Jump to content

బులా చౌదరి

వికీపీడియా నుండి
బులా చౌదరి
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరుబులా చౌదరి
జాతీయతభారతీయులు
జననంకలకత్తా
క్రీడ
క్రీడSwimming

బులా చౌదరి సప్త సముద్రాలలోని ఏడు జలసంధులు ఈదిన తొలి భారతీయ మహిళ. ఈమె భారతదేశంలో జాతీయ మహిళా ఈత ఛాంపియన్ గా నిలిచారు. ఆమె 1989, 1999లలో "ఇంగ్లీషు ఛానెల్" ను రెండుసార్లు ఈదారు. ఈమెకు 1990లో అర్జున అవార్డు వచ్చింది. ఆమె కోల్‌కతాలో ఒక స్విమ్మింగ్ అకాడమీ నెలకొల్పడానికి పథకం రచిస్తున్నారు. ఈమె పశ్చిమ బెంగాల్ లోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని నందన్‌పూర్ నియోజకవర్గం నుండి కమ్యూనిస్ట్ పార్ట్(మార్క్సిస్టు) తరపున లెజిస్లేచర్గా ఎన్నికైనారు.

ఈమె ప్రతిభావంతురాలైన అధిక దూరాలను ఈదే భారతీయ స్విమ్మర్, ఆమె పోటీ ప్రపంచంలో తన స్థానాన్ని నిలబట్టుకున్నారు. ఆమె తన 9 వయేట ఆమె స్విమ్మింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి వివిధ పోటీలలో ఆరు బంగారు పతకాలను సాధించారు.[1] ఆమె తన 24వ యేటనుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయారు. 2004లో శ్రీలంక నుండి ధనుష్కోటి వరకు పాక్ జలసంధిని 14 గంటలలో ఈదగలిగారు. ఈమె ఐదు ఖండాలలో ఏడు సముద్రాలను ఈదిన మొదటి మహిళగా చరిత్రలో నిలిచారు.

ముఖ్య విజయాలు

[మార్చు]
పద్మశ్రీపురస్కారం

ఈమె 1989లో ఇంగ్లీషు ఛానెల్ను దాటారు. 1999లో రెండవసారి ఇంగ్లీషు చానెల్ను ఈదారు. ఈమె రెండుసార్లు ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన మొదటి ఆసియా మహిళగా చరిత్రను సృష్టించారు. 1990లో ఆమెకు అర్జున అవార్డు లభించింది. 2000లో ఈమె జిబ్రాల్టర్ జలసంధిని ఈదారు. ఆతర్వాత ఆమె ఇటలీ లోని తిరేనియన్ సముద్రాన్ని ఈదారు. ఆ తర్వాత ఆమె 2003 లో యూ.ఎస్. లోని కటాలినా ఛానెల్ ను, గల్ఫ్ లోని టొరోనియస్ ను ఈదారు. ఆమె న్యూజిలాండ్ లోని కుక్స్ స్ట్రైట్స్ ను ఈదారు. ఈమె జిబ్రాల్టర్ జలసంధిని 3 గంటల 35 నిముషాలలో ఈది ప్రపంచ రికార్డును నెలకొల్పారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈమె 1993లో సంజిబ్ చక్ర���ర్తిని వివాహమాడారు. వారికి ఒక కుమారుడు (సరబ్‌జిత్). ఆమె లక్ష్యం కలకత్తాలో స్విమ్మింగ్ అకాడమీ నెలకొల్పాలని.

మూలాలు

[మార్చు]