దీర్ఘతమ మహర్షి
స్వరూపం
దీర్ఘతముడు (దేవనాగరి:दीर्घतमस) ఒక పురాతన మహర్షి. ఋగ్వేదంలో తన తాత్విక శ్లోకాల ద్వారా చాలా బాగా ప్రసిద్ధుడు. ఋగ్వేదం సంహితలోని మొదటి మండలం లోని 140 నుండి 164 వరకు గల సూక్తము (శ్లోకాలు) లకు ఇతను రచయిత, ఋగ్వేదం ఆరవ మండల యొక్క ప్రవక్త అయిన ఋషి భరద్వాజుడు, సోదరుడుగా భావిస్తారు.[1]
- దీర్ఘతమస్ అనగా శాశ్వత చీకటిలో చుట్టబడింది అని అర్థం.
పుట్టుక
[మార్చు]- దీర్ఘతమ మహర్షి అతి పురాతన ఋషి కుటుంబములలో ఒకటి అయిన అంగీరసుడు యొక్క వంశస్థుడు. అంగీరసుడు బ్రహ్మ కుమారుడు. ఉచథ్యుడు, బృహస్పతి అంగీరసుని కుమారులు. దీర్ఘతముడు ఉచథ్యుని కుమారుడు. దీర్ఘతమ తల్లి మమత. బృహస్పతి యొక్క శాపం వల్ల ఇతను గుడ్డివాడుగా జన్మించాడు. దీర్ఘతముడు బుద్ధిలో బృహస్పతితో సమానం.[2]
- దీర్ఘతమ మహర్షి కూడా ఋషుల యొక్క కుటుంబములలోని గౌతముడు కంటే, అలాగే కక్షీవణుడు, గోతముడు, నోధాలు, వామదేవుడు (ఋగ్వేదం లోని నాల్గవ మండలాన్ని దర్శించిన వాడు) లకంటే, ప్రధానంగా (ముఖ్యంగా) చాలా ముందున్నవాడు.[1]
సంసారం
[మార్చు]- దీర్ఘతముడు భార్య ప్రద్వేషి. వీరిద్దరి కుమారుడు గౌతముడు.
- దీర్ఘతమకు మరో భార్య ఉశిజ వల్ల పదకొండు మంది కుమారులు కలిగారు. వీరి సంతానంలో కక్షీవంతుడు ఋక్సంహితలో కొన్ని సూక్తాలను దర్శించి చాలా ప్రసిద్దుడయ్యాడు.[2]
- దీర్ఘతముడు అనుగ్రహం వల్ల సుధేష్ణకు కలిగిన అంగ, వంగ, కళింగ, పుండ్ర, శుంగ పుత్రులు తదుపరి ఆయా రాజ్యాలకు రాజులు అయ్యారు. ఆ రాజ్యాలే ప్రస్తుతము భాగల్పూర్, బెంగాల్, ఆంధ్ర, రాజసాహి, తామ్రవిక రాజ్యాలుగా చాలా ప్రసిద్ధమయ్యాయి.[2]
రచనలు
[మార్చు]- ఋగ్వేదం లోని 1000 శ్లోకాలను ఇతని వంశజులు దర్శించిన వాటిలో దాదాపు 150 దీర్ఘతముడు దర్శించినవే ఉన్నాయి. అతని సొంత శ్లోకాలు అనేక వేద పాఠాలలో, కొన్ని ఉపనిషత్తులలో కూడా తరచుగా దర్శనమిస్తూ ఉంటాయి, [1]
ప్రాముఖ్యం
[మార్చు]- రాజరిక ప్రారంభ రాజుల్లో రాజు అయిన భరతుడు నకు ప్రముఖ పురోహితుడు లేదా ప్రధాన పూజారిగా దీర్ఘతముడు ఉన్నాడు (ఐతరేయ బ్రాహ్మణం VIII.23). భరతుడు పరిపాలించిన దేశమే ఇప్పుడు భారత దేశము. (దేశం యొక్క సాంప్రదాయ నామం).గా పేరు పెట్టారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 https://en.wikipedia.org/wiki/Dirghatamas
- ↑ 2.0 2.1 2.2 "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురణ
- Gupta, Nolini Kanta. “Seer Poets”. Sri Aurobindo Ashram, Pondicherry, 1970.
- Johnson, Williard. On the Rgvedai Riddle of the two birds in the Fig Tree (1.164.20-22) and the Discovery of the Vedic Speculative Symposium. American Oriental Society. 1976. http://www.jstor.org/pss/599827
- Mahabharata, book1, Adi Parva, CIV
- Rg veda, suktas 140 to 164
- Raja, Dr. C. Kunhan. Asya Vamasya Hymn, (printed 1956).
- Singh, Prof. satya Prakash. Life and Vison of the Vedic Seers 2: Dirghatamas. Standard Publishers, New Delhi, 2006.