బేరింగ్ జలసంధి

ఆసియా, ఉత్తర అమెరికాల మధ్య ఉన్న జలసంధి

బేరింగ్ జలసంధి పసిఫిక్, ఆర్కిటిక్ మహాసముద్రాల మధ్య ఉన్న జలసంధి. ఇది రష్యా తూర్పు కొసన ఉన్న చుక్చి ద్వీపకల్పాన్ని, అమెరికా అలాస్కాలోని సెవార్డ్ ద్వీపకల్పాన్నీ వేరు చేస్తుంది. ప్రస్తుత రష్యా - యునైటెడ్ స్టేట్స్ సముద్ర సరిహద్దు ఆర్కిటిక్ సర్కిల్‌కు కొంచెం దక్షిణంగా, 168° 58' 37" W రేఖాంశం, 65° 40' N అక్షాంశం వద్ద ఉంది. రష్యన్ సామ్రాజ్యంలో పనిచేసిన డానిష్ అన్వేషకుడు వైటస్ బేరింగ్ పేరు మీద జలసంధి పేరు పెట్టారు.

బేరింగ్ జలసంధి
బేరింగ్ జలసంధి ఉపగ్రహ ఫొటో
బేరింగ్ జలసంధి is located in Alaska
బేరింగ్ జలసంధి
బేరింగ్ జలసంధి
Nautical chart of the Bering Strait
ప్రదేశంఆసియా, ఉత్తర అమెరికా
అక్షాంశ,రేఖాంశాలు66°30′N 169°0′W / 66.500°N 169.000°W / 66.500; -169.000
ప్రవహించే దేశాలురష్యా, అమెరికా
కనిష్ట వెడల్పు83 కి.మీ. (52 మై.)
సరాసరి లోతు−50 మీ. (−160 అ.)
ద్వీపములుడయోమీడ్ దీవులు

మంచుయుగపు గ్లేసియేషను కాలంలో సముద్ర మట్టాలు తగ్గినపుడు బేరింగ్ జలసంధి వద్ద మట్టం తగ్గిపోయి, విస్తృతమైన సముద్రపు అడుగున ఉన్న నేల బయటపడి, ఆసియా ఉత్తర అమెరికా ఖండాల మధ్య బేరింగియా అనే భూ వంతెన ఏర్పడింది. దాని మీదుగా ఆసియా నుండి ఉత్తర అమెరికాకు మానవులు వలస వెళ్ళారు అనేది శాస్త్రీయ సిద్ధాంతం. [1] ఇలా సముద్ర మట్టం తగ్గడం ప్రస్తుత జలసంధి ఎండిపోవడమే కాక, దానికి ఉత్తరాన, దక్షిణాన ఉన్న నీటి లోతు తగ్గిపోయింది. పాలియో-ఇండియన్లు అమెరికాలోకి ఎలా ప్రవేశించారనే దానిపై ఈ సిద్ధాంతం అనేక దశాబ్దాలుగా ప్రబలంగా ఉంది, అత్యంత ఆమోదం పొందింది కూడాను. పడవను ఉపయోగించకుండా దాటడం కనీసం 20వ శతాబ్దం ప్రారంభం నుండి చాలాసార్లు నమోదైంది.

సాహసయాత్రలు

మార్చు
 
డిఫెన్స్ మ్యాపింగ్ ఏజెన్సీ టోపోగ్రాఫికల్ మ్యాప్ ఆఫ్ ది బేరింగ్ స్ట్రెయిట్, 1973

కనీసం 1562 నుండి, యూరోపియన్ భౌగోళిక శాస్త్రవేత్తలు ఆసియా, ఉత్తర అమెరికాల మధ్య అనియాన్ జలసంధి ఉందని భావించారు. 1648లో, సెమియోన్ డెజ్నియోవ్ బహుశా ��లసంధి గుండా ప్రయాణించాడు గానీ, అతని నివేదిక ఐరోపాకు చేరుకోలేదు. డెన్మార్కులో జన్మించిన రష్యన్ నావిగేటర్ వైటస్ బేరింగ్ 1728 లో జలసంధిలో ప్రవేశించాడు. 1732లో, మిఖాయిల్ గ్వోజ్‌దేవ్ మొదటిసారిగా దాన్ని దాటి ఆసియా నుండి అమెరికా వరకు దాటాడు. 1778 లో జేమ్స్ కుక్ మూడవ సముద్రయానంలో దీనిని సందర్శించాడు.

అమెరికా నౌకలు 1847 నాటికి జలసంధిలో బోహెడ్ [2] తిమింగలాల కోసం వేటాడాయి. .

