Jump to content

కార్తీక్ రత్నం

వికీపీడియా నుండి
కార్తీక్ రత్నం
జననం (1997-07-05) 1997 జూలై 5 (వయసు 27)
విద్యసి.ఎ.
వృత్తినాటకరంగ, తెలుగు సినిమా నటుడు.
క్రియాశీల సంవత్సరాలు2010 - ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • పృథ్వీరాజ్ (తండ్రి)
  • నళిని (తల్లి)

కార్తీక్ రత్నం[1][2] తెలుగు నాటకరంగ, సినిమా నటుడు. 2018లో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం సినిమాలోని జోసఫ్ పాత్రతో గుర్తింపు పొందాడు.[3]

జీవిత విషయాలు

[మార్చు]

కార్తీక్ 1997, జూలై 5న పృథ్వీరాజ్, నళిని దంపతులకు సికింద్రాబాదు సమీపంలోని వారసిగూడలో జన్మించాడు. సి.ఎ. చదువును మధ్యలోనే ఆపేశాడు.

నాటకరంగం

[మార్చు]

రంగస్థల నటుడిగా దాదాపు 30 నాటకాలలో నటించిన కార్తీక్,[4] 2010లో బొరుసు లేని బొమ్మ నాటకంలో నటనకుగాను ఉత్తమ బాల నటుడిగా నంది నాటక అవార్డు కూడా అందుకున్నాడు.[3][5] రాళ్లపల్లి రచించిన ముగింపు లేని కథ, కోట శంకరరావు దర్శకత్వంలో రసరాజ్యం తదితర నాటకాల్లో నటించాడు.

సినిమారంగం

[మార్చు]

మొదట్లో కొన్ని సినిమాలలో చిన్నచిన్న పాత్రలు చేసిన కార్తీక్ కు దర్శకుడు వెంకటేష్‌ మహా కేరాఫ్ కంచరపాలెం సినిమాలో జోసఫ్ పాత్రను ఇచ్చాడు.[6] ఆ సినిమాతో కార్తీక్ కు మంచి గుర్తింపు వచ్చింది. తరువాత, జీ5 వెబ్ సిరీస్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి[7][8] లో రవిరెడ్డి[9] పాత్రలో నటించాడు. కేరాఫ్ కంచరపాలెం తమిళ రిమేక్ కేరాఫ్ కాదల్ సినిమాలో జోసఫ్ పాత్రలో కూడా నటించాడు.[10][11] ప్రస్తుతం నారప్ప చిత్రంలో నారప్ప పెద్ద కొడుకు మునికన్నా పాత్రలో నటించాడు.[12]

నటించినవి

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతర వివరాలు మూలాలు
2018 కేరాఫ్ కంచరపాలెం జోసఫ్ తొలి చిత్రం [13][14][15][16]
2019 గాడ్స్ ఆఫ్ ధర్మపురి రవి రెడ్డి జీ5 వెబ్ సిరీస్ [17][18]
2020 కెరాఫ్ కాదల్ జోసఫ్ తమిళ తొలిచిత్రం

కేరాఫ్ కంచరపాలెం (2018 సినిమా) తమిళ చిత్రం

2020 అర్ధ శతాబ్దం కృష్ణ
2021 C/o కాదల్ జోసెఫ్ తమిళంలో తొలి సినిమా, కేరాఫ్ కంచరపాలెం రీమేక్
చెక్ (2021) విక్రమ్
నారప్ప మునికన్నా
రౌడీ బాయ్స్‌
2023 ఛాంగురే బంగారు రాజా బంగార్రాజు
లింగోచ్చా
2024 శ్రీ‌రంగ‌నీతులు

వెబ్‌సిరీస్‌

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Apart from my Tamil debut in C/o Kaadhal, I have five other projects in my kitty: Karthik Rathnam". Times of India.
  2. HaribabuBolineni (2018-09-06). "Karthik Ratnam Excited About C/O Kancharapalem". Chitramala (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-05.
  3. 3.0 3.1 సాక్షి (10 September 2018). "హీరో లేడు.. విలన్‌ లేడు." Archived from the original on 14 September 2018. Retrieved 5 July 2020.
  4. "Tales of Rama, Krishna and more told through spellbinding Kuchipudi - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-07-05.
  5. "స్టేజ్‌ షో టు సినిమా". Sakshi. 2018-09-06. Retrieved 2020-07-05.
  6. "'C/O Kancharapalem' preview: Celebrities bowled over by this Venkatesh Maha directorial - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-07-05.
  7. "My Guru, Nawazuddin Siddiqui, Is Sitting In Mumbai: Karthik Rathnam Of ZEE5 Original G.O.D". Zee Telugu. 2019-10-29. Archived from the original on 2019-12-03. Retrieved 2020-07-05.
  8. "G.O.D's Ravi Reddy AKA Karthik Rathnam Turns Model For Vijay Deverakonda's Rowdy". Zee Telugu. 2019-11-20. Archived from the original on 2019-12-03. Retrieved 2020-07-05.
  9. "My Guru, Nawazuddin Siddiqui, Is Sitting In Mumbai: Karthik Rathnam Of ZEE5 Original G.O.D". Zee Telugu. 2019-10-29. Archived from the original on 2019-12-03. Retrieved 2020-07-05.
  10. "'C/o Kancharapalem' to be remade in Tamil and Malayalam! - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-07-05.
  11. "Critically-acclaimed Telugu film, C/O Kancharapalem, gets a Tamil remake". The New Indian Express. Retrieved 2020-07-05.
  12. ఈనాడు, సినిమా (5 July 2020). "'నారప్ప' పెద్ద కుమారుడు ఇతనే!". www.eenadu.net. Archived from the original on 5 July 2020. Retrieved 5 July 2020.
  13. Chowdhary, Y. Sunita (2018-09-06). "Meet the actors of 'C/o Kancharapalem'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-07-05.
  14. "'C/O Kancharapalem' preview: Celebrities bowled over by this Venkatesh Maha directorial - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-07-05.
  15. Dundoo, Sangeetha Devi (2018-09-04). "'C/o Kancharapalem' review: Small film with a large heart". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-07-05.
  16. "Anupama Chopra's 50 Films I Love: Care Of Kancharapalem". Film Companion (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-09-18. Archived from the original on 2020-05-11. Retrieved 2020-07-05.
  17. Dundoo, Sangeetha Devi (2019-10-14). "Gods of Dharmapuri is a cool gangster drama". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-07-05.
  18. "'G.O.D' review: Satyadev, Karthik Rathnam dazzle in Zee5 web series on class struggle". www.thenewsminute.com. 2019-10-29. Retrieved 2020-07-05.