Jump to content

మహారాజా చందు లాల్

వికీపీడియా నుండి
మహారాజా చందు లాల్
చందు లాల్
బ్రూక్లిన్ మ్యూజియంలో ఉంచబడిన మహారాజా చందు లాల్ ఛాయాచిత్రపటం.
జననం
చందు లాల్

(1766-01-01)1766 జనవరి 1 [ఆధారం చూపాలి]
మరణం1845 ఏప్రిల్ 15(1845-04-15) (వయసు 79)
సమాధి స్థలంహైదరాబాదు
జాతీయతభారతీయుడు
వృత్తిపేష్కారు
క్రియాశీల సంవత్సరాలు1766 - 1845

చందు లాల్ సదన్ (1766 - 15 ఏప్రిల్ 1845 ), హైదరాబాద్ రాజ్యం ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. ఆయన మహారాజా చందులాల్‌గా ప్రఖ్యాతుడు. సికిందర్ జా నవాబు కాలంలో 1833 నుంచి 1844 వరకూ ఆయన రాజ్యంనికి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన ఉర్దూ, పర్షియన్ భాషల్లో గొప్ప కవి. తాను పేష్కరుగా, ప్రధానిగా అధికారంలో ఉన్నకాలంలో హైందవ పుణ్యక్షేత్రాలను, ధార్మిక సంస్థలను, పండితులను అనేకవిధాలుగా పోషించారు.

కుటుంబం

[మార్చు]

చందు లాల్ సదన్ తండ్రి రాయ్ నారాయణ్ దాస్ రాయ్ బరేలి నుంచి హైదరాబాద్ రాజ్యా నికి వలసవచ్చారు,[1][2] ఆయన పూర్వీకులు మొఘల్ దర్బారుల్లో పనిచేసినవారు. చందు లాల్ ముత్తాత అక్బర్ చక్రవర్తికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన రాజా తోడర్ మల్.[1] వారి కుటుంబం మొదటి నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా కాలంలో హైదరాబాద్ డెక్కన్‌లో దఫ్టెర్-ఎ-మల్ (ఆర్థిక మంత్రిత్వ శాఖ) ను వ్యవస్థాపించినవారు. ఆయన ముని మనుమడు మహారాజా కిషన్ పెర్షాద్ 1901-1912, 1926-1937 కాలాల్లో హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా పనిచేశారు.[2]

ధార్మిక కార్యక్రమాలు

[మార్చు]

చందు లాలా తాను పేష్కరుగా ఉన్న కాలంలోనే పలు హిందూ పుణ్యక్షేత్రాలకు సౌకర్యాల కల్పన కోసం దానధర్మాలు చేశారు. 1830 కాలంలో తిరుపతి, అహోబిలం, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలలో ఆయన ధర్మకార్యాలను ఏర్పాటుచేశారు. అహోబిలం, శ్రీశైలం, మహానంది వంటి పుణ్యక్షేత్రాలు కర్నూలు నవాబుల పరిపాలనలో ఉండడంతో నవాబులు ఆయా పుణ్యక్షేత్రాల నుంచి డబ్బు స్వీకరించి ఆలనాపాలనా పట్టించుకునేవారు కాదు. చందులాలా ఆ సమయంలో అహోబిలం క్షేత్రంలో సంవత్సరానికి రూ.వెయ్యి చొప్పున ఇచ్చి ధార్మిక కార్యకలాపాలకు ఆటంకం లేకుండా చూసేవారు. మరోవైపు పేష్కరుగా, ప్రధానమంత్రిగా తనకున్న అధికారాన్ని వినియోగించి కర్నూలు నవాబులు ఆ పుణ్యక్షేత్రాలకు, అక్కడి పండితులకు హానిచేయకుండా చూసుకునేవారు.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Qasemi, Sharif Husain (15 December 1990). "Chandu Lal Sadan: Maharaja, statesman and poet in Persian and Urdu". Retrieved 2014-12-11.
  2. 2.0 2.1 Leonard, Karen (May 1971). "The Hyderabad Political System and its Participants". The Journal of Asian Studies. 30 (3): 569–582. JSTOR 2052461.
  3. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.