1913 మార్చిలో, కెప్టెన్ మాక్స్ గాట్‌స్చాక్ (జర్మన్) సైబీరియా తూర్పు అగ్రం నుండి అలాస్కాలోని షిష్మారెఫ్ వరకు లిటిల్, బిగ్ డయోమెడ్ దీవుల మీదుగా కుక్కలు లాగే స్లెడ్జి బండి మీద వెళ్ళాడు. పడవను ఉపయోగించకుండా రష్యా నుండి ఉత్తర అమెరికాకు ప్రయాణించిన మొట్టమొదటి ఆధునిక యాత్రికుడు అతడు. [3]

1987లో ఈతగాడు లిన్నే కాక్స్ అలస్కా లోని డయోమెడ్ దీవుల నుండి సోవియట్ యూనియన్ వరకు ఉన్న 4.3 కి.మీ. దూరాన్ని 3.3 °C (37.9 °F) నీటిలో ఈదింది. [4] [5] అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, సోవియట్ నాయకుడు మిఖాయిల్ గోర్బచెవ్ సంయుక్తంగా ఆమెను అభినందించారు. [4]

1989 జూన్, జూలైల్లో, మూడు స్వతంత్ర బృందాలు ఆధునిక సముద్ర-కయాక్ లో బేరింగ్ జలసంధిని మొదటి సారి దాటేందుకు ప్రయత్నించాయి. ఏడుగురు అలస్కన్లు, వారు తమ ప్రయత్నాన్ని పాడ్లింగ్ ఇంటు టుమారో (అంటే అంతర్జాతీయ తేదీ రేఖను దాటడం) అని పిలిచారు; నలుగురు వ్యక్తుల బ్రిటీష్ యాత్ర, బేరింగ్ జలసంధిలో కయాక్స్ ; జిమ్ నోయెస్ నేతృత్వంలో ముగ్గురు వ్యక్తుల బైదార్కాలో కాలిఫోర్నియా బృందం ఇలా ప్రయత్నించాయి. [6] [7]

2006 మార్చిలో, బ్రిటన్ కార్ల్ బుష్బీ, ఫ్రెంచ్-అమెరికన్ సాహసికుడు డిమిత్రి కీఫెర్ జలసంధి లోని గడ్డకట్టిన 90 కి.మీ. భాగాన్ని కాలినడకన 15 రోజుల్లో దాటారు. [8] సరిహద్దు నియంత్రణ ద్వారా కాకుండా రష్యాలోకి ప్రవేశించనందుకు వారిని అరెస్టు చేశారు. [9]

2008 ఆగష్టులో ఉభయచర వాహనాన్ని ఉపయోగించి బెరింగ్ జలసంధిని మొదటిసారి దాటారు. ప్రత్యేకంగా మార్పులు చేసిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 ని స్టీవ్ బర్గెస్, డాన్ ఎవాన్స్ లు తమ రెండవ ప్రయత్నంలో ఇలా దాటారు. ప్రతికూల వాతావరణం వలన వారి మొదటియాత్రకు అంతరాయం కలిగింది. [10]

2012 ఫిబ్రవరిలో, హాంగ్ సంగ్-టేక్ నేతృత్వంలోని కొరియా బృందం ఆరు రోజుల్లో కాలినడకన జలసంధిని దాటింది. వారు ఫిబ్రవరి 23న రష్యా తూర్పు తీరంలోని చుకోట్కా ద్వీపకల్పం నుండి బయలుదేరి ఫిబ్రవరి 29న అలాస్కాలోని పశ్చిమ తీర పట్టణమైన వేల్స్‌కు చేరుకున్నారు. [11]

2012 జూలైలో, "డేంజరస్ వాటర్స్" అనే రియాలిటీ అడ్వెంచర్ షోతో సంబంధం ఉన్న ఆరుగురు సాహసికులు సీ-డూస్‌లో దాటారు. అయితే వారిని అరెస్టు చేసారు. చుకోట్స్కీ జిల్లాపరిపాలనా కేంద్రమైన లావ్రేంటియాలో కొంతకాలం నిర్బంధించిన తర్వాత వారిని సీ-డూస్‌లో అలాస్కాకు తిరిగి పంపించారు. వారికి మంచి చికిత్స అందించారు. గ్రామం లోని మ్యూజియంను సందర్శింపజేసారు. కానీ పసిఫిక్ తీరం వెంబడి దక్షిణాన కొనసాగడానికి అనుమతించలేదు. వారికి వీసాలు ఉన్నాయి గానీ, బేరింగ్ జలసంధి పశ్చిమ తీరం మూసివేయబడిన మిలిటరీ జోన్ కావడం వలన వారిని అరెస్టు చేసారు. [12]

2013 ఆగస్ట్ 4 - 10 మధ్య, 17 దేశాల నుండి 65 మంది ఈతగాళ్ల బృందం బేరింగ్ జలసంధి మీదుగా రిలే ఈత కొట్టింది. ఇది చరిత్రలో మొదటి ఈత. వారు రష్యాలోని కేప్ డెజ్నెవ్ నుండి యునైటెడ్ స్టేట్స్‌లోని కేప్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ (సుమారు 110 కి.మీ.) వరకు ఈదారు. [13] [14] వారికి రష్యన్ నావికాదళం మద్దతు నిచ్చింది.

