ఆఫ్ఘనిస్తాన్‌లో హిందూమతం
మొత్తం జనాభా | |
---|---|
ఆఫ్ఘనిస్తాన్‌లో 50 [1] Larger diaspora in India, Germany, United States, United Kingdom, and Canada | |
Regions with significant populations | |
కాబూల్, జలాలాబాదు | |
మతాలు | |
హిందూమతం[2] | |
భాషలు | |
పష్తో, హింద్కో, పంజాబీ, దారీ, సింధీ, ]], హిందూస్థానీ, ఉర్దూ, హిందీ |
ఆఫ్ఘనిస్తాన్‌లో హిందూ మతాన్ని కొద్దిమంది మైనారిటీలు ఆచరిస్తున్నారు/ అంతా కలిపి దాదాపు 50 మంది మాత్రమే ఉంటారు.[3] కాబూల్, జలాలాబాద్ నగరాల్లో వీరు నివసిస్తున్నారు. ఆఫ్ఘన్ హిందువులు జాతిపరంగా పష్టూన్, [4] హింద్‌కోవాన్ (హింద్కి), పంజాబీ లేదా సింధీలు. వీరు ప్రధానంగా పష్టో, హింద్కో, పంజాబీ, దారీ హిందుస్తానీ ( ఉర్దూ - హిందీ ) భాషలు మాట్లాడతారు.
ఆఫ్ఘనిస్తాన్‌పై ఇస్లామిక్ ఆక్రమణకు ముందు, ఆఫ్ఘన్ ప్రజలు బహుళ మతస్థులు.[5] మతపరమైన హింస, వివక్ష, హిందువులను బలవంతంగా ముస్లిములుగా మార్చడంతో ఆఫ్ఘన్ హిందువులు, బౌద్ధ, సిక్కు జనాభాతో పాటు తగ్గిపోయారు.
1970లలో, ఆఫ్ఘన్ హిందూ జనాభా 80,000 - 2,80,000 (జాతీయ జనాభాలో 0.7%–2.5%) మధ్య ఉన్నట్లు అంచనా వేయబడింది. [a] [6] అయినప్పటికీ, ఆఫ్ఘన్ యుద్ధాల కారణంగా నిరంతర హింస, వివక్ష, బలవంతపు మతమార్పిడి కారణంగా జనాభా వేగంగా క్షీణించింది.[7]
చరిత్ర
[మార్చు]పూర్వ చరిత్ర, పురాతన కాలం (5500–550 BCE)
[మార్చు]హిందూమతం ఆఫ్ఘనిస్తాన్ లో ఎప్పుడు ప్రారంభమైందో కచ్చితమైన ఆధారాలు లభించలేదు. హిందూ కుష్ దక్షిణ ప్రాంతం మాత్రం సాంస్కృతికంగా సింధు లోయ నాగరికత (సా.పూ. 5500-2000) తో సంబంధం కలిగి ఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తారు.
సుమారుగా సా.పూ. 2000-1500 నాటికి, ఈ ప్రాంతంలోని ఇండో-ఆర్యన్ నివాసులు (ప్రధానంగా నేటి ఆఫ్ఘనిస్తాన్ తూర్పు, దక్షిణ ప్రాంతాలలో) హిందూమతాన్ని ఆచరించేవారు. వీరిలో ప్రముఖులు గాంధారీలు, కాంభోజులు. నేటి పశాయీలు, నూరిస్తానీలు ఈ ఇండో-ఆర్య వేద కాలపు ప్రజల వారసులు.[8][9][10][11][12]
పర్షియన్, గ్రీక్, మౌర్య కాలాలు (550–150 BCE)
[మార్చు]సా.పూ. 330 లో అలెగ్జాండర్, అతని గ్రీకు సైన్యం రాకముందు ఆఫ్ఘనిస్తాన్‌లో పురాతన ఏరియన్లు నివసించేవారని చాలా మంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. మూడు సంవత్సరాల తర్వాత అలెగ్జాండర్ వెనక్కి వెళ్ళిపోయాక, ఇది సెల్యూసిడ్ సామ్రాజ్యంలో భాగమైంది. సా.పూ. 305 లో, సెలూసిడ్-మౌర్యన్ యుద్ధం ఫలితంగా సెలూసిడ్ సామ్రాజ్యం హిందూ కుష్‌కు దక్షిణంగా ఉన్న భూభాగంపై నియంత్రణను కోల్పోయి, భారత చక్రవర్తి "సాండ్రోకోటస్" (చంద్రగుప్త మౌర్యుడు) కు అప్పగించింది.
