Jump to content

ప్రతాప్‌సింగ్ రాణే

వికీపీడియా నుండి
ప్రతాప్‌సింగ్ రావోజి రాణే
ప్రతాప్‌సింగ్ రాణే


పదవీ కాలం
7 జూన్ 2005 – 8 జూన్ 2007
గవర్నరు ఎస్. సి . జమీర్
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత దిగంబర్ కామత్
పదవీ కాలం
2 ఫిబ్రవరి 2005 – 4 మార్చి 2005
గవర్నరు ఎస్. సి . జమీర్
ముందు మనోహర్ పారికర్
తరువాత రాష్ట్రపతి పాలన
పదవీ కాలం
16 డిసెంబర్ 1994 – 29 జులై 1998
గవర్నరు గోపాల రామానుజం
రొమేష్ భండారి
పి.సి . అలెగ్జాండర్
టి. ఆర్. సతీష్ చంద్రన్
జాకబ్
ముందు విల్ఫ్రెడ్ డిసౌజా
తరువాత విల్ఫ్రెడ్ డిసౌజా
పదవీ కాలం
16 జనవరి 1980 – 27 మార్చి 1990
గవర్నరు పి. ఎస్. గిల్
జగ్మోహన్
లతీఫ్
కే . టి. సాతరవాలా
గోపాల్ సింగ్
ఖుర్షేడ్ ఆలం ఖాన్
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత చర్చిల్ అలెమావో

శాసన సభ్యుడు
పదవీ కాలం
1989 – ప్రస్తుతం
నియోజకవర్గం పోరియం అసెంబ్లీ నియోజకవర్గం
పదవీ కాలం
1972 – 1989
ముందు కే.జి . అప్ప
తరువాత నియోజకవర్గ పునరావిభజన జరిగింది
నియోజకవర్గం సత్తరి

గోవా అసెంబ్లీ స్పీకర్
పదవీ కాలం
1999 – 2002
ముందు తోమాజినహో కార్డోజో
తరువాత విశ్వాస్ సతర్కర్
పదవీ కాలం
2007 – 2012
ముందు ఫ్రాన్సిస్కో సర్దిన్హా
తరువాత రాజేంద్ర అర్లేకర్

వ్యక్తిగత వివరాలు

జననం (1939-01-28) 1939 జనవరి 28 (వయసు 85)
సన్క్యూలిమ్, గోవా, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నివాసం 'గోల్డెన్ ఎకర్స్',కులాన్, సన్క్యూలిమ్, గోవా

ప్రతాప్‌సింగ్ రాణే గోవా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1987 నుండి 2007 వరకు ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, ఐదు సార్లు వివిధ సందర్భాల్లో గోవా ముఖ్యమంత్రిగా పని చేశాడు. ఆయన గోవా శాసనసభకు ఎమ్మెల్యేగా 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆయనకు 2022లో గోవా ప్రభుత్వం జీవితకాల కేబినెట్ హోదా ప్రకటించింది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రతాప్ సింగ్ రాణే మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1972లో సత్తరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1977, 1980, 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడ్డా పోరియం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1989 నుండి 2017 వరకు వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 1980 - 2007 మధ్య ఆరుసార్లు (16 సంవత్సరాలు) ముఖ్యమంత్రిగా, 2007- 2012 మధ్య అసె��బ్లీ స్పీకర్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు.

ప్రతాప్ సింగ్ రాణే గోవా రాష్ట్రానికి విశేష సేవలందించిన ఆయనకు జీవితకాలం కేబినెట్ హోదా ఇవ్వాలని జనవరి 2022లో ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మెల్యేగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న మాజీ ముఖ్యమంత్రులు, మాజీ స్పీకర్లకు అలాంటి హోదా ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయడంతో ఆయనకు జీవితకాల కేబినెట్ హోదా దక్కింది.[2]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (7 January 2022). "గోవా మాజీ సీఎంకు... జీవితకాల క్యాబినెట్ హోదా". Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.
  2. ETV Bharat News (31 January 2022). "కాంగ్రెస్ నేతకు జీవితకాలం కేబినెట్ హోదా ఇస్తున్న భాజపా సర్కార్!". Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.