Jump to content

పవన్ కుమార్ చామ్లింగ్

వికీపీడియా నుండి
పవన్ కుమార్ చామ్లింగ్
పవన్ కుమార్ చామ్లింగ్

2016లో పవన్ కుమార్ చామ్లింగ్


పదవీ కాలం
12 డిసెంబరు 1994 – 26 మే 2019
గవర్నరు పి.శివశంకర్ ,
కె.వి.రఘునాథరెడ్డి (అదనపు బాద్యతలు),
చౌదరి రణధీర్ సింగ్
కిడర్ నాథ్ సహానీ ,
వి.రామారావు ,
ఆర్.ఎస్.గవాయ్ (ఆపద్ధర్మ),
వి.రామారావు ,
సుదర్శన్ అగర్వాల్ ,
వాల్మీకి ప్రసాద్ సింగ్ ,
శ్రీనివాస్ పాటిల్ ,
గంగా ప్రసాద్
ముందు సంచమన్ లింబూ
తరువాత ప్రేం సింగ్ తమాంగ్ ]
నియోజకవర్గం దమ్‌తాంగ్ శాసనసభ నియోజకవర్గం (1994-2009),
పోక్‌లోక్ కమ్రాంగ్ (2009-2014),
నామ్చి సింగితాంగ్ (2009-2019),
రాన్‌గంగ్-యణ్‌గాంగ్ నియోజకవర్గం (2014-2019)

సిక్కిం శాసనసబ ప్రతిపక్షనేత
పదవీ కాలం
3 జూన్ 2019 – 13 ఆగస్టు 2019
ముందు ప్రీమ్‌సింగ్ తమాంగ్
నియోజకవర్గం నామ్చి సింగితాంగ్ శాసనసభ నియోజకవర్గం

సిక్కిం శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
3 జూన్ 2019 – 1 జూన్ 2024
ముందు అతను
నియోజకవర్గం నామ్చి సింగితాంగ్ శాసనసభ నియోజకవర్గం
పదవీ కాలం
8 మార్చి 1985 – 11 డిసెంబరు 1994
ముందు ప్రదీప్ యంజోణ్
తరువాత అతను
నియోజకవర్గం దమ్‌తాంగ్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1949-09-22) 1949 సెప్టెంబరు 22 (వయసు 75)
యంగాంగ్, సిక్కిం రాజ్యం
(ప్రస్తుతం సిక్కిం, భారతదేశం )
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్
జీవిత భాగస్వామి ధన్ మాయా చామ్లింగ్
తికా మాయా చామ్లింగ్
సంతానం 8
వృత్తి
  • రచయిత
  • రాజకీయనాయకుడు

పవన్ కుమార్ చామ్లింగ్ (జననం: 1949 సెప్టెంబరు 22) భారతీయ రాజకీయ నాయకుడు, సిక్కిం మాజీ ముఖ్యమంత్రి .[1] చామ్లింగ్ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు.[2] ఇది 1993 నుండి వరుసగా ఐదు పర్యాయాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు. అతను భారతదేశంలో అత్యధిక కాలం పని చేసిన ముఖ్యమంత్రులు జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. పవన్ కుమార్ చామ్లింగ్ 24 సంవత్సరాలు, 165 రోజులు పాటు సిక్కిం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

భారతీయ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులలో అత్యధిక కాలం చామ్లింగ్ ముఖ్యమంత్రిగా పనిచేసి చరిత్రలో నిలిచాడు. అతను 1994 నుండి 2019 వరకు 25 సంవత్సరాలపాటు సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ స్థాపించడానికి ముందు చామ్లింగ్ 1989 నుండి 1992 వరకు నార్ బహదూర్ భండారి మంత్రివర్గంలో పరిశ్రమలు, సమాచార, ప్రజా సంబంధాల మంత్రిగా పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

దక్షిణ సిక్కింలోని యాంగాంగ్‌లో నేపాలీ తల్లిదండ్రులైన యాష్ బహదూర్ చామ్లింగ్, యాష్ రాణి చామ్లింగ్ దంపతులకు చామ్లింగ్ జన్మించాడు. అతను నేపాలీ భాషా రచయితగా సిక్కిం సాహిత్య పరిషత్ ప్రదానం చేసిన భాను పురస్కార్ (2010) అందుకున్నాడు. . అతను పవన్ చామ్లింగ్ కిరణ్ అనే కలం పేరుతో వ్రాస్తాడు. చామ్లింగ్‌కు 8 మంది సంతానం, అందులో 4 కుమారులు, 4 మంది కుమార్తెలు ఉన్నారు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