అలెగ్జాండర్ వీటిని ఏరియన్ల నుండి లాక్కుని, తన స్వంత స్థావరాలను ఏర్పరచుకున్నాడు. కానీ సెల్యూకస్ నికేటర్ పరస్పర వివాహ బంధాలకూ 500 ఏనుగుల బహుమానానికీ ప్రతిగా వాటిని చంద్రగుప్త మౌర్యునికి ఇచ్చాడు.[13]
—Strabo, సా.పూ. 64 – సా.శ. 24
సాంప్రదాయ కాలం (150 BCE–650 CE)
[మార్చు]చైనీస్ యాత్రికులు ఫాక్సియన్, సాంగ్ యున్, జువాన్‌జాంగ్ సా.శ. 5 - 7వ శతాబ్దాల మధ్య ఆఫ్ఘనిస్తాన్‌ను అన్వేషించినప్పుడు, వారు అనేక ట్రావెలాగ్‌లను వ్రాసారు. ఇందులో ఆఫ్ఘనిస్తాన్‌పై విశ్వసనీయ సమాచారం లభిస్తుంది. ఉత్తరాన అమూ దర్యా (ఆక్సస్ నది), సింధు నది మధ్య వివిధ ప్రాంతాలలో బౌద్ధమతం ఆచరింపబడిందని వారు పేర్కొన్నారు.[14] అయితే, వారు హిందూమతం గురించి పెద్దగా ప్రస్తావించలేదు. అయితే హెఫ్తలైట్ పాలకులు బౌద్ధమతాన్ని గుర్తించలేదని సాంగ్ యున్ పేర్కొన్నప్పటికీ "సూడో దేవుళ్లను ఆరాధించారు, మాంసం కోసం జంతువులను చంపారు" అని రాసారు.[14]
టర్క్ & కాబుల్ షాహి, జున్‌బిల్ రాజవంశం (650–850 CE)
[మార్చు]ఆఫ్ఘనిస్తాన్‌పై ఇస్లామిక్ ఆక్రమణకు ముందు , ఈ భూభాగం జొరాస్ట్రియనిజం, జూన్‌బిల్స్, హిందూయిజం, బౌద్ధమతం యొక్క మతపరమైన అవక్షేపంగా ఉంది. ఇది పర్షియన్లు, ఖలాజ్, టర్క్స్, పష్టూన్‌లతో సహా వివిధ ప్రజలు నివసించేవారు. హిందూ కుష్‌కు దక్షిణంగా ఉన్న భూభాగంలోని కొన్ని భాగాలను దక్షిణ-హెఫ్తలైట్‌ల సంతానం అయిన జూన్‌బిల్‌లు పరిపాలించారు. తూర్పు భాగాలు ( కాబులిస్తాన్ ) టర్క్ షాహీలచే నియంత్రించబడ్డాయి.
కాబూల్ షాహి ఇందులో Zunbil భూభాగం, ఉత్తర పాలించిన Kabulistan, Gandahara . అరబ్బులు 653–654లో కాబూల్ చేరుకున్నారు CE, అబ్దుర్ రెహ్మాన్ బిన్ సమారాతో పాటు 6,000 మంది అరబ్ ముస్లింలు జూన్‌బిల్ భూభాగంలోకి చొచ్చుకుపోయి జమిందావర్‌లోని జున్ మందిరానికి వెళ్ళినప్పుడు, ఇది నేటి హెల్మండ్ ప్రావిన్స్‌లోని మూసా ఖలాకు దక్షిణంగా five కిలోమీటర్లు (three మైళ్లు) ఉందని నమ్ముతారు. ఆఫ్ఘనిస్తాన్. అరబ్ సైన్యానికి చెందిన జనరల్ "దేవుని పనికిరాని తనం గురించి సిస్తాన్‌లోని మార్జ్‌బాన్‌ని ఒప్పించడానికి విగ్రహం చేతిని విరిచి, దాని కళ్ళలోని కెంపులను బయటకు తీశాడు." [15]
హిందూ షాహీ (850–1000 CE)
[మార్చు]విల్లెం వోగెల్సాంగ్ తన 2002 పుస్తకంలో ఇలా వ్రాశాడు: "సా.శ.. 8, 9వ శతాబ్దాలలో ఆధునిక ఆఫ్ఘనిస్తాన్ యొక్క తూర్పు భూభాగాలు ఇప్పటికీ ముస్లిమేతర పాలకుల చేతుల్లో ఉన్నాయి. స్థానిక పాలకులు, ప్రజలు చాలా మంది హున్నిక్ లేదా టర్కిక్ సంతతికి చెందినవారు అయినప్పటికీ ముస్లింలు వారిని భారతీయులు (హిందువులు) గానే పరిగణించేవారు. తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని ముస్లిమేతర జనాభా సాంస్కృతికంగా భారత ఉపఖండంతో ముడిపడి ఉన్నందున ముస్లింల భావన ఆ మేరకు సరైనదే. వారిలో ఎక్కువ మంది హిందువులు లేదా బౌద్ధులు. " [16]
870 ADలో, మధ్యయుగపు జరంజ్ ( ఆఫ్ఘనిస్తాన్‌లోని జరంజ్‌గా పేరుపొందిన ఆధునిక నగరం కాదు) నుండి వచ్చిన సఫారిద్‌లు, [17] ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా వరకు ముస్లిం పాలనను స్థాపించారు. 10వ శతాబ్దంలో ఘజనవీడులు రాకముందు వరకు ముస్లింలు, ముస్లిమేతరులు పక్కపక్కనే నివసించినట్లు సమాచారం.
