Jump to content

పెదకళ్ళేపల్లి (మోపిదేవి)

అక్షాంశ రేఖాంశాలు: 16°4′54.804″N 80°59′19.752″E / 16.08189000°N 80.98882000°E / 16.08189000; 80.98882000
వికీపీడియా నుండి
(పెదకళ్ళేపల్లి నుండి దారిమార్పు చెందింది)
పెదకళ్ళేపల్లి (మోపిదేవి)
పటం
పెదకళ్ళేపల్లి (మోపిదేవి) is located in ఆంధ్రప్రదేశ్
పెదకళ్ళేపల్లి (మోపిదేవి)
పెదకళ్ళేపల్లి (మోపిదేవి)
అక్షాంశ రేఖాంశాలు: 16°4′54.804″N 80°59′19.752″E / 16.08189000°N 80.98882000°E / 16.08189000; 80.98882000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా
మండలంమోపిదేవి
విస్తీర్ణం22.57 కి.మీ2 (8.71 చ. మై)
జనాభా
 (2011)
6,547
 • జనసాంద్రత290/కి.మీ2 (750/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,352
 • స్త్రీలు3,195
 • లింగ నిష్పత్తి953
 • నివాసాలు1,997
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్521130
2011 జనగణన కోడ్589768

పెదకళ్ళేపల్లి, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన మోపిదేవి నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మచిలీపట్నం నుండి 32 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1997 ఇళ్లతో, 6547 జనాభాతో 2257 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3352, ఆడవారి సంఖ్య 3195. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 679 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 112. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589768.[2]

సమీప గ్రామాలు

[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో మెరకనపల్లి, వెంకటాపురం, ఉత్తర చిరువోలులంక గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.సమీప బాలబడి మోపిదేవిలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల చల్లపల్లిలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ మచిలీపట్నంలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మచిలీపట్నంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]

పెదకళ్ళేపల్లి గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో, 7వ తరగతి చదువుచున్న సనకా నీలిమ అను విద్యార్థిని, రాష్ట్రస్థాయి పరుగు పందేలకు ఎన్నికైనది. 2013,డిసెంబరు 10 న విజయవాడలో జరిగిన అండర్-14, బాలికల పాఠశాలల క్రీడాపోటీలలో, 200మీ. & 600మీ. లలో ప్రథమస్థానం కైవసం చెసుకున్నది. 2013,డిసెంబరు, 10 నుండి 12 వరకూ శ్రీకాకుళంలో జరుగు రాష్ట్రస్థాయి పోటీలలో ఈమె పాల్గొంటుంది. [3]

శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వరస్వామి సంస్కృత ఉన్నత పాఠశాల

[మార్చు]

ఈ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేయుచున్న శ్రీమతి విజయలక్ష్మి, 2015,సెప్టెంబర్-5న నిర్వహించు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైనారు. [12] శ్రీ శారదావిద్యానికేతన్ ప్రాథమికోన్నత పాఠశాల,పెదకళ్ళేపల్లి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

పెదకళ్ళేపల్లిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

పెదకళ్ళేపల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

పెదకళ్ళేపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 314 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 12 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 25 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 59 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 30 హెక్టార్లు
  • బంజరు భూమి: 113 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1700 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 155 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1689 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

పెదకళ్ళేపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1684 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 4 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

పెదకళ్ళేపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి

గ్రామంలో మౌలిక వసతులు

[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

[మార్చు]

దాత శ్రీ యర్రంశెట్టి వెంకటేశ్వరరావు, ఈ కేంద్ర నిర్మాణానికి 72 సెంట్ల స్థలాన్ని వితరణగా అందజేసినారు. ఈ స్థలంలో ఎంతో విశాలంగా ఒక శాశ్వతభవనం నిర్మించి వైద్యసేవలందించుచున్నారు. దాత అందజేసిన స్థలం సిబ్బందికి గృహాలు నిర్మించడానికి గూడా అనుకూలంగా ఉంది. [13]

బ్యాంకులు

[మార్చు]

ఇండియన్ బ్యాంక్.

గ్రామ పంచాయతీ

[మార్చు]

అడపావారిపాలెం గ్రామం, పెదకళ్ళేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

2013 జూలైలో పెదకళ్ళేపల్లి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో అరజా వెంకటసుబ్బారావు, సర్పంచిగా ఎన్నికైనాడు. ఉపసర్పంచిగా గండు సాంబశివరావు ఎన్నికైనాడు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి వారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో శివుడు స్వయంభూగా వెలసినాడని భక్తుల విశ్వాసం. దక్షిణకాశీగా పేరుగాంచిన ఈ ఆలయంలో, మహాశివరాత్రి సందర్భంగా, స్వామివారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు 2015,ఫిబ్రవరి-14వ తేదీ నుండి 22వ తేదీ వరకు, వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు అవిశ్రాంతంగా భక్తుల పూజలందుకున్న ఉభయ దేవతా సమేత నాగేశ్వరస్వామివారికి, ఆఖరిరోజైన 22వ తేదీ ఆదివారంనాడు, 12 విశిష్టలతో ద్వాదశ ప్రదక్షిణలు, మేళతాళాల మధ్య, వేడుకగా నిర్వహించారు. అనంతరం పవళింపుసేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తైదువులకు పసుపు, కుంకుమ, దుస్తులు, అమ్మవారల కానుకగా అందజేసినారు. అలసి సొలసిన స్వామివారలకు శ్రావ్యంగా లాలి, జోలపాటలు పాడుచూ ఉత్సవాలకు ముగింపు పలికినారు. [4]&[7]

