ముదుగంటి రామగోపాల్ రెడ్డి
ముదుగంటి రామగోపాల్ రెడ్డి | |
---|---|
మాజీ పార్లమెంట్ సభ్యుడు | |
In office 1971-1984 | |
అంతకు ముందు వారు | ఎం. నారాయణరెడ్డి |
తరువాత వారు | తాడూరి బాలాగౌడ్ |
నియోజకవర్గం | నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
మాజీ శాసన సభ్యుడు | |
In office 1962-1967 | |
నియోజకవర్గం | బోధన్ శాసనసభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | తక్కళ్ళపల్లి, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ | 1917 అక్టోబరు 10
మరణం | 2002 |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | భూలక్ష్మిదేవి |
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె |
కళాశాల | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
ముదుగంటి రామగోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసన సభ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు (1971 నుండి 1984 వరకు) పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు. 1962లో బోధన్ శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుడిగా పాత్రినిధ్యం వహించాడు.[1]
జననం, విద్య
[మార్చు]రామగోపాల్ రెడ్డి 1917, అక్టోబరు 10న తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, తక్కళ్ళపల్లి గ్రామంలో జన్మించాడు. తండ్రిపేరు లక్ష్మారెడ్డి. రామగోపాల్ రెడ్డి హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బిఏ పూర్తిచేశాడు.[2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]రామగోపాల్ రెడ్డికి భూలక్ష్మిదేవితో వివాహం జరిగింది. వారికి ��క కుమారుడు, ఒక కుమార్తె.[3]
వృత్తి జీవితం
[మార్చు]20 సంవత్సరాలపాటు నిజాం షుగర్ ఫ్యాక్టరీలో అధికారిగా పనిచేసి 1961లో రాజీనామా చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]చిన్నప్పటినుండి నాయకత్వ లక్షణాలు ఉన్న రామగోపాల్ రెడ్డి 1961లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1962లో స్వతంత్ర అభ్యర్థిగా బోధన్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కె.వి. రెడ్డి గెలుపొందాడు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన రామగోపాల్ రెడ్డి నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసి 1971లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి కె. అనంతరెడ్డి,[4] 1977లో జరిగిన ఎన్నికల్లో బి.ఎల్.డి. అభ్యర్థి గడ్డం గంగారెడ్డి,[5] 1980లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థి ఎం.ఎం. ఖాన్[6] లపై గెలుపొందాడు.
శాసనసభ ఎన్నికల వివరాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం పేరు గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు 242 బోధన్ ముదుగంటి రామగోపాల్ రెడ్డి స్వతంత్ర 19416 కె.వి. రెడ్డి కాంగ్రెస్ 16585
లోక్‌సభ ఎన్నికల వివరాలు
[మార్చు]లోక్‌సభ | ఎన్నికలు | కాలము | గెలిచిన అభ్యర్థి | పార్టీ | సమీప ప్రత్యర్థి | పార్టీ | ఆధిక్యత |
---|---|---|---|---|---|---|---|
ఐదవ | 1971 | 1971-77 | ముదుగంటి రామగోపాల్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | కె.అనంతరెడ్డి | తెలంగాణా ప్రజాసమితి | 59737 |
ఆరవ | 1977 | 1977-80 | ముదుగంటి రామగోపాల్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | గడ్డం గంగారెడ్డి | బి.ఎల్.డి | 159393 |
ఏడవ | 1980 | 1980-84 | ముదుగంటి రామగోపాల్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ | ఎం.ఎం.ఖాన్ | జనతా పార్టీ | 200315 |
నిర్వర్తించిన పదవులు
[మార్చు]- నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారం చైర్మన్
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార చక్కెర కర్మాగారాల సమాఖ్య చైర్మన్
- నిజాం షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్
- సహకార చక్కెర ఫ్యాక్టరీల జాతీయ సమాఖ్య డైరెక్టర్
- ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ సభ్యుడు
- నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు,
- కేన్ గ్రోవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు
- శ్రీనగర్‌లోని భారత్ కృషక్ సమాజ్ (1954) వ్యవస్థాపకుడు
- గిర్రాజ్ కళాశాల (నిజామాబాద్), జగిత్యాల కళాశాలల వ్యవస్థాపకుడు
- టెక్స్‌టైల్ మెషినరీ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సభ్యుడు
- ప్రాగా టూల్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు
- సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ అండర్‌టేకింగ్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
రచనలు
[మార్చు]“లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ రామ్ గోపాల్ రెడ్డి లెజిస్లేటర్ అండ్ పార్లమెంటేరియన్,” “లెజిస్లేటివ్ అసెంబ్లీలో రామ్ గోపాల్ రెడ్డి ప్రసంగాలు”, “పార్లమెంటులో నా ప్రసంగాలు” అనే మూడు పుస్తకాలు రాశాడు.
మరణం
[మార్చు]రామగోపాల్ రెడ్డి తన 85 సంవత్సరాల వయసులో 2002లో కారు ప్రమాదంలో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Writer, Staff (2017-10-12). "Remembering Ram Gopal Reddy on his 100th birthday | News India Times". www.newsindiatimes.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-05-10. Retrieved 2021-12-03.
- ↑ "Shri M. Ram Gopal Reddy MP biodata Nizamabad | ENTRANCEINDIA". https:// (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-12-28. Archived from the original on 2021-12-03. Retrieved 2021-12-03.
- ↑ "Members Bioprofile". loksabhaph.nic.in. Archived from the original on 2020-11-29. Retrieved 2021-12-03.
- ↑ "Election Results 1971" (PDF). www.eci.nic.in. Election Commission of India. Retrieved 2021-12-03.
- ↑ "Election Results 1977" (PDF). www.eci.nic.in. Election Commission of India. Retrieved 2021-12-03.
- ↑ "Election Results 1980" (PDF). www.eci.nic.in. Election Commission of India. Retrieved 2021-12-03.
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- Date of birth not in Wikidata
- 1917 జననాలు
- 5వ లోక్‌సభ సభ్యులు
- 6వ లోక్‌సభ సభ్యులు
- 7వ లోక్‌సభ సభ్యులు
- భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (1962)
- జగిత్యాల జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- జగిత్యాల జిల్లా రాజకీయ నాయకులు
- జగిత్యాల జిల్లా వ్యక్తులు
- నిజామాబాదు జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
- 2002 మరణాలు
- రోడ్డు ప్రమాదంలో మరణించినవారు