క్షీణత (1000–1800 CE)
[మార్చు]10వ శతాబ్దంలో ఘజనీ సుల్తాన్ మహమూద్ హిందూస్థాన్ లోకి ప్రవేశించి సింధు నదిని దాటడం ప్రారంభించినప్పుడు, ఘజ్నావిడ్ ముస్లింలు హిందూ బానిసలను ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ లోకి తీసుకురావడం మొదలైంది. మార్టిన్ ఎవాన్స్ తన 2002 పుస్తకంలో ఇలా వ్రాశాడు:
Even then a Hindu dynasty the Hindu Shahis, held Gandhara and the eastern borders. From the tenth century onwards as Persian language and culture continued to spread into Afghanistan, the focus of power shifted to Ghazni, where a Turkic dynasty, who started by ruling the town for the Samanid dynasty of Bokhara, proceeded to create an empire in their own right. The greatest of the Ghaznavids was Mahmud who ruled between 998 and 1030. He expelled the Hindus from Ghandhara, made no fewer than 17 raids into India. He encouraged mass conversions to Islam, in Pakistan as well as in Afghanistan."[19]
మహ్మద్ తన కొల్లగొట్టిన సంపదను కిరాయి సైనికులతో సహా తన సైన్యాలకు పంచేశాడు. భారతీయ సైనికులు, బహుశా హిందువులు, వారి కమాండర్ సిపాహ్‌సాలార్ -ఇ-హిందూవాన్ అని పిలువబడే సైన్యంలోని భాగాలలో ఒకరైన వారు తమ స్వంత మతాన్ని ఆచరిస్తూ గజ్నాలోని తమ ప్రాంతంలో నివసించారు. వారి కమాండర్ సువేంద్రాయ్ ఆధ్వర్యంలోని భారత సైనికులు మహమూద్‌కు విధేయులుగా ఉన్నారు. బైహాకి ప్రకారం తిలక్ అనే హిందువుకు ఇచ్చిన ఆదేశంతో, ఓ టర్కు తిరుగుబాటుదారుడికి వ్యతిరేకంగా కూడా వారిని ఉపయోగించారు.[20]
పెషావర్, వైహింద్‌పై చేసిన యుద్ధంలో మహమూద్, 5,00,000 మంది బానిసలను సంపాదించాడని అల్-ఉత్బీ అన్నాడు. అందులో పిల్లలు, బాలికలు కూడా ఉన్నారు. పురుషులను బానిసలుగా సాధారణ వ్యాపారులకు కూడా విక్రయించారు. నార్డిన్‌లో బంధించబడిన బానిసల సంఖ్య కారణంగా వారి ధర బాగా పడిపోయింది. మగ బానిసలను సాధారణ వ్యాపారులు కూడా కొనుగోలు చేయగలిగారు. తానేసర్‌పై దాడి చేసిన తర్వాత, అతను 2,00,000 మంది బానిసలను సంపాదించాడు.
