Jump to content

మహబూబ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format
వికీపీడియా నుండి
(మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
మహబూబ్‌నగర్
—  శాసనసభ నియోజకవర్గం  —
మహబూబ్‌నగర్ is located in Telangana
మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో 2 మండలాలు ఉన్నాయి. పునర్విభజనకు ముందు ఉన్న కోయిలకొండ మండలం కొత్తగా ఏర్పడిన నారాయణపేట శాసనసభ నియోజకవర్గంలో కలవగా, కొత్తగా హన్వాడ మండలం ఈ నియోజకవర్గంలో భాగమైంది.[1] పులివీరన్న, పి.చంద్రశేఖర్‌లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో పదవులు నిర్వహించారు. 2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఎన్.రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించాడు. రాజేశ్వర్ రెడ్డి మరణంతో 2012 మార్చిలో జరిగిన ఉప-ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి విజయం సాధించాడు.[2]

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు]

నియోజకవర్గపు గణాంకాలు

[మార్చు]
  • 2001 లెక్కల ప్రకారము జనాభా: 2,40,244.
  • ఓటర్ల సంఖ్య (2008 ఆగస్టు నాటికి) : 2,21,166.[3]
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 10.10%, 6.72%.

నియోజకవర్గ భౌగోళిక సరిహద్దులు

[మార్చు]

కేవలం రెండే మండలాలతో ఈ నియోజకవర్గం జిల్లాలోనే భౌగోళికంగా చిన్న నియోజకవర్గంగా మారింది. మహబూబ్ నగర్ పట్టణ జనాభా అధికంగా ఉండుటచే అధిక మండలాలు కలిసే వీలు లేకపోయింది. ఈ నియోజకవర్గానికి ఉత్తరాన రంగారెడ్డి జిల్లాకు చెందిన పరిగి శాసనసభ నియోజకవర్గం ఉండగా, తూర్పున జడ్చర్ల, దక్షిణమున దేవరకద్ర, పడమర వైపున నారాయణపేట శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]

ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి చెందిన వి. శ్రీనివాస్‌ గౌడ్‌ శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాడు;[4] ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 పల్లెర్ల హనుమంతరావు కాంగ్రెస్ ఎస్.రావు సోషలిస్టు
1957 ఐ.చిన్నప్ప ప్రజాపార్టీ ఎం.రామిరెడ్డి పి.ఎస్.పి
1962 ఎం.రామిరెడ్డి[5] స్వతంత్ర అభ్యర్థి మహ్మద్ ఇబ్రహీం అలీ కాంగ్రెస్ పార్టీ
1967 ఇబ్రహీం అలీ అన్సారీ[5] కాంగ్రెస్ పార్టీ రాజేశ్వర్ రెడ్డి భారతీయ జనసంఘ్
1972 ఇబ్రహీం అలీ అన్సారీ కాంగ్రెస్ పార్టీ టి.రాజేశ్వర్ రెడ్డి భారతీయ జనసంఘ్
1978 ఎం.రామిరెడ్డి ఇందిరా కాంగ్రెస్ కె.కె.రెడ్డి జనతా పార్టీ
1980 ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ ఆర్.రెడ్డి జనతా పార్టీ
1983 పి.చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ ఎం.ఏ.షుకూర్ కాంగ్రెస్ పార్టీ
1985 పి.చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ జి.సహదేవ్ కాంగ్రెస్ పార్టీ
1989 పులి వీరన్న కాంగ్రెస్ పార్టీ పి.చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ
1994 పి.చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ పులి వీరన్న కాంగ్రెస్ పార్టీ
1999 పి.చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ పులి వీరన్న కాంగ్రెస్ పార్టీ
2004 పులి వీరన్న స్వతంత్ర అభ్యర్థి పి.చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ
2009 ఎన్.రాజేశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి ఇబ్రహీం తెలంగాణ రాష్ట్ర సమితి
2012 ఉప ఎన్నికలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఇబ్రహీం తెలంగాణ రాష్ట్ర సమితి
2014 వి. శ్రీనివాస్‌ గౌడ్‌ తెలంగాణ రాష్ట్ర సమితి యెన్నం శ్రీనివాస్ రెడ్డి భారతీయ జనతా పార్టీ
2018 వి. శ్రీనివాస్‌ గౌడ్‌ తెలంగాణ రాష్ట్ర సమితి ఎం.చంద్ర శేఖర్ తెలుగుదేశం పార్టీ
2023[6] యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ భారత రాష్ట్ర సమితి

1999 ఎన్నికలు

[మార్చు]

1999లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన పి.చంద్రశేఖర్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పులి వీరన్నపై 6688 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. చంద్రశేఖర్ 51065 ఓట్లు సాధించగా, పులివీరన్నకు 44377 ఓట్లు లభించాయి.