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత మదనగోపాలస్వామివారి ఆలయం

[మార్చు]
  1. ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 2015,మార్చ్-6వ తేదీ శుక్రవారం నాడు, ఉభయ దేవేరుల సమేతుడైన గోపాలస్వామివారికి వసంతోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గులాములు జల్లి, రైతులకు కొత్తగా పంట చేతికి వచ్చిన ధాన్యాన్ని, రోకళ్ళతో దంచి స్వామివారికి నివేదించారు. అనంతరం ఉత్సవ మూర్తులను తలపై పెట్టుకొని చక్రస్నానం నిర్వహించారు. నిత్యహోమంతోపాతు బలిహరణ, మహాపూర్ణాహుతి, ధ్వజ అవరోహణ, పార్వేట ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. కార్య్క్రమంలో గ్రామపెద్దలు, భక్తులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 7వ తేదీ శనివారం ఉదయం స్వామివారికి విశేష అర్చనలు, నవకుంభ ఆరోపణ, చోరసంవాదం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రాత్రికి ద్వాదశస్వామివారల ఉత్సవ విగ్రహాలను ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ఈ ఉత్సవాలు శనివారంతో ముగింపుకు చేరుకున్నవి. [8] & [9]
  2. ఈ ఆలయ అవరణలో, గ్రామస్థుల, భక్తుల విరాళాలతో చేపట్టిన, హనుమత్, సీతా, లక్ష్మణ, పరివారసమేతంగా శ్రీ కోదండరామస్వామి విగ్రహాలను, ఋత్విక్కులు వేదమంత్రోచ్ఛారణలమధ్య, ఉదయం 9-15 గంటలకు భక్తబృందం ప్రతిష్ఠించారు. అనంతరం పరివార విగ్రహాలను నిజరూపదర్శనం కల్పించి, భక్తులు కొలిచేందుకు అనుమతించారు. అంతకుముందు పుణ్యాహవచనం, ప్రాణప్రతిష్ఠల కార్యక్రమం నిర్వహించారు. నిజరూపదర్శనం అనంతరం శాంతికళ్యాణం నిర్వహించారు. [11]

శ్రీ నాంచారమ్మ అమ్మవారి ఆలయం

[మార్చు]

పెదకళ్ళేపల్లి గ్రామంలో కొలువైయున్న శ్రీ నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరం, చైత్ర శుద్ధ పౌర్ణమికి అత్యంత వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసెదరు. కుంకుమార్చనలు చేసెదరు. భక్తులు మ్రొక్కులు తీర్చుకొని అమ్మవారిని దర్శించుకొని తరించెదరు. [5]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం

[మార్చు]

గ్రామంలోని పాత బస్సుస్టాండు కూడలిలో నెలకొన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి వేడుకలు (మే నెలలో) రెండు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. రెండవరోజున భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [6]

ఇస్కాన్

[మార్చు]

పెదకళ్ళేపల్లి గ్రామంలో ఇస్కాన్ శాఖ ఉంది.

తపోవనం

[మార్చు]

గత సంవత్సరం ఏర్పాటుచేసిన ఈ తపోవనంలో, తొలి వార్షికోత్సవాన్ని, 2016,ఫిబ్రవరి-21వ తేదీ ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక ధ్యానం, దీపప్రజ్వలన, మహావైదీప గురుపూజ, ప్రత్యేకంగా ఉచిత మహిళలకు ప్రత్యేక వైద్యశిబిరం, సత్సంగములు మొదలగు కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. [14]

పెదకళ్ళేపల్లి గ్రామ సమీప దేవాలయాలు

[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రముఖులు

[మార్చు]
వేటూరి ప్రభాకరశాస్త్రి

గ్రామ విశేషాలు

[మార్చు]

రాజమండి పట్టణంలో, 2015,మే-27వ తేదీనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతికశాఖ, నందినాటకోత్సవ పురస్కార ప్రదానోత్సవాన్ని, రాజమండ్రి లోక్ సభ సభ్యులు శ్రీ ఎం.మురళీమోహన్ నేతృత్వంలో నిర్వహించి, రాష్ట్రంలో పేరెన్నికగన్న ఆరుగురు వృద్ధకళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా, పెదకళ్ళేపల్లి గ్రామానికి చెందిన శ్రీ తలుపుల వేంకటేశ్వరరావుని దుశ్శాలువతో సన్మానించి, ప్రశంసాపత్రం, ఐదువేల రూపాయల నగదు బహుమతిని అందజేసినారు. ఈ సందర్భంగా వీరు కాళిదాసు నాటకంలో పాత్ర వేయడం గుర్తుచేసారు. [10] జీవిత బీమా సంస్థ వారు, 2017,ఫిబ్రవరి-21న, ఈ గ్రామాన్ని, జీవిత బీమా గ్రామంగా గుర్తించి, యాభైవేల రూపాయలు పారితోషికంగా అందజేసినారు. [15]

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7214. ఇందులో పురుషుల సంఖ్య 3623, స్త్రీల సంఖ్య 3591, గ్రామంలో నివాస గృహాలు 1962 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2257 హెక్టారులు.

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు

[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగస్టు-3; 1వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2013,డిసెంబరు-10; 11వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మార్చ్-5; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఏప్రిల్-16,2వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014.మే-25; 2వ పేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఫిబ్రవరి-23; 2వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మార్చ్-7; 2వపేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మార్చ్-8; 1వపేజీ. [10] ఈనాడు కృష్ణా; 2015,మే-29; 6వపేజీ. [11] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జూన్-5; 3వపేజీ. [12] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,సెప్టెంబరు-5; 1వపేజీ. [13] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-28; 39వపేజీ. [14] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,ఫిబ్రవరి-22; 3వపేజీ. [15] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,ఫిబ్రవరి-22; 1వపేజీ.