14వ శతాబ్దపు ప్రఖ్యాత మొరాకో ముస్లిం పండితుడు ఇబ్న్ బటుటా హిందూ కుష్ అంటే "భారతీయులను చంపేవాడు" అని వ్యాఖ్యానించాడు. ఎందుకంటే భారతదేశం నుండి తీసుకురాబడిన బానిసలు ఇక్కడి విపరీతమైన చలి, మంచు కారణంగా పెద్ద సంఖ్యలో మరణించేవారు.[21]
ఘజ్నవిద్ సామ్రాజ్యాన్ని ఘురిద్‌లు మరింతగా విస్తరించారు. ఖల్జీ రాజవంశం సమయంలో, భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ ప్రజల మధ్య స్వేచ్ఛా సంచారం కూడా ఉంది. మొఘలులు ఆ తరువాత సూరిలు, దుర్రానిల కాలం వరకూ వరకు ఇది ఈ విధంగా కొనసాగింది.
ఆధునిక కాలం
[మార్చు]ఆఫ్ఘనిస్తాన్‌లో నేడు హిందూమతాన్ని ఆచరిస్తున్న ప్రధాన జాతి సమూహాలు పంజాబీలు, సింధీలు. వారు 19వ శతాబ్దంలో సిక్కులతో పాటు వ్యాపారులుగా ఆఫ్ఘనిస్తాన్‌కు వచ్చినట్లు భావిస్తున్నారు.[22] డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కూలిపోయే వరకు, దేశంలో అనేక వేల మంది హిందువులు నివసించారు. కానీ నేడు వారి సంఖ్య కేవలం 1,000 మాత్రమే.[23] మిగిలిన వారిలో ఎక్కువ మంది భారతదేశం, యూరోపియన్ యూనియన్, ఉత్తర అమెరికా లేదా ఇతర ప్రాంతాలకు వలస వచ్చారు.[3]
ఆఫ్ఘన్ హిందువులు, ఆఫ్ఘన్ సిక్కులు తరచూ ఒకే ప్రార్థనా స్థలాలకు వెళ్తూంటారు. వారందరినీ కలిపి సమష్టిగా హింద్కి అని పిలుస్తారు.[24] హిందూ సమాజంలోని భాషా జనాభా వైవిధ్యాలు, సాధారణంగా ప్రాంతీయ మూలాలను అనుసరిస్తాయి: పంజాబ్ నుండి వచ్చిన వారు సాధారణంగా పంజాబీ మాట్లాడతారు, సింధీలు సింధీ, హింద్కో లోని ఉత్తర, దక్షిణ మాండలికాలు మాట్లాడతారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని స్థానిక హిందూ సమాజం ఎక్కువగా కాబూల్ నగరంలోనే ఉంది. 2002 లోయా జిర్గాలో హిందువులకు రెండు సీట్లు కేటాయించారు.[25] మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్కు ఆర్థిక సలహాదారైన షామ్ లాల్ భటీజా ఆఫ్ఘన్ హిందువు.[26]
1996 నుండి 2001 చివరి వరకు సాగిన తాలిబాన్ పాలనలో, హిందువులు తమను తాము ముస్లిమేతరులుగా గుర్తించుకోవడానికి బహిరంగంగా పసుపు రంగు బ్యాడ్జీలు ధరించవలసి వచ్చింది. హిందూ స్త్రీలు బురఖాలు ధరించాలని బలవంతం చేసారు. వారిని వేధింపుల నుండి "రక్షించేందుకే" ఈ నిర్ణయమని చెప్పుకొచ్చారు. ఇస్లామిక్ సమాజాల నుండి "అన్-ఇస్లామిక్", "విగ్రహారాధన" కమ్యూనిటీలను వేరు చేయాలనే తాలిబాన్ ప్రణాళికలో భాగమే ఈ నిబంధన.[27]
ఈ ఉత్తర్వు మత స్వేచ్ఛకు భంగం కలిగిస్త��ందని భారత, అమెరికా ప్రభుత్వాలు ఖండించాయి. భారతదేశంలోని భోపాల్‌లో తాలిబాన్ పాలనకు వ్యతిరేకంగా విస్తృత నిరసనలు చెలరేగాయి. అమెరికాలో, యాంటీ-డిఫమేషన్ లీగ్ ఛైర్మన్ అబ్రహం ఫాక్స్‌మాన్ ఈ డిక్రీ నాజీ జర్మనీ పద్ధతుల లాగా ఉందని పోల్చాడు. అక్కడ యూదులు తమను యూదులని గుర్తించే లేబుల్‌లను ధరించాల్సి వచ్చింది.[28] ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూ మైనారిటీకి సంఘీభావ సూచికగా అమెరికా సెనెట్‌లో చర్చ సందర్భంగా పలువురు సభ్యులు "నేను హిందువును" అని రాసి ఉన్న పసుపు బ్యాడ్జీలను ధరించారు.[29][30][31][32]
