, న తమిళనాడు 38వ జిల్లాగా నాగపట్నం జిల్లా నుండి కొన్ని ప్రాంతాలు విడగొట్టుటద్వారా మైలాదుత్తురై జిల్లా ఏర్పడింది.
విశేషాలు
[మార్చు]మైలాదుత్తురై చరిత్రలో 1915, 1921, 1927 సంవత్సరాలలో గాంధీజీ ఈ పట్టణం ప్రాంతంలోని వివిధ ప్రదేశాలలో నడయాడాడు. ధన్వంతి సిద్ధహర్ వంటి సాధువులు మైలాడుతురై గొప్పతనాన్ని చాటిచేప్పారు.ఆధ్యాత్మిక, సాహితీ రంగాలలో తమ వంతు కృషి చేసిన మహానుభావులున్నారు.పొరుగు కుగ్రామమైన థెరిజాందూర్ గొప్ప రచయిత "కంబార్"ని అందించింది. ఇతనితో పాటు మయూరం వేదనాయగం పిళ్లై, కల్కి కృష్ణమూర్తి, గోపాలకృష్ణ భారతి వంటి వారు తమ రచనల ద్వారా మైలాడుతురై గొప్పతనాన్ని చాటిచెప్పారు. ఎం.ఎస్.. వంటి ఉదయమూర్తి, లైబ్రేరియన్ ఉద్యమ పితామహుడు ఎస్.ఆర్. రెంగనాథన్, త్యాగరాజ బహవతార్, సిర్కాజి గోవిందరాజన్, నాథేశ్వర విధ్వాన్ రాజరథినం లాంటి మేధావి ప్రముఖ రచయితల సమూహం అందించింది. చెస్ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఎప్పటికీ, ఒక రోజు విశ్రాంతి కోసం వారి శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఉత్తరాదిలోని గొప్ప కుంభమేళాను గుర్తుచేసే "కావేరి పుష్కరం" (తుల పండుగ) వంటి గొప్ప మతపరమైన ఉత్సవాలకు మాయియాల్దుతురై ప్రసిద్ధి చెందింది.[3]
జనాభా గణాంకాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, మైలాదుత్తురై నగరంలో మొత్తం 21,929 కుటుంబాలు నివసిస్తున్నాయి. పట్టణ పరిధి లోని మొత్తం జనాభా 85,632, అందులో 41,869 మంది పురుషులు, 43,763 మంది స్త్రీలు ఉన్నారు. కాబట్టి మైలాదుత్తురై సగటు లింగ నిష్పత్తి 1,045.[4] మైలాదుత్తురై నగరంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 7720, ఇది మొత్తం జనాభాలో 9%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 3883 మంది మగ పిల్లలు, 3837 మంది ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి 988, ఇ���ి సగటు లింగ నిష్పత్తి (1,045) కంటే తక్కువ. అక్షరాస్యత రేటు 91.8%. ఆ విధంగా నాగపట్నం జిల్లా 83.6% అక్షరాస్యతతో పోలిస్తే మైలాదుత్తురై అధిక అక్షరాస్యతను కలిగి ఉంది. మైలాదుత్తురై పురుషుల అక్షరాస్యత రేటు 95.29%, స్త్రీల అక్షరాస్యత రేటు 88.55%గా ఉంది.[4]
మయూరనాధస్వామి
[మార్చు]మైలాదుత్తురై పట్టణంలో మయూరనాథస్వామి దేవాలయం, ప్రముఖ శైవక్షేత్రం.దీనిని మయూరనాథస్వామి ఆలయ సముదాయాన్ని మధ్యయుగ చోళుల కాలంలో నిర్మించారు.
ఇతర దేవాలయాలు
[మార్చు]కొరనాడ్‌లోని పునుకీశ్వర్ ఆలయం, అయ్యారప్పర్ ఆలయం మైలాదుత్తురై పట్టణంలో మరో ముఖ్యమైన పురాతన శివాలయాలు.[5] పట్టణంలోని ప్రముఖ వైష్ణవ దేవాలయాలు కావేరి ఉత్తర ఒడ్డున తిరువిలందూర్‌లోని పరిమళ రంగనాథర్ విష్ణు దేవాలయం, ఒక దివ్య క్షేత్రం. పంచ రంగం, కొలికుట్టి వనముట్టి పెరుమాళ్ ఆలయం.
పరిపాలన, రాజకీయాలు
[మార్చు]ఇది కొత్తగా ఏర్పడిన మైలాదుత్తురై జిల్లాకు ప్రధాన కార్యాలయం. తమిళనాడు పట్టణ అభివృద్ధి చట్టం 1865 ప్రకారం 1866లో సృష్టించబడిన పురపాలక సంఘం ద్వారా మైలాదుత్తురై పట్టణ పరిపాలన సాగుతుంది. కౌన్సిల్ ప్రారంభంలో పదకొండు మంది సభ్యులను కలిగి ఉంది.[6] ఇది 1883లో 18కి పెరిగింది. ప్రస్తుతం 36గా ఉంది.[6] పట్టణం మొత్తం 36 ఎన్నికల వార్డులుగా విభజించారు.
