జానకీ అమ్మాళ్
జానకీ అమ్మాళ్ | |
---|---|
జననం | ఎడవళత్ కక్కాడ్ జానకీ అమ్మాళ్ 4 నవంబర్ 1897 మద్రాసు |
ఇతర పేర్లు | ఎడవళత్ కక్కాడ్ జానకీ అమ్మాళ్ |
ఎడవళత్ కక్కాడ్ జానకీ అమ్మాళ్ ఒక భారతీయ మహిళా శాస్త్రవేత్త. ఈవిడ వృక్షశాస్త్రంలో చాలా కృషి చేశారు. వృక్షశాస్త్ర శాఖలో సైటోజెనెటిక్స్ (అంటే జీవకణ నిర్మాణం, విధులకు సంబంధించిన శాస్త్రం), భూగోళ శాస్త్రంపై పరిశోధన జరిపార.ఈమె చెరకు, వంగ చెట్టు మీద చాలా పేరెన్నికైన పరిశోధన జరిపారు. అలాగే జానకీ అమ్మాళ్, కేరళ వర్షాధార అడవుల నుండి ఔషధపరంగా, వాణిజ్యపరంగా పలు విలువైన మొక్కలు సేకరించారు.
జీవిత విశేషాలు
[మార్చు]ఈమె చెన్నపట్టణం (మద్రాసు) లో 1897 నవంబరు 4 న జన్మించారు. ఉన్నత చదువులు చదివిన తర్వాత అమెరికా వెళ్లారు. మిచిగాన్ యూనివర్సిటీ నుండి DSC (1931), L.L.D. (Hon. Cau.) (1956) డిగ్రీలను అందుకొని పరిశీలనా రంగంలో అపూర్వ విజయాలను సాధించారు.
తొలుత ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజి (మద్రాసు), మహారాజాస్ కాలేజి ఆఫ్ సైన్స్ (త్రివేండ్రం) లలో బోటనీ ప్రొఫెసర్ గా పనిచేశారు. సుగర్ కేన్ రీసెర్చి స్టేషను (కోయంబత్తూరు) లో వృక్ష జన్యు శాస్త్రవేత్తగా పరిశోధనలు నిర్వహించారు. రాయల్ హార్టీకల్చరల్ సొసైటీ (లండన్) లో వృక్షకణ శాస్త్ర రంగంలో పరిశోధనలు చేసి కేంద్రక ఆమ్లములలో ఉన్న నత్రజని ఆధారమును విశ్లేషించారు. కణములకు విషపూరితమైన పదార్థములను కనుగొన్నారు.
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (కలకత్తా) స్పెషల్ ఆఫీసర్ గా నియమితులై నూతన సంవిధానంలో పునర్నిర్మాణం చేశారు. సెంట్రల్ బొటానికల్ లేబొరేటరీ (అలాహాబాద్) కు డైరక్టర్ గా ఉండి సమున్నత పరిచారు. రీజినల్ రీసెర్చి లేబొరేటరీ (జమ్ము), బాబా అటామిక్ రీసెర్చి సెంటర్ (బొంబాయి), సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (బొంబాయి) మున్నగు ప్రసిద్ధ వైజ్ఞానిక సంస్థలకు గౌరవ శాస్త్రవేత్తగా ఉండి బహుముఖ సేవలు అందించారు.
అవార్డులు
[మార్చు]ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (1957), లినేయం సౌసైటీ (బ్రిటన్), రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ (లండన్), జెనెటిక్ సొసైటీ ఆఫ్ అమెరికా, రాయల్ హార్టీ కల్చరల్ సొసైటీ (లండన్) మొదలైన పలు దేశ, విదేసీ ప్రతిష్ఠాత్మక సంస్థలు ఈమెకు గౌరవ ఫెలోషిప్ ను అందించాయి. ఈమె బొటానికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు కార్యదర్శిగా 1933 - 38), గౌరవ అధ్యక్షురాలుగా (1960) గాను, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ కు ఉపాధ్యక్షురాలుగా (1961-64) వుండి ఆయా సంస్థల పురోభివృద్ధికి అఖండ కృషి చేశారు.
అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక సంస్థలు సిగ్మా -XI అసోషియేషన్ ఆఫ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్ మొదలిఅనవి ఈమెకు పలు గౌరవ పురస్కారములను అందించాయి. 1961 లో బీర్బల్ సహాని మెడల్, 1977 లో పద్మశ్రీ మొదలైన గౌరవ పురస్కారములను గ్రహించారు.
ప్రధాన పరిశోధనలు
[మార్చు]ఈమె చేసిన ప్రధాన పరిశోధనలు చెరుకు జన్యు శాస్త్ర విభాగంలో కణములు, క్రోమోజోముల మీద జరిగాయి. ఆయా కణములకు విషఫలితాలు చేరకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు విషయమై ఈమె నిర్వహించిన పరిశోధనలు నూతన ఆవిష్కరణలు చేశాయి. సూక్ష్మమైన బీజ మాతృకణముల గురించి పలు నూతన అంశములను వెలికి తీసుకు వచ్చిన ఘనత ఈమెకు దక్కింది. చెరుకు మొక్కల జీవపరిణామాన్ని తొలిసారిగా అన్వేషించి, జాడ తెలుసుకున్నారు. ఈమె రాసిన గ్రంథం "Chromosome Atlas of the cultivated plant" దేశ విదేశాలలో వృక్ష శాస్త్రవేత్తలకు కల్పతరువు వలె భాసిల్లింది. విద్యార్థుల పాఠ్య గ్రంథంలా చిరకీర్తి ప���ందింది.
సూచికలు
[మార్చు]ఇతర లంకెలు
[మార్చు]- [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా
వ్యాసాలను అభివృద్ధి చేయవచ్చు.
- లీలావతి కూతుళ్ళు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- శాస్త్రవేత్తలు
- భారతీయ శాస్త్రవేత్తలు
- మహిళా శాస్త్రవేత్తలు
- 1897 జననాలు
- పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు
- భారతీయ మహిళా శాస్త్రవేత్తలు