Jump to content

మంజుల గావిట్

వికీపీడియా నుండి
మంజుల గావిట్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
ముందు ధనాజీ సీతారాం అహిరే
నియోజకవర్గం సక్రి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ శివసేన
జీవిత భాగస్వామి తులషీరామ్ గవిత్
వృత్తి రాజకీయ నాయకురాలు

మంజుల తులషీరామ్ గావిట్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె సక్రి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

మంజుల గావిట్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి ధూలే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పని చేసి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో సక్రి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి యోగేంద్ర రేషమా భోయే చేతిలో 18,944 ఓట్ల తేడాతో, 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ధంజీ సీతారాం అహిరే గవిత్‌ చేతిలో 3,323 ఓట్ల తేడాతో వరుసగా ఓటమిపాలైంది.

మంజుల గావిట్ కు 2019 ఎన్నికలలో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మోహన్‌ సూర్యవంశీపై 7,265 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3] ఆమె ఆ తరువాత శివసేన పార్టీలో చేరి[4] 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ బాపు చౌరేపై 5,584 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[5][6][7][8]

మూలాలు

[మార్చు]
  1. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The New Indian Express (24 October 2019). "Maharashtra now has seven more women members in assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. The Times of India (26 October 2019). "Meet Maharashtra's 24 women MLAs". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. Lokmat (30 October 2019). "अजून एक अपक्ष आमदार शिवसेनेच्या गोटात, मंजुळा गावित यांनी दिला पाठिंबा". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  5. TimelineDaily (23 November 2024). "Sakri Election Result: Manjula Gavit Secures Second Term With 5,584 Vote Margin" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  6. Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Sakri". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  7. The Economic Times (24 November 2024). "21 women among 288 winning candidates in Maharashtra; only 1 from opposition side". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  8. NDTV Profit (24 November 2024). "Maharashtra Election Results 2024: Full List Of Mahayuti Winners — Fadnavis, Eknath Shinde, Ajit Pawar" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.