చామ్లింగ్ 1982 లో యాంగాంగ్ గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1978–1984 వరకు సిక్కిం ప్రజాతంత్ర కాంగ్రెస్ కోశాధికారిగా ఉన్నాడు. 1985 లో సిక్కిం శాసనసభకు తొలిసారి ఎన్నికయ్యాడు. దమ్‌తాంగ్ శాసమసభ నియోజకవర్గం నుండి రెండవసారి ఎన్నికైన తరువాత, నార్ బహదూర్ భండారి మంత్రివర్గంలో 1989 నుండి 1992 వరకు పరిశ్రమలు, సమాచార, ప్రజా సంబంధాల మంత్రి అయ్యాడు. సిక్కింలో వరుస రాజకీయ తిరుగుబాట్ల తరువాత చామ్లింగ్ 1993 మార్చి 4 న సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశాడు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు తరువాత వరుసగా ఐదు పర్యాయాలు పరిపాలించిన ముఖ్యమంత్రిగా చామ్లింగ్ భారతదేశంలో రెండవ వాడు. అతని పార్టీ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 1994, 1999, 2004, 2009, 2014 సిక్కిం శాసనస�� ఎన్నికలలో విజయం సాధించింది. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆయన పార్టీ సిక్కింలో మొదటిసారి అధికారంలోకి వచ్చింది. అభివృద్ధి పనుల వల్ల, శాంతిని కాపాడుకోవడం వల్ల సిక్కింలో అతని ఆదరణ పెరుగుతూ వచ్చింది. 2009 లో సిక్కిం శాసనసభలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలను అతని పార్టీ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ గెలుచుకుంది.

2012 లో అతను అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నాడు. అతని తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థి భండారి చామ్లింగ్ జైలుకు వెళ్తాడని, అధికారాన్ని కోల్పోతాడని ఊహించాడు.[4] అతని మాజీ కామ్రేడ్ తమంగ్ (గోలే) అతనితో విభేదాలను పెంచుకుని తన సొంత పార్టీని నడిపాడు. ఈ పరిణామాలు అతనికి రాజకీయ సవాలును సృష్టించాయి. కాని అతను చాలా తక్కువ మెజారిటీతో ఉన్నప్పటికీ 2014 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించగలిగాడు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత, సిక్కిం గవర్నర్ శ్రీనివాస్ దాదాసాహెబ్ పాటిల్ 2014 మే 21 న వరుసగా ఐదవసారి సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. అతను ఐదవసారి ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంతకుముందు 1977 నుండి 2000 వరకు పశ్చిమ బెంగాల్‌ను పాలించిన జ్యోతి బసు ఈ రికార్డును కలిగి ఉన్నాడు.[3][5]

2014 శాసనసభ ఎన్నికల్లో 32 అసెంబ్లీ స్థానాల్లో 22 స్థానాలను అతని పార్టీ ఎస్‌డిఎఫ్ గెలుచుకుంది. 2014 ఎన్నికలు జరిగిన 18 నెలల తరువాత 2015 నవంబరు 30న, 10 మందిలో 7 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పవన్ చామ్లింగ్ నాయకత్వంలో ఎస్‌డిఎఫ్ పార్టీలో చేరారు. రాష్ట్రంలోని 32 అసెంబ్లీ స్థానాల్లో 29 స్థానాలను పాలకవర్గం కలిగి ఉంది.[6]

2016 జనవరి 18 న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో సిక్కింను దేశంలో మొట్టమొదటి, ఏకైక "సేంద్రీయ రాష్ట్రం"గా ప్రకటించాడు. ఎందుకంటే ఇది సేంద్రీయ వ్యవసాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా అమలు చేసింది.[7]

