Jump to content

చిరపుంజీ

వికీపీడియా నుండి
(చిరపుంజి నుండి దారిమార్పు చెందింది)
Sohra
Sohra
Cherrapunji
town
Cherrapunji has held the record for highest rainfall multiple times in the past
Cherrapunji has held the record for highest rainfall multiple times in the past
Country India
రాష్ట్రంMeghalaya
జిల్లాEast Khasi Hills
Elevation
1,484 మీ (4,869 అ.)
జనాభా
 (2011)
 • Total14,816
 • జనసాంద్రత397/కి.మీ2 (1,030/చ. మై.)
భాషలు
 • అధికారKhasi
Time zoneUTC+5:30 (IST)
టెలిఫోన్ కోడ్03637
Precipitation11,777 మిల్లీమీటర్లు (463.7 అం.)
Websitehttp://cherrapunjee.gov.in/

చిరపుంజీ (దీన్ని చిరపుంజీ లేదా చర్రాపుంజి అని కూడా పలుకుతారు). ఇది మేఘాలయాలోని తూర్పు ఖాశీ హిల్స్‌ జిల్లాలోని ఒక పట్టణం. భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశంగా ఇది ఖ్యాతిగాంచింది. అయితే ఇప్పుడు దీనికి సమీపంలో ఉండే మౌస్నారామ్‌లో అత్యధిక వర్షపాతం ఉంటోంది.[1]

ఇది హిమాకు (ఖాశీ తెగ నాయకత్వం ఓచిన్న రాష్ట్రాన్ని నిర్మించింది) సంప్రదాయ రాజధాని. దీన్ని సోహ్రా లేదా చురా అని కూడా పిలుస్తారు.

చరిత్ర

[మార్చు]

ఈ పట్టణం యొక్క అసలు పేరు సొరా, దీన్ని చురా అని బ్రిటిష్‌ వారు పిలిచేవారు. కాలక్రమేపీ అది ఇప్పుడున్న చిరపుంజీగా మారింది. నిత్యం వర్షాలు పడ్డా కూడా, చిరపుంజీ తాగునీటి సమస్యను ఎదుర్కొంటోంది. ఇక్కడ వారు తాగునీటి కోసంఎన్నో మైళ్లు వెళ్లాల్సి ఉంటుంది.[2] అడవులు భారీగా ఆక్రమణకు గురి కావడంతో, విస్తారంగా పడే వర్షాల కారణంగా, మట్టిపైపొరలు కొట్టుకుపోవడంతో ఈ అడవుల్లో నీటిపారుదలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. మేఘాలయా రాష్ట్ర ప్రభుత్వం చిరపుంజీకి సోహ్రా అన్న స్థానిక పేరును తిరిగి పెట్టడానికి నిశ్చయించుకుంది. చిరపుంజీలోని శ్మశానవాటికలో డేవిడ్‌స్కాట్‌ (1802-31 వరకు ఈశాన్య భారతానికి సంబంధించిన బ్రిటిష్‌ అధికారి)కు సంబంధించిన స్మారక చిహ్నం ఒకటి ఉంది.

భూగోళ శాస్త్రం

[మార్చు]

చిరపుంజీ ఇక్కడ ఉంది.25°18′N 91°42′E / 25.30°N 91.70°E / 25.30; 91.70 దీనికి సాధారణమైన ఎలివేషన్‌ ఉంది.1,484 మీటర్లు (4,869 అ.) బంగ్లాదేశ్‌ ముఖంగా ఉన్న ఖాసీ కొండల దక్షిణ కొనకు చిరపుంజీ ఉంది. బంగాళాఖాతం నుంచి వీచే రుతుపవన గాలులు ఈ కొండశిఖరాలను తాకడం వల్ల చిరపుంజీలో భారీ వర్షాలు కురుస్తాయి. అందుకే ఇది చిత్తడిగా వాతావరణానికి పుట్టినిల్లుగా భాసిల్లుతోంది.

వాతావరణం

[మార్చు]

చిరపుంజీలో వార్షిక వర్షపాతం ఇలా ఉంటుంది.11,430 మిల్లీమీటర్లు (450 అం.) ఈ గణాంకాలు దీనికి దగ్గరగా ఉండే మౌసన్‌రామ్‌ తరువాత వరసలో ఉంటాయి. చిరపుంజీలో ఈశాన్య, నైరుతీ రుతుపవనాల నుంచి వర్షాలు కురవడంతో, ఇక్కడ రెండూ కలిసి ఒకే ఒక రుతుపవన కాలంగా ఉంటాయి. ఇది ఖాసీ కొండల నుంచి వీచే గాలులకు వ్యతిరేక దిశలో ఉంటుంది. ఒరనోగ్రాఫిక్‌ భావన కారణంగా రుతుపవన గాలులు అధిక సంఖ్యలో తేమను నిక్షిప్తం చేస్తాయి. శీతాకాలంలో బ్రహ్మపుత్ర వ్యాలీ గుండా ప్రయాణించేఈశాన్య రుతుపవనాల వల్ల ఇక్కడ వానలు పడతాయి.