ఆఫ్ఘనిస్తాన్‌లో హిందువులను ప్రభుత్వమే అణచివేయడం ఇదే మొదటిసారి కాదని భారత విశ్లేషకుడు రాహుల్ బెనర్జీ అన్నాడు. హిందువులపై జరుగుతున్న హింస అనేక సంవత్సరాలుగా హిందూ జనాభా వేగంగా క్షీణించడానికి కారణమైంది.[33] 1990ల నుండి, చాలా మంది ఆఫ్ఘన్ హిందువులు దేశం నుండి పారిపోయారు. భారతదేశం, జర్మనీ, అమెరికా వంటి దేశాలలో వాళ్ళు ఆశ్రయం పొందారు.[34]
2013 జూలైలో ఆఫ్ఘన్ పార్లమెంటు మైనారిటీ వర్గానికి సీట్లను రిజర్వ్ చేయడానికి నిరాకరించింది. ఎందుకంటే ఆ ప్రతిపాదన పెట్టిన బిల్లు వీగిపోయింది. అప్పటి అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు ద్వారా రిజర్వేషన్లు పొందిన గిరిజనులు, "మహిళలు" బలహీన వర్గాలకు చెందినవారు. కానీ రాజ్యాంగంలోని మత సమానత్వ ఆర్టికల్ ప్రకారం మతపరమైన మైనారిటీలు బలహీనవర్గాలు కాదు.[35]
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- ఆత్మారామ్ - ఆఫ్ఘన్ మంత్రి, రచయిత.
- సెలీనా జైట్లీ – కాబూల్‌లో భారతీయుడైన కల్నల్ VK జైట్లీకి, ఆఫ్ఘన్ హిందూ తల్లి అయిన మీటా జైట్లీకి కాబూల్‌లో జన్మించిన భారతీయ నటి. ఆమె తల్లి కాబూల్‌కు చెందినది, భారత సైన్యంలో నర్సుగా పనిచేసింది.[36][37][38]
- అన్నెట్ మహేంద్రు – అమెరికన్ నటి. కాబూల్‌లో భారతీయుడైన ఘన్షాన్ "కెన్" మహేంద్రునికి జన్మించింది. అతని కుటుంబం వ్యాపారం కోసం ఢిల్లీ నుండి ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్ళింది. ఆమె తల్లి రష్యను అయిన ఓల్గా.[39][40]
హిందువుల డయాస్పోరా
[మార్చు]మొత్తం జనాభా | |
---|---|
80,000 - 280,000 [3][6][41][42] ( సి. 1980 ) | |
గణనీయమైన జనాభా ఉన్న ప్రాంతాలు | |
భారతదేశం, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా | |
</img> భారతదేశం | 15,000-16,000 |
</img> జర్మనీ | 7,000-10,000 [43] |
</img> సంయుక్త రాష్ట్రాలు | 3,000 [44] |
</img> యునైటెడ్ కింగ్‌డమ్ | 1,600 [45] |
భాషలు | |
హింద్కో (స్థానిక), ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, పాష్టో (పాత తరం), దారి (పాత తరం) |
చరిత్రకారుడు ఇందర్‌జీత్ సింగ్ ప్రకారం ఆఫ్ఘన్ సిక్కులు హిందువుల జనాభా నిష్పత్తి 60:40గా అంచనా వేసాడు.
అధికారిక జనాభా లెక్కల సమాచారం లేనందున, జనాభా లెక్కల్లో అనేక అంచనాలున్నాయి. కాబూల్, నంగర్హర్, ఘజనీ, కాందహార్ ప్రావిన్సులలో ఎక్కువ మంది హిందువులు కేంద్రీకృతమై ఉండటంతో, ఆఫ్ఘన్ హిందూ జనాభా 1970లలో 80,000 - 2,80,000 మధ్య ఉన్నట్లు అంచనాలు వేసారు.[3][6][41][42] చరిత్రకారుడు ఇందర్‌జీత్ సింగ్, పోర్సేష్ రీసెర్చ్ అండ్ స్టడీస్ ఆర్గనైజేతో్పనిచేసిన తో ఎహ్సాన్ షా్, గఆయు ఆఫ్ఘన్ సిక్కు పౌర హక్కులకు చెందిన రవైల్ సిఈ స్వతంత్ర ంంచనాలు వేసా్్త.