ప్రతిపాదిత క్రాసింగ్

మార్చు

1864లో ఒక రష్యన్-అమెరికన్ టెలిగ్రాఫ్ కంపెనీ తూర్పున యూరప్‌ను అమెరికాలనూ కలుపుతూ ఒక టెలిగ్రాఫ్ లైన్ వేసేందుకు సన్నాహాలు ప్రారంభించినప్పుడు బేరింగ్ జలసంధి ద్వారా ఆసియా, ఉత్తర అమెరికాల మధ్య భౌతిక సంబంధం ఏర్పడడం దాదాపుగా వాస్తవమైంది. అయితే సముద్రగర్భంలో అట్లాంటిక్ కేబుల్ వేయడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు.

1906లో ఫ్రెంచ్ ఇంజనీర్ బారన్ లొయిక్ డి లోబెల్ తూర్పు రష్యా నుండి అలాస్కా వరకు వంతెన-సొరంగం లింక్ కోసం తదుపరి ప్రతిపాదన చేసాడు. రష్యాకు చెందిన జార్ నికోలస్ II ట్రాన్స్-సైబీరియన్ అలాస్కా రైల్‌రోడ్ ప్రాజెక్ట్‌పై పనిని ప్రారంభించడానికి డి లోబెల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఫ్రాంకో-అమెరికన్ సిండికేట్‌కు అధికారం ఇస్తూ ఒక ఉత్తర్వును జారీ చేశాడు. అయితే ఆ పని మొదలే కాలేదు. [15] [16]

అలాస్కా, సైబీరియా మధ్య బేరింగ్ జలసంధి వంతెనను నిర్మించేందుకు సూచనలు వచ్చాయి. అపూర్వమైన ఇంజనీరింగ్, రాజకీయ, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, రష్యా 2011 ఆగస్టులో US$65-బిలియన్ల TKM-వరల్డ్ లింక్ టన్నెల్ ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపింది. పూర్తయితే, ఈ 103 కి.మీ. సొరంగం ప్రపంచంలోనే అతి పొడవైనది అయ్యేది. [17] చైనా "చైనా-రష్యా-కెనడా-అమెరికా" రైల్‌రోడ్ మార్గాన్ని నిర్మించాలని భావించింది. బేరింగ్ జలసంధిని దాటుతూ 200 కి.మీ. సముద్రాంతర్గత సొరంగం ఇందులో భాగంగా ఉంటుంది. [18]

ప్రతిపాదిత ఆనకట్ట

మార్చు

ఆర్కిటిక్ మహాసముద్రాన్ని వేడి చేసి, అందులోని మంచు గడ్డలను కరిగించడానికి ఒక సంయుక్త ప్రాజెక్టును 1956లో, సోవియట్ యూనియన్ అమెరికాకు ప్రతిపాదించింది. పీటర్ బోరిసోవ్ ప్రణాళిక ప్రకారం, ఈ ప్రాజెక్టులో బేరింగ్ జలసంధికి అడ్డంగా 90 కి.మ��. వెడల్పున ఆనకట్ట కట్టే ప్రతిపాదన ఉంది. ఇది చల్లని పసిఫిక్ ప్రవాహాన్ని ఆర్కిటిక్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఆర్కిటిక్‌ లోని తక్కువ లవణీయత కలిగిన చల్లని ఉపరితల నీటిని ఆనకట్ట మీదుగా పసిఫిక్‌ లోకి పంపింగ్ చేయడం ద్వారా, అలా తొలగించిన నీటి స్థానంలోకి అట్లాంటిక్ మహాసముద్రం నుండి వెచ్చని, అధిక లవణీయత కలిగిన సముద్రపు నీరు ఆర్కిటిక్ మహాసముద్రంలోకి ప్రవహిస్తుంది. [19] [20] [21] అయితే, జాతీయ భద్రతా సమస్యలను ఉటంకిస్తూ, CIA, FBI నిపుణులు సోవియట్ ప్రణాళికను వ్యతిరేకించారు. ప్రణాళిక సాధ్యమే గానీ, అది NORAD కు ముప్పు తెస్తుందనీ, అందువల్ల ఎంతో ఖర్చు పెడితే తప్ప ఆనకట్టను నిర్మించలేమనీ వాదించారు. [22] సోవియట్ శాస్త్రవేత్త డి.ఎ. డ్రొగేట్సేవ్ కూడా ఈ ఆలోచనను వ్యతిరేకించాడు. ఆనకట్టకు ఉత్తరాన ఉన్న సముద్రం, సైబీరియాలో ఉత్తరాన ప్రవహించే నదులు సంవత్సరం పొడవునా ప్రయాణించలేనివిగా మారుతాయనీ, గోబీ, ఇతర ఎడారులు ఉత్తర సైబీరియా తీరప్రాంతం వరకు విస్తరిస్తాయనీ అతను పేర్కొన్నాడు. [19]

