Jump to content

దిండిగల్ జిల్లా

వికీపీడియా నుండి
దిండిగల్ జిల్లా
திண்டுக்கல் மாவட்டம்
Thinntikkal district
District
Poomparai village, Kodaikanal
Poomparai village, Kodaikanal
Location in Tamil Nadu, India
Location in Tamil Nadu, India
Countryభారతదేశం
రాష్ట్రంతమిళనాడు
DivisionMadurai
Region80% Kongu Nadu 20 %Pandyan Dynasty
Municipal CorporationsDindigul
ప్రధాన కార్యాలయంDindigul
BoroughsAttur, Dindigul, Kodaikanal, Natham, Nilakottai, Oddanchatram, Palani, Vedasandur.
Government
 • CollectorR Venkatachalam, IAS
భాషలు
 • అధికారTamil
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
624xxx
టెలిఫోన్ కోడ్0451
ISO 3166 code[[ISO 3166-2:IN|]]
Vehicle registrationTN-57
Largest cityDindigul
Central location:10°21′N 77°59′E / 10.350°N 77.983°E / 10.350; 77.983

దిండిగల్ జిల్లా, భారతదేశం తమిళనాడు రాష్ట్రం లోని జిల్లాలలో ఇది ఒకటి. దిండిగల్ జిల్లా తిరువణ్ణామలై జిల్లా తర్వాత వైశాల్యం ప్రకారం తమిళనాడులో రెండవ అతిపెద్ద జిల్లా. ఈ జిల్లా 1985 సెప్టెంబరు 9న మధురై జిల్లా నుండి వేరు చేయబడింది.[1] ఇది 6266.64 కిమీ2 వైశాల్యం కలిగి ఉంది. జిల్లా పరిధిలో 3 రెవెన్యూ డివిజన్లు, 10 తాలూకాలు 361 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2] పంచాయతీ బ్లాకులు 14, [3] గ్రామ పంచాయితీలు 306, [4] పట్టణ పంచాయితీలు 23[5] ఉన్నాయి. జిల్లా వాయవ్య సరిహద్దులో తిరుప్పూర్ జిల్లా, ఈశాన్యంలో కరూర్ జిల్లా, తూర్పున తిరుచిరాపల్లి జిల్లా, దక్షిణాన మధురై, థేనీ జిల్లాలు, పశ్చిమాన కేరళలోని ఇడుక్కి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

గణాంకాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19017,14,098—    
19117,80,440+0.89%
19218,13,581+0.42%
19318,59,809+0.55%
19419,74,794+1.26%
195110,83,964+1.07%
196111,78,363+0.84%
197113,98,023+1.72%
198115,64,448+1.13%
199117,60,601+1.19%
200119,23,014+0.89%
201121,59,775+1.17%
source:[6]

2011 గణాంకాలను అనుసరించి దిండిగల్ జనసంఖ్య 2,161,367.[7] దిండిగల్ జనసంఖ్య దాదాపు నమీబియా దేశానికి.[8] లేక అమెరికా లోని న్యూమెక్సికో రాష్ట్ర జనసంఖ్యకు సమానంగా ఉంటుంది.[9] భారతదేశ జీల్లాలలో (640) దిండిగల్ 211వ స్థానంలో ఉంది. జిల్లా జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 357.

2001-2011 నుండి దశాబ్ధకాలంలో దిండిగల్ జిల్లా జనసంఖ్య అభివృద్ధి శాతం 12.39%.[7] దిండిగల్ జిల్లా స్త్రీ పురుష నిష్పత్తి 998:1000.[7] అలాగే అక్షరాస్యత శాతం 76.85%.[7] 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, దిండిగల్ జిల్లా జనాభా 2,159,775, లింగ నిష్పత్తి ప్రతి 1,000 మంది పురుషులకు 998 స్త్రీలు ఉన్నారు. ఇది జాతీయ సగటు 929 కంటే చాలా ఎక్కువ.

మొత్తం జనాభాలో 37.41% పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.జిల్లా లోని మొత్తం జనాభాలో 216,576 మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. వీరిలో 111,955 మంది పురుషులు కాగా, 104,621 మంది స్త్రీలు ఉన్నారు.