1979 ఆఫ్ఘన్ అంతర్యుద్ధం తర్వాత 1980 లలో తాలిబాన్‌లు అధికారంలోకి రావడం, అప్పుడు జరిగిన మతపరమైన హింస, వివక్షల కారణంగా హిందువులు సిక్కుల జనాభా చాలా వేగంగా పడిపోయింది. వారు ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇతర దేశాలకు వలసపోయారు.[46] నిరంతరం పెరుతున్న ఇస్లామీకరణ, తాలిబాన్ తిరుగుబాటు కూడా డయాస్పోరాలో పెరుగుదలకు దోహదపడ్డాయి.[47] ముఖ్యంగా పష్టున్లు ఎక్ల్కువగా ఉన్న ప్రాంతాల్లో క్షీణత కనిపించింది. -పష్తూనిస్తాన్ ఉద్యమం, పష్టూన్ జాతీయవాదం దీనికి కారణం,[48] ఆఫ్ఘన్ హిందూమత జనాభా 2009 నాటికి 3,000 కు పడిపోయింది.[41]
2017 డేటా ప్రకారం, గత 3 దశాబ్దాలలో 99% పైగా ఆఫ్ఘన్ సిక్కులు, హిందువులు దేశం విడిచిపెట్టారు.[42] చాలా మంది ఆఫ్ఘన్ హిందువులు, సిక్కులు జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, బెల్జియం, నెదర్లాండ్స్ తదితర దేశాలలో స్థిరపడ్డారు.[3]
ఆఫ్ఘనిస్తాన్‌లో హిందూ జనాభా 2020 లో సుమారు 50 కి పడిపోయింది.[3] తరువాత, 2021లో కాబూల్ పతనం తరువాత, దేశం తాలిబాన్ స్వాధీనమై పోవడంతో భారత ప్రభుత్వం చాలా మంది సిక్కులు, హిందువులను దేశం నుండి ఖాళీ చేయించింది. ఫలితంగా, ఈ రోజున దేశంలో ఒక హిందూ పూజారి మాత్రమే మిగిలి ఉన్నాడు. అతనే ఆలయానికి గార్డుగా కూడా వ్యవహరిస్తున్నాడు.[49]
జనాభా శాస్త్రం
[మార్చు]చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
2005 | 79,521 | — |
2010 | 10,000 | −87.4% |
2015 | 3,440 | −65.6% |
2020 | 50 | −98.5% |
సంవత్సరం | శాతం | పెంచు |
---|---|---|
2005 | 0.35% | - |
2010 | 0.03% | -0.32 |
2015 | 0.01% | -0.02% |
2020 | 0.0001% | -0.0099% |
పురాతన హిందూ దేవాలయాలు
[మార్చు]స్థలం | వివరణ | ఇతర సమాచారం | Ref. |
---|---|---|---|
పోలుషా | బీమా దేవి (దుర్గ), మహేశ్వరుని ఆలయం | జువాన్‌జాంగ్ సందర్శించారు | [50] |
సకవాండ్ | సునాకు అంకితం చేయబడిన ఆలయం | [51][52] | |
అసమాయి ఆలయం | అసమై దేవాలయం సెంట్రల్ కాబూల్ కొండ కోహ్-ఇ అసమై పాదాల వద్ద ఉంది | [53] | |
భైరో దేవాలయం | షోర్ బజార్ | [54] | |
మంగళద్వార్ మందిర్ | [55] |
మూలాలు
[మార్చు]- ↑ Country Policy and Information Note: Afghanistan: Hindus and Sikhs (PDF). Home Office, United Kingdom (Report). 6.0. March 2021. p. 15. Retrieved 17 May 2021.
- ↑ Singh, Manpreet (22 August 2014). "Dark days continue for Sikhs and Hindus in Afghanistan". Hindustan Times. Retrieved 2021-02-13.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 Goyal, Divya (28 July 2020). "Sikhs and Hindus of Afghanistan — how many remain, why they want to leave". The Indian Express.
- ↑ Ali, Tariq (2003). The clash of fundamentalisms: crusades, jihads and modernity. Verso. p. 20. ISBN 978-1-85984-457-1. Retrieved 20 April 2008.
The friends from Peshawar would speak of Hindu and Sikh Pashtuns who had migrated to India. In the tribal areas – the no man's land between Afghanistan and Pakistan – quite a few Hindus stayed on and were protected by the tribal codes. The same was true in Afghanistan itself (till the mujahidin and the Taliban arrived).
- ↑ Wink, André (2002). Al-Hind, the Making of the Indo-Islamic World: Early Medieval India and the Expansion of Islam 7Th-11th Centuries (in ఇంగ్లీష్). BRILL. ISBN 978-0-391-04173-8.
