Jump to content

అమ్మకోసం

వికీపీడియా నుండి
అమ్మకోసం
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.వి.ప్రసాద్
నిర్మాణం చిన్నారావు
(పి. ఆదినారాయణరావు, అంజలీదేవి కుమారుడు)
తారాగణం అంజలీదేవి,
కృష్ణ,
కృష్ణంరాజు,
విజయనిర్మల,
రేఖ
సంగీతం పి. ఆదినారాయణరావు
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల,
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ చిన్ని బ్రదర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అమ్మకోసం 1970 మార్చి 26న విడుదలైన తెలుగు సినిమా. బి వి ప్రసాద్ దర్శకత్వంలో , అంజలీ దేవి, కృష్ణ, విజయ నిర్మల, కృష్ణంరాజు, రేఖ,ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం పి ఆదినారాయణరావు అందించారు.

సాంకేతికవర్గం

[మార్చు]

తారాగణం

[మార్చు]

ధనవంతుడు ధర్మారావు కుమారుడు రఘుబాబు. కోడలు భారతి. రఘు, భారతిలకు వివాహానికి ముందే కలిగిన బాబుని భారతి తండ్రి సోమయ్య వద్ద ఉంచుతాడు. రఘుబాబు ఓ పెద్ద భవంతి నిర్మిస్తాడు. ఆ సమయంలో తన బాబుకోసం భారతి ఆరాటపడుతుంది. ఈలోపు సోమయ్య తాగుడు మైకంలో బాబును రూ. 3లకు అమ్మేశాడనే విషయం భార్యకు తెలియచేస్తాడు. ఈ వార్త విని భారతి కృంగిపోతుంది. తరువాత వారికి మరొక బాబు చిన్ని పుడతాడు. ఈలోపు వారి పెద్ద కొడుకు అనుకోని పరిస్థితుల్లో అనాథగా వారింట ఆశ్రయం పొందుతాడు. కంట్రాక్టర్ భుజంగరావు, కళావతి అనే నర్తకిని హత్యచేసి, ఆ హత్యానేరం రఘుబాబు, వారి కుమారుడు గంగూలపై నెట్టడంతో వారిరువురూ జైలుకెళ్తారు. ఈ కుట్రవలన మామగారిని, ఆస్తిని పొగొట్టుకున్న భారతి చిన్నకొడుకు ఆనంద్‌తో తండ్రి వూరువెళ్లి కష్టనష్టాలకోర్చి అతన్ని చదివించి పోలీస్ ఆఫీసర్‌ని చేస్తుంది. బోస్టన్ స్కూల్‌లో చదివి శిక్ష పూర్తి చేసుకుని వచ్చిన గంగూ భుజంగరావును అంతంచేసి తండ్రిని విడిపించాలని ఓ గుంపుతో సావాసం చేస్తాడు. అక్కడ ముఠా నాయకుని కుమార్తె గౌరి ప్రేమ పొందుతాడు. ఆనంద్, భుజంగరావు గుట్టు ఛేదించాలని ప్రయత్నించటం, భుజంగరావు కూతురు గీత అతన్ని ప్రేమించటం జరుగుతుంది. గంగూను పట్టాలని ఆనంద్ ప్రయత్నించటం, అతన్ని అంతంచేయాలని గంగూ ప్రయత్నంచేయగా, గంగూ తన పెద్దకొడుకని గ్రహించిన భారతి, వారిద్దరిమధ్య సన్నిహిత్యానికి ఆశపడుతుంది. గంగూ గు���ించి నిజం తెలిసిన ఆనంద్, అన్నను అరెస్ట్ చేయడం, భుజంగరావుకు శిక్షపడటం జరుగుతుంది. గంగూ, రఘుబాబు జైలునుండి విడుదలై భారతిని గౌరిని, గీతలను కలుసుకోవటం చిత్రం శుభంగా ముగుస్తుంది.[1]

పాటలు

[మార్చు]
  1. పాపికొండలకాడ పాలమబ్బుల నీడ గానం: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రచన: సినారె
  2. అదే అదే.. పదే పదే ప్రియా గానం: పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి రచన: సినారె
  3. ఈ లోయలోన ఈ పాయలోనా గానం: పి.సుశీల, రచన: సినారె
  4. రేపు వత్తువుగాని గానం: పి.సుశీల, రచన: సీ నారాయణ రెడ్డి
  5. అందాలవలపు జంట కలలపంట గానం: ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం, రచన: ఆరుద్ర
  6. గువ్వలా ఎగిరిపోవాలి ఆ తల్లి గూటికే గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రచన: సినారె.
  7. ఏమాయే ఏమాయే నీదైవం . ఘంటసాల.రచన: సి.నారాయణ రెడ్డి.

మూలాలు

[మార్చు]
  1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (14 March 2020). "ఫ్లాష్ బ్యాక్ @ 50 అమ్మకోసం". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 5 జూన్ 2020. Retrieved 10 June 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అమ్మకోసం&oldid=4209320" నుండి వెలికితీశారు