మైలాదుత్తురై తమిళనాడు శాసనసభలో మైలాదుత్తురై రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది.[7] మైలాదుత్తురై పట్టణం, మైలాడుతురై (లోక్‌సభ నియోజకవర్గం)లో ఒక భాగం.[8]
ప్రయాణ సౌకర్యాలు
[మార్చు]వాయు మార్గం:
[మార్చు]సమీప అంతర్జాతీయ విమానాశ్రయం పుదుచ్చేరి విమానాశ్రయం. ఇది 116 కి.మీ (72 మైళ్లు), తిరుచిరాపల్లి విమానాశ్రయం 142 కిమీ (88 మైళ్లు) దూరంలో ఉన్నాయి, అయితే సమీప ఓడరేవు 40 కిమీ (25 మైళ్లు) దూరంలో ఉన్న కరైకల్ తీరప్రాంతంలో ఉంది.
రోడ్డు మార్గం
[మార్చు]తమిళనాడులోని ముఖ్యమైన నగరాలకు సాధారణ బస్సు సర్వీసులు ఉన్నాయి. బెంగళూరు, కోయంబత్తూరు, మధురై, తిరువనంతపురం వంటి ఇతర దక్షిణ భారత నగరాలకు కూడా సాధారణ సర్వీసులు ఉన్నాయి.
రైలు మార్గం
[మార్చు]మైలాదుత్తురై దక్షిణ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పట్టణాలు, నగరాలతో రైలు ద్వారా ప్రయాణ సౌకర్యం ఉంది. మైలదుత్తురై జంక్షన్ రైల్వే స్టేషన్ రాష్ట్ర రాజధాని చెన్నైనగరాన్ని, తిరుచిరప్పాలితో కలిపే ప్రధాన మార్గంలో ఉంది. మైలాదుత్తురై కారైకుడి నుండి తిరువారూర్ మీదుగా లైన్లు ఉన్నాయి. మైసూరు -మైలాదుత్తురై ఎక్స్‌ప్రెస్ మైలాడుతురై, కుంభకోణం, తంజావూరు, తిరుచిరప్పాలిలను మైసూరు, బెంగళూరు నగరాలతో కలుపుతుంది. చెన్నై, కోయంబత్తూర్, మధురై, తిరుచిరాపల్లి వంటి రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో నగరాన్ని అనుసంధానించే సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. మైలాదుత్తురై పట్టణాన్ని తంజావూరు, తిరుచిరాపల్లి, తిరువారూర్, నాగపట్నం చిదంబరం, కడలూర్, విలుప్పురంలతో కలుపుతూ ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి.[9][10]
మూలాలు
[మార్చు]- ↑ "Mayiladuthurai Announced As 38th District Of Tamil Nadu". dtNext.in. 2020-12-28. Archived from the original on 29 December 2020. Retrieved 2020-12-31.
- ↑ 2.0 2.1 "Historical Moments: History of Mayuram". Mayiladuthurai Municipality. 2011. Archived from the original on 20 సెప్టెంబరు 2012. Retrieved 17 May 2014.
- ↑ "History | Mayiladuthurai District, Government of Tamilnadu | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-28.
- ↑ 4.0 4.1 "Mayiladuthurai Population, Caste Data Nagapattinam Tamil Nadu - Census India". www.censusindia.co.in. Archived from the original on 2023-01-24. Retrieved 2023-01-24.
- ↑ "Places of Interest". Mayiladuthurai Municipality. 2011. Archived from the original on 20 September 2012. Retrieved 17 May 2014.
- ↑ 6.0 6.1 "About Us". Mayiladuthurai Municipality. 2011. Archived from the original on 20 సెప్టెంబరు 2012. Retrieved 17 May 2014.
- ↑ "Tamil Nadu Legislative Assembly Constituency map". Tamil Nadu Legislative Assembly. Archived from the original on 14 June 2012. Retrieved 17 May 2014.
- ↑ "Key highlights of the general elections 1962 to the Third Lok Sabha" (PDF). Election Commission of India. p. 49. Retrieved 16 April 2011.
- ↑ "Train availability at stations". Indian Railways. 2012. Archived from the original on 2013-07-14. Retrieved 2012-11-16.
- ↑ "Passenger trains to Mayiladuthurai, Katpadi, flagged off at Villupuram". The Hindu. Villupuram. 30 March 2013. Retrieved 20 May 2014.
వెలుపలి లంకెలు
[మార్చు]- ఆళ్వార్ మంగళాశాసనం: తిరుమంగై ఆళ్వార్: 1328-1337, 2674 (174) పె.తి.మొ. 4-9-1. నాలాయిర దివ్య ప్రభందం పాశురముల పట్టిక ప్రకారం.