ఒక సంవత్సర కాలంలో గరిష్ఠ వర్షపాతానికి సంబంధించి చిరపుంజీ పేరిట రెండు గిన్నిస్‌ రికార్డులున్నాయి. 22,987 మిల్లీమీటర్లు (905.0 అం.)ఒక ఏడాది కాలంలో ఆగస్టు 1860, 1861జులై మధ్య, అదే విధంగా 9,300 మిల్లీమీటర్లు (370 అం.)ఒక నెల వ్యవధిలో జూలై 1861లో గరిష్ఠ వర్షపాతం నమోదు కావడంలో ఈ రెండు రికార్డులకు గిన్నిస్‌లో స్థానం దక్కింది.[3]

భారీ వర్షాలు కురవడానికి గల కారణాలు

[మార్చు]
చిరపుంజీ ప్రపంచంలో అతి తేమగా ఉండే ప్రదేశం
Cherrapunji
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
9.5
 
15
6
 
 
23
 
16
8
 
 
110
 
20
13
 
 
363
 
21
14
 
 
645
 
22
16
 
 
1299
 
23
18
 
 
1277
 
23
18
 
 
902
 
22
18
 
 
560
 
23
17
 
 
216
 
23
16
 
 
25
 
20
12
 
 
6
 
17
8
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: Allmetsat. For graphing purposes, the blue numbers of this graph are at a scale of 1:2. (All figures for that part of the graph have been halved.)

చిరపుంజి భారత వేసవి ఋతుపవనాల యొక్క బంగాళాఖాతం నుండి వర్షాలను అందుకుంటుంది. రుతుపవన మేఘాలు బంగ్లాదేశ్‌లోని పర్వతసానుల గుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా సుమారు నాలుగువందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఆ తరువాత అవి ఖాసీ పర్వతాలను ఢీకొంటాయి. రెండు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇవి అనూహ్యంగా సముద్రమట్టానికి 1370మీటర్లు ఎత్తు పెరగడమే దీనికి కారణం. భౌగోళిక పరంగా లోతైన లోయలుండటంతో బాగా దిగువకు ప్రయాణించే మేఘాలు (150 నుంచి 300 మీటర్లు) చిరపుంజీ మొత్తం పరుచుకుంటాయి. ఆ గాలులు వర్షాల మేఘాలను ద్రోణివైపు లేదా నునుపైన తలాల వైపుకు నెడతాయి. మేఘాలు వేగంగా పైకి పోతుండటంతో పైన వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. అంటే పై భాగాలు చల్లబడతాయి. ఫలితంగా నీటిబాష్పాలు ద్రవీభవిస్తాయి. చిరపుంజీలో కురిసే వర్షాల్లో అధిక శాతం వర్షాలు,గాలి పెద్దమొత్తంలో నీటి బాష్పాలుగా మారడం వల్లనే సంభవిస్తాయి. ఇక అతి పెద్ద మొత్తం వర్షాలు పడటానికి కారణం,బహుళా అందరికీ తెలిసినదే.అదే ఈశాన్య రాష్ట్రాల్లో కురిసే ఒరోగ్రాఫిక్‌ వర్షాలు.

చిరపుంజీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు సంభవిస్తే మిగిలిన ప్రాంతాలు వర్షపాతంలో తీవ్ర వ్యత్యాసాలు చూపిస్తూ,పూర్తిగా పొడిగా ఉంటాయి. రుతుపవనాల కాలం క్రియాశీలకంగా ఉన్న రోజుల్లో వాతావరణంలో తేమ గరిష్ఠంగా ఉంటుంది.

చిరపుంజీలో అత్యధిక శాతం వర్షం కురవడానికి, ఒరోగ్రాఫిక్‌ లక్షణాలే కారణమని చెప్పవచ్చు. దక్షిణం పక్క నుంచి వచ్చే మేఘాలు ఈ కొండల మీదగా ప్రయాణించినప్పుడు ఇవి లోయ మొత్తం విస్తరిస్తాయి. ఈ మేఘాలు చిరపుంజీ కొండలను నిట్టనిలువుగా ఢీకొట్టినప్పుడు దానికి దిగువన ప్రయాణించే మేఘాలు నునుపైన వక్రతలాల్లోకి నెట్టబడతాయి. ఖాసీ కొండల నుంచి గాలి నేరుగా వీస్తున్నప్పుడు భారీ వర్షాలు కురవడంలో ఆశ్చర్యం అనిపించదు.