2004 ఎన్నికలు

[మార్చు]

2004 శాసనసభ ఎన్నికలలో మహబూబ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి పులి వీరణ్ణ తన సమీప ప్రత్యర్థి, మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీకి చెందిన పి.చంద్రశేఖర్‌పై 19282 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు వలన ఈ స్థానం తెరాసకు కేటాయించగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పులి వీరన్న రెబెల్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించాడు. పులి వీరణ్ణకు 63110 ఓట్లు రాగా, మాజీ మంత్రి అయిన పి.చంద్రశేఖర్‌కు 43828 ఓట్లు వచ్చాయి. మొత్తం 12 అభ్యర్థులు పోటీచేయగా టి.ఆర్.ఎస్.అభ్యర్థితో సహా 10 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. మొదటి రెండు స్థానాలలో ఉన్న పులివీరన్న, పి.చంద్రశేఖర్‌లు పోలైన ఓట్లలో 858% ఓట్లు పొందగా మిగితా 10 అభ్యర్థులు కలిపి కేవలం 14.2% ఓట్లు పొందినారు. ఇక్కడ బహుముఖ పోటీ జరిగిననూ ప్రధాన పోటీ ఇండిపెండెంట్ అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థుల మధ్యనే జరిగింది.

వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
2004 ఎన్నికల గణాంకాలు
ఓట్లు
పోలైన ఓట్లు
  
124665
పులివీరన్న
  
50.62%
పి.చంద్రశేఖర్
  
35.15%
ఎం.శ్రీనివాసులు
  
4.90%
రాంరెడ్డి
  
1.87%
కె.బాలరాజు
  
1.58%
ఇతరులు
  
5.88%
* చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు

2004 ఎన్నికల గణాంకాలు

  పులివీరన్న (50.62%)
  పి.చంద్రశేఖర్ (35.15%)
  ఎం.శ్రీనివాసులు (4.90%)
  రాంరెడ్డి (1.87%)
  కె.బాలరాజు (1.58%)
  ఇతరులు (5.88%)
క్రమసంఖ్య అభ్యర్థి పేరు పార్టీ సాధించిన ఓట్లు
1 పులి వీరన్న స్వతంత్ర అభ్యర్థి 63110
2 పి.చంద్ర శేఖర్ తెలుగుదేశం పార్టీ 43828
3 ఎం.శ్రీనివాసులు తెలంగాణ రాష్ట్ర సమితి 6116
4 వై.రాంరెడ్డి పిరామిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 2332
5 కె.బాల్‌రాజు బహుజన్ సమాజ్ పార్టీ 1976
6 షేక్ జానీమియా ఇండిపెండెంట్ 1246
7 అబ్దుల్ ఖదీర్ MULKSP 1235
8 పి.చెన్నమ్మ ఇండిపెండెంట్ 1233
9 మేకల కుసుమ జనతాపార్టీ 1086
10 జఫరుల్లా సిద్ధికీ ఇండిపెండెంట్ 893
11 బి.శ్రీనివాస్ రెడ్డి సమాజ్‌వాది పార్టీ 865
12 జి.పూజారి వెంకన్న ఇండిపెండెంట్ 745

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ శాసన సభ్యులు, మాజీ మంత్రి పులి వీరన్న మళ్ళీ పోటీచేయగా, [7] భారతీయ జనతా పార్టీ తరఫున జి.పద్మజా రెడ్డి, [8] ప్రజారాజ్యం పార్టీ తరఫున అమృత్ ప్రసాద్ గౌడ్ [9], లోక్‌సత్తా తరఫున బెక్కరి రాంరెడ్డిలు పోటీచేశారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సయ్యద్ ఇబ్రహీం పోటీచేశాడు. ప్రజారాజ్యం పార్టీ టికెట్టును ఆశించి టికెట్టు లభించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఎన్.రాజేశ్వర్ రెడ్డికి, టి.ఆర్.ఎస్.అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం, కాంగ్రెస్ అభ్యర్థి పులివీరన్నల మధ్య ప్రధానపోటీ జరుగగా ఎన్.రాజేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిపై 5137 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.[10] రాజేశ్వర్ రెడ్డి 2011 అక్టోబరు 30న మరణించడంతో శాసనసభ స్థానం ఖాళీ అయింది.

