విక్రం సారాభాయ్
విక్రం అంబాలాల్ సారాభాయి | |
---|---|
జననం | అహ్మదాబాదు, భారతదేశం | 1919 ఆగస్టు 12
మరణం | 1971 డిసెంబరు 30 కేరళ, తిరువనంతపురం లోని కోవలం | (వయసు 52)
నివాసం | భారత్ |
జాతీయత | భారతీయుడు |
రంగములు | భౌతిక శాస్త్రము |
వృత్తిసంస్థలు | ఇస్రో భౌతిక శాస్త్ర పరిశోధనశాల |
చదువుకున్న సంస్థలు | గుజరాత్ కాలేజి సెయింట్ జాన్ కళాశాల కేంబ్రిడ్జి, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం |
పరిశోధనా సలహాదారుడు(లు) | సి.వి.రామన్ |
ప్రసిద్ధి | భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ |
ముఖ్యమైన పురస్కారాలు | పద్మభూషణ్ (1966) పద్మవిభూషణ్ (మరణాంతరం) (1972) |
విక్రం అంబాలాల్ సారాభాయి (ఆగస్టు 12, 1919 – డిసెంబరు 30, 1971) భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు.
బాల్యము
[మార్చు]విక్రమ్ సారాభాయ్ బ్రిటీష్ ఇండియాలోని బొంబాయి ప్రావిన్సులోని (ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ఉంది) అహ్మదాబాద్‌లో 1919 ఆగస్టు 12న జన్మించాడు. అంబాలాల్ సారాబాయ్, సరళాదేవి (పూర్వనామం రేవా) అతని తల్లిదండ్రులు. వారి ఎనిమిదిమంది సంతానంలో విక్రమ్ ఒకడు.
వారిది సంపన్న వ్యాపారస్తుల కుటుంబం. విక్రమ్ తండ్రి అంబాలాల్ అహ్మదాబాద్‌లో పేరు పొందిన పారిశ్రామికవేత్త. అహ్మదాబాద్‌లో కాలికో మిల్లుతో ప్రారంభించిన అంబాలాల్‌కు బీహారులో పంచదార కర్మాగారం, తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) లో రైల్వే లైను, టిబెట్ నుంచి ఎద్దుల మీద జూలు దిగుమతి చేసే వ్యాపారం, తూర్పు ఆఫ్రికాలో పత్తి వడికే కర్మాగారం, లండన్‌లో కార్యాలయం వంటి ఎన్నో సంస్థలు, వ్యాపారాలు ఉండేవి. విక్రమ్ పుట్టేనాటికే అతని కుటుంబం అహ్మదాబాద్‌లోని అత్యంత సంపన్నులైన వర్తకులు ఉండే షాహిబాగ్ ప్రాంతంలో 21 ఎకరాల్లో విస్తరించిన "రిట్రీట్" అన్న బంగళాలో నివసించేవారు. విక్రమ్ సారాబాయ్ కుటుంబం దాసశ్రీ మాలి శాఖకు చెందిన జైనులు.
తన ఎనిమిది మంది పిల్లలను చదివించడానికి విక్రం సారాభ��యి తల్లి మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది. వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్‌లాల్ నెహ్రూ మొదలైన ఎంతో మంది ప్రముఖులు తరచూ వస్తూ ఉండేవారు. వీరు విక్రం సారాభాయ్ వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు.
విద్య
[మార్చు]విక్రమ్ తల్లి సరళాదేవి తన ఎనిమిదిమంది పిల్లల్ని చదివించేందుకు మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటుచేశారు. వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి తరచుగా మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్‌లాల్ నెహ్రూ... తదితర ముఖ్య నాయకులందరూ వస్తుండేవారు. వీరందరూ విక్రమ్ సారాభాయ్ వ్యక్తిత్త్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారనటంలో అతిశయోక్తి లేదు అహమ్మదాబాదులోని గుజరాత్ కళాశాలలో మెట్రిక్ విద్యను పూర్తి చేసుకున్న విక్రమ్ సారాభాయ్... తరువాత పై చదువుల కోసం ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 1940వ సంవత్సరంలో అక్కడ నాచురల్ సైన్సెస్‌లో, ట్రిపోస్‌లో ఉత్తీర్ణులయ్యారు.
