జహీరాబాద్
జహీరాబాద్ (పట్టణం ) | |
— పురపాలక సంఘం — | |
జహీరాబాదు పట్టణంలో 9వ నెంబరు జాతీయ రహదారి | |
అక్షాంశరేఖాంశాలు: 17°40′45″N 77°37′00″E / 17.679046°N 77.616584°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి |
మండలం | జహీరాబాద్ |
ప్రభుత్వం | |
- Type | పురపాలక సంఘం |
- మేయర్ | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
జహీరాబాద్ (M), తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ ఒక పెద్ద పట్టణం.[1]ఇది 9వ నెంబరు జాతీయ రహదారిపై హైదరాబాదు నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్ళు మార్గంలో ఉంది. జహీరాబాద్ జాతీయ రహదారిపై హైదరాబాదునుండి సుమారు 100 కి.మీ. దూరంలో ఉంది. పైగా నవాబ్ "జహీర్ యార్ జంగ్" పేరు మీద ఈ పట్టణానికి జహీరాబాద్ అనే పేరు వచ్చింది.
భౌగోళికం
[మార్చు]జహీరాబాద్ అక్షాంశ రేఖాంశాలు 17°41′N 77°37′E / 17.68°N 77.62°E.[2] సగటు ఎత్తు 622 మీటర్లు (204 అడుగులు).ఇక్కడి నుండి కర్ణాటక రాష్ట్ర్రం లోని బీదర్ పట్టణం 31 కి.మీ. దూరంలో ఉంది.
వృత్తులు, పరిశ్రమలు
[మార్చు]చుట్టుప్రక్కల గ్రామాలలో ��్యవసాయం ముఖ్య జీవనోపాధి. అంతే కాకుండా ఉపాధి కలిపించే మరి కొన్ని పరిశ్రమలున్నాయి - ఉదా - మహీంద్ర & మహీంద్ర, ట్రైడెంట్ షుగర్స్ (పాత పేరు నిజాం షుగర్స్), ముంగి (బస్ బాడీ బిల్డింగ్ యూనిట్). ఈ పరిశ్రమలకు తగినట్లుగా వాణిజ్య సదుపాయాలున్నాయి.అనేక గోడౌన్లు ఉన్నాయి.చుట్టుప్రక్కల గ్రామాలలో చెరకు ముఖ్యమైన పంట. జహీరాబాద్-బీదర్ దారిలో ఉన్న సిద్ధి వినాయక ఆలయం ప్రసిద్ధి చెందింది. తెలంగాణ ఊటీగా పేరొందిన గొట్టం గుట్ట ప్రాంతం ఇక్కడికి సమీపంలోనే ఉంది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]
దేవాలయాలు
[మార్చు]- సాయినాథుని మందిరం: సర్వమతాల సారం ఒక్కటేనని, సబ్ కా మాలిక్ ఏక్ అని ప్రవచించిన సద్గురువు శ్రీ సాయినాధుడు కొలువుదీరిన మందిరం ఇక్కడ నెలకొని ఉంది. వర్ణరంజిత ప్రాకారాదులతో శోభిల్లే ఈ మందిరం, వివిధ ఉపాలయాల సమాహారంగా భాసిల్లుతోంది.
- కేతకి సంగమేశ్వర ఆలయం: జహీరాబాదు పట్టణానికి సుమారు 18 కి.మీ. దూరంలో చాలా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర దేవాలయం కలదు, ఈ ఆలయం నుండి వారణాసి గంగా నదికి కాశీ లోని ఆలయం నుండి ఇక్కడి ఈ ఆలయంలోని జల ద్వారం నకు కలసి అంతర్వేదిగా ఉందని ప్రసిద్ధి. కాశీ ఆలయం లోని ఒక ఋషి ఒక కమండలాన్ని ఆ జల ద్వారంలో వదిలితే ఇక్కడి కేతకి సంగమేశ్వర ఆలయంలో తేలిందని ప్రసిద్ధి. సంవత్సరం పొడవునా ఎల్లపుడు నీటితో నిండి జల ద్వారం కలకలలాడుతు ఉంటుంది.
ఇతర వివరాలు
[మార్చు]- ఈ ప్రాంతంలో నిర్మించబడుతున్న సంగమేశ్వర ఎత్తిపోతల పథకంకు 2022, ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశాడు.[4][5]
- జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో 511 ఎకరాల్లో 1000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న తొలి పరిశ్రమ వీఈఎం టెక్నాలజీస్ పరిశ్రమ నిర్మాణానికి 2022 జూన్ 22న తెలంగాణ రాష్ట్ర ఐటీ-మున్సిపల్-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు భూమిపూజ చేశాడు. వాయు ఈవీ పరిశ్రమను, మహీంద్రా ట్రాక్టర్లు 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి పూర్తయిన సందర్భంగా కంపెనీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్మారకాన్ని ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్, రాజ్యసభ సభ్యుడు కె.ఆర్. సురేష్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ జి.బాలమల్లు, జిల్లా పరిషత్ చైర్మన్ పి. మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జిల్లా కలెక్టర్ డా.ఎ. శరత్ పాల్గొన్నారు.[6][7]
- తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటులో భాగంగా మహీంద్రా గ్రూపు - ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 1000 కోట్ల రూపాయలతో జహీరాబాద్ ప్లాంట్‌లో ఈవీ బ్యాటరీల యూనిట్ (లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్) నిర్మాణానికి 2023 ఏప్రిల్ 24న కేటీఆర్ శంకుస్థాపన చేశాడు.[8][9]
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ Falling Rain Genomics, Inc - Zahirabad
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2022-08-09.
- ↑ telugu, NT News (2022-02-21). "CM KCR | సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన". Namasthe Telangana. Archived from the original on 2022-02-21. Retrieved 2022-02-21.
- ↑ Velugu, V6 (2022-02-21). "సంగమేశ్వర్,బసవేశ్వరప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-21. Retrieved 2022-02-21.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ telugu, NT News (2022-06-22). "నేడు జహీరాబాద్‌కు మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం". Namasthe Telangana. Archived from the original on 2022-06-22. Retrieved 2022-06-22.
- ↑ telugu, NT News (2022-06-23). "ఈవీ కేంద్రం తెలంగాణ". Namasthe Telangana. Archived from the original on 2022-06-23. Retrieved 2022-06-23.
- ↑ Ayyappa, Mamidi (2023-04-24). "Telangana: ఎలక్ట్రిక్ బ్యాటరీల యూనిట్‌కు మంత్రి KTR శంకుస్థాపన.. వేల మందికి ఉపాధి..!". www.telugu.goodreturns.in. Archived from the original on 2023-04-24. Retrieved 2023-04-24.
- ↑ "'మహీంద్రా'లో ఈవీ బ్యాటరీల యూనిట్". EENADU. 2023-04-24. Archived from the original on 2023-04-24. Retrieved 2023-04-24.