- ↑ 6.0 6.1 6.2 Ruchi Kumar (19 October 2017). "Afghan Hindus and Sikhs celebrate Diwali without 'pomp and splendour' amid fear". Archived from the original on 26 October 2017. Retrieved 6 July 2021.
- ↑ Bagchi, Joymala. "Sikh Afghan Nationals Narrate Their Stories Of Fear, Suppression And Anxiety Faced In Kabul". businessworld.in. Retrieved 2020-07-27.
- ↑ Minahan, James B. (10 February 2014). Ethnic Groups of North, East, and Central Asia: An Encyclopedia (in English). ABC-CLIO. p. 217. ISBN 9781610690188.
Historically, north and east Afghanistan was considered part of the Indian cultural and religious sphere. Early accounts of the region mention the Pashayi as living in a region producing rice and sugarcane, with many wooded areas. Many of the people of the region were Buddhists, though small groups of Hindus and others with tribal religions were noted.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Weekes, Richard V. (1984). Muslim peoples: a world ethnographic survey (in English). Greenwood Publishing Group. p. 601. ISBN 9780313233920.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Khanam, R. (2005). Encyclopaedic ethnography of Middle-East and Central Asia (in English). Global Vision Publishing House. p. 631. ISBN 9788182200654.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "The Pashayi of Afghanistan" (in English). Bethany World Prayer Center. 1997. Retrieved 11 April 2019.
Before their conversion to Islam, the Pashayi followed a religion that was probably a corrupt form of Hinduism and Buddhism. Today, they are Sunni (orthodox) Muslims of the Hanafite sect.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Richard F. Strand (31 December 2005). "Richard Strand's Nuristân Site: Peoples and Languages of Nuristan". nuristan.info. Archived from the original on 1 April 2019. Retrieved 19 January 2012.
- ↑ Nancy Hatch Dupree / Aḥmad ʻAlī Kuhzād (1972). "An Historical Guide to Kabul – The Name". American International School of Kabul. Archived from the original on 30 August 2010. Retrieved September 18, 2010.
- ↑ 14.0 14.1 "Chinese Travelers in Afghanistan". Abdul Hai Habibi. alamahabibi.com. 1969. Retrieved August 9, 2012.
- ↑ André Wink, Al-Hind: The Making of the Indo-Islamic World, Brill 1990. p 120
- ↑ by Willem Vogelsang, Edition: illustrated Published by Wiley-Blackwell, 2002 Page 188
- ↑ Mehrafarin, Reza; Haji, Seyyed Rasool Mousavi (2010). "In Search of Ram Shahrestan The Capital of the Sistan Province in the Sassanid Era". Central Asiatic Journal. 54 (2): 256–272. ISSN 0008-9192. JSTOR 41928560.
- ↑ Hutchinson's story of the nations, containing the Egyptians, the Chinese, India, the Babylonian nation, the Hittites, the Assyrians, the Phoenicians and the Carthaginians, the Phrygians, the Lydians, and other nations of Asia Minor. London, Hutchinson. p. 150.
- ↑ Afghanistan: A New History, by Martin Ewans Edition: 2, illustrated Published by Routledge, 2002 Page 15 ISBN 0-415-29826-1, ISBN 978-0-415-29826-1
- ↑ Romila Thapar (2005). Somanatha: The Many Voices of a History. Verso. p. 40. ISBN 9781844670208.
- ↑ Christoph Witzenrath (2016). Eurasian Slavery, Ransom and Abolition in World History, 1200-1860. Routledge. p. 45. ISBN 978-1-317-14002-3.
Ibn Battuta, the renowned Moroccan fourteenth century world traveller remarked in a spine-chilling passage that Hindu Kush means slayer of the Indians, because the slave boys and girls who are brought from India die there in large numbers as a result of the extreme cold and the quantity of snow.
- ↑ Majumder, Sanjoy (2003-09-25). "Sikhs struggle in Afghanistan". BBC. Retrieved 2009-12-17.
- ↑ Cross, Tony (14 November 2009). "Sikhs struggle for recognition in the Islamic republic". Radio France Internationale www1.rfi.fr. Retrieved 13 February 2021.
- ↑ "Hindki". Encyclopædia Britannica Eleventh Edition. Archived from the original on 2010-08-11. Retrieved 2007-09-15.
- ↑ Afghanistan's loya jirga BBC 0- June 7, 2002
- ↑ "Karzai's Hindu Afghan serves his country". The New Indian Express. Retrieved 2021-02-13.
