గంగా గౌరీ సంవాదం
గంగా గౌరీ సంవాదం (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.ఎన్.రెడ్డి |
---|---|
తారాగణం | సి.హెచ్.నారాయణరావు, కృష్ణకుమారి, జానకి, కాంతారావు |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
ఛాయాగ్రహణం | వి.ఎన్.రెడ్డి |
నిర్మాణ సంస్థ | విజయ గోపాల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
గంగా గౌరీ సంవాదం 1958, ఫిబ్రవరి 16న విడుదలైన పౌరాణిక/జానపద తెలుగు చలనచిత్రం.
నటీనటులు
[మార్చు]- చిత్తూరు నాగయ్య - శంఖదేవయ్య
- హేమలత - చక్రదేవమ్మ
- కృష్ణకుమారి - గంగ
- షావుకారు జానకి - పార్వతి
- ఋష్యేంద్రమణి - రుద్రమ్మ
- ఆర్.వి.కృష్ణారావు -బసవయ్య
- కాంతారావు - నారదుడు
- సి.హెచ్. నారాయణరావు - శివుడు, జంగమదేవర
- సీతారామమ్మ - ఎరుకలసాని
- రమణారెడ్డి - రంగయ్య
- సీతారాం - శంభయ్య
- చంద్రశేఖర్ - శరభయ్య
- నాగభూషణం - వశిష్ఠుడు
- వంగర - పెద్దయ్య
- పాలడుగు సుబ్బారావు - సుబ్బయ్య
- విశ్వనాథం - విస్సయ్య
- రాగిణి - రంభ
- రీటా
- బాల
- రాజేశ్వరి
- ధనం
- చంద్ర
- కమల
- జయంతి
- మల్లీశ్వరి
- రాధ
- సరళ
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాతలు: జెట్టి చంద్రశేఖరరెడ్డి, ముంగమూరు బ్రదర్స్
- దర్శకత్వం: వి.ఎన్.రెడ్డి
- స్క్రీన్ ప్లే: మహతి
- పాటలు, మాటలు: పరశురామ్
- కళ: తోట
- కూర్పు: బాబు
- సంగీతం: పెండ్యాల
- ఛాయాగ్రహణం: వర్మ, వి.ఎన్.రెడ్డి
కథ
[మార్చు]శివపార్వతులు ఆనందతాండవం చేస్తూ పరవశిస్తూ ఉండగా నారదుడు వచ్చి వారి ఏకాంతాన్ని భగ్నం చేస్తాడు. పార్వతి కోపంతో ఆడువారు తెచ్చు మర్యాదకాక పురుషజాతికి వేరేమి పరువు కలదని, పశువు మొదలుకొని పశుపతి వరకు అందరూ ఆడువారికి దాసోహం అనవలసిందేనని మాటల మధ్యలో అంటుంది. గంగాభవాని కూడా ఇలాగే అంటున్నదని నారదుడు శివునికి చెబుతాడు. పార్వతికి, గంగాభవానికి గర్వభంగం చేసి మంచి గుణపాఠం నేర్పాలని శివుడు నిర్ణయించుకుంటాడు.
శివుడు జంగందేవర వేషంలో భూలోకం వచ్చి ఒక బెస్తపల్లెకు వస్తాడు. ఆ పల్లెలోని బెస్తలంతా జంగమారాధనే శివారాధన అని నమ్మే సత్‌శైవులు. వీధిలో పోతూవున్న ఆ జంగం దేవరను రుద్రమ్మ భిక్షకు, పూజకు ఆహ్వానిస్తుంది. అతడు అందుకు అంగీకరించి భిక్ష స్వీకరించి, ఆమెను, ఆమె చిన్న కొడుకును ఆశీర్వదించి మరోవీధికి బయలుదేరుతాడు. ఆ వీధిలో ఉంటున్న చక్రదేవమ్మ పరమభక్తితో జంగందేవరను ఆహ్వానించి భిక్ష ఇవ్వబోతుంది. ఆ మాయాజంగం కృద్ధుడై గొడ్రాలిచేతి భిక్ష నిషేధం అంటూ ఆమె ఇవ్వబోతున్న భిక్షను తన్నేస్తాడు.
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలను పరశురామ్ రచించగా పెండ్యాల సంగీతం సమకూర్చాడు[1].
క్ర.సం | పాట | గాయకులు |
---|---|---|
1 | "వాణి ప్రాణేశ్వరై, బ్రహ్మకెన్నగ రాని వాగీశుడనియెడు పరువుదెచ్చె" (పద్యం) | పి.లీల |
2 | "పావనీ - గంగాభవానీ పావనీ గంగాభవానీ లోకపావన వాహినీ" | ఘంటసాల |
3 | "రారే చెలీ ఇటు రారే చెలీ మన వాడంతా వేడుక గావింపరే" | బృందం |
4 | "హేలేసా హైలా హైలేసా హైలా హైలేసా హైలా హైలేసా హైలా హైలేసా మనతల్లి గంగే మనవాడ వెలసే" | ఎం.ఎస్.రామారావు, వైదేహి బృందం |
5 | "ఓ మనసిజ దమనా! గిరిజా మోఃఅనా" | జిక్కి బృందం |
6 | "కైలాసగిరినేలు గౌరీ మహాసాధ్వి కెరుకనూ చెప్పేటి ఎరుకతా నేనూ" | వైదేహి |
7 | "స్వామీ ఇదె శరణాగతి ఈ లీలా లేల నయా నను గావరావయ్యా" | పి.సుశీల |
8 | "కనరావేలా కనుమరుగేలా నీత��� నాకీ ఎడబాటేలా" | ఘంటసాల |
9 | "ఇంద్రాది దేవతల్ వందిమాగధులట్లు స్తోత్రపాఠముల్ సొంపు నింప"(పద్యం) | పి.సుశీల |
10 | "ఓ భళిర భళిర భళి భళి భళి భళి భళి భళి భాళీ!" | ఎం.ఎస్.రామారావు, రఘునాథ పాణిగ్రాహి, జానకి, బృందం |
11 | "దాసురాలనోయీ, నా దోసమెంచకోయీ స్వామీ" | పి.సుశీల, పి.లీల |
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ పరశురామ్. గంగా గౌరీ సంవాదం పాటల పుస్తకం. p. 10. Retrieved 19 September 2020.