Jump to content

పరూల్ దల్సుఖ్భాయ్ పర్మార్

వికీపీడియా నుండి
పరూల్ దల్సుఖ్భాయ్ పర్మార్
2009 ఆగస్టు 29న పరూల్ దల్సుఖ్భాయ్ పర్మార్ కు అర్జున పురస్కారాన్ని ప్రదానంచేస్తున్న అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్
వ్యక్తిగత సమాచారం
జననం (1973-03-20) 1973 మార్చి 20 (వయసు 51)[1]
దేశం భారతదేశం

పరూల్ దల్‌సుఖ్‌భాయ్ పర్మార్ భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. పారా బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ క్రీడాకారిణి కూడా. భారత ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున అవార్డు గ్రహీత పర్మార్.

వ్యక్తిగత జీవితం, నేపథ్యం

[మార్చు]

పరూల్ 20 మార్చి, 1973న గుజరాత్ లోని గాంధీనగర్ లో జన్మించింది. మూడ���ళ్ల వయసులో పొలియో బారిన పడింది. దానికితోడు ఆడుకుంటుండగా, ఊయల మీది నుంచి పడటంతో కాలర్ బోన్, కుడి కాలు విరిగాయి. ఈ గాయాల నుంచి కోలుకునేందుకు ఆమెకు చాలా కాలం పట్టింది. ఆమె అవయవాలు గట్టిపడాలంటే వ్యాయామం చేయాలని వైద్యులు సూచించారు. పరూల్ తండ్రి రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. సాధన కొసం స్థానిక బ్యాడ్మింటన్ క్లబ్‌కు వెళ్లేది.[2] దీంతో పరూల్ కూడా తండ్రితో కలిసి బ్యాడ్మింటన్ క్లబ్ కు తరుచుగా వెళ్లేది. అలా ఆమెకు కూడా బ్యాడ్మింటన్‌పై ఆసక్తి పెరిగి, ఇరుగుపొరుగు చిన్నారులతో కలిసి ఆడేది. ఆమెకు ఉన్న ప్రత్యేక నైపుణ్యాన్ని గుర్తించిన కోచ్ సురేంద్రే పరేఖ్,  పరూల్ బ్యాడ్మింటన్ ఆడేందుకు ప్రొత్సహించాడు.2

పరూల్ కుటుంబం ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే అయినప్పటికీ, ఆమె కుటుంబ సభ్యులు, తోబుట్టువులు పరూల్ బ్యాడ్మింటన్ ఆడేందుకు సహకరించేవారు. తమ ప్రాధాన్యతల పక్కన పెట్టి  పరూల్ బ్యాడ్మింటన్ అవసరాలను తీర్చేవారు.

బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పటికీ, చాలాకాలం పాటు ఆమెకు పారా బ్యాడ్మింటన్ గురించి తెలియలేదు. ఒక్కసారిగా పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ల్లలో ఆడటడం ప్రారంభించిన తర్వాత ఆమెకు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్ల్లల్లో విజయాలు దాసోహం అయ్యాయి. [2] తన విజయాల వెనుక తన కుటుంబ సభ్యులు, తన తోటి క్రీడాకారులు ఉన్నారని, తన వైకల్యాన్ని కానీ, తన ఆర్థిక పరిస్థితులను కానీ వారు ఎప్పుడూ గుర్తు చేయలేదని ఆమె చెప్పింది. అయితే టోర్నమెంట్ ఆడేటప్పుడు స్పాన్సర్ లేకపోవడంతో కొంత నెర్వస్ గా ఫీల్ అయినప్పటికీ, భయం లేకుండా ఆడగలిగానని  పరూల్ చెపింది. తాను ఎన్నో పతకాలు గెలిచినప్పటికీ, అవన్నీ తన కుటుంబ సభ్యులకు, తన సహకరించినవారికి దక్కుతాయని, ఆమె అనింది.[2][3]

వృత్తిపర విజయాలు

[మార్చు]

2010 ఆసియా పారా గేమ్స్ లో  పర్మార్  కాంస్యపతకం సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు అదే తొలి పతకం. 2014, 2018 ఆసియా పారా గేమ్స్ లో ఆమె స్వర్ణాలు సాధించింది. [4] మంచి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గా పేరొందితే చాలని చిన్నప్పుడు తాను భావించింది అని, ఓ ఇంటర్వూలో పరూల్ చెప్పుకొచ్చింది. పారా బ్యాడ్మింటన్ లో వరల్డ్ చాంపియన్ అవుతానని అప్పుడు ఆమె ఊహించలేదు.[2]

2017 బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ నిర్వహించిన పారా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో స్వర్ణాలు సాధించి అత్యంత అరుదైన క్రీడాకారిణిగా పరూల్ రికార్డు నమోదు చేశారు.[5] 25 ఫిబ్రవరి 2020 నాటికి పారా బ్యాడ్మింటన్ లో  ఆమె వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి.[6]

2009లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డును స్వీకరించడం తన జీవితంలో అత్యుత్తమ జ్ఞాపకంగా  పరూల్ అభివర్ణించింది.  

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-09-14. Retrieved 2021-02-21.
  2. 2.0 2.1 2.2 2.3 "Parul Parmar | Episode 07 | The Finish Line with Saurav Ghosal - YouTube". www.youtube.com. Retrieved 2021-02-20.
  3. "BBC ISWOTY పారుల్ పర్మార్: ప్రపంచ పారా బాడ్మింటన్‌లో ప్రపంచంలో నంబర్ వన్". BBC News తెలుగు. Retrieved 2021-02-20.
  4. Paul, Tanmoy (2019-12-21). "Parul Parmar career at a glance and Tokyo Paralympics hopes » FirstSportz". FirstSportz (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-02-05. Retrieved 2021-02-20.
  5. India, Press Trust of. "India win 10 medals in Para-Badminton World Championships". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-20.[permanent dead link]
  6. "BWF Para-Badminton - BWF Para Badminton World Rankings - Overview". bwfpara.tournamentsoftware.com. Retrieved 2021-02-20.