మాజీ సభ్యుడు ప్రేమ్‌సింగ్ తమాంగ్, సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ 32 లో 17 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో 2019 సిక్కిం శాసనసభ ఎన్నికల తరువాత చామ్లింగ్ సిఎం పదవికి రాజీనామా చేశాడు. మిగిలిన 15 సీట్లను ఎస్‌డిఎఫ్ పార్టీ గెలుచుకుంది. కానీ 2019 ఆగస్టులో భారతీయ జనతా పార్టీలో చేరడానికి 10 మంది ఎమ్మెల్యేలు తన పార్టీని విడిచిపెట్టారు. అదే నెలలో మరో ఇద్దరు శాసనసభ్యులు సిక్కిం క్రాంతికారి మోర్చాలో చేరారు. ఆ విధంగా చామ్లింగ్‌ను పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యేగా మార్చారు.[8][9]

ఎన్నికల రికార్డులు

[మార్చు]

సిక్కిం శాసనసభ ఎన్నికలు

సంవత్సరం నియోజకవర్గం రాజకీయ పార్టీ ఫలితం స్థానం ఓట్లు
1985 దమ్‌తాంగ్ ఎన్.ఎస్.పి గెలుపు 1 వ / 8 2,281
1989 దమ్‌తాంగ్ ఎన్.ఎస్.పి గెలుపు 1 వ / 2 4.227
1994 దమ్‌తాంగ్ ఎస్.డి.ఎఫ్ గెలుపు 1 వ / 4 3,904
1999 దమ్‌తాంగ్ ఎస్.డి.ఎఫ్ గెలుపు 1 వ / 3 4.952
2004 దమ్‌తాంగ్ ఎస్.డి.ఎఫ్ గెలుపు 1 వ / 1 -
2009 పోక్‌లోక్ కమ్రాంగ్ ఎస్.డి.ఎఫ్ గెలుపు 1 వ / 6 7.379
2009 నామ్చి-సింగితాంగ్ ఎస్.డి.ఎఫ్ గెలుపు 1 వ / 6 5.653
2014 నామ్చి-సింగితాంగ్ ఎస్.డి.ఎఫ్ గెలుపు 1 వ / 3 4.774
2014 రంగాంగ్-యాంగాంగ్ ఎస్.డి.ఎఫ్ గెలుపు 1 వ / 3 6.343
2019 పోక్‌లోక్ - కామ్రాంగ్ ఎస్.డి.ఎఫ్ గెలుపు 1 వ / 5 7.731
2019 నామ్చి-సింగితాంగ్ ఎస్.డి.ఎఫ్ గెలుపు 1 వ / 5 5.054
2024 పోక్‌లోక్ కమ్రాంగ్ ఎస్.డి.ఎఫ్ ఓటమి
2024 నామ్‌చాయ్‌బాంగ్ ఎస్.డి.ఎఫ్ ఓటమి[10]

మూలాలు

[మార్చు]
  1. "Sikkim budget session from 25 June". Zee News. Gangtok. PTI. 13 June 2012. Retrieved 7 November 2012.
  2. Dahal, Chewan K (6 September 2017). "Sikkim CM wants BJP chief to step in". The Times of India. Retrieved 30 August 2019.
  3. 3.0 3.1 "Sikkim's Pawan Chamling is the longest serving Chief Minister, surpassing former West Bengal Chief Minister Jyoti Basu".
  4. https://economictimes.indiatimes.com/news/politics-and-nation/sikkim-cm-pawan-kumar-chamling-dangles-crorepati-dream/articleshow/33374752.cms?from=mdr
  5. "Chamling sworn in as Sikkim CM for record fifth time". The Indian Express. Gangtok. Press Trust of India. 21 May 2014. Retrieved 21 May 2014.
  6. IANS (2019-03-22). "Why are national parties shunned in Sikkim? (Dangal 2019)".
  7. "Sikkim becomes India's first organic state". 16 January 2016.
  8. 10 SDF legislators switch over to BJP
  9. "Ten SDF MLAs join BJP: Sikkim may be headed towards Arunachal Pradesh route, as mass crossovers leave ex-CM in the lurch". Archived from the original on 2019-12-01. Retrieved 2020-06-14.
  10. The Hindu (2 June 2024). "Sikkim Assembly election 2024: SDF chief Pawan Kumar Chamling loses both seats". Archived from the original on 2 June 2024. Retrieved 2 June 2024.

బాహ్య లంకెలు

[మార్చు]
రాజకీయ కార్యాలయాలు
అంతకు ముందువారు
సంచామన్ లింబూ
సిక్కిం ముఖ్యమంత్రి
12 డిసెంబరు 1994 – 27 మే 2019
తరువాత వారు
ప్రేం సింగ్ తమాంగ్