Jump to content

సికిందరాబాద్ ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.
సికిందరాబాద్ ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్, దురంతో ఎక్స్‌ప్రెస్
తొలి సేవ2011 ఫిబ్రవరి 23
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలుసికింద్రాబాద్ జంక్షన్
ఆగే స్టేషనులు7 (2 passenger stops, 5 technical stops)
గమ్యంలోకమాన్య తిలక్ టర్మినస్
ప్రయాణ దూరం772 కి.మీ. (480 మై.)
సగటు ప్రయాణ సమయం12 గంటలు
రైలు నడిచే విధంవారానిల్కి 2 రోజులు. 12220 Secunderabad–Lokmanya Tilak Terminus Duronto Express – Tuesday & Friday. 12219 Lokmanya Tilak Terminus–Secunderabad Duronto Express – Wednesday & Saturday.
రైలు సంఖ్య(లు)12220 Up, 12219 Down
సదుపాయాలు
శ్రేణులుAC 1st Class, AC 2 tier, AC 3 tier[ఆధారం చూపాలి]
కూర్చునేందుకు సదుపాయాలుNo
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుPantry car attached
చూడదగ్గ సదుపాయాలుLHB coaches
సాంకేతికత
రోలింగ్ స్టాక్ప్రామాణిక దురంతో బోగీలు
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం110 km/h (68 mph) (Maximum Speed),
64.37376 km/h (40 mph) (Average speed), including halts

సికింద్రాబాద్ – లోకమాన్య తిలక్ టెర్మినస్ దురంతో ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ జంక్షన్ స్టేషన్, లోకమాన్య తిలక్ టెర్మినస్ ల మధ్య నడిచే దురంతో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. [1]

ఈ సేవను దక్షిణ మధ్య రైల్వే జోన్ నడుపుతోంది. రైలు నంబర్లు 12220 (సికింద్రాబాద్-ముంబై (LTT)) 12219 (ముంబయి (LTT)-సికింద్రాబాద్) కలిగిన ఈ రైలు తెలంగాణ, మహారాష్ట్రలను కలుపుతుంది.

సేవ

12220/19 సికింద్రాబాద్-ముంబై (LTT) దురంతో ఎక్స్‌ప్రెస్ 773 కిలోమీటర్ల దూరాన్ని 12 గంటల్లో కవర్ చేస్తుంది. (64.42 కిమీ./గం వేగంతో). ఎక్స్‌ప్రెస్ రైలు సగటు వేగం 55 km/h (34 mph) కంటే ఎక్కువగా ఉన్నందున భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం అదనపు సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్‌ని వసూలు చేస్తారు.

ఈ రైలులో ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. దీనిలో సాధారణంగా 1 AC 1వ తరగతి కోచ్, 3 AC 2-టైర్ కోచ్‌లు, 9 AC 3-టైర్ కోచ్‌లు ఉంటాయి. ఇరువైపులా జనరేటర్ కోచ్‌లు, క్యాటరింగ్ సేవల కోసం ఒక ప్యాంట్రీ కారు ఉంటాయి.

ప్రమాదాలు

  • 2014 మే 4 న, 12220 సికింద్రాబాద్-లోకమాన్య తిలక్ టెర్మినస్ దురంతో ఎక్స్‌ప్రెస్ పూణే జంక్షన్ సమీపంలో ఒక ట్రాక్టర్ ట్రయిలర్‌ను ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. [2]
  • 2015 సెప్టెంబరు 12 న, 12220 సికింద్రాబాద్-ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్ ఉదయం 2:15 గంటలకు కర్ణాటకలోని షోలాపూర్ డివిజన్‌లోని షాబాద్, గుల్బర్గాల మధ్య మార్టూరు స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పడంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు.

మూలాలు

  1. "New Bi-weekly Duranto Express to Mumbai from Feb 22". Retrieved 2014-08-01.
  2. "3 killed, 8 hurt as Duronto hits tractor near Pune". DNA India. 4 May 2014. Retrieved 2014-08-01.