Jump to content

భావన(నటి)

వికీపీడియా నుండి
భావన
భావన
జననం
కార్తీక మీనన్

(1986-06-06) 1986 జూన్ 6 (వయసు 38)
త్రిస్సూర్, కేరళ, భారతదేశం
వృత్తి
  • నటి
  • దర్శకురాలు
క్రియాశీల సంవత్సరాలు2002 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
నవీన్
(m. 2018)

భావన (జననం 1986 జూన్ 6), ప్రముఖ దక్షిణ భారత సినీ నటి. ఆమె అసలు పేరు కార్తికా మీనన్. మలయాళంలో దర్శకుడు కమల్ తీసిన నమ్మళ్(2002) సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు భావన. ఈ సినిమాలోని నటనకు ఆమె మంచి ప్రశంసలు అందుకున్నారు. దశబ్దం పాటు కొనసాగిన ఆమె కెరీర్ లో దాదాపు 70 సినిమాల్లో నటించిన భావన, రెండు కేరళ రాష్ట్ర సినీ పురస్కారాలు అందుకుంది.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఆమె జన్మించింది. ఆమె తండ్రి జి.బాలచంద్రన్ సినిమాల్లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్, తల్లి పుష్ప గృహిణి. ఆమె త్రండ్రి 2015 సెప్టెంబరు 24న మరణించాడు. ఆమెకు ఒక అన్నయ్య జయదేవ్.[1] ఉన్నాడు. ఆమె త్రిస్సూర్ లోని చెంబుక్కవులో హోలీ ఫ్యామిలీ గర్ల్స్ హై స్కూల్ లో చదువుకుంది. భావన అన్నయ్య జయదేవ్ తమిళ సినిమా పట్టినప్పాక్కంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.[2]

తనకు చిన్నప్పటినుంచీ నటి కావాలని కోరిక ఉండేదని భావన ఒక ఇంటర్వ్యూలో వివరించారు.[3] తన ఐదేళ్ళ వయసు నుంచి అమలకు అభిమాని అని, మలయాళ చిత్రం ఎంటె సూర్యపుత్రిక్కులో అమల నటనను అద్దంలో చూస్తూ అనుకరిస్తుండేదని తెలిపింది. ఆ సినిమాలో అమల ఒక సీన్ లో బిల్డింగ్ పైనుంచీ దూకడం చూసి, భావన కూడా అలాగే దూకి, చేయి విరగ్గొట్టుకున్నానంది.[3]

కెరీర్

[మార్చు]

ఆమె 16వ ఏట[3] మలయాళ చిత్రం నమ్మాళ్ తో వెండితెరకు పరిచయమయింది. ఈ సినిమా సమయంలోనే తన పేరు భావనగా ఆమె మార్చుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాక, ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ఈ విజయంతో ఆమెకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. కేరళ రాష్ట్ర స్పెషల్ జ్యూరీ పురస్కారం కూడా అందుకుంది. ఆ సినిమాలో నటించేప్పుడు ఆమె 11వ తరగతి చదువుతోంది. మలయాళ సినీ రంగంలో ఆ సమయంలో ఉన్న దాదాపు అందరి నటులతోనూ ఆమె కలిసి చేసింది. తమిళ సినిమాల్లో కూడా ఆమె నటించింది. తమిళ ప్రముఖ హీరోలైన అజిత్ కుమార్మాధవన్జయం రవిభరత్జీవాశ్రీకాంత్ వంటి  వారి  పక్కన హీరోయిన్ గా నటింంచింది.[4]

2010లో పునీత్ రాజ్‌కుమార్ సరసన జాకీ అనే కన్నడ సినిమాలో ఆమె నటించింది. ఇది ఆమె మొట్టమొదటి కన్నడ చిత్రం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విజయవంతం కావడంతో తెలుగు, మలయాళ భాషల్లోకి కూడా డబ్ చేశారు.[5] ఇమ్రాన్ హష్మి, అమితాబ్ బచ్చన్ వంటి హీరోలతో బాలీవుడ్ సినిమాలనూ ఆమె నటిస్తానని ప్రకటించింది.[6] విష్ణువర్ధన్, సుదీప్ లతో కలసి ఆమె తన రెండో కన్నడ సినిమా చేసింది. ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. 2012లో హనీ బీ, 2013లో ఎళమతే వరవు అనే మలయాళ చిత్రాల్లో నటించింది. తరువాత శ్యాంప్రసాద్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ఇవిడేలో ఐటీ కంపెనీలో పనిచేసే సింగిల్ మదర్ పాత్రలో ఆమె నటించిమెప్పించింది. ఈ సినిమాలో అమెరికాలో వరుసగా ఐటి ప్రొఫెషనల్స్ ను చంపుతుంటారు. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[7][8]

తెలుగు సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Tamil Actress Bhavana Balachandran Photo Gallery | Bhavana's Latest Movie in Telugu is Ontari with P.Gopichand". Actress.telugucinemastills.com. 1986-06-06. Archived from the original on 2012-07-01. Retrieved 2011-01-02.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-21. Retrieved 2017-01-06.
  3. 3.0 3.1 3.2 Y. Sunita Chowdhary (2011-07-16). "Arts / Cinema : New-look Bhavana's dream comes true". The Hindu. Retrieved 2011-10-03.
  4. "Bhavana going glamorous in film". Times of India. Archived from the original on 2013-04-04. Retrieved 2017-01-06.
  5. "Bhavana debuts in Kannada today – Tamil Movie NEWS". IndiaGlitz. Retrieved 2011-10-03.
  6. cinema (2011-09-03). "Actress bhavana is all set to make her bollywood debut. | Kottaka.com Blog". Kottaka.com. Archived from the original on 2011-10-04. Retrieved 2011-10-03.
  7. "Watch Making of Prithviraj, Nivin Pauly, Bhavana Starrer 'Ivide' [VIDEO]". International Business Times, India Edition. 30 March 2015.
  8. "Shyamaprasad gives artistes their space". The Times of India.
"https://te.wikipedia.org/w/index.php?title=భావన(నటి)&oldid=4066580" నుండి వెలికితీశారు