Jump to content

బీర్బం జిల్లా

వికీపీడియా నుండి
బీర్బం జిల్లా
ఎడమ నుండి సవ్యదిశలో: బీర్భూమ్ జిల్లాలోని మల్లార్‌పూర్‌లోని మల్లేశ్వర ఆలయ సముదాయం, శాంతినికేతన్‌లో ఠాగూర్ ఇల్లు, రాజ్‌నగర్‌లోని స్మారక చిహ్నాలు, సియోరాకురి ఫారెస్ట్, మామా భగ్నే హిల్స్
Birbhumసవరించు జిల్లా
বীরভূম জেলা
West Bengal పటంలో Birbhumసవరించు జిల్లా స్థానం
West Bengal పటంలో Birbhumసవరించు జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంWest Bengal
డివిజనుBurdwan
ముఖ్య పట్టణంSuri, Birbhum
Government
 • లోకసభ నియోజకవర్గాలుBirbhum, Bolpur (shared with Bardhaman district)
 • శాసనసభ నియోజకవర్గాలుDubrajpur (SC), Suri, Sainthia (SC), Rampurhat, Hansan, Nalhati, Murarai, Bolpur, Nanoor (SC), Labpur, Mayureswar
విస్తీర్ణం
 • మొత్తం4,545 కి.మీ2 (1,755 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం35,02,387
 • జనసాంద్రత770/కి.మీ2 (2,000/చ. మై.)
 • Urban
2,58,420 (2,001)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత70.90 per cent (2011)
 • లింగ నిష్పత్తి926
ప్రధాన రహదార్లుPanagarh–Morgram Highway
సగటు వార్షిక వర్షపాతం1,300 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర జిల్లాలలోని 20 జిల్లాలో బీర్బం (బెంగాలీ:বীরভূম জেলা) జిల్లా ఒకటి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 3 విభాగాలలో ఒకటైన బర్ద్వాన్ విభాగంలో ఉత్తరభాగంలో ఉంది. జిల్లా ప్రధాన కార్యాలయం సూరి వద్ద ఉంది.[1][2]జిల్లా పశ్చిమ సరిహద్దులో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన దుంకా, జంతరా, పాకుర్ జిల్లాలు ఉన్నాయి. ఇతర సరిహద్దులో బర్ధామన్, ముర్షిదాబాద్ జిల్లాలు ఉన్నాయి.

ఈ జిల్లాను తరచుగా " ది లాండ్ ఆఫ్ రెడ్ సాయిల్ " (ఎర్రమట్టి భూమి) [3] విభిన్నమైన భూలక్షణాలే కాక సంప్రదాయంగా కూడా బిర్బం జిల్లాను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఇతర జిల్లాల నుండి వేరు చేస్తుంది. జిల్లా పశ్చిమ భూభాగంలోని చోటా నాగ్పూర్ ప్రాంతంలో పొదలు అధికంగా ఉన్నాయి. ఈ భూభాగం క్రమంగా తూర్పు భూభాంలో ఉన్న సారవంతమైన వ్యవసాయభూములలో కలిసిపోతుంది. [4] జిల్లా పలు సాంస్కృతిక, మతపరమైన ఉద్యమాలు జరిగాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతి నికేతన్ వద్ద విశ్వభారతి విశ్వవిద్యాలయం స్థాపించాడు. ఇది అంతర్జాతీయ గుర్తింపును పొందింది.[5] సాంస్కృతికంగా సుసంపన్నమైన ఈ జిల్లాలో పౌష్ మేళా వంటి పలు ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. [6] ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన బిర్బం జిల్లాలో 75% వ్యవసాయ భూములు ఉన్నాయి.[7] జిల్లాలలో ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులలో పత్తి, పట్టు వ్యవసాయం ప్రధానమైనవి. నేత, నూనె మిల్లులు, రాళ్ళగనులు, లక్కను పండించడం, మృణ్మయ పాత్రల తాయారీ, లోహపాత్రల తయారీ, రైస్ మిల్లులు వంటి చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి.[8] జిల్లాలో ఉన్న ఏకైక బృహత్తర పరిశ్రమగా " బక్రేశ్వర్ థర్మల్ పవర్ స్టేషను " గుర్తినచబడుతుంది.[9]

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

బిర్బం అంటే వీరభూమి (బీర్ వీర అని అర్ధం బం అంటే భూమి అని అర్ధం)అని అర్ధం. .[10][11] మరొక సిద్ధాంతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన బిర్ రాజుల ఈ ప్రాంతానికీపేరు వచ్చినదని భావిస్తున్నారు.[10][11] అయినప్పటికీ బిర్ అంటే శంతలి భాషలో అరణ్యం అనికూడా అర్ధం కనుక దీనికి అరణ్యభూమి అనే అర్ధం కూడా వర్తిస్తుంది.[10][11]

భౌగోళికం

[మార్చు]