చిరపుంజీలో కురిసే రుతుపవన వర్షాల్లో అత్యధికం ఉదయం పూటే కురవడం విశేషం. రెండు రకాల గాలులు ఒకేసారి రావడమే దీనికి కారణం. రుతుపవన కాలంలో బ్రహ్మపుత్రా లోయ నుంచి వీచే గాలులు సాధారణంగా తూర్పు నుంచి ఈశా���్యం వైపుకు వీస్తాయి. కానీ మేఘాలయానుంచి వీచే గాలులు దక్షిణవైపు నుంచి గాలులు వీస్తాయి. ఈ రెండు రకాల గాలు ఖాసీ కొండల సమీపంలో దగ్గరకు వస్తాయి. ఈ కొండల్లో రాత్రి వేళ చిక్కుకున్న గాలులు అవి వేడెక్కిన తరువాత ఉదయం వేళ, పైకి లేవడం ప్రారంభిస్తాయి. ఇది ఉదయం వేళ మాత్రమే వానలు కురవడానికి గల కారణాన్ని పాక్షికంగా వివరిస్తుందని చెప్పవచ్చు. ఒరోగ్రాఫ్‌ లక్షణాల కారణంగా వాతావరణంలోనా మార్పులు కూడా రుతుపవన కాలంలో జరిగే మార్పులో కీలక పాత్ర పోషిస్తాయి.సీజన్‌ మొత్తం ఇదే విధంగా కొనసాగుతుంది.

శీతోష్ణస్థితి డేటా - Cherrapunji
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
Source: Climate Charts [4]

జనాభా

[మార్చు]

As of 2001భారతీయ [[జనాభా లెక్కల {/1{2/}]]} ప్రకారం చిరపుంజీలో జనాభా 10.086. వీరిలో పురుషులు 49శాతం కాగా, స్త్రీలు 51శాతం వరకు ఉన్నారు. చిరపుంజీలో సగటు అక్షరాస్యతా శాతం 74. ఇది జాతీయ అక్షరాస్యతా సగటు 59.5కంటే ఎక్కువ. స్త్రీ,పురుష అక్షరాస్యతశాతం 74గా ఉండటం విశేషం.మొత్తం జనాభాలో 19శాతం మంది ఆరేళ్లలోపు వారున్నారు.

సంస్కృతి

[మార్చు]
ఖాసీ చిల్డ్రన్‌(1944)

చిరపుంజీలో నివసించే స్థానికులను ఖాసీలంటారు. వీరిలో మాతృవంశీయ పాలన ఉంటుంది. పెళ్ళి తరువాత భర్త జీవించడం కోసం భార్యవెంబడి ఆమె ఇంటికి వెళతాడు.పుట్టిన పిల్లలు తల్లిపేరును ఇంటిపేరుగా పెట్టుకుంటారు.[5]

చిరపుంజీ లివింగ్‌ బ్రిడ్జ్‌కు పెట్టింది పేరు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి చిరపుంజివాసులు చెట్ల వేళ్లనే బ్రిడ్జిలుగా మార్చే విధానాన్ని అభివృద్ధి చేశారు. వీటిని బ్రిడ్జిలుగా మలచడానికి పది, పదిహేను సంవత్సరాలు పడుతుంది.అయితే ఇవి వందల సంవత్సరాల పాటు ఉంటాయి.ఇప్పటికీ ఉపయోగిస్తున్న ఒక పురాతన బ్రిడ్జి వయస్సు 500ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు.[6]

సూచనలు

[మార్చు]
  1. "అత్యధిక నెలసరి వర్ష పాతం". గిన్నిస్ ప్రపంచ రికార్డులు. Retrieved 1 December 2018.
  2. "World's wettest area dries up" (in ఇంగ్లీష్). 2003-04-28. Retrieved 2023-01-10.
  3. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ 2005, పేజీ`51 ఐఎస్‌బిఎన్‌ 0-85112-192-6
  4. "Average Conditions Cherrapunji, India". Climate Charts. Retrieved 2010-03-23.
  5. "Cherrapunjee Holiday Resert website". Archived from the original on 2013-11-02. Retrieved 2020-06-09.
  6. "Bridge to Nature: Amazing Indian Living Root Bridges". Archived from the original on 2011-11-29. Retrieved 2010-07-13.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చిరపుంజీ&oldid=3800715" నుండి వెలికితీశారు