సెయింట్ లారెన్స్ ద్వీపం, సెవార్డ్, చుకోత్స్కీ ద్వీపకల్పాల లోని కొంత భాగాలను తొలిచి బేరింగ్ జలసంధిని విస్తరించాలని గతంలో అమెరికన్ చార్లెస్ పి. స్టెయిన్‌మెట్జ్ (1865-1923) ప్రతిపాదించాడు. 320 కి.మీ. వెడల్పున ఉండే జలసంధి గుండా జపాన్ ప్రవాహం వచ్చి ఆర్కిటిక్ మహాసముద్రాన్ని కరిగిస్తుంది. [19]

21వ శతాబ్దంలో, 300 కి.మీ. వెడలపైన ఆనకట్టను కూడా ప్రతిపాదించారు. అయితే, గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా ఆర్కిటిక్ మంచు పలకలను సంరక్షించడం ఈ ప్రతిపాదన లక్ష్యం. [23]

మూలాలు

మార్చు
  1. Beck, Roger B.; Linda Black; Larry S. Krieger; Phillip C. Naylor; Dahia Ibo Shabaka (1999). World History: Patterns of Interaction. Evanston, IL: McDougal Littell. ISBN 978-0-395-87274-1.
  2. Willian John Dakin (1938), Whalemen Adventures, Sydney, Angus & Robertson, p.127.
  3. "The Victoria Advocate - Google News Archive Search". news.google.com.
  4. 4.0 4.1 Watts, Simon (2012-08-08). "Swim that broke Cold War ice curtain". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2021-03-08.
  5. "Swimming to Antarctica", CBS News, September 17, 2003
  6. "Soviet kayakers cross Bering Strait". UPI.
  7. "Curtain of Ice" – via www.imdb.com.
  8. "Epic explorer crosses frozen sea". BBC News. 3 April 2006. Retrieved 13 January 2012.
  9. "Epic explorer detained in Russia". BBC News. 4 April 2006. Retrieved 13 January 2012.
  10. "Cape to Cape Expedition". Retrieved 13 January 2012.
  11. The Korea Herald (March 2012). "Korean team crosses Bering Strait". koreaherald.com.
  12. Andrew Roth (July 11, 2012). "Journey by Sea Takes Awkward Turn in Russia". The New York Times. Retrieved July 12, 2012.
  13. "ТАСС: Спорт – На Аляске завершилась международная эстафета "моржей", переплывших Берингов пролив". ТАСС.
  14. "Bering Strait Swim – Russia to America". Facebook.
  15. "San Francisco to St Petersburg by Rail! If the Tunnel is driven under Bering Strait will Orient meet Occident with Smile – or with Sword?". San Francisco Call. September 2, 1906. Retrieved April 23, 2016.
  16. "FOR BERING STRAIT BRIDGE" (PDF). New York Times. August 2, 1906. Retrieved April 23, 2016.
  17. Halpin, Tony (2011-08-20). "Russia plans $65bn tunnel to America". The Sunday Times.
  18. Tharoor, Ishaan (2014-05-09). "China may build an undersea train to America". The Washington Post. Retrieved 2014-05-14.
  19. 19.0 19.1 19.2 Ley, Willy (June 1961). "The Strait Named After Vitus Bering". For Your Information. Galaxy Science Fiction. pp. 37–51.
  20. Fleming, James Rodger. "How the USSR Tried to Melt the Arctic". Archived from the original on 2017-10-23. Retrieved 2022-06-03.
  21. "The Soviet Scientist Who Dreamed of Melting the Arctic with a 55-Mile-Long Dam". 25 April 2013.
  22. "Ocean Dams Would Thaw North" Popular Mechanics, June 1956, p. 135.
  23. "Could a 300 km dam save the Arctic?".