2012 ఉప ఎన్నికలు

[మార్చు]

ఎన్.రాజేశ్వర్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానంలో జరుగనున్న 2012 ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున యెన్నం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున సయ్యద్ ఇబ్రహీం, కాంగ్రెస్ పార్టీ తరఫున ముత్యాల ప్రకాష్ పోటీచేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన ఇబ్రహీంపై 1859 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల ప్రకాష్‌కు మూడవస్థానం లభించగా, నాలుగుసార్లు శాసన సభ్యులుగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.చంద్రశేఖర్ నాలుగోస్థానం లభించింది.

నియోజకవర్గ ప్రముఖులు

[మార్చు]
పల్లెర్ల హనుమంతరావు
పల్లెర్ల హనుమంతరావు 1952లో ఈ నియోజకవర్గం నుంచి తొలి శాసనసభ్యుడిగా ఎన్నికై బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో దేవాదాయ, ఎక్సైజ్, రెవెన్యూ శాఖల మంత్రిగా పనిచేశాడు. 1957, 1962లలో పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు , నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు. దాష్టీక రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమించి జైలుశిక్ష పొందాడు.[11]
పులి వీరన్న
పులివీరన్న 2 సార్లు మహబూబ్ నగర్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1989లో రాష్ట్ర మంత్రివర్గంలో చేనేత జౌళి శాఖామంత్రిగా పనిచేశాడు. ఇతని భార్య పులి అంజనమ్మ మహబూబ్ నగర్ పురపాలసంఘపు వైస్ చైర్మెన్‌గా పనిచేసింది. 2009 ఎన్నికలలో పులివీరన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిననూ[12] తృతీయ స్థానంతో సరిపెట్టుకున్నాడు. డిసెంబరు 11, 2009న మరణించాడు.[13]
పి.చంద్రశేఖర్
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత 1983 నుంచి వరుసగా ఈ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్న పి.చంద్రశేఖర్ ఇంతవరకు 4 సార్లు గెలుపొందగా, రెండు సార్లు పులి వీరన్న చేతిలో ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన పి.చంద్రశేఖర్ మహబూబ్ నగర్ నియోజకవర్గపు ప్రముఖ తెలుగుదేశం నాయకుడు. 2009 ఎన్నికలలో మహబూబ్ నగర శాసనసభ స్థానం పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితికి కేటాయించడంతో పోటీచేసే అవకాశం లభించలేదు.
ఎన్.రాజేశ్వర్ రెడ్డి
మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన ఎన్.రాజేశ్వర్ రెడ్డి పట్టణ రాజకీయ నాయకులలో ముఖ్యులు. 1991 నుండి రాజకీయాలలో ఉంటూ పదవులను అలంకరించాడు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షపదవిని కూడా చేపట్టినాడు. ఇటీవల భాజపాకు రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరిననూ శాసనసభ ఎన్నికలలో టికెట్టు లభించలేదు. స్వంతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మేల్యేగా ఎన్నికైనాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సాక్షి దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజి 12, తేది 11.09.2008
  2. Eenadu (21 November 2023). "పాలమూరు పందెం కోళ్లు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  3. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.
  4. Namasthe Telangana (12 April 2022). "శాసనసభ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  5. 5.0 5.1 Eenadu (17 November 2023). "స్వతంత్రులుగా సత్తా చాటారు". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  6. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  7. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  8. సూర్య దినపత్రిక, తేది 18-03-2009
  9. ఈనాడు దినపత్రిక, తేది 31-03-2009
  10. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
  11. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటీ ప్రచురణ, ప్రథమ ముద్రణ 2006, పేజీ సంఖ్య 224
  12. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 22-03-2009
  13. ఈనాడు దినపత్రిక, తేది 12-12-2009