జిల్లా 23° 32' 30", 24° 35' 0" డిగ్రీల ఉత్తర అక్షాంశం, 87° 5' 25", 88° 1' 40" డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది. దాదాపు త్రిభుజాకారంలో జిల్లా వైశాల్యం 45చ.కి.మీ. జిల్లాలో ప్రవహిస్తున్న అజయ్ నది బిర్బం, బర్ధామన్ జిల్లా సరిహద్దులను నిర్ణయిస్తుంది. జిల్లా ఉత్తర, పశ్చిమ సరిహద్దులో జార్ఖండ్ రాష్ట్రం, తూర్పు సరిహద్దులో ముర్షిదాబాద్ జిల్లా ఉంది.[2][8][10] భౌగోళికంగా జిల్లా చోటానాగ్పూర్ మైదానానికి ఈశాన్యంలో ఉంది. అక్కడ నుండి దుగువలో ఉన్న సారవంతమైన గంగామైదానం వరకు విస్తరించి ఉంది. జిల్లా పశ్చిమ భూభాగాన్ని విజయభూమి లేక బీరభూమి అని పిలుస్తుంటారు.[4][12] సారవంతమైన తూర్పు భూభాగంతో పోల్చినట్లైతే ఎత్తుపాల్లాలతో కూడిన జిల్లాలోని ఉత్తర భూమి దాదాపు ఖాళీగా ఉంటుంది. ఈశాన్యంలో ఉన్న రార్ భూమి (విజయభూమి ఇందులోని భాగమే) తిన్నగా గంగామైదానంలో కలుస్తుంది. విజయభూమి కాక మిగిలిన రార్ భూభాగాన్ని సుంహా అంటారు.[4][12]

వాతావరణం

[మార్చు]
Rivers and towns of Birbhum

జిల్లా పశ్చిమప్రాంతంలో పొడిగా, తీవ్రంగా ఉంటుంది. తూర్పు ప్రాంతంలో వాతావరణం తేలికగా ఉంటుంది. వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్షియస్ ఉ��ది. శీతాకాల ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది.[8] జిల్లా తూర్పుప్రాంతం కంటే పశ్చిమప్రాతంలో వర్షపాతం అధికంగా ఉంటుంది. రాజ్నగర్ సరాసరి వర్షపాతం 405 మి.మీ., నానూర్ ప్రాంతం వర్షపాతం 121 మి.మీ. జూన్ నుండి అక్టోబరు మాసాలలో వర్షపాతం అధికంగా ఉంటుంది.[4][10]

నదులు

[మార్చు]

బిర్బం జిల్లా భూభాగం నుండి అజయ్, మయూరాక్షి (మోర్), కోపై, బక్రేశ్వర్, బ్రహ్మణి, ద్వర్క, హొంగ్లొ, చపల, బంస్లాయి, పగ్ల వంటి పలు నదులు ప్రవహిస్తున్నాయి.[2][8] మయూరాక్షి నది మీద సూరి వద్ద నిర్మించిన తిల్పరావంతెన 2,428 చ.కి.మీ వ్యవసాయభూములకు నీటిపారుదల సౌకర్యాన్ని కలిగిస్తుంది. [13] దాదాపు నదులన్నీ చోటానాగ్పూర్ ఎగువ భూములలో జన్మించి బిర్బం జిల్లాలో పశ్చిమ తూర్పు దిశగా ప్రవహిస్తున్నాయి. వర్షాకాలంలో ఉధ్రుతంగా ప్రవహిస్తున్న నదులు వేసవి కాలంలో మాత్రం కుచించుకు పోతుంటాయి. కరువు, వరదలు మారి మారి వస్తూ ప్రజల ఆస్తి, ప్రాణాలకు హాని కలిగిస్తూ ప్రజాజీవితాలను చిన్నాభిన్నం చేస్తుంటాయి.[4][7]

చరిత్ర

[మార్చు]

చరిత్రకాలానికి ముందు

[మార్చు]
Terracota design depicting Ramayana war at Jayadev Kenduli
Statue of Rabindranath Tagore by K P Krishnakumar at Amar Kutir

చరిత్ర కాలానికి ముందు నుండి బిర్బం జిల్లాలో మానవ నివాసాలు ఉన్నాయి. పురాతత్వశాఖకు చెందిన పాండురాజర్ దిబికి చెందిన సున్నపురాతినిక్షేపాలు బీర్బం జిల్లాలో ఉన్నాయి. [14] రాతియుగానికి చెందిన పనిముట్లు కొన్ని జిల్లాలో పలు ప్రదేశాలలో లభించాయి.[15] జైనమతానికి చెందిన " అకరంగ సూత్ర " పుస్తక కథనాలను అనుసరించి 24వ తీర్థంకరా మహావీరా క్రీ.పూ 5వ శతాబ్దంలో ఈ ప్రాంతంలోని విజయభూమి, సుబ్బభూమి (సుహ్మా) సంచరించినట్లు భావిస్తున్నారు. [2][12][16] ఈ ప్రాతంలో ఆర్యసంప్రాదాయం వ్యాపించడంలో భాగంగా జైనిజం, బుద్ధిజం ఆధిక్యత వహించాయన్నది కొందరు చారిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.[17] డాక్టర్ అతుల్ వ్రాసిన బుద్ధిస్ట్ దువ్యాబ్ధన్‌ (కొలకత్తా, సాహిత్యలోక్ ప్రచురణ, 1986,1994) పుస్తకంలో గౌతమబుద్ధుడు ఈ ప్రాంతం నుండి ప్రయాణిస్తూ పుంద్రవర్దన, సమతతకు చేరున్నాడని ప్రస్తావించబడింది.[18] రార్ ప్రాంతం ఒకప్పుడు మయూర సామ్రాజ్యంలో భాగంగా ఉంటూ తరువాత గుప్త, శశాంక, హర్ష సామ్రాజ్యంలో భాగాంగా ఉంది. హర్షసామ్రాజ్యం పతనం తరువాత ఈ ప్రాంతాన్ని 12 వ శతాబ్దం వరకు సేనా సామ్రాజ్యం ఆధీనంలో ఉంది.[2] పాలా సామ్రాజ్యం కాలంలో ఈ ప్రాంతంలో " వజ్రయాన " బుద్ధిజం ఆధిక్యత చూపింది.[19] 7వ శతాబ్దంలో చైనాయాత్రికుడు హూయంత్సాంగ్ ఈ ప్రాంతంలోని కొన్ని బౌద్ధవిహారాల గురించి వివరించాడు.[12][18]

మద్యయుగం

[మార్చు]

13 వ శతాబ్దం నుండి ఈ ప్రాంతంలో ముస్లిముల పాలన మొదలైంది. అయినప్పటికీ ఈ ప్రాతంలో ముస్లిం పాలకుల ఆధిపత్యం నామమాత్రంగానే ఉండేది. ఈ ప్రాంతాన్ని బిర్ రాజాలు అనే సంస్థాధీశులు పాలిస్తూ ఉండేవారు.[2] సంస్థానాధీసుల వశంలో హెతంపూర్, బిరిషింగ్పూర్, రాజ్నగర్ పట్టణాలు ఉండేవి. [20] బిర్బంలో అధిక ప్రాంతం హేతంపూర్, రాజ్నగర్ రాజుల పాలనలో ఉండేది. తబక్వాత్-ఐ- నసిరి పుస్తకంలో రార్ రాజ్యానికి లఖనూర్ రాజధానిగా, ప్రధాన సరిహద్దుగా ఉండేదని తెలుస్తుంది. అయినప్పటికీ బిర్బంలో లఖనూర్ ప్రాంతం గుర్తించబడలేదు.[2][12] హిందూ, తాంత్రిక కారూక్రమాలకు విజయభూమి కేంద్రంగా ఉండేదని పురాణకథనాలు వివరిస్తున్నాయి.[18][21] కొందరు రచయితలు బీర్బం అనే పదం తాంత్రిక్ సంప్రదాయం నుండి వచ్చిందని భావిస్తున్నారు. వజ్రయాన, శాక్తేయులు, బౌద్ధులు తాంత్రిక, శాక్తేయ పూజల కొరకు పలు ఆలయాలను నిర్మించారని భావిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా బిర్బంలోని తరాపీఠ్, బక్రేశ్వర్, కంకలితల, లభ్పుర్ వద్ద ఉన్న ఫుల్లర, సైంతియా, నల్హతి ప్రాంతాలలో శక్తిపీఠాలు ఉన్నాయి. తారాపీఠానికి చెందిన ప్రఖ్యాత శాక్తేయులలో బందేవ్ (బమక్యాప) ఒకరు.[22]

ఆధునిక శకం

[మార్చు]

బ్రిటిష్ ఈస్టిండియా కంపనీ పాలనాకాలంలో 1787లో బిర్బం పేరుతో నిర్వహణా విభాగం ఏర్పాటు చేయబడింది. అంతకు ముందు ఇది ముర్షిదాబాద్ జిల్లాలో భాగంగా ఉంటూఊవచ్చింది. 1787లో అధికారికంగా బీర్భూం జిల్లా రూపొందించబడిన తరువాత ఈ జిల్లా వైశాల్యం ఇప్పుడు ఉన్నదానికంటే చాలా అధికంగా ఉండేది. 1793లో బిర్బం జిల్లాతో బిష్ణుపూర్ కూడా చేర్చబడింది. బిష్ణుపూర్ ఇప్పుడు బంకురా జిల్లాలో భాగంగా ఉంది. 1857లో సిపాయీల తిరుగుబాటు తరువాత శాంతల్ పరగణాలు కూడా బిర్బం జిల్లాతో చేర్చబడ్డాయి. క్రమంగా దేవ్‌ఘర్ జిల్లా వరకు విస్తరించబడింది. 1855-56 లో గిరిజన ప్రజలలో మొదలైన శాంతల్ తిరుగుబాటు కారణంగా పశ్చిమ గిరిజన ప్రాంతాలు వేరుచేయబడ్డాయి. బిర్బం జిల్లాలోని సిధు, కను ప్రాంతాలు అమరవీరుల స్మృతిచిహ్నాలుగా గుర్తించబడుతున్నాయి.[2][12]

ఆర్ధికం

[మార్చు]
A common Birbhum village scene
Product display of Amar Kutir

బిర్బం జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జిల్లా. జ్జిల్లలోని 75% ప్రజలు వ్యవసాయ మీద ఆధారపడి ఉన్నారు.[7] జిల్లాలోని 159 చ.కి.మీ భూభాగంలో అరణ్యాలు ఉన్నాయి. 3329 చ.కి.మీ భూభాగం వ్యవసాయానికి ఉపయోగించబడుతుంది.[8] జిల్లాలోని 91.02% ప్రజలు గ్రామాలలో నివసిస్తున్నారు.[7] జిల్లాలో ప్రధానంగ వరి, చిక్కుడు, గోధుమ, మొక్కజొన్న, ఉర్లగడ్డలు, చెరుకు పంటలు పండినచబడుతున్నాయి.[7] జిల్లాలో 13 కోల్డ్ స్టోరేజ్ గోదాములు ఉన్నాయి.[8] 2763 చ.కి.మీ వ్యవసాయ భాభానికి నీటిపారుదల సౌకర్యం ఉంది.[7] జిల్లాలో 5 ఆనకట్టలు వ్యవసాయ భూముల నీటిపారుదల సౌకర్యానికి సహకరిస్తున్నాయి. వీటిలో మయూరాక్షి నది మీద నిర్మించబడిన " మాసంజోర్ ఆనకట్ట (కెనడా ఆనకట్ట) ఒకటి. ఇది బిర్బం , జార్ఖండ్ రాష్ట్రంలోని ధంకా జిల్లా సరిహద్దు మద్య ఉంది. మయూరాక్షికి మరి కొంత దిగువన సూరి వద్ద తిప్రా ఆనకట్ట ఉంది.[7]

కుటీర పరిశ్రమలు

[మార్చు]

బిర్బం జిల్లా కుటీర పరిశ్రమలకు ప్రఖ్యాతి చెందినది. జిల్లాలోని గుర్తించతగిన పరిశ్రమలు లాభాపేక్ష రహిత గ్రామీణ సంస్థ అయిన " అమర్ కుతిర్ " కు సంబధితమై ఉన్నాయి. జిల్లాలోని ఇతర ప్రధాన పరిశ్రమలలో వ్యవసాయ ఆధారితమైన టెక్స్టైల్, ఫారెస్టరీ, కళలు , హస్థకళలు ప్రధానమైనవి. శ్రీనికేతన్ పాల ఉత్పత్తులకు , వన్య ఉత్పత్తులకు ప్రసిద్ధిచెంది. బిర్బం జిల్లాలోని గుర్తించతగిన కుటీర పరిశ్రమలలో టెక్స్టైల్ తయారీ ప్రధానమైనది. ప్రధానంగా నూలు వస్త్రాలు , ప్రంతీయంగా ఉత్పత్తి చేయబడుతున్న టస్సర్ సిల్క్, జనపనార వస్తువులు, బతిక్ , కంథాస్టిట్చ్, మాక్రేం (అల్లిక వస్త్రాలు), తోలు, మృణ్మయ పాత్రలు, టెర్రకోటా, సోలాపిత్, కొయ్యశిల్పాలు, వెదురు, కేన్ (ఫ్రేం) వస్తువులు, లోహ పాత్రలు, , పలు గిరిజన ఉత్పత్తులు ప్రధానమైనవి.[8] జిల్లాలో మొత్తం 8,883 చిన్న తరహా , మద్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలోని ప్రధాన పరిశ్రమలలో పత్తి , పట్టు తయారీ , నేత, బియ్యం , నూనె మిల్లులు, లక్క పండించడం , మృణ్మయ పాత్రలు , లోహపాత్రల తయారీ ప్రధానమైనవి. [8] జిల్లాలో బృహత్తర పరిశ్రమగా " బక్రేశ్వర్ థర్మల్ పవర్ స్టేషను " విద్యుదుత్పత్తి కేంద్రం మాత్రమేఉంది.[9]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బిర్బం జిల్లా ఒకటి అని గుర్తించింది.[23] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 20 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[23]

రాజకీయ , నిర్వహణా విభాగాలు

[మార్చు]

బిర్బం జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది:- సూరి సాదర్ ఉపవిభాగం, బోల్పూర్ ఉపవిభాగం , రాంపూర్హత్ ఉపవిభాగం.[1] బిర్బం జిల్లాకు సూరి (బిర్బం) కేంద్రంగా ఉంది.[1][24] జి���్లాలో 17 పోలీస్ స్టేషన్లు, 19 డెవెలెప్మెంటు బ్లాకులు, 6 పురపాలకాలు, 167 గ్రామపంచాయితీలు, 1 పట్టణం ఉన్నాయి.[24][25] సమీపకాలంలో చివరిగా 2000లో నల్హతి పురపాలకం ఏర్పాటు చేయబడింది. [26]

అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]
  • జిల్లా 12 అసెంబ్లీ నియోజావర్గాలుగా విభజించబడింది. (అ.ని)[27]*
  • నానూర్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 283)
  • బోల్పూర్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 284)
  • లాబ్‌పూర్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 285)
  • దుబ్రజ్పూర్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 286)
  • రాజ్నగర్ (బీర్బుం) (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 287)
  • సూరి (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 288)
  • మొహమ్మద్ బజార్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 289)
  • మయూరేశ్వర్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 290)
  • రాపూర్హత్ (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 291)
  • హంసన్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 292)
  • నాల్హతి (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 293) ,
  • మురారై (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 294).

పునర్విభజన తరువాత నియోజక వర్గాలు

[మార్చు]

2006 వరకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక జరిగింది.[28] తరువాత పశ్చిమ బెంగాల్ డిలిమినేషన్ ఆఫ్ కంసిస్టెన్సీస్ సిఫారుసుతో డిలిమినేషన్ కమీషన్ " ఆదేశానుసారం బిర్బం జిల్లాలోని నియోజకవర్గాల పునర్విభజన తరువాత జిల్లా 11 అసెంబ్లీ నియోజకవర్గాలుగా విభజించబడింది.[29]2009 ఇండియన్ జనరల్ ఎలెక్షన్ కొత్తాగారూపొందించబడిన జియోజకవర్గాలు ఆధారంగా జరిగింది.

  • దుబ్రజ్పూర్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 284)
  • సూరి (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 285)
  • బోల్పూర్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 286)
  • నానూర్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 287)
  • లాబ్పూర్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 288)
  • సైంతియా (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 289)
  • మయూరేశ్వర్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 290)
  • రాంపూర్హత్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 291)
  • హంసన్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 292)
  • నాల్హతి (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 293)
  • మురారై (విధాన సభ నియోజకవర్గం) (అ.ని #294).

షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు

[మార్చు]
  • నానూర్, రాజ్నగర్, మయూరేశ్వర్, హంసన్ అసెంబ్లీ నియోజకవర్గాలు షెడ్యూల్డ్ జాతి, షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేకించబడ్డాయి.[27]
  • దుబ్రజ్పూర్, ననూర్, సైతియా నియోజకవర్గాలు షెడ్యూల్డ్ జాతి, షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేకించబడ్డాయి.[28]
  • బిర్బం పార్లమెంటరీ నియోజకవర్గం లోని దుబ్రాజ్పూర్, సూరి, సైంతియా, రాంపూర్హత్, హంసన్, నల్హతి, మురారై అసెంబ్లీ విభాగాలు.[28]
  • బోల్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం లోని బోల్పూర్, నానూర్, లాభ్పూర్, సైంతియా అసెంబ్లీ నియోజకవర్గాలు, బర్ధామన్ జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలు.[28]

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

బిర్బం జిల్లా ద్వారా " ది పనగర్-మొర్గం హైవే " వేయబడి ఉంది. జిల్లాలోని పల్లెలు, పట్టణాలన్ని రహదరితో అనుసంధానించబడి ఉన్నాయి. జిల్లాలోని రహదారి మార్గాల పొడవు 2413 కి.మీ. జిల్లాలోని మొత్తం రైలు మార్గాల పొడవు 32కి.మీ. ఇందులో 1917లో నిర్మించబడిన అహమ్మద్పూర్, కత్వా రైలుమార్గం (26.55) కూడా ఉంది.[8] 1862లో నిర్మించబడిన ఈస్టర్న్ రైల్వేకి చెందిన సాహిబ్గంజ్ లూప్ మార్గం ఈ జిల్లా ద్వారా నిర్మించబడింది. జల్పైగురి, అజింగంజ్‌లను కలిపే నల్హతి వద్ద రైల్వే జంక్షన్ ఉంది. అండల్ వద్ద ఉన్న " ది అండై - సైంతియా బ్రాంచ్ లైన్ " ఢిల్లీ - హౌరా మార్గంతో అనుసంధానించబడి ఉంది. .[8]

గణాంకాలు

[మార్చు]

1901లో బిర్బం జసంఖ్య 902,280, 1981 నాటికి జనఖ్య 2,095,829కు చేరింది. 2001 నాటికి 3,015,422 కి చేరింది.[30]

గ్రామీణ/నగరప్రాంతం ప్రజలు పురుషులు స్త్రీలు
మొత్తం 3,015,422 1,546,633 1,468,789
రూరల్ 2,757,002 1,414,097 1,342,905
అర్బన్ 258,420 132,536 125,884

మతం , జాతులు

[మార్చు]

2001 గణాంకాలను అనుసరించి బిర్బం జిల్లాలోని ప్రజలలో హిందువులు 65%, ముస్లిములు 33% ఉన్నారు.[31] స్వల్పసంఖ్యలో చెదురు మదురుగా ఇతర మతస్థులు జిల్లా మొత్తంలో ఉన్నారు. 2001లో ప్రజలలో 29.5% షెడ్యూల్డ్ కులాలు, షేడ్యూల్డ్ జాతులకు చెందినవారు 6.7% .[32]

భాషలు

[మార్చు]

జిల్లాలో అత్యధికంగా బెంగాలీ భాష వాడుకలో ఉండగా, శంతల్ గిరిజన జాతులు, 10 ఇతర గిరిజన జాతులు కొడ, మహాలి, ఒరాన్ భాషలు మాట్లాడడం సాధారణంగా కనిపిస్తుంది.[33]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,502,387,[34]
ఇది దాదాపు. లితుయానియా దేశ జనసంఖ్యకు సమానం.[35]
అమెరికాలోని. కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[36]
640 భారతదేశ జిల్లాలలో. 84 వ స్థానంలో ఉంది.[34]
1చ.కి.మీ జనసాంద్రత. 771 [34]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.15%.[34]
స్త్రీ పురుష నిష్పత్తి. 956:1000 [34]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 70.9%.[34]
జాతియ సరాసరి (72%) కంటే.

సంస్కృతి

[మార్చు]
Baul singers at Santiniketan

బిర్బంలోని బౌల్ సాహిత్యంలో వేదాంతం, గీతాలతో కూడిన జానపదగీతాలు జిల్లాకు ప్రత్యేకత తీసుకువచ్చాయి. బిర్బం కబియాల్, కీర్తనియా, జానపద సంస్కృతికి బిర్బం జిల్లా పుట్టిల్లు.[6][37] బిర్బం జిల్లాలో శాంతినికేతన్ వద్ద పౌష మేళా సందర్భంలో పలు ఉత్సవాలు నిర్వహించబడతాయి. ప్రత్యేకంగా జయదేవ్ కెండులి వద్ద నిర్వహించే ఉత్సవం [6], ఆయా సీజంస్‌లో పలు ఉత్సవాలు నిర్వహించబడతాయి. బిర్బం గిరిజన ప్రజలు జత్రా (బెంగాల్), కవిగన్, అల్కప్ ఉత్సవాలు జరుపుకుంటారు.[38] ఈ జిల్లాలలో పలువురు కవులు జన్మించారు. వీరిలో చండిదాస్ (రామి) ఒకరు.[38] వైష్ణవ, శాక్తేయ సంప్రదాయాలు ఐక్యతతో జిల్లా గ్రామప్రాంతాలలో చరిత్రకాలానికి ముందు నుండే గ్రాందేవతారాధన పలురూపాలలో దర్శనమిస్తూ ఉంటుంది.[21][39] బిర్బం జిల్లాలోని ప్రధాన ఆకర్షణలలో బక్రేశ్వర్, తారాపీఠ్, పత్రార్చపురి వంటి ఆలయాలు ఉన్నాయి. బిర్బంలో పలు పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో జయదేవ్ కెండిల్, సురుల్, నానూర్‌లలో ఉన్న ఆలయాలు ప్రధానమైనవి. బిర్బం ప్రత్యేకతలలో పురాతన కళ అయిన టెర్రకోట కూడా ఒకటి.[40]

ప్రముఖులు

[మార్చు]
Rabindranath Tagore with Mahatma Gandhi and Kasturba Gandhi at Santiniketan in 1940

బిర్బం జిల్లాలోని శాంతినికేతన్‌లో పలువురు ప్రముఖులు నివసించడం, పనిచేయడం విశేషం.[41] నోబెల్ గ్రహీత ఆర్థికవేత్త అమర్త్యసేన్ వారిలో ఒకరు. [41] ఈ జిల్లాను రవీంద్రనాథ్ ఠాగూర్ తన నివాసంగా చేసుకున్నాడు. అజయ్ నదీతీరంలో ఉన్న జయదేవ్ కెండులి 12వ శతాబ్ధపు సంస్కృత కవి జయదేవుని జన్మస్థానమని విశ్వసిస్తున్నారు.[42] నానూరు 14 వ శతాబ్ధపు కవి చండీదాస్ (రామి) జన్మించాడు.[43] వైశ్హ్ణ మత స్థాపకులలో ఒకరైన " నిత్యానందా స్వామి " ఏకచక్రా వద్ద జన్మించాడు.[44] సమీపకాల ప్రముఖ బెంగాలీ రచయిత తారాశంకర్ బందోపాద్యా (1898-1871) లభ్పూర్‌కు చెందిన వాడని భావిస్తున్నారు. ఇతను వ్రాసిన " బిర్బంలో జీవితం " (లైఫ్ ఇన్ బిర్బం) పుస్తకం బహుళ ప్రజాదరణ పొందింది.[41]

వృక్షజాలం , జంతుజాలం

[మార్చు]

Educational facilities in Birbhum district:[8]
High School–256, Higher Secondary School–110
Junior High School–86
Junior High Madarsa–10
Senior Madarsa–4
Primary School–237
Sishu Sikhsha Kendra–495
Anganwadi Centre–2407
College–12
University–1
Engineering colleges–2
Polytechnic –1
Industrial Training Institute (ITI)–1

బిర్బం జిల్లా తూర్పుప్రాంతంలో సారవంతమైన వరిపంట భూములు విస్తరించి ఉన్నాయి. వృక్షజాలంలో ప్రధానమైనవి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని వరిపండించే పంటభూములలో ఉండే అపోనోజిటాన్, ఉట్రికులారియా, డ్రోసెరా, ఫిల్కోక్సియా, స్క్రోఫులారియాసెయా, ఇలాంటి పలుస్ట్రైన్ జెనెరా వంటి చెట్లు ముఖ్యమైనవి.[10][45] జిల్లాలోని పశ్చిమ భూభాగంలో సున్నపురాతితో కూడిన పొడిభూములలో ఉండే పొదలు, ఔషధమొక్కలు ఉన్నాయి. వీటిలో వెన్లాండియా, కంవాల్వులేసీయే, స్తిప, ట్రాగస్ (జెనస్), స్పెర్మాకోస్, జిజిఫస్, కప్పరీస్, ఇతర మొక్కలు ఉన్నాయి.[45] మామిడి, అరెకెసెయేల్ పాల్మ్‌, వెదురు కూడా సాధారణంగా బిర్బం జిల్లాలో కనిపిస్తూ ఉంటుంది.[45] జిల్లాలో కనిపించే ఇతర సాధారణ కనిపించే వృక్షజాతులలో పనస, టర్మినేలియా అర్జునలర్జున్, షొరియా రొబస్టల్, జామ, కెండ్, మదుక లాంగిఫోలియల్ మహుయా ముఖ్యమైనవి.[45]

బిర్బం జిల్లాలో కుక్కలు, పెంపుడు జతువులు, బూడిదరంగు లాంగూర్‌లు కనిపిస్తుంటాయి. కొన్ని ఆటవిక కొండచిలువలు, గోధుమవర్ణ తోడేళ్ళు చింపై, బండర్సోల్, చరిచ అడవులలో కనిపిస్తూ ఉన్నాయి.[45] చిరుతపులులు, ఎలుగుబంట్లు వంటివి అంతగా కనిపించవు.[45] మహుయా చెట్లు పుష్పించే సమయంలో జార్ఖండ్ నుండి వచ్చే అడవిఏనుగులు పొలాలను త్రొక్కి, ప్రజల ఆస్తులకు ప్రాణాలకు భంగం కలిగిస్తూ బీభత్సం సృష్టిస్తాయి. [45] బిర్బం పక్షులు కొండలు, మైదానాలలో నివసిస్తుంటాయి. వీటిలో పాట్రిడ్జ్, పావురాళ్ళు, గ్రీన్ పీజియన్, వాటర్ ఫౌల్స్, డోయల్, ఇండియన్ రాబిన్, డ్రోంగో, హాక్, కోకిల, సంబర్డ్, ఇండియన్ రోలర్, చిలుక, బాబ్లర్, ఇతర వలస పక్షులు ఉన్నాయి.[45]

1977లో శాంతినికేతన్ సమీపంలో " బల్లభ్పూర్ విల్డ్‌లైఫ్ శాక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది.[46] బ్లాక్‌బక్, మచ్చలజింక, కాకల్స్, నక్కలు, పలుజాతుల నీటి పక్షులు ఇక్కడ కనిపిస్తుంటాయి.[46][47][48]

అక్షరాస్యత , విద్య

[మార్చు]

2011 గణాంకాలను అనుసరించి బిర్బం జిల్లా అక్షరాస్యత 70.9%.[34] 2001 గణాంకాలను అనుసరించి బిర్బం జిల్లా అక్షరాస్యత 62.16%. 2011 గణాంకాలను అనుసరించి బిర్బం జిల్లా అక్షరాస్యత 17.74% ఉండగా 1991 నాటికి ఇది 48.56% చేరుకుంది.[49] 20వ శతాబ్ధపు చివరి దశాబ్ధంలో జిల్లాలో అక్షరాస్యత గుర్తించతగినంగగా అభివృద్ధి చెంది నిరక్ష్యరాశ్యతను దాదాపు నిర్మూలమైంది. 6-14 సంవత్సరాల మద్య వయసు పిల్లను అందరినీ స్కూలువైపుకు తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాలు 2010 వరకు సఫలీకృతం కాలేదు. .[49]జిల్లాలో ప్రభుత్వసహాయంతో నడుస్తున్న 127 గ్రంథాలయాలు, 1 ప్రైవేటు గ్రంథాలయం, 1 జిల్లా గ్రంథాలయం ఉన్నాయి.[8]

క్రీడలు

[మార్చు]

బిర్బం జిల్లాలోని గ్రామాలలో గిల్లీ-దండ క్రీడ అత్యంత ఆదరణ కలిగి ఉంది. .[50] అయినప్పటికీ ప్రస్తుతం ఆ స్థానాన్ని క్రికెట్ క్రీడ ఆక్రమించుకుంది. పిల్లల ఆదరణ కలిగిన మరొక క్రీడ ఔట్ డోర్స్, ఇండోర్స్‌లో కూడా ఆడే క్రీడ మార్బుల్ (టాయ్). ఇది గాజు పూసలతో ఆడే క్రీడ. అదనంగా జిల్లాలో ఫుట్‌బాల్, కబాడీ క్రీడలు కూడా ప్రజాదరణ కలిగి ఉన్నాయి.[50]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Directory of District, Sub division, Panchayat Samiti/ Block and Gram Panchayats in West Bengal, March 2008". West Bengal. National Informatics Centre, India. 2008-03-19. p. 1. Archived from the original on 2009-02-25. Retrieved 2009-02-28.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 "Birbhum District". District Administration. Retrieved 2009-02-18.
  3. Rahim, Kazi MB, and Sarkar, Debasish, Agriculture, Technology, Products and Markets of Birbhum District, Paschim Banga, Birbhum Special Issue, pp. 157–166, Information and Cultural Department, Government of West Bengal
  4. 4.0 4.1 4.2 4.3 4.4 Mukhopadhyay, Malay, Birbhum Jelar Bhougolik Parichiti, Paschim Banga, Birbhum Special issue (in Bengali), February 2006, pp. 29–32
  5. Halim, Abdul, Birbhumer Sech Byabastha O Samaj Unnayan Parikalpana Samparke, Paschim Banga, Birbhum Special issue (in Bengali), February 2006, pp. 149–155
  6. 6.0 6.1 6.2 Mukhopadhyay, Aditya, Birbhumer Mela, Paschim Banga, Birbhum Special issue (in Bengali), February 2006, pp. 203–214
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 7.6 Choudhuri, Tapan, Unnayaner Aloke Birbhum, Paschim Banga, Birbhum Special Issue, pp. 59–74
  8. 8.00 8.01 8.02 8.03 8.04 8.05 8.06 8.07 8.08 8.09 8.10 8.11 Mondal, Dipanwita, Ek Najare Birbhum Jela, Paschim Banga, Birbhum Special issue (in Bengali),February 2006, pp. 7–10
  9. 9.0 9.1 Pramanik, Swarajit, Birbumer Ahankar: Bakreshwar Tapbidyut Kendra, Paschim Banga, Birbhum Special issue (in Bengali),February 2006, pp. 189–192
  10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 O'Malley, L.S.S., "Bengal District Gazeteers - Birbhum", 1996 reprint, pp. 1-9, Govt. of West Bengal
  11. 11.0 11.1 11.2 Maiti, Prakash Chandra, Birbhum in the Backdrop of Pre-history, Paschim Banga, Birbhum Special Issue, pp. 15–28
  12. 12.0 12.1 12.2 12.3 12.4 12.5 O'Malley, pp. 10-31,
  13. Selim, Mohammad, Irrigation Projects in Birbhum District,Paschim Banga, February 2006, (in Bengali), Birbhum special issue, pp. 168–169
  14. Amalananda Ghosh (1990). An Encyclopaedia of Indian Archaeology: Volume 1: Subjects. Volume 2: A Gazetteer of Explored and Excavated Sites in India. BRILL. p. 237. ISBN 90-04-09264-1.
  15. "Prehistoric tools unearthed in Bengal". Stone Pages Archaeo News. 2005-12-24. Retrieved 2009-06-04.
  16. Ray, Nihar Ranajan, Bangalir Itihas - Adi parva, (Bengali), p. 152, Paschim Banga Nirakharata Durikaran Samiti
  17. Ray, Nihar Ranajan, p.283
  18. 18.0 18.1 18.2 Bangla O Bangalir Bibartan, (An Ethno-Cultural History of Bengal) by Dr. Atul Sur, (Published by Sahityalok, Kolkata, 1986, 1994)
  19. Ghosh, Binoy, Paschim Banger Sanskriti, 1976 edition, Vol I, p. 287, Prakash Bhawan
  20. Gupta, Dr. Ranjan Kumar, The Economic Life of a Bengal District: Birbhum 1770–1857, pp. 2 – 9, The University of Burdwan, 1984.
  21. 21.0 21.1 Mitra, Amalendu, Dr., Rarher Sanskriti O Dharma Thakur, (Bengali), pp. 90-96, Subarnarekha
  22. "Temples in Birbhum". P.C.Roy Choudhuri. Hindu Books Universe. Archived from the original on 2009-03-30. Retrieved 2009-02-18.
  23. 23.0 23.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  24. 24.0 24.1 "Important Telephone Numbers". Official website of Birbhum district. Retrieved 2008-12-05.
  25. "Population, Decadal Growth Rate, Density and General Sex Ratio by Residence and Sex, West Bengal/ District/ Sub District, 1991 and 2001". West Bengal. Directorate of census operations. Archived from the original on 2011-07-19. Retrieved 2008-12-05.
  26. "Category, Year of Establishment, Area, SC, ST and total population in ULBs in West Bengal" (PDF). Department of Municipal affairs, Government of West Bengal. Archived from the original (PDF) on 2009-12-04. Retrieved 2008-12-05.
  27. 27.0 27.1 "General election to the Legislative Assembly, 2001 – List of Parliamentary and Assembly Constituencies" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2014-07-20.
  28. 28.0 28.1 28.2 28.3 "Press Note, Delimitation Commission" (PDF). Assembly Constituencies in West Bengal. Delimitation Commission. Retrieved 2008-11-16.
  29. "Press Note - Schedule for General Elections, 2009". Press Information Burueau, Government of India. Retrieved 2009-03-11.
  30. "Census of India 2001". Provisional population totals, West Bengal, Table 4. Census Commission of India. Archived from the original on 2011-07-19. Retrieved 2009-02-21.
  31. Islam, Sheikh, Birbhumer Karmasansthane Matsya, Pranisampad Ebong Paschim Banga Sankhyalaghu Unnayan O Bityanigam, Paschim Banga, Birbhum Special Issue, p. 178
  32. "Himan Development Report - Birrbhum" (PDF). Religious and Caste Composition. Archived from the original (PDF) on 2010-08-06. Retrieved 2009-05-07.
  33. Choudhuri, Arun, Birbhumer Adivasi Samaj O Janagosthi, Paschim Banga, Birbhum Special Issue, pp. 117–122
  34. 34.0 34.1 34.2 34.3 34.4 34.5 34.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  35. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Lithuania 3,535,547 July 2011 est.
  36. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Connecticut 3,574,097
  37. Kundu, Chnadan, Birbhumer Baul: Swatantrer Sandhane, Paschim Banga, Birbhum Special Issue, pp. 215–224
  38. 38.0 38.1 Das, Prabhat Kumar, Birbhumer Kirtan O Jatragan, Paschim Banga, Birbhum Special issue (in Bengali), February 2006, pp. 311–319
  39. Mitra, Ajit Kumar, Birbhumer loukik Debdebi, Paschim Banga, Birbhum Special Issue, pp. 321–334
  40. Sarkar, Joydeep, Paryatan Boichitre Birbhum Jela, Paschim Banga, Birbhum Special Issue, pp. 197–202
  41. 41.0 41.1 41.2 Ghosal, Amartya, Birbhumer Bisisto Byakti O Monishi, Paschim Banga, Birbhum Special Issue, pp. 321–334
  42. O'Malley, p.131
  43. O'Malley, p. 137
  44. O'Malley, p.128
  45. 45.0 45.1 45.2 45.3 45.4 45.5 45.6 45.7 "About Birbhum: Geography". Official website of Birbhum. Retrieved 2009-06-02.
  46. 46.0 46.1 Chhanda Das (2007). A Treatise on Wildlife Conservation in India. Daya Books. p. 115. ISBN 81-87616-22-9. Retrieved 2009-03-15.
  47. "Santiniketan". National Informatics Centre, Government of India. Archived from the original on 2009-02-27. Retrieved 2014-07-20.
  48. Indian Ministry of Forests and Environment. "Protected areas: West Bengal". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.
  49. 49.0 49.1 Roy, Bikash, Siksha Prasare Birbhum Jela, Paschim Banga, Birbhum Special Issue, pp. 81–91
  50. 50.0 50.1 Sen, Suchbrata, Birbhumer Otit O Bartaman Samajchitra, Paschim Banga, Birbhum Special Issue, pp. 107–116

వెలుపలి లింకులు

[మార్చు]