మూగ ప్రేమ
మూగ ప్రేమ (1971 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | గుత్తా రామినీడు |
తారాగణం | శోభన్ బాబు , వాణిశ్రీ |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | నసీమ్ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
కె బాలచందర్ తమిళ చిత్రం తెలుగులో తీయబడింది.కె.చటర్జీ నిర్మాత.సంగీత దర్శకుడిగా |చక్రవర్తి తొలి చిత్రం."ఈ సంజె లో కెంజాయలో" ,"జిలిబిలి పలుకుల చెల్లెళ్ళు","నాగులేటి వాగులోన","పోవనివ్వం పోనివ్వం " వంటి జనరంజకమైన పాటలున్నాయి. గుత్తా రామినీడు దర్శకత్వంలో శోభన్ బాబు, వాణీశ్రీ, విజయ లలిత, జి. వరలక్ష్మి నటించిన ఈ చిత్రం 1971 మార్చి 6 న విడుదలైంది .
సంక్షిప్త చిత్రకథ
[మార్చు]వాసుదేవరావు అనే అతని ఇంట్లో కమల అనే అమాయకురాలు పనిమనిషిగా చేరుతుంది. వాసుదేవరావు తమ్ముడైన మురళిని చూసి ముచ్చటపడి, అతన్ని మనసులోనే ప్రేమిస్తుంది. మురళి, రాధ అనే అమ్మాయిని చూసి, ఆమె ఎవరని తెలుసుకోకుండా ప్రేమిస్తాడు. ఆమె కమల స్నేహితురాలు. ఆ విషయం తెలుసుకుని, కమల లోలోన బాధపడుతుంది. వాసుదేవరావు తన తమ్ముడికి కమలను ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. కాని, కమల బలవంతం మీద, రాధకు ఇచ్చి వివాహం చేస్తాడు. కమల రాసిన ఒక నవల చదివిన రాధ, ఆ కథ కమల కథేనని తెలుసుకుని, ఆమె చేసిన త్యాగాన్ని అర్థం చేసుకుని, తాను కావాలని కాలు పోగొట్టుకుంటుంది. కమల తనను ప్రేమించిన విషయం మురళి తెలుసుకుంటాడు. కమలకు ఇంకొక వరుడితో వివాహం నిశ్చయమవుతుంది. కాని కథ మరోలా సమాప్తమవుతుంది.
నటీనటులు
[మార్చు]- వాణిశ్రీ
- విజయలలిత
- జి.వరలక్ష్మి
- సూర్యకాంతం
- శోభన్ బాబు
- రమణారెడ్డి
- చలం
- ప్రభాకరరెడ్డి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: గుత్తా రామినీడు
- మాటలు, పాటలు: ఆచార్య ఆత్రేయ
- సంగీతం: చక్రవర్తి
- ఛాయాగ్రహణం: జి.కె.రాము
- కళ: రాజేంద్రకుమార్
- కూర్పు: అంకిరెడ్డి
- నిర్మాత: ఎన్.ఎన్.భట్
పాటలు
[మార్చు]వరుస సంఖ్య | పాట | రచన | సంగీతం | పాడిన వారు |
---|---|---|---|---|
1 | నాగులేటి వాగులోన కడవ ముంచబోతుంటే | ఆచార్య ఆత్రేయ | చక్రవర్తి | పి సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి |
2 | జిలిబిలి పలుకుల చెళ్లెల్లు చిలిపి తనాల తమ్ముళ్లు | ఆచార్య ఆత్రేయ | చక్రవర్తి | పి. సుశీల |
3 | మొయిలు చూసి మురిసి పోయి నటనమాడు నెమలి | ఆచార్య ఆత్రేయ | చక్రవర్తి | పి సుశీల |
4 | ఈ సంజెలో కెంజాయలో చిరిగాలుల | ఆచార్య ఆత్రేయ | చక్రవర్తి | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రమణ్యం |
5 | వెయ్ వెయ్ చేతిలోన చేయ్ వేయ్ | ఆచార్య ఆత్రేయ | చక్రవర్తి | పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం |
6.పోనివ్వం పోనివ్వo పోతానంటే , రచన:ఆచార్య ఆత్రేయ, గానం. బి. వసంత, కె. జమునా రాణి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
7. పో పోవే పిచ్చిదానా నేనేమి ఎరుగని దాననా పసిదాన, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.పి సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి .
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.