జనాభాలో షెడ్యూల్డ్ కులాలు ప్రజలు 20.95% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు ప్రజలు 0.37% మంది ఉన్నారు. జిల్లా సగటు అక్షరాస్యత 68.61%, దీనిని జాతీయ సగటు 72.99%.అక్షరాస్యత పోల్చగా తక్కువగ ఉంది. జిల్లాలో మొత్తం 560,773 గృహాలు ఉన్నాయి.[10]

మొత్తం 1,105,155 మంది కార్మికులు ఉన్నారు, వీరిలో 155,332 మంది రైతులు, 388,725 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు, 25,253 గృహ పరిశ్రమలు, 393,707 మంది ఇతర కార్మికులు, 142,138 మంది ఉపాంత కార్మికులు, మార్జినల్ కార్మికులు 10,072, మార్జినల్ కార్మికులు 10,072 కార్మికులు.[11]

2011 జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో 91.52% మంది తమిళం, 5.45% తెలుగు, 1.69% కన్నడం వారి మొదటి భాషగా మాట్లాడతారు.[12]

మతాలు వారిగా జిల్లా ప్రజలు (2011)[13]
మతం Percent
హిందూ
  
87.02%
క్రిష్టియన్లు
  
7.87%
ముస్లిం
  
4.86%
వివరాలు తెలపనివారు
  
0.25%

ఆర్థిక స్థితి

[మార్చు]

2006లో పంచాయితీ మంత్రిత్వశాఖ 640 భారతదేశ జిల్లాలలో 250 జిల్లాలు వెనుకబడిన జిల్లలుగాగుర్తించింది. వీటిలో దిండిగల్ జిల్లా ఒకటి.[14] అలాగే 30 తమిళనాడు జిల్లాలలో 6 జిల్లాలను వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా గుర్తించిన " బ్యాక్ వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ " (బి.ఆర్.జి.ఎఫ్) నుండి నిధులను అందుకుంటుంది. .[14]

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన కొడైకెనాల్ లోని సరసు
ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన కొడైకెనాల్ లోని సరసు
పళని కొండ
పళని కొండ
  • కొడైకెనాల్
  • పళని
  • సిరుమలై
  • దిండిగల్ ఫోర్ట్

విభాగాలు

[మార్చు]

తాలూకాలు

[మార్చు]

దిండిగల్ జిల్లాలో 10 తాలూకాలు ఉన్నాయి.

  • దిండిగల్ తూర్పు
  • నిలక్కోట్టై
  • నాథమ్
  • అథూర్
  • పళని
  • ఒద్దంచత్రం
  • వేదసందూర్
  • కొడైకెనాల్
  • దిండిగల్ వెస్ట్
  • గుజిలియంపరై

పంచాయితీ యూనిట్లు

[మార్చు]

జిల్లాలో 14 పంచాయితీ బ్లాకులు ఉన్నాయి

  • దిండిగల్
  • అత్తూర్
  • రెడ్డియార్చత్రం
  • శనర్పట్టి
  • నాథమ్
  • నీలకోట్టై
  • బట్లగుండు
  • పళని
  • ఒద్దంచత్రం
  • తోప్పంపట్టి
  • వేదసందూర్
  • వడమదురై
  • గుజిలియాంపరై
  • కొడైకెనాల్

మూలాలు

[మార్చు]
  1. "About the District | Dindigul District | India". Retrieved 2023-01-12.
  2. "Revenue Administration | Dindigul District | India". Retrieved 2023-01-12.
  3. https://cdn.s3waas.gov.in/s3f74909ace68e51891440e4da0b65a70c/uploads/2018/06/2018060642.pdf
  4. https://cdn.s3waas.gov.in/s3f74909ace68e51891440e4da0b65a70c/uploads/2018/06/2018060626.pdf
  5. https://cdn.s3waas.gov.in/s3f74909ace68e51891440e4da0b65a70c/uploads/2018/06/2018060689.pdf
  6. Decadal Variation In Population Since 1901
  7. 7.0 7.1 7.2 7.3 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  8. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Namibia2,147,585 {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  9. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179
  10. "Dindigul District Population Religion - Tamil Nadu, Dindigul Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in. Archived from the original on 2023-01-12. Retrieved 2023-01-12.
  11. "Census Info 2011 Final population totals - Dindigul district". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  12. "Table C-16 Population by Mother Tongue: Tamil Nadu". Census of India. Registrar General and Census Commissioner of India.
  13. "Table C-01 Population by Religion: Tamil Nadu". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
  14. 14.0 14.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

వెలుపలి లింకులు

[మార్చు]