పీచు
స్వరూపం
(నార నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
పీచు పదార్థం మన దైనందిక ఆహారంలో ఒక భాగముగా ఉండాలి. పీచు పదార్థం ముఖ్యంగా జీర్ణంకాని కార్బోహైడ్రేట్స్. ఇవి పాలిసాకరైడ్స్ పెక్టెన్, సెల్యులోజ్ వంటి పదార్థాలు. మన జీర్ణశయం జీర్ణించుకోలేని ఆహార పదార్ధాలను పీచు పదార్ధాలు అంటారు.
రకాలు
[మార్చు]పదార్ధాలలో ఉన్న పీచు పదార్థం రెండు రకాలుగా ఉంటుంది.
- కరిగే పీచు ఇది రక్తంలో కొవ్వును తగ్గిస్తుంది. తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశము తక్కువ చేయును. ఇవి గ్లూకోజ్ అబ్సార్ప్షన్ (glucose absorption) నెమ్మది చేయుటచేత రక్తములో సుగరు లెవల్ తగ్గును . ఉదా: ఓట్స్, ఓట్స్ తవుడు, బార్లీ, బ్రౌన్ రైస్, చిక్కుడు, పండ్లు, కాయకూరలు ఉదా: యాపిల్, ఆరెంజ్, కారెట్స్ మున్నగునవి
- కరగని పీచు పదార్ధము: దీనినే రఫేజ్ అని అంటారు. కడుపు నిండేందుకు ఉపయోగపడుతుంది. విరోచనము సాఫీగా జరుగును. ఉదా: తొక్కతీయని దాన్యాలు, అన్ని రకాల అపరాలు (చోళు, పెసలు, ఉలవలు) గోధుమ పొట్టు, జొన్న పొట్టు, పండ్లు తొక్కలు (outer peels), కాయల తొక్కలు,
పీచు వల్ల ఉపయోగాలు
[మార్చు]- మన పేగుల్ని ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గిస్తుంది. బరువు తగ్గించటంతో పాటు రక్తంలో గ్లూకోజ్ నిల్వల్నీ తగ్గిస్తుంది.
- పీచు పదార్ధాలు శరీరంలో జీర్నం కాకుండా, ఎక్కువ మలం తయారు కావటానికి దోహద పడతాయి.
- దీని వలన జీర్నాశయం అనవసరమైన పదార్ధాలను జీర్నించుకోదు.
- మల విసర్జన చాలా సులభంగా అవుతుంది.మల బద్దకం ఉన్న వారు పీచు పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి.
- మీరెంత ఖరీదైన ఆహారమైన తినండి. ఆ తిండిలో పీచు పదార్థం లేకపోతే జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేయదు. పేవులు శుభ్రం కావు
పీచు లభించే ఆహార పదార్థాలు
[మార్చు]- పీచుకోసం చిక్కుళ్లు, బీన్స్ వంటి కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యాలు, గోధుమలు, డ్రైఫ్రూట్స్ సమృద్ధిగా తీసుకోవాలి.
- ఆపిల్, జామ కాయ, అరటి పండు, ఆకు కూరలు, ఓట్స్ లలో పీచు పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి.
- సీజన్లో దొరికే ఆపిల్ను రోజుకొకటి తినండి. అందుబాటు ధరలో అద్భుతమైన పీచును అందించే పండు ఇది. ఒక ఆపిల్లో 4.4 గ్రాముల పీచు లభిస్తుంది.
- ముల్లంగికి ఉన్న ఫ్లేవర్ మరే కూరగాయకు రాదు. చాలామంది అయిష్టపడతారు కాని దీన్ని తింటే.. జీర్ణవ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది. తొమ్మిది అంగుళాల ముల్లంగిలో సుమారుగా 5.8 గ్రాముల పీచు దొరుకుతుంది.
- ఒకప్పుడు బ్రకోలి మన మార్కెట్లలో దొరికేది కాదు. ఇప్పుడు అన్ని నగరాల్లోని సూపర్మార్కెట్లలో బ్రకోలి దొరుకుతోంది. ఒక చిన్న కప్పు బ్రకోలి తింటే ఎన్నెన్నో లాభాలు. ఉడికించి తినడం ఇంకా మంచిది. ఒక కప్పు పరిమాణం తీసుకుంటే 2.4 గ్రాముల పీచు శరీరానికి అందించినట్లే!
- తక్కువ ధరకు దొరికే క్యాబేజిని సలాడ్లు, వేపుళ్లులలో విరివిగా వాడొచ్చు. శరీరంలోని క్యాన్సర్ కారకాలను నిరోధించే శక్తి క్యాబేజికి ఉంది. ఇందులో ఒక పొర ఆకులో 0.5 గ్రాముల పైబర్ ఉంటుంది.
- పచ్చిదైన, ఉడికించినదైన క్యారెట్ రుచే రుచి. ధర కాస్త ఎక్కువైన రెగ్యులర్గా తినాలి. ఎందుకంటే వంద గ్రాముల పచ్చి క్యారెట్లో 2.9 గ్రాముల పైబర్ ఉంటుంది. అదే ఉడికిస్తే ఆరు గ్రాముల పైబర్ తగ్గుతుంది.
- తెలుగువాళ్లు ఇష్టపడే ఆకుకూర పాలకూర. అందులో విటమిన్లు, ఖనిజాలు బోలెడు. కేవలం పప్పులోకే కాకుండా మిగిలిన కూరల్లోకి దీన్ని వాడొచ్చు. ఒక కట్ట పాలకూరలో కనీసం 7.5 గ్రాముల పీచు దొరుకు తుంది.
- తృణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ మంచిది. పొద్దున్నే అల్పాహారంగా ఉడికించిన గుడ్డు (ఓన్లీ వైట్) తోపాటు తీసుకోవచ్చు. మధ్యాహ్నపూట స్నాక్స్గాను వాడొచ్చు. దీనివల్ల కావాల్సినంత పీచు తీసుకున్నవాళ్లం అవుతాం.