ఇంగ్లాండులో విద్య
[మార్చు]ఆ సమయంలో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభం కావటంతో భారతదేశానికి తిరిగివచ్చిన విక్రమ్ సారాభాయ్... బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సర్ సీ.వీ.రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై పరిశోధన మొదలుపెట్టారు. తదనంతరం రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1945వ సంవత్సరంలో తిరిగీ కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లి పీహెచ్‌డీ పట్టాను సాధించుకుని 1947లో తిరిగి భారత్ చేరుకున్నారు. అహ్మదాబాదులోని గుజరాత్ కళాశాల నుంచి మెట్రిక్ పాసయ్యాడు. తరువాతి చదువుల కోసం ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. 1940లో అక్కడ నుంచి నాచురల్ సైన్సెస్ లో ట్రిపోస్ లో ఉత్తీర్ణుడయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం అప్పటికే ప్రారంభం అవడంతో భారతదేశానికి తిరిగి వచ్చి బెంగుళూరు లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సి.వి. రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపైన పరిశోధన మొదలుపెట్టాడు. రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత 1945లో తిరిగి కేంబ్రిడ్జి వెళ్ళి పీహెచ్‌డీ పట్టా 1947లో సాధించుకుని వచ్చాడు.
పరిశోధన
[మార్చు]1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు... భారత భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం గురించి ఎంతో విషయ సేకరణ చేయటమేగాకుండా, ఆ శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూకు వివరించి, ఆయనను ఒప్పించారు సారాభాయ్. ఆ తరువాత 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడయిన హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్) సెంటర్‌ను ఆయన ఏర్పాటు చేశారు. తదనంతరం ఆయన ఆదర్శాలకు అనుగుణంగా ఇస్రో ఎన్నో విజయాలను సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేసింది.
"భారత అంతరిక్ష రంగ పితామహుడు"గా కీర్తి గడించిన సారాభాయ్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 1962లో శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డుతో, 1966లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయంగానూ అర్థవంతమైన పాత్ర పోషించగలగాలంటే, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మానవ సమాజ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడంలో మనం ఎవరికీ తీసిపోకుండా ఉండాలని” చెప్పి, ఆ దిశగా కృషి చేసిన సారాభాయ్ 1971, డిసెంబరు 31వ తేదీన పరమపదించారు.
గ్రామీణ ప్రజల కోసం ఉపగ్రహాలను రూపొందించటం విక్రమ్ సారాభాయ్ వ్యూహంలో ప్రధానమైనదిగా ఉండేది. సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొని రావాలని, అప్పుడే మన దేశంలోని ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని సారాభాయ్ తోటి శాస్త్రవేత్తలను ప్రొత్సహించేవారు.
సహజ వనరుల వివరాలు సేకరించే పరిజ్ఞానాన్ని రూపొందించటం, రిమోట్ సెన్సింగ్‌కు అవసరమైన సాధనాలను ఏర్పాటు చేసుకోవటం అనేవి అందులో కీలక భాగాలు. ఈ రంగాలను ఎలా ఉపయోగించుకోవాలి? అంతరిక్షంలోకి మానవుల్ని ఏలా పంపాలి? సంప్రదాయపద్ధతిలో ఉన్న వ్యవస్థల్లోకి అంతరిక్ష వ్యవస్థను ఎలా కలపాలి? అన్న విషయాలన్నీ విక్రమ్ సారాభాయ్ వ్యూహాల్లో భాగాలుగా ఉండేవి.
కుటుంబం
[మార్చు]విక్రమ్ సారాభాయ్ కుటుంబం విషయానికి వస్తే...ఇతని భార్య మృణాలిని సారాభాయ్. ఆమె మంచి సాంప్రదాయ నర్తకి. అప్పట్లో వీరి పెళ్ళి చెన్నైలో జరిగింది. అయితే వీరి పెళ్ళికి విక్రం సారాభాయ్ తరపు బంధువులు అందరూ క్విట్ ఇండియా ఉద్యమంలో బిజీగా ఉండటంతో ఎవరూ హాజరుకాలేకపోయారు. వీరి కుమార్తె మల్లికా సారాభాయ్. ఈమె కూడా మంచి నర్తకి. కొడుకు కార్తికేయ.
బయటి లింకులు
[మార్చు]- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు
- 1919 జననాలు
- 1971 మరణాలు
- గుజరాత్ శాస్త్రవేత్తలు
- భౌతిక శాస్త్రవేత్తలు