దగ్గుపల్లి దుగ్గన
దగ్గుపల్లి దుగ్గన | |
జననం: | 15 వ శతాబ్దం |
---|---|
వృత్తి: | కవి |
జాతీయత: | ఉదయగిరి రాజ్యం |
రచనా కాలము: | ప్రబంధ యుగం |
శైలి: | శృంగారం, క్షేత్ర మాహాత్య్మం |
దగ్గుపల్లి దుగ్గన (దగ్గుబల్లి దుగ్గన అని కూడా ప్రచురంగా ఉంది) 15 వ శతాబ్దంలో జీవించిన తెలుగు కవి. అతని తండ్రి దగ్గుపల్లి తిప్పన, తల్లి ఎర్రమ్మ. [1] దుగ్గన నాసికేతోపాఖ్యానము (నాచికేతోపాఖ్యానము) అనే పద్యకావ్యాన్ని రచించాడు.
శ్రీనాథునితో బంధుత్వం
[మార్చు]దుగ్గన ప్రసిద్ధ తెలుగు కవి శ్రీనాథునికి బావమరిది. [2] శ్రీనాథుని వద్దనే పెరిగి అతని శిష్యరికం లోనే కవిత్వ రచన మొదలుపెట్టాడు. దుగ్గనకు ఇద్దరు అన్నయ్యలు - పోతన, ఎర్రన. ఈ పోతన, బమ్మెర పోతన వేరు. అలాగే ఈ ఎర్రన, కవిత్రయం లోని ఎర్రన వేరు. పోతనను బమ్మెర పోతనగా భావించి అల్లిన కథలు కేవలం కల్పనలే.
రచనలు
[మార్చు]దుగ్గన అనేక రచనలు చేసినప్పటికీ నాసికేతోపాఖ్యానం ఒక్కటి మాత్రమే లభ్యమౌతోంది. [3] చెన్నై లోని ప్రాచ్య లిఖిత భాండాగారంలో ఇది భద్రంగా ఉంది. నేటి నెల్లూరు జిల్లా లోని ఉదయగిరి రాజ్య పాలకుడు బసవరాజు వద్ద మంత్రిగా ఉన్న చెందలూరు గంగన మంత్రికి ఈ కావ్యాన్ని అంకితమిచ్చాడు. ఈ కావ్యంలో బ్రహ్మదేవునిపై దండకం రచించాడు.
కాంచీపుర మాహాత్మ్యము, దుగ్గన రచించిన మరొక పద్య కావ్యం. [4] ఈ కావ్యాన్ని చెందలూరు గంగన మంత్రి కుమారుడైన చెందలూరు దేవయామాత్యునికి అంకితమిచ్చాడు. [5]
మూలాలు
[మార్చు]- ↑ వేటూరి, ప్రభాకరశాస్త్రి. బయాగ్రఫీ ఆఫ్ శ్రీనాథ శ్రీనాథుని జీవిత చరిత్ర. Translated by వేటూరి, ఆంజనేయులు. p. 16.
- ↑ భాగవతుల, శివశంకరశాస్త్రి (ఆరుద్ర) (2012). సమగ్ర ఆంధ్ర సాహిత్యం (రెండవ సంపుటి). హైదరాబాదు: తెలుగు అకాడమి. p. 181.
- ↑ టేకుమళ్ళ, అచ్యుతరావు (1937). "ఆంధ్రా లిటరేచర్ ఇన్ ది విజయనగర ఎంపైర్". జర్నల్ ఆఫ్ ది ఆంధ్ర హిస్టారికల్ రీసెర్చ్ సొసైటీ. 10: 254.
- ↑ మజుమ్‌దార్, ఆర్.స��. (1967). హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియన్ పీపుల్ (ఢిల్లీ సుల్తానేట్). 6. ముంబై: భారతీయ విద్యాభవన్. p. 528.
- ↑ ఏల్చూరి, మురళీధరరావు. "సాహిత్య చారిత్రిక విశేషాలు". సిలికానాంధ్ర వారి సుజనరంజని.
{{cite web}}
: CS1 maint: url-status (link)