బలోడా బజార్
బలోడా బజార్ | |
---|---|
పట్టణం | |
Nickname: Baloda | |
Coordinates: 21°40′N 82°10′E / 21.67°N 82.17°E | |
దేశం | India |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
జిల్లా | బలోడా బజార్ |
Elevation | 254 మీ (833 అ.) |
జనాభా (2001) | |
• Total | 1,22,853 |
భాషలు | |
• అధికారిక | హిందీ, ఛత్తీస్‌గఢీ |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | CG-22 |
బలోడా బజార్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, బలోడా బజార్ జిల్లాలోని పట్టణం. దీని పిన్ కోడ్ 493332. 2011 ఆగస్టు 15 న ఈ జిల్లాను ఏర్పాటు చేసారు. రావన్‌లో అంబుజా సిమెంట్, గ్రాసిమ్ సిమెంట్, సోనాదిలో లాఫార్జ్ సిమెంట్, రిస్డాలో ఇమామి సిమెంట్, ఖప్రదిలో శ్రీ సిమెంట్, హిర్మిలో అల్ట్రాటెక్ సిమెంట్ మొదలైన అనేక ప్రసిద్ధ సిమెంట్ ప్లాంట్లు ఉన్నందున బలోడా బజార్ జిల్లాను ఛత్తీస్‌గఢ్ సిమెంట్ హబ్ అని కూడా అంటారు.
భౌగోళికం
[మార్చు]బలోడా బజార్ 30°40′N 82°10′E / 30.67°N 82.17°E వద్ద, [1] సముద్రమట్టం నుండి సగటున 254 మీ. ఎత్తున ఉంది. బలోదా బజార్‌లో సిర్పూర్, తుర్తురియా, గిరౌద్‌పురి, సిద్ధేశ్వర్ మందిర్ పల్లారి వంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.
చదువు
[మార్చు]పట్టణంలో రెండు ప్రభుత్వ కళాశాలలు, ఒక పాలీటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, 50 కి పైగా ప్రైవేట్ విద్యా సంస్థలూ ఉన్నాయి. అంబుజా విద్యా పీఠం, వర్ధమాన్ విద్యా పీఠం, గురుకుల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, టాటా DAV పబ్లిక్ స్కూల్ (సోనాది నువోకో ప్లాంట్‌లో ఉంది), సేక్రేడ్ హార్ట్ కాన్వెంట్ స్కూల్, ఆదిత్య బిర్లా పబ్లిక్ స్కూల్ మొదలైనవి కొన్ని ప్రముఖ పాఠశాలలు. ప్రభుత్వ పండిట్ చక్రపాణి శుక్లా మల్టీపర్పస్ హయ్యర్ సెకండరీ పాఠశాలను 1948 లో స్థాపించారు. దీనిని పండిట్ రవిశంకర్ శుక్లా ప్రారంభించాడు.
జనాభా
[మార్చు]2008 భారత జనాభా లెక్కల ప్రకారం, [2] బలోడా బజార్ జనాభా 27,853. జనాభాలో పురుషులు 51%, మహిళలు 49% ఉన్నారు. బలోడా బజార్ సగటు అక్షరాస్యత రేటు 69%, ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ; అక్షరాస్యుల్లో 57% పురుషులు, 43% స్త్రీలు. జనాభాలో 14% మంది 6 సంవత్సరాల లోపు పిల్లలు. ఇది రాయపూర్ నుండి 84 కి.మీ., మహాసముంద్ నుండి 75 కి.మీ. బిలాస్‌పూర్ నుండి 60 కి.మీ. దూరమ్లో ఉంది. మొత్తం వైశాల్యం 16 చ.కి.మీ.
ఆలయాలు
[మార్చు]"మహామాయ మాత" ఆలయం ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని అతి పెద్ద చెరువు పట్టణం నుండి 15 కి.మీ. దూరంలో పాలారి వద్ద ఉంది.
చరిత్ర
[మార్చు]ఈ పట్టణం పశువుల మార్కెట్‌కు ప్రసిద్ధి చెందింది. మార్కెట్ ఇప్పటికీ "భైసా పస్రా" పేరుతో ఉంది. పురానీ బస్తీ లేదా మావ్లీ మాత మందిరానికి ఆనుకుని ఉన్న ప్రాంతం పట్టణంలోని పురాతన ప్రాంతం. బలోడా బజార్ నుండి వచ్చిన గొప్ప వ్యక్తులు డాక్టర్ సాహెబ్ లాల్ తివారీ, సత్య నారాయణ్ కేశర్వాణి, చక్రపాణి శుక్లా, బాన్ష్ రాజ్ ���ివారీ, గణేష్ శంకర్ బాజ్‌పాయ్ శంకర్ దయాళ్ త్రివేది, డాక్టర్ రమేష్ కేసరవాణి లతో పాటు, బిసౌహా బంజారే, వీర్ నారాయణ్ సింగ్, రఘునాథ్ ప్రసాద్ కేసరవానీ వంటి స్వాతంత్ర్య సమరయోధులకు బలోడా బజార్ జన్మస్థానం.
మూలాలు
[మార్చు]- ↑ Bazar.html Falling Rain Genomics, Inc - Baloda Bazar[permanent dead link]
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.