- ↑ Taliban to mark Afghan Hindus Archived 2007-02-21 at the Wayback Machine, CNN
- ↑ Taliban: Hindus Must Wear Identity Labels, People's Daily
- ↑ "U.S. House condemns Taliban over Hindu badges – WWRN – World-wide Religious News". Retrieved 31 March 2017.
- ↑ "ForAmerica President Brent Bozell and FNC's Megyn Kelly Discuss Eric Cantor's Primary Loss". 12 June 2014. Archived from the original on 5 November 2016. Retrieved 31 March 2017.
- ↑ "rediff.com US edition: US lawmakers say 'We are Hindus'". Retrieved 31 March 2017.
- ↑ "Afghanistan News Center". Archived from the original on 2 ఏప్రిల్ 2012. Retrieved 31 March 2017.
- ↑ US Lawmakers Condemn Taliban Treatment Of Hindus Archived 2008-05-25 at the Wayback Machine, CNSnews.com
- ↑ Immigrant Hinduism in Germany: Tamils from Sri Lanka and Their Temples Archived 2012-10-15 at the Wayback Machine, pluralism.org
- ↑ "We condemn the discrimination against Sikhs and Hindus of Afghanistan". Kabul Press. Retrieved 12 May 2015.
- ↑ "'Accident...' will show another side of me: Celina". The Indian Express. 26 December 2009. Retrieved 17 February 2010.
Jaitley, born in Kabul
- ↑ "India in vogue, Vogue in India". Telegraphindia.com. 2007-09-09. Archived from the original on 25 October 2012. Retrieved 2011-08-29.
- ↑ "History Beckons Celina". The Times of India. 8 November 2006. Retrieved 17 February 2010.
I was born in Kabul
- ↑ de Croisset, Phoebe (December 16, 2016). "Multiple Identities". SBJCT Journal. Retrieved March 5, 2021.
I am an Indian-Russian-Afghan-American
- ↑ Masih, Archana (January 27, 2015). "Nina! The 'spy' with designs on India". Rediff.com. Retrieved March 5, 2021.
- ↑ 41.0 41.1 41.2 Ruchi Kumar (1 January 2017). "The decline of Afghanistan's Hindu and Sikh communities". Al Jazeera.
- ↑ 42.0 42.1 42.2 "Nearly 99% Of Hindus, Sikhs Left Afghanistan in Last Three decades". TOLOnews (in ఇంగ్లీష్). Retrieved 2021-02-13.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Mitgliederzahlen: Hinduismus – REMID – Religionswissenschaftlicher Medien- und Informationsdienst e.
- ↑ "Afghans in New York Metro Area"[permanent dead link].
- ↑ "Edward Snowden: the whistleblower behind the NSA surveillance revelations | US news".
- ↑ KABIR, NAHID A. (2005). "The Economic Plight of the Afghans in Australia, 1860—2000". Islamic Studies. 44 (2): 229–250. ISSN 0578-8072. JSTOR 20838963.
- ↑ Service, Tribune News. "Facing Islamic State, last embattled Sikhs, Hindus leave Afghanistan". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2021-02-13.
- ↑ "Hindus in Afghanistan Archives". Hindu Council of Australia (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-01-22. Retrieved 2021-02-13.
- ↑ "Last Hindu priest refuses to abandon Afghanistan ancestral temple, says 'will consider it Seva even if Taliban kills me'". Zee News (in ఇంగ్లీష్). 2021-08-17. Retrieved 2021-11-03.
- ↑ Dutt, R. C. (1995). The Civilization of India (in ఇంగ్లీష్). Asian Educational Services. pp. 107–109. ISBN 978-81-206-1108-5.
- ↑ Gupta, Parmanand (1977). Geographical Names in Ancient Indian Inscriptions (in English). Concept Publishing Company. p. 53.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ The Journal of the Bihar Research Society, Volumes 47-49 (in English). Bihar and Orissa Research Society. 1961. p. 83.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "The lost Sun Temple of Multan in Pakistan". Retrieved 2021-02-20.
- ↑ Hindu Castes and Sects, by Jogendra Nath Bhattacharya, Published by Editors Indian, Calcutta, 1968- page 470.
- ↑ Tate 1911, p. 198.
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు
- CS1 maint: unrecognized language
- CS1 maint: url-status
- All articles with dead external links
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- Articles using infobox ethnic group with image parameters
- దేశాల వారీగా హిందూమతం
- ఆఫ్ఘనిస్తాన్
- మూలాల లోపాలున్న పేజీలు
- Pages with reference errors that trigger visual diffs