బడిపంతులు (1958 సినిమా)
బడిపంతులు (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.రామకృష్ణయ్య పంతులు |
---|---|
తారాగణం | శివాజీ గణేశన్ షావుకారు జానకి, కాంచన, బి.ఆర్.పంతులు, ఎం.వి.రాజమ్మ, డిక్కి మాధవరావు, ఉదయకుమార్, బి.సరోజాదేవి, బాలకృష్ణ, నరసింహరాజు, జెమినీ గణేష్ |
సంగీతం | టి.జి.లింగప్ప |
గీతరచన | రావూరు సత్యనారాయణ రావు |
ఛాయాగ్రహణం | డబ్ల్యూ.ఆర్.సుబ్బరావు |
నిర్మాణ సంస్థ | పద్మిని పిక్చర్స్ |
నిడివి | 185 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
బడిపంతులు 1958, జూన్ 19న విడుదలైన తెలుగు సినిమా.[1] ఇది కన్నడ సినిమా స్కూల్ మాస్టర్ కు తెలుగు డబ్బింగ్.
నటీనటులు
[మార్చు]- బి.ఆర్.పంతులు
- రాజమ్మ
- శివాజీ గణేశన్
- జానకి
- ఉదయకుమార్
- బి.సరోజాదేవి
- సూర్యకుమార్
- డిక్కీ మాధవరావు
- నరసింహరాజు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: బి.ఆర్.పంతులు
- మాటలు, పాటలు:రావూరు సత్యనారాయణరావు
కథ
[మార్చు]గంగిగోవు లాంటి బడిపంతులు ఆ ఊరి బడిని నడిపే పంచాయితీ ప్రెసిడెంటు అక్రమాలను ఎదిరించి కష్టాలను తెచ్చుకుంటాడు. ఆ దుష్టుడు పగబూని ఈయన ఇంటికి నిప్పంటించి ధ్వంసం చేస్తాడు. అప్పుడు బడిపిల్లలే చందాలు వేసి స్వయంగా పనిచేసి ఇంటిని కట్టియిస్తారు. పంతులు గారి పిల్లలిద్దరూ పెద్దవారై చెరో పిల్లని పెళ్ళి చేసుకుంటారు. చిన్న కోడలు తండ్రే ఆయనమీద పగబూనిన పంచాయతీ ప్రెసిడెంటు. అతడు ఐదారుసార్లు చెంపలేసుకుని, క్షమాపణలు చెప్పి, పంతులు సహాయం పొందుతూ కూడా ఎప్పటికప్పుడు పగసాధించాలని ప్రయత్నిస్తుంటాడు. దానికి తోడు పిల్లల చదువులకి, కూతురు పెళ్లికీ చేసిన అప్పులు తడిసి మోపెడై ఆయనమీద పడుతుంది. ఈ సమయంలో ఆదుకోవలసిన అతని కొడుకులు ఇద్దరూ చేతిలో డబ్బు వుండి కూడా తప్పించుకు తిరుగుతారు. తల్లినీ తండ్రినీ విడదీసి చెరొకరినీ పంచుకుంటారు. గత్యంతరం లేక ఆ వృద్ధులు ఇద్దరూ ఒకరు పెద��ద కొడుకు పంచన, మరొకరు చిన్న కొడుకు వద్ద జీవించవలసి వచ్చి తీవ్రమైన మానసిక క్షోభకు గురి అవుతారు. బడిపిల్లలు ప్రేమతో కట్టించి ఇచ్చిన ఇల్లును అమ్మడానికి పంతులుకు ఇష్టం వుండదు. చివరకు ఆయన ప్రియశిష్యుడు ఒకడు ఆయనమీద గౌరవంతో తన భార్యనగలు అమ్మి ఇంటిని కొని తిరిగి గురుదక్షిణగా పంతులకు అప్పగిస్తాడు[2].
పాటలు
[మార్చు]- అతి మధురం అనురాగం జీవన సంశీరాగం విమలతరపై -
- ఈ పూలగాలిలోన చిగురాకు మేడలోన సొంపైన రాగమాల -
- ఉండాలి సంపాదన జగతి తెలివున్న మానిస సిరిఉంటె చాలు -
- క్షేమసాగరా లోకపాలనా హేనమోస్తు నమోస్తుతే -
- జాగేల ఆనంద మందీయరా జవరాలరా నీ దానరా -
- నీవు నేనూ జోడూ ఈ ఎద్దుల సక్కెత చూడు ఎండా వానా అనక -
- పదండోయ్ పదండోయ్ పదండోయ్ గురుసేవయే సర్వోదయం -
- భామను జేరవా గోపాలా బృందావనిలో మేలౌరా -
- రంపాన వదినౌ సంబరమే ( రామాయణం నాటకం )-
- రాధా మాధవ వినోదలీల నాలో పరువిను ప్రేమ విలాస -
మూలాలు
[మార్చు]- ↑ http://ghantasalagalamrutamu.blogspot.in/2012/04/1958_17.html[permanent dead link]
- ↑ సంపాదకుడు (22 June 1958). "'బడిపంతులు '". ఆంధ్రపత్రిక దినపత్రిక. Archived from the original on 25 సెప్టెంబరు 2020